రాములమ్మ రీ- ఎంట్రీకి రెడీ!!
on Apr 22, 2019
విజయ శాంతి 30 ఏళ్ల సినీ ప్రస్థానంలో దాదాపు 180 సినిమాల్లో నటించింది. ఆ తర్వాత 1997లో పాలిటిక్స్ లోకి అడుగుపెట్టింది. 2006 లో హిందీలో ఒక సినిమాలో తప్ప ఆ తర్వాత ఏ తెలుగు సినిమాలో నటించలేదు. రాజకీయాల్లో మాత్రం చురుకుగా పాల్గొంటూ వచ్చింది. గత రెండేళ్లుగా ఆమె రీ ఎంట్రీ ఇవ్వబోతుందంటూ కూడా వార్తలు వచ్చినప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. అయితే ఈ సారి ఆమె రీ ఎంట్రీ ఖరారైనట్లు సమాచారం అందుతోంది.
ఒకసారి వివరాల్లోకి వెళితే.. అనిల్ రావిపూడి, మహేష్ కలయికలో ఒక సినిమా రాబోతున్నట్లు ఇటీవల వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ క్యారక్టర్ కోసం రాములమ్మను సంప్రదించారట దర్శకుడు అనిల్ రావిపూడి. ఆమెకు తన పాత్రను వివరించడం, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని విజయశాంతి సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికి విజయశాంతితో నటింపజేయాలని చాలా మంది యంగ్ డైరక్టర్స్ ప్రయత్నించినప్పటికీ ...ఆమె అంతగా ఆసక్తి కనరబరచలేదట. ఈ విషయంలో హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యాడు అని అంటున్నారు సినీ జనాలు. ఈ వార్తలో నిజానిజాలు తెలియాలంటే ఇంకొంత కాలం వెయిట్ చేయాల్సిందే.