చైతూకి తాతగా నాగార్జున!
on Jan 18, 2019
'మనం'లో నాగార్జునకు తండ్రిగా నాగచైతన్య కనిపించారు. ఏయన్నార్కి తాత పాత్రలో చైతూ నటించారు. నిజ జీవితంలోని తండ్రికి తండ్రిగా తెరపై కుమారుడు తెరపై నటించడమేమిటి? నిజ జీవితంలోని తాతకు తాతగా తెరపై మనవడు నటించడమేమిటి? అని ఆక్షేపించకుండా కథను ప్రేక్షకులకు అర్థమయ్యేలా దర్శకుడు విక్రమ్ కె కుమార్ చెప్పారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించబోయే 'బంగార్రాజు'లో సీన్ పూర్తిగా రివర్స్ కానుంది. నిజ జీవితంలోని కుమారుడికి తాతగా తెరపై తండ్రి కనిపించనున్నారు. 'సోగ్గాడే చిన్ని నాయనా' సీక్వెల్ 'బంగార్రాజు'లో నాగార్జున, నాగచైతన్య తాతా మనవాళ్లుగా కనిపిస్తారని తెలిసింది. దర్శకుడు కల్యాణ్ కృష్ణ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడని, త్వరలో షూటింగ్ మొదలు కానుందని సమాచారం. ప్రస్తుతం నాగచైతన్య 'మజిలీ', 'వెంకీ మామ' సినిమాలు చేస్తున్నారు. ఈ రెండూ పూర్తయిన తరవాత 'బంగార్రాజు' పట్టాలు ఎక్కుతుందని టాక్. 'సోగ్గాడే చిన్ని నాయనా' సంక్రాంతికి విడుదలైంది. ఈ సినిమానూ కూడా సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారట.