2016 సంక్రాంతికి చిరు సినిమా??
on May 11, 2015
.jpg)
చిరంజీవి సినిమాకి పూరి దర్శకుడయ్యాని కన్‌ఫామ్ అయిపోయింది. ఈ విషయాన్ని రామ్‌చరణ్ కూడా ధృవీకరించేశాడు. 'నాన్నగారి సినిమాకి జగన్ దర్శకుడు.' అంటూ ట్వీట్ చేశాడు చరణ్. దాంతో అభిమానుల ఆనందం రెండింతలయ్యింది. ఇప్పుడు... మరో స్వీట్ న్యూస్. ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పూరి భావిస్తున్నాడట. ఆగస్టులో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమవుతుంది. సెప్టెంబరులో సెట్స్‌పైకి తీసుకెళ్తారు. అక్టోబరు, నవంబరు.. రెండు నెలల్లో సినిమాని పూర్తి చేసి 2016 సంక్రాంతికి విడుదల చేయాలని పూరి స్కెచ్ వేశాడట. పూరి టేకింగ్ యమ ఫాస్ట్ గా ఉంటుంది. స్టార్‌తో సినిమా అయినా ఆయన చక చక పూర్తి చేస్తారు. చిరు సినిమాకీ ఇదే స్పీడు కంటిన్యూ చేయాలనుకొంటున్నాడట. కేవలం 60 రోజుల్లో ఈ సినిమాని ఫినిష్ చేయాలన్నది ధ్యేయంగా పెట్టుకొన్నాడట పూరి. అదే జరిగితే.. బాక్సాఫీసు దగ్గర అన్నదమ్ముల వార్ చూసే అవకాశం ఉంది. ఎందుకంటే గబ్బర్ సింగ్ 2 సినిమాకీ సంక్రాంతికే ముహూర్తం ఫిక్స్ చేశారు. అటు పవన్ - ఇటు చిరు... 2016 మెగా హీరోలిద్దరి సందడి చూడబోతున్నామన్నమాట. నిజంగా ఇది షాకింగ్ న్యూసే!!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



