వైరల్ అవుతోన్న వర్మ సాంగ్ !!
on Apr 20, 2019
కాంట్రవర్సీలతో నిత్యం కాపురం చేసే రామ్ గోపాల్ వర్మ ...ఇటీవల లక్ష్మీస్ ఎన్టీఆర్ తో చేయాల్సినంత కాంట్రవర్సీ చేసాడు. ఇక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ మఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ ను తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే వర్మ ఎనౌన్స్ మెంట్ చేసాడు. ఈ సినిమాకు `టైగర్ కేసీఆర్' అంటూ టైటిల్ కూడా ప్రకటించాడు.
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా కేసీఆర్ బయోపిక్ `టైగర్ కేసీఆర్` ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు వర్మ. అంతే కాదు వర్మ తనే సవ్వయంగా సినిమాకు సంబంధించిన ఒక పాటను పాడుతూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టాడు. `నీ తాట తీయనీకి వస్తున్నా`` అంటూ సాగే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలో అవుతోంది. కేసీఆర్ ఉద్యమ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఆ సమయంలో ఉన్న నాయకుల పాత్రలన్నీ ఈ సినిమా లో ఉండబోతున్నట్లు చెప్పుకొచ్చాడు వర్మ. మరి ఈ సినిమాతో ఎంత రచ్చ చేయనున్నాడో వర్మ. వెయిట్ అండ్ సీ.