సంపూ నిజంగానే వెళ్లిపోయాడా... రేటింగ్స్ డ్రామానా..
on Jul 26, 2017
ఒకే ఒక్క సినిమాతో చిన్న చితకా అందర్నీ మెప్పించగలిగాడు మన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. రాజమౌళి లాంటి అగ్ర దర్శకుడు హృదయ కాలేయం పోస్టర్స్ చూసి, కామెంట్ చేయకుండా ఉండలేక పోయాడు అంటే అవి ఎంతగా ప్రభావితం చేశాయో అర్ధం చేసుకోవచ్చు. కానీ, సంపూ మాత్రం వచ్చిన సినిమాలన్నీ చేసి, పేరు చెడగొట్టుకున్నాడనే చెప్పొచ్చు. హృదయ కాలేయంతో తనకి లైఫ్ ఇచ్చిన సాయి రాజేష్ తో కొబ్బరి మట్ట అనే సినిమా చేస్తున్నాడు సంపూ. తన ఆశలన్నీ ఈ సినిమా మీదే పెట్టుకున్నాడు మన బర్నింగ్ స్టార్. ఈ మధ్యలో, ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా చేయడానికి ఒప్పుకున్నాడు సంపూ. ఈ షో మొదటి ఎపిసోడ్ లో ఎన్టీఆర్ బర్నింగ్ స్టార్ గురించి మాట్లాడుతూ నీకు ఫాన్స్ ఎక్కువగానే ఉన్నారని వాళ్ళని నిరుత్సాహపరచొద్దని చెప్పాడు. తర్వాత, సంపూ ని టీం లీడర్ గా చేసారు. తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించట్లేదు అని అతన్ని లీడర్ పదవి నుండి తొలగించారు.
గత కొన్ని రోజులుగా ఏమవుతుందో తెలియదు కానీ, సంపూ తనకి హౌస్ లో నాలుగు గోడల మధ్య ఉండడం ఇబ్బందిగా ఉందని, తనకి ఆరోగ్యం కూడా బాగా లేదని, త్వరగా ఎలిమినేట్ చేయమని ప్రాధేయ పడ్డాడు. నానా హంగామా చేసిన తర్వాత మొత్తానికి నిన్న సంపూ ని హౌస్ నుండి బయటకి వెళ్ళడానికి బిగ్ బాస్ అనుమతించారు. అయితే, సంపూ నిజంగానే వెళ్లాడా లేక టీ ఆర్ పీ రేటింగులు పెంచుకోవడానికి షో నిర్వాహకులు చేస్తున్న హంబక్ ఆ అని సందేహం. వాస్తవానికి ఇలాంటి రియాలిటీ షోల్లో ఇలాంటి జిమ్మిక్కులు చేయడం కామన్. అసలు విషయం తెలియాలంటే మాత్రం కాస్త వెయిట్ చేయాల్సిందే!