లిప్‌లాక్స్‌తో సినిమాలు ఆడవు..,
on Jul 23, 2019
'అర్జున్‌రెడ్డి'లో లిప్‌లాక్స్ ఉన్నాయి. సినిమా హిట్. 'గీత గోవిందం'లో లిప్ లాక్ ఉంది. అంటే... సినిమాలో చూపించలేదు గానీ, క్లైమాక్స్‌లో బస్‌లో హీరోకి హీరోయిన్ లిప్‌లాక్ ఇస్తుంది. విడుదలకు ముందు బయటకొచ్చిన పైరసీ సీన్స్‌లో ఉంది. ఆ సినిమా కూడా హిట్. త్వరలో రిలీజవుతున్న 'డియర్ కామ్రేడ్'లో కూడా రష్మికతో విజయ్ దేవరకొండ లిప్ లాక్ సీన్స్ ఉన్నాయి. ఆల్రెడీ ట్రైలర్‌లో చూపించారు. 'లిప్‌లాక్స్ విజయ్ దేవరకొండకు సెంటిమెంటా? లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆయనకు ఇదే ప్రశ్న ఎదురైంది. ముద్దుల వల్ల సినిమాలు హిట్టవ్వవని విజయ్ దేవరకొండ స్పష్టం చేశాడు. మరో ఏడాదికి సినిమాల్లో ముద్దులు సాధారణం అవుతాయని అన్నాడు. డియర్ కామ్రేడ్ తరవాత క్రాంతిమాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా విడుదలవుతుందని, ఆ తర్వాత విజయ్ అనే కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాని విజయ్ దేవరకొండ తెలిపాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాలనుందని, అయితే ప్రస్తుతం ఆయన చిరంజీవిగారితో చేస్తున్న సినిమా పూర్తయ్యేసరికి ఈక్వీషన్స్ ఎలా ఉంటాయో చెప్పలేమని అన్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
