వరుణ్ తేజ్ పదేళ్ల ప్రేమ ప్రయాణం
on Jul 24, 2017
‘ఫిదా’తో భారీ విజయాన్ని అందుకున్నాడు వరుణ్ తేజ్. తన కెరీర్ లోనే చెప్పుకోదగ్గ విజయం ‘ఫిదా’అని.. అప్పుడే అందరూ మాట్లాడేసుకుంటున్నారు. ఈ సక్సెస్ ను ఇంకా పూర్తిగా ఎంజాయ్ చేయకుండానే... తన తర్వాతి చిత్రాన్ని పట్టాలెక్కించేశాడు వరుణ్. మరి ‘ఫిదా’ లాంటి విజయం తర్వాత వరుణ్ నటించే సినిమా ఎలా వుంటుంది? ఎలాంటి సినిమా చేస్తాడు? అనేది మెగా అభిమానుల్లో నెలకొన్న అనుమానాలు. వాటికి తెరదించుతూ... మళ్లీ ప్రేమకథనే ఎంపిక చేసుకున్నాడు ఈ మెగా హీరో. ఇది కూడా మూమూలు ప్రేమకథ కాదు... పదేళ్ల ప్రయాణంగా సాగే ప్రేమకథ. ఇప్పటివరకూ రాని అద్భుతమైన రీతిలో ఈ కథ ఉంటుందని టాక్.
ఇందులో కథానాయక ఛాన్స్ ను రాశీఖన్నా కొట్టేసింది. వెంకీ అట్టూరి అనే కొత్త దర్శకుడ్ని పరిచయం చేస్తూ బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ సోమవారం నుంచి మొదలైంది. కెరీర్ మొదలైనప్పట్నుంచీ... ముకుందా, కంచె, లోఫర్... అంటూ యాక్షన్ తో కూడిన సినిమాలు చేసిన వరుణ్... ‘ఫిదా’తో తన పద్ధతి మార్చుకున్నట్టున్నాడు. తనకు ప్రేమకథలే కరెక్ట్ అనుకున్నాడేమో... మళ్లీ వెంటనే ప్రేమికునిగానే దర్శనమివ్వనున్నాడు.
ఆల్ ది బెస్ట్ వరుణ్.