లారెన్స్‌ని భయపెడుతున్న ఎన్టీఆర్!
on Apr 14, 2015

గత జన్మ పాపాలు ఈ జన్మలోనూ వెంటాడతాయి అంటుంటారు. ఆ సంగతేమో గానీ.. గత సినిమా ఫ్లాప్ అయితే ఆ నష్టాలు వచ్చే సినిమానీ వెంబడిస్తుంటాయి. రభస, గంగ సినిమాల విషయంలో ఇదే జరుగుతోంది. ఎన్టీఆర్ తో రభస తీశాడు బెల్లంకొండ సురేష్. ఆ సినిమా భారీ ఫ్లాప్ అయ్యింది. బయ్యర్లకు ఎక్కువ రేటుకి సినిమా అమ్మేసిన సురేష్.. వాళ్ల నష్టాన్ని పూడ్చాల్సివచ్చింది. ఆ సినిమా కోసం తీసుకొన్న అప్పులు కుప్పలు కుప్పలుగా ఎదిగిపోయాయి. ఇప్పుడువాటిని క్లియర్ చేసుకోవాలి. కానీ అవేం తీర్చకుండా గంగని విడుదల చేసే పనిలో పడ్డాడు నిర్మాత బెల్లంకొండ సురేష్. ఇప్పుడు రభస తాలుకూ అప్పులు తీరిస్తే గానీ, లారెన్స్ 'గంగ' విడుదలక నోచుకోని పరిస్థితి దాపురించింది. ఈనెల 17న గంగని విడుదల చేయాలి. అయితే ఈలోగా సురేష్ క్లియర్ చేసుకోవాల్సిన బాకీలు చాలా ఉన్నాయి. మరి ఈ వ్యవహారం ఎప్పుడు ముగుస్తుందో, గంగ ఎప్పుడు బయటకు వస్తుందో..?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



