English | Telugu

రజనీకి తప్పలేదుగా.. "2.0" సినిమా టీజర్ లీక్...

on Mar 4, 2018


పెద్ద హీరోల సినిమాలకు లీకుల బెడద ఎప్పుడూ ఉండేదే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఏదో ఒక రకంగా.. ఎవరో ఒకరి వల్ల సినిమాలో డైలాగ్స్ కానీ.. పాటలు కానీ లీకయ్యాయన్న వార్తలు వస్తూనే ఉంటాయి. అంతెందుకు రాజమౌళి జాగ్రత్త గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది.. బాహుబలికే లీకుల బెడద తప్పలేదు. ఇప్పుడు తాజాగా మరో భారీ చిత్రానికి కూడా ఈ సమస్య వచ్చిపడింది. రజనీకాంత్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న 2.0 సినిమా టీజర్ ఇప్పుడు నెట్లో హల్ చల్ చేస్తుంది. ఇప్పటికే కొన్ని కారణాల వల్ల.. సినిమా విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతుంది. దాంతో టీజర్ విడుదల కార్యక్రమాన్ని కూడా వాయిదా వేశారు. కానీ, ఏం లాభం? ఇంట‌ర్‌నెట్‌లో టీజర్ వచ్చేసింది. ఎవరో లీక్ చేశారు. వున్నట్టుండి అందరి చేతుల్లో సెల్ ఫోన్లు గాల్లో ఎగిరి ఒక చోటు చేరడం, అందులోంచి అక్షయ్ కుమార్ ఎంట్రీ… ‘రోబో’లో ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేసిన చిట్టి రోబో రీ ఎంట్రీ… చివర్లో రజనీకాంత్ ‘హో హో’ డైలాగ్ చెప్పడం సినిమాపై క్యూరియాసిటీ కలిగిస్తున్నాయి. ఇప్పుడీ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి దీనికి చిత్ర యూనిట్ ఎలా యాక్షన్ తీసుకుంటుందో చూడాలి..


Cinema Galleries



Latest News


Video-Gossips