ఎన్టీఆర్ సరసన మళ్ళీ బ్రిటిష్ అమ్మాయేనా??
on Aug 21, 2019
ఏస్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలయికలో వస్తోన్న మహా ముల్టీస్టారర్ చిత్రం `ఆర్ ఆర్ ఆర్ `. ప్రెసెంట్ ఈ చిత్రానికి సంబంధిచిన కొన్ని కీలక సన్నివేశాలు చిత్రకరించడానికి చిత్ర యూనిట్ త్వరలో బల్గెరియా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో కేవలం ఎన్టీఆర్ కి సంభందించిన సీన్స్ మాత్రమే షూట్ చేయనున్నారట. ఇక ఈ షెడ్యూల్ పూర్తి అయ్యేవరకు రామ్ చరణ్ కి బ్రేక ఇచ్చాడట రాజమౌళి. ఇదిలా ఉంటె ...ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్స్ కోసం ఇంకా సెర్చింగ్ జరుగుతోనే ఉంది. అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం ..మరో బ్రిటిష్ అమ్మాయిని ఫైనలా చేసినట్లు సోషల్ మీడియా లో న్యూస్ వస్తున్నాయి . త్వరలో అధికారికం గా ప్రకటన చిత్ర యూనిట్ ఇచ్చే అవకాశాలున్నాయి. చరణ్ సరసన అలియా భట్ హీరోయిన్ గా నటిస్తోంది. డి వి వి దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రం నెక్స్ట్ ఇయర్ జులై 30న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.