వెంకీకి డబ్బింగ్ చెప్పిన "అపరిచితుడు"..
on Aug 30, 2016
వెంకటేష్‌కు వేరే వాళ్లు డబ్బింగ్ చెప్పడం ఏంటీ..? మనోడు చెప్పుకోలేడా..? అయినా అపరిచితుడు ఎవరు అనేగా మీ డౌట్..వస్తున్నాం..! అక్కడికే వస్తున్నాం. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వెంకటేష్, శ్రీదేవి జంటగా నటించిన క్షణక్షణం సినిమా తెలుగులో సూపర్‌హిట్ దీనిని తమిళ ప్రేక్షకులకు అందించే ఉద్దేశ్యంతో తమిళ్లో రిలీజ్ చేశారు నిర్మాతలు. తమిళ్ వెర్షన్లో వెంకటేశ్‌కు వేరేవారు డబ్బింగ్ చెప్పారు. ఈ చెప్పింది ఎవరో కాదు. విలక్షణ నటుడిగా..చియాన్‌గా అభిమానులు పిలుచుకునే హీరో విక్రమ్. ఇప్పుడంటే విక్రమ్ పెద్ద స్టార్ హీరోగానీ కెరీర్ ఆరంభంలో చాలా కష్టాలు అనుభవించాడు. చిన్నా చితకా సినిమాలతో కాలం గడిపిన విక్రమ్‌కు పదేళ్ల తర్వాత బ్రేక్ వచ్చింది. ఆ పదేళ్ల కాలంలో డబ్బు కోసం..అవకాశాల కోసం తమిళంలో చాలా సినిమాలకు డబ్బింగ్ చెప్పాడు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా డైరెక్టర్ శంకర్‌తో ఏర్పడిన పరిచయమే అతనికి అపరిచితుడు లాంటి అవకాశాన్ని ఇచ్చింది. స్వతహాగా డబ్బింగ్ అంటే ఇష్టంకావడంతో స్టార్ హీరో అయినా డబ్బింగ్‌ను వదిలి పెట్టలేదని విక్రమ్ చెప్పాడు.