తండ్రి బస్సు డ్రైవర్- కొడుకు సూపర్ స్టార్
on Dec 10, 2018
తన కొడుకు యష్ టాప్ హీరో గా ఎదిగినా కానీ, తండ్రి మాంత్రం ఇంకా బస్సు డ్రైవర్ గానే పని చేస్తున్నాడు...యష్ కంటే తన తండ్రే సూపర్ స్టార్ అంటూ కన్నడ హీరో యష్ గురించి పొగిడేసాడు ఏస్ డైరక్టర్ ఎస్ .ఎస్.రాజమౌళి. కన్నడలో టాప్ హీరోగా దూసుకెళ్తోన్న యష్ నటించిన క్రేజీ ప్రాజెక్ట్ `కేజీయఫ్` . ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈ వెంట్ ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసాడు రాజమౌళి. ఈ సందర్భంగా పై విధంగా స్పందించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ....`` ఈ సినిమా గురించి తెలిసాక...హీరో ఎవరు? తన బ్యాక్ గ్రౌండ్ ఏంటని సాయి కొర్రపాటి గారిని అడిగాను. అప్పుడు యష్ గురించి ...వారి ఫాదర్ గురించి తెలిసి ఆశ్చర్యపోయాను. కొడుకు సూపర్ స్టార్ గా ఎదిగినా కూడా తండ్రి ఇంకా బస్ డ్రైవర్ గానే చేయడం నన్ను ఆశ్యర్యానికి గురి చేసింది.
`నేను ఇంత సంపాదించాను, ఇంకా ఎందుకు బస్ డ్రైవర్ గా చేస్తావు మానెయ్` అని యష్ తన తండ్రితో అంటే `నేను బస్ డ్రైవర్ గా చేస్తూనే నిన్ను సూపర్ స్టార్ గా చేశాను. కాబట్టి నా పని నేను చేసుకుంటూ...నీ పని నువ్వు చెయ్ `` అన్నారట. నిజంగా ఇది విన్నాక యష్ కంటే నాకు తన తండ్రే సూపర్ స్టార్ అనిపించింది అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు. సౌత్ ఇప్పుడు ఎక్కడ చూసినా కేజియఫ్ గురించి చర్చ జరుగుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగు, తమిళ, కన్నడలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కాబోతుంది.