మళ్లీ మొదటికొచ్చిన మహేష్ ‘మహర్షి’!
on Jan 22, 2019
ఏప్రిల్ నెలలో మహేష్ బాబు 'మహర్షి' వస్తుందా? రాదా? ఒకవేళ వస్తే ఏ తేదీకి వస్తుంది? నిన్నటివరకూ ఈ సినిమా విడుదల తేదీలో బోల్డంత గందరగోళం నడిచింది. కొందరు మే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారన్నారు. మరి కొందరు ఏప్రిల్ నెలలో ముందుకు వస్తుందన్నారు. ఈ గందరగోళానికి నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు తెర దించారు. ముందుగా చెప్పినట్టు ఏప్రిల్ 25వ తేదీన సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు. ముందు చెప్పిన టైమ్‌కి సినిమా వస్తుందని స్పష్టం చేశారు. 'ఊపిరి' విజయం తరవాత వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. దిల్ రాజు, సి. అశ్వనీదత్, పివిపి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పొల్లాచ్చిలో మహేష్ బాబు రైతుగా నటిస్తున్న సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. మహేష్ బాబు స్నేహితుడి పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.
Also Read