English | Telugu

వెయిట్ చేయలేకపోతున్నా... మనం ముందే చూద్దాంలే..

on Apr 13, 2018

 

దర్శకుడు పూరీ జగన్నాథ్ తన కుమారుడు ఆకాష్ తో 'మెహబూబా' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 1971 ఇండియా-పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలై.. మంచి టాకే తెచ్చుకుంది. అద్భుతమైన విజువల్స్, యుద్ధ వాతావరణం, బుల్లెట్ల లాంటి డైలాగ్స్ సినీ అభిమానులను ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా అక్కినేని అఖిల్ ఈ సినిమా ట్రైలర్ పై తన స్పందనను తెలియజేశాడు. 'వాట్ ఏ క్రాకింగ్ ట్రైలర్. నాకు బాగా నచ్చింది. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తోంది. వెయిట్ చేయలేకపోతున్నా. విజువల్స్ అదిరిపోయాయ్... మొత్తం టీమ్ కు ఆల్ ది బెస్ట్.' అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు పూరీ జగన్నాథ్ రిప్లై ఇచ్చాడు. 'నీ స్పందనకు ప్రేమాభివందనాలు. రిలీజ్ కంటే ముందే మనిద్దరం కలిసి సినిమా చూద్దాం' అంటూ ట్వీట్ చేశాడు.

 

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here