సల్మాన్ కు ఐదేళ్లు జైలు..నిర్మాతలకు షాక్
on May 6, 2015

ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు హిట్ అండ్ రన్ కేసులో కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. మద్యం సేవించి వాహనం నడిపిన సల్మాన్ ఒకరి మరణానికి .. మరో నలుగురు తీవ్ర గాయాలు అయ్యేందుకు కారణం అయ్యారు. 13 ఏళ్ల సుధీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో తీర్పు వెలువడింది. ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి దేశ్ పాండే తీర్పు ప్రకటించారు. మరోవైపు సల్మాన్ ఖాన్ కు జైలు శిక్ష విధించడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ గురి అయింది. ఆయన ఫ్యాన్స్, ఆయనతో సినిమాలు చేస్తున్న నిర్మాతలు ఇంకా షాక్ లోనే వున్నారు. సల్మాన్ శిక్షపై ఇండస్ట్రీ లో బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



