మెగా కాంపౌండ్ నుండి బాలయ్యకు ప్రశంసలు...
on Jan 12, 2017
నందమూరి బాలకృష్ణ నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన సినిమాకు పలువురు హీరోల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలయ్యకు అభినందనలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. ఇప్పుడు మెగా కాంపౌండ్ నుండి ట్వీట్ వచ్చేసింది. మెగా హీరో సాయి ధరం తేజ్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. 'గౌతమీపుత్ర శాతకర్ణి' గురించి గొప్ప రిపోర్టులు అందుతున్నాయని, ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కు, దర్శకుడు క్రిష్ కు శుభాకాంక్షలు తెలిపారు. బాలకృష్ణ గారు తమలో చాలామందికి స్ఫూర్తిగా నిలిచారని ఆయన ఫొటో పెట్టి మరీ హర్షం వ్యక్తం చేశారు.
ఇక అల్లు అర్జున్ కూడా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ విడుదల నేపథ్యంలో బాలయ్యకు అభినందనలు తెలిపారు.