English | Telugu

'నాంది' పలికిన అల్లరి నరేశ్

అల్లరి నరేష్ కథానాయకుడిగా ఎస్.వి.2 ఎంటర్టైన్మెంట్ పతాకంపై సతీష్ వేగేశ్న నిర్మిస్తున్న 'నాంది' చిత్రం షూటింగ్ సోమవారం రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. విజయ్ కనకమేడల దర్శకుడిగా పరచయమవుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, హరీష్ ఉత్తమన్ కీలక పాత్రధారులు. దేవుని పటాలకు నమస్కరిస్తున్న నరేష్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ హరీష్ శంకర్ క్లాప్ నివ్వగా, నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు.

'అల వైకుంఠపురములో' ఇండస్ట్రీ రికార్డ్ కొట్టాను!

"మా నాన్నతో కలిసి ఇండస్ట్రీ రికార్డ్ కొట్టడమనే ఆనందం త్రివిక్రమ్ గారిచ్చారు" అంటూ ఉద్వేగానికి గురయ్యాడు అల్లు అర్జున్. ఆదివారం రాత్రి వైజాగ్‌లోని ఆర్కే బీచ్‌లో జరిగిన 'అల వైకుంఠపురములో' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో బన్నీ తన సినిమా ఇండస్ట్రీ రికార్డును కొడుతున్నదనే విషయాన్ని ఒకవైపు చెబుతూనే, రికార్డులనేవి తాత్కాలికమనీ, ఫీలింగ్స్ శాశ్వతమనీ మరోవైపు చెప్పాడు.

ప్రభాస్‌ సినిమాలో కృష్ణంరాజు కూడా...

రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు, యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ మరోసారి వెండితెరపై సందడి చేయబోతున్నారు. తమ్ముడి కుమారుడితో మరోసారి కృష్ణంరాజు కలిసి నటిస్తున్నారు. వీరిద్దరూ వచ్చే వేసవిలో వెండితెరపై సందడి చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే...

ఎంజీఆర్ కోసం ఎనిమిది లుక్స్ ట్రై చేశాడు

'తలైవి'లో ఎంజీఆర్ పాత్రలో అరవిందస్వామి ఆహార్యానికి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, సీఎం ఎంజీఆర్ ను అచ్చుగుద్దినట్టు అరవిందస్వామి దింపేశాడని సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం కురుస్తోంది. ఈ లుక్ రావడం కోసం ఒకప్పటి అమ్మాయిల కలల రాకుమారుడు, 'రోజా' హీరో చాలా కష్టపడ్డాడట.

'జాన్' అప్‌డేట్: ప్రభాస్ ఫస్ట్ లుక్

ప్రభాస్ హీరోగా 'జిల్' ఫేం రాధాకృష్ణకుమార్ డైరెక్ట్ చేస్తోన్న 'జాన్' (వర్కింగ్ టైటిల్) మూవీ కొత్త షెడ్యూల్ నేడు (జనవరి 17) రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్లో మొదలైంది. పూజా హెగ్డే నాయికగా నటిస్తోన్న ఈ సినిమాని ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో తీస్తున్నారు. యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ మేళవించిన లవ్ స్టోరీతో తయారవుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇదివరకు ఇటలీలో ఒక షెడ్యూల్, హైదరాబాద్‌లో ఒక ఒక షెడ్యూల్ నిర్వహించారు.

కంగనా తేలిపోయింది... అరవిందస్వామి లుక్ పేలిపోయింది

దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితంపై తెరకెక్కుతోన్న బయోపిక్స్ లో ‌‌‌‌‌'తలైవి' ఒకటి. దివంగత నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ ప్రస్తావన లేని జీవితం అసంపూర్ణం. జయలలితకు ఆయనే రాజకీయ గురువు. నటిగా ఆమె ఎదుగుదలలో ఆయన పాత్ర ఎంతో ఉంది.

రాజకీయ 'చదరంగం'... మంచు విష్ణు టార్గెట్ ఎవరు?

తెలుగులో వెబ్ సిరీస్ ట్రెండ్ రోజురోజుకు పెరుగుతోంది. నవదీప్, జగపతిబాబు, శ్రద్దాదాస్, వరుణ్ సందేశ్ తదితర స్టార్స్ ఇప్పటికే వెబ్ సిరీస్ లు చేశారు. సమంత, శృతిహాసన్ వంటి టాప్ హీరోయిన్లు ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. ఈ లిస్టులోకి హీరో శ్రీకాంత్...

ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ

మూడేళ్ళ క్రితం సంక్రాంతికి 'శతమానం భవతి' (2017)తో దర్శకుడు వేగేశ్న సతీష్ మంచి విజయం అందుకున్నారు. ఆ సినిమాకు నేషనల్ అవార్డు వచ్చింది. ఈ సంక్రాంతికి 'ఎంత మంచివాడవురా'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు వేగేశ్న సతీష్. నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా ఉంది? రివ్యూ చదివి తెలుసుకోండి.

'జులాయి' నుంచి రాజేంద్రప్రసాద్‌ను భరిస్తున్నా: త్రివిక్రమ్

"సునీల్ శక్తి సునీల్‌కు తెలీదు. మేం ఒక రూంలో కలిసున్నప్పుడు వాడు విలన్ అవుదామనుకున్నాడు. నేనేమో తెలుగు ఇండస్ట్రీలోని కామెడీ దిగ్గజాల్లో నువ్వూ ఒక దిగ్గజంగా నిలిచిపోతావని చెప్పా. అఫ్‌కోర్స్.. అప్పట్నుంచీ ఇప్పటిదాకా తను నా మాటల్ని నమ్మడం లేదు. ఎప్పుడు నమ్ముతాడో తెలీదు. పద్మశ్రీలు, పద్మభూషణ్‌లు వచ్చాక ఇంకో 20 ఏళ్లకు నమ్ముతాడేమో" అని చెప్పారు డైరెక్టర్ త్రివిక్రమ్. 

అల్లు అర్జున్ గ్యాప్‌కి కారణం అరవిందే!

'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా 2018 మే నెలలో విడుదలైంది. ఆ సినిమా తర్వాత మళ్లీ అల్లు అర్జున్ థియేటర్లలోకి వచ్చింది ఈ సంక్రాంతికే. 'అల... వైకుంఠపురములో' సినిమాతోనే. ఆల్మోస్ట్ ఏడాదిన్నర తర్వాత అల్లు అర్జున్ సినిమా మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చింది.

అల వైకుంఠపురములోమూవీ రివ్యూ

'గ్యాప్ తీసుకోలేదు... వచ్చింది' - 'అల వైకుంఠపురములో' టీజర్లో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్. గ్యాప్  వచ్చిందా? తీసుకున్నాడా? అనేది పక్కన పెడితే... గ్యాప్ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న చిత్రమిది. 'రేసు గుర్రం' తరహా కామెడీ సినిమా అని ప్రచార పర్వంలో చెప్పారు. 'అరవింద సమేత వీరరాఘవ' వంటి సీరియస్ సినిమా తర్వాత త్రివిక్రమ్ తనశైలిలో తీసిన వినోదాత్మక కుటుంబ కథా చిత్రమిది. ఈ రెండూ పక్కన పెడితే...

'సరిలేరు నీకెవ్వరు' మూవీ రివ్యూ

సూపర్ హిట్ల మీదున్న మహేశ్, అనిల్ రావిపూడి కలయికలో ఒక సినిమా వస్తున్నదంటే.. అంచనాలకు కొదవేముంటుంది! పైగా పదమూడేళ్ల తర్వాత లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి నటించిన సినిమా కూడానాయె! అందుకే విడుదలయ్యే సమయానికి 'సరిలేరు నీకెవ్వరు'పై అంచనాలు అంబరాన్ని చుంబించాయి. దేవి శ్రీప్రసాద్ స్వరాలు కూర్చిన పాటలు కూడా సంగీత ప్రియుల హృదయాల్లో చోటు దక్కించుకోవడం కూడా సినిమాపై బజ్‌ను పెంచింది.

వాళ్లు 'ప్రేక్షక దేవుళ్లు' ఎందుకయ్యారంటే..!

"ప్రేక్షకులనేవాళ్లు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు. అందుకే వాళ్లను ప్రేక్షక దేవుళ్లు అంటుంటాం. థియేటర్‌లో లైట్లు ఆర్పిన తర్వాత కులం, మతం, జాతి.. వీటన్నిటికీ అతీతంగా తమ ముందున సినిమాని చూస్తారు. వాళ్లను ఏదీ ఆ టైంలో ఎఫెక్ట్ చెయ్యదు. నవ్వొస్తే నవ్వుతారు, ఆనందం వస్తే ఆనందిస్తారు. కళ్లల్లో నీళ్లొస్తే ఏడుస్తారు" అని చెప్పారు త్రివిక్రమ్. 'అల వైకుంఠపురములో' అనే టైటిల్ పెట్టడానికి పోతన పద్యమే స్ఫూర్తి అని తెలిపారు.

మహేష్‌ 27కు తమన్‌?

రొటీన్‌ కమర్షియల్‌ మ్యూజిక్‌ చేస్తున్నాడని, రొట్ట పాటలు ఇస్తున్నాడని విమర్శలు ఎదుర్కొన్న సమయంలోనూ... సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుకు ఎస్‌.ఎస్‌. తమన్‌ సూపర్‌హిట్‌ పాటలే ఇచ్చాడు. ‘దూకుడు’లో మహేష్‌, సమంత డ్యాన్‌ ఇరగదీసిన ‘దఢక్‌ దఢక్‌ దేత్తడి’ పాట ఇప్పటికీ ఆటోల్లో అప్పుడప్పుడూ వినపడుతోంది....

'విరాటపర్వం' సెట్స్‌పై రానా

పొడగరి హీరో రానా దగ్గుబాటి తన తాజా చిత్రం 'విరాటపర్వం' షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం కేరళలో ప్రధాన తారాగణంపై కొన్ని ప్రధాన సన్నివేశాల్ని దర్శకుడు వేణు ఊడుగుల చిత్రీకరిస్తున్నాడు. నాయికగా నటిస్తున్న సాయిపల్లవితో పాటు, ఒక కీలక పాత్ర చేస్తున్న ప్రియమణి సైతం ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తయారవుతున్న ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను పేరుపొందిన హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ స్టీఫెన్ రిచర్ ఆధ్వర్యంలో చిత్రీకరించనున్నారు.

'డిస్కో రాజా' మూవీ ప్రివ్యూ

మాస్ మహారాజాగా అభిమానులు పిలుచుకొనే రవితేజ జనవరి 24న 'డిస్కో రాజా'గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాతో ఆకట్టుకున్న వి.ఐ. ఆనంద్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో పాయల్

పూరి-దేవరకొండ 'ఫైటర్'లో హాలీవుడ్ యాక్టర్స్?

'ఇస్మార్ట్ శంకర్' హిట్ దర్శకుడు పూరి జగన్నాథ్ లో కొత్త జోష్ తీసుకొచ్చింది. సూపర్ డూపర్ సక్సెస్, ఇండస్ట్రీ హిట్స్ పూరికి కొత్త కాదు. కానీ, కొన్ని ప్లాప్స్ తర్వాత 'ఇస్మార్ట్ శంకర్' రావడంతో అతడు మళ్లీ ఫుల్ రీఛార్జ్ అయ్యాడు. ఈ హుషారులో విజయ్ దేవరకొండ హీరోగా 'ఫైటర్' తీయడానికి రెడీ అవుతున్నాడు. 'వరల్డ్ ఫేమస్ లవర్' తర్వాత 'అర్జున్ రెడ్డి' హీరో నటించనున్న సినిమా ఇదే.  

జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ ఫిల్మ్ టైటిల్ అదేనా?

లేటెస్టుగా 'అల.. వైకుంఠపురములో' వంటి సూపర్ హిట్ సంక్రాంతి సినిమా అందించిన టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్, దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌ను డైరెక్ట్ చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ 2020 జూన్‌లో మొదలవుతుందని చెప్పుకుంటున్నారు. ఈలోగా రాజమౌళి డైరెక్షన్‌లో చేస్తోన్న 'ఆర్ ఆర్ ఆర్' షూటింగ్‌ను తారక్ పూర్తిచేయనున్నాడు. 

బాక్సాఫీస్ భీకర యుద్ధం: 'సరిలేరు నీకెవ్వరు' వర్సెస్ 'అల వైకుంఠపురములో'

సంక్రాంతి పందెం కోళ్లు 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో' ఒకదానితో ఒకటి బాక్సాఫీస్ దగ్గర భీకరంగా ఢీకొంటున్నాయి. సూపర్ స్టార్ మహేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు'కి క్రిటిక్స్ మిక్స్డ్ రివ్యూస్ ఇవ్వగా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్...

గాళ్‌ఫ్రెండ్ వద్దు.... సెలవు కావాలి

టాలీవుడ్ యంగ్ హీరోల్లో, ఎలిజిబుల్ బ్యాచిలర్లలో శర్వానంద్ ఒకడు. పెళ్లి ఎప్పుడు? అనే ప్రశ్న పక్కన పెట్టండి. కనీసం ప్రేమలో ఉన్నాడేమో అని కనుక్కుందామని 'మీరు సింగిల్ గా ఉన్నారా? ప్రేమలో ఉన్నారా?' అని అడిగితే... "నేను సింగిల్. అలాగని, ఎవరితోనూ మింగిల్ కావడానికి రెడీగా లేను. నాట్ రెడీ టు మింగిల్. చేతి నిండా సినిమాలు ఉన్నాయి....

బన్నీతో నా కెమిస్ట్రీ బాగుందని అందరూ అంటున్నారు!

"మేం ఇప్పటి దాకా రెండు సినిమాలు కలిసి చేశాం. దాంతో మామధ్య సెట్స్ పై కంఫర్ట్ లెవల్ పెరిగింది. అది తెరపై కెమిస్ట్రీ రూపంలో కనిపించింది. మామధ్య కెమిస్ట్రీ బాగుందని అందరూ అంటున్నారు. అందువల్లే ఈ సినిమా తర్వాత ఇంకోసారి మళ్లీ నాతో కలిసి నటించాలని ఉందని అల్లు అర్జున్ అన్నారు. ఆయన అన్నట్లుగానే ఇద్దరం కలిసి మరో సినిమా చెయ్యాలని ఆశిస్తున్నా" అని చెప్పారు పూజా హెగ్డే. 

'రాములో రాములా' పాట హిట్టవడానికి కారణం నేనే: బ్రహ్మానందం

"రాములో రాములా పాట హిట్టయ్యిందంటే కారణం బన్నీ అనుకుంటున్నారు. కాదు.. నేను" అని చెప్పారు సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం. "నాకు గుండెకు సంబంధించి అనారోగ్యం కలిగినప్పుడు నన్ను పలకరించడానికి వచ్చాడు మిస్టర్ బన్నీ. 'అంకుల్.. మీరు పర్ఫెక్టుగా ఉన్నారు.. రెస్ట్ తీసుకున్నాక మొట్టమొదట నా సినిమాలోనే మీరు చేస్తున్నారు' అని చెప్పాడు. కలిశాడు కాబట్టి ఏదో ఎంకరేజ్ చెయ్యడం కోసం చెప్పాడేమో అనుకున్నా" అని ఆయన చెప్పారు. 

ఒక్క సినిమాకు 100 కోట్లు అడిగాడట!

అక్షరాలా వంద కోట్ల రూపాయలు... రూ.100కోట్లు. ఒక్క సినిమా... ఒకే ఒక్క సినిమా చేయడానికి తమిళ స్టార్ హీరో విజయ్ వంద కోట్ల రూపాయలు పారితోషికంగా అడిగాడట. ఒక తమిళ సినిమా చేయాలని ముంబై నిర్మాత ఒకరు ఈ హీరోను సంప్రదించగా...

17 నుంచి ప్రభాస్ 'జాన్' షెడ్యూల్

ప్రభాస్ హీరోగా 'జిల్' ఫేం రాధాకృష్ణకుమార్ డైరెక్ట్ చేస్తోన్న 'జాన్' (వర్కింగ్ టైటిల్) మూవీ కొత్త షెడ్యూల్ జనవరి 17 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్లో జరగనున్నది. పూజా హెగ్డే నాయికగా నటిస్తోన్న ఈ సినిమాని ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో తీస్తున్నారు. యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ మేళవించిన లవ్ స్టోరీతో తయారవుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇదివరకు ఇటలీలో ఒక చిన్న షెడ్యూల్ నిర్వహించారు. 

ఎవరికైనా సోలో రిలీజ్ కావాలి: అల్లు అర్జున్

ఎవరైనా సోలో రిలీజ్ కావాలనుకుంటారని అల్లు అర్జున్ అన్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి నాలుగు సినిమాలు వస్తున్నాయి. ఎప్పుడూ లేనివిధంగా రెండు సినిమాల మధ్య పోటీ వాతావరణం నెలకొంది. మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' చిత్రాలు ప్రచారం, పబ్లిసిటీ విషయాల్లో పోటీపడ్డాయి. నేరుగా ఈ అంశం మీద కానప్పటికీ...

మహేశ్ డాన్సులు ఆడియెన్స్‌కు బోనస్!

"మహేశ్ యాక్టింగ్ వేరే లెవెల్‌లో ఉండబోతుంది. నేను రీరికార్డింగ్ చేస్తున్నప్పుడే రిపీటెడ్‌గా చూశాను. ఈ సినిమాలో ఆయన డాన్సులు ఆడియన్స్‌కి బోనస్" అని చెప్పాడు దేవి శ్రీప్రసాద్. మహేశ్ హీరోగా నటించిన 'సరిలేరు నీకెవ్వరు' మూవీకి ఆయనిచ్చిన మ్యూజిక్ మంచి ఆదరణే పొందింది. ఆ సినిమా జనవరి 11న విడుదలవుతోంది.

నిర్మాతలు ఇచ్చిన చెక్కులు చించేశా- రవితేజ

ఒకటి కాదు... రెండు కాదు... మూడు సార్లు నిర్మాతలు తనకు ఇచ్చిన చెక్కులు చించేశానని మాస్ మహారాజా రవితేజ అన్నారు. సినిమాలు ఫ్లాప్ కావడంతో నిర్మాతల దగ్గర డబ్బులు తీసుకోకుండా వదిలేశానని ఆయన తెలిపారు. ఇప్పుడు ఈ టాపిక్ రవితేజ ఎందుకు మాట్లాడారంటే... రెమ్యూనరేషన్ విషయంలో మాస్ మహారాజా నిక్కచ్చిగా ఉంటాడనీ, అతడు అడిగినంత ఇవ్వకపోతే సినిమాలు వదిలేసుకున్న సందర్భాలు ఉన్నాయనీ విమర్శలు వచ్చాయి.

విజయ్ దేవరకొండ 'ఫైటర్' షూటింగ్ షురూ

సంచలన కథానాయకుడు విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో తయారవుతున్న క్రేజీ మూవీ 'ఫైటర్' (వర్కింగ్ టైటిల్) షూటింగ్ ముంబైలో సోమవారం ఉదయం పూజా కార్యక్రమాలతో మొదలైంది. హీరో విజయ్ దేవరకొండపై...

'ఆర్ ఆర్ ఆర్'కు కొత్త రిలీజ్ డేట్?

2020 సంవత్సరంలో మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా ఫిల్మ్ ఏదంటే ఎవరైనా ఠక్కున చెప్పే పేరు 'ఆర్ ఆర్ ఆర్'. నంబర్ వన్ ఇండియన్ డైరెక్టర్ యస్.యస్. రాజమౌళి డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తోన్న ఈ మల్టీస్టారర్ ఎప్పుడు తమ ముందుకు వస్తుందా అని దేశవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆసక్తికరంగా...

సమంత కోసం చెన్నైలో ఇల్లు కొంటున్నాడా?

శ్రీమతి సమంత కోసం యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య చెన్నైలో ఇల్లు కొనడానికి ప్లాన్ చేస్తున్నాడట. కొనడం ఎందుకు? ఆల్రెడీ ఓ ఇల్లు ఉన్నట్టుంది కదా అని కొందరి సందేహం. నిజం చెప్పాలంటే... సమంతది చెన్నై. ఆమె తల్లితండ్రులకు అక్కడ సొంత ఇల్లు ఉంది. చైతన్య తల్లి ఉంటున్నది

19న వైజాగ్‌లో 'అల వైకుంఠపురములో' విజయోత్సవం!

అల్లు అర్జున్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'అల వైకుంఠపురములో' బాక్సాఫీస్ దగ్గర ఆశ్చర్యకరమైన ఫలితాలతో దూసుకుపోతోంది. బన్నీ కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్ ఫిలింగా నిలిచేందుకు ఉరకలు వేస్తోంది. గతానికి భిన్నంగా ఓవర్సీస్‌లోనూ కూడా ఈ చిత్రం రికార్డు ఓపెనింగ్స్ దక్కించుకోవడం గమనార్హం. సినిమా ఇంతటి ఘన విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం అభిమానుల సమక్షంలో బహిరంగంగా ఈ విజయోత్సవ సభ నిర్వహించబోతున్నారు.

రాజమౌళి చెప్పిందే చేస్తున్నాడట

యాక్టింగ్ విషయానికి వస్తే తాను డైరెక్టర్స్ యాక్టర్ అని రామ్ చరణ్ చెబుతున్నాడు. డైరెక్టర్ విజన్ ఏంటో తెలుసుకుని అందుకు తగ్గట్టు నటిస్తాననీ... డైరెక్టర్స్ కి సరెండర్ అవుతాననీ... క్యారెక్టర్ గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడనని మెగాపవర్ స్టార్ పేర్కొన్నాడు....

పవన్ కల్యాణ్‌తో పూజా హెగ్డే

అవును... పవన్ కల్యాణ్‌తో పూజా హెగ్డే నటించడం దాదాపుగా ఖాయమే. పవన్-పూజ కాంబినేషన్ గత కొన్ని రోజులుగా వార్తల్లోకి వస్తోంది. అయితే... అందరూ అనుకుంటున్నట్టు 'పింక్' రీమేక్ లో పూజా హెగ్డే నటించడం లేదు. పవన్ కల్యాణ్ హీరోగా 'కంచె', 'కృష్ణంవందే జగద్గురుమ్', 'గమ్యం' సినిమాల దర్శకుడు క్రిష్ తీయబోయే సినిమాలో ఆమె నటించనుంది.

మెసేజ్‌కి కూడా తమన్ రెస్పాండ్ కావట్లేదు!

"తమన్ ఇవాళ బిగ్ స్టార్ అయిపోయాడు. మెసేజెస్‌కు కూడా రెస్పాండ్ కానంత బిజీ స్టార్ అయ్యాడు. ఈ సినిమాకు ఆత్మనిచ్చాడు. అతనికి గోల్డెన్ పీరియడ్ నడుస్తోంది" అని చెప్పింది పూజా హెగ్డే. 'అల వైకుంఠపురములో' మూవీలో అమూల్య పాత్రలో ఆమె ఆకట్టుకుంది. బన్నీకి మేడంగా నటించి, అతని ప్రేమలో పడే పాత్రలో కావాల్సినంత గ్లామర్ కురిపించింది. 'అల వైకుంఠపురములో' థాంక్స్ మీట్‌లో ఆమె మాట్లాడింది.

ఎందుకిలాంటి సినిమా చేయరని నా వైఫ్ అడిగింది

నందమూరి కల్యాణ్ రామ్ నటించిన ఫస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఎంత మంచివాడవురా'. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో "అన్నయ్య ఇటువంటి ఫ్యామిలీ సినిమా చేస్తే చూడాలని ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నాను. ఈ సినిమాతో నా కోరిక తీరింది" అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నారు....

విడాకుల బాధ ఓవర్... బికినీలో నవ్వుల్

​ప్రేమించి పెళ్లాడిన రోహిత్ మిట్టల్ తో విడిపోతున్నట్టు గతేడాది డిసెంబరులో 'కొత్త బంగారు లోకం' ఫేమ్  శ్వేతాబసు ప్రసాద్ అనౌన్స్ చేసింది. అప్పటికి కొన్ని నెలల క్రితమే విడిపోవాలని డెసిషన్ తీసుకున్నారు. అయితే తొలి వివాహ వార్షికోత్సవానికి కొన్ని రోజుల ముందు విడాకుల..

సుకుమార్ గ్యాప్ పెరిగిపోతుందన్నాడని...

సుకుమార్ సినిమా కోసం 'ఐకాన్' సినిమాను కాస్త వెనక్కు జరిపానని అల్లు అర్జున్ తెలిపాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'దిల్' రాజు నిర్మాణంలో 'ఐకాన్' సినిమా చేయనున్నట్టు అల్లు అర్జున్ నుండి ప్రకటన వచ్చింది. అలాగే, సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ కి కూడా ఒక సినిమా చేయడానికి ఆయన ఓకే చెప్పారు. రెండు సినిమాల్లో.... 

వర్మ బయోపిక్‌ టైటిల్ కాంట్రవర్సీ

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఆర్జీవీ అంటే రామ్ గోపాల్ వర్మ. ఆయనొక బ్రాండ్. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా ప్రతి సినిమాతో వార్తల్లో నిలిచే వ్యక్తి. ఒకప్పుడు సెన్సేషనల్ ఫిలింస్ తీసిన ఈయన, ఇప్పుడు సెన్సేషన్ కోసం ఏదో విధంగా ఎవరో ఒకరి పరువు తీయడమే...

నా భయాలతో ఫైట్ చేస్తూ వస్తున్నా!

'అరవింద సమేత' సినిమా నుంచి తన భయాలతో ఫైట్ చేస్తూ వస్తున్నానని అంటున్నారు డైరెక్టర్ త్రివిక్రమ్. భయాలను గెలవడానికే ఆ సినిమా చేశానని కూడా ఆయన అంటున్నారు. అల్లు అర్జున్ హీరోగా ఆయన రూపొందించిన 'అల వైకుంఠపురములో' మూవీ జనవరి 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సంక్రాంతికి పోటీపడుతున్న తన సినిమా, 'సరిలేరు నీకెవ్వరు' వేర్వేరు తరహా సినిమాలని ఆయన చెప్పారు.

Movie Reviews

Latest News

Video-Gossips

Gallery

అక్కడ 'అల వైకుంఠపురములో' పైచేయి!

మహేశ్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ సినిమా 'అల వైకుంఠపురములో' బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి కోడి పుంజుల్లా తలపడుతున్న విషయం తెలిసిందే. మిక్స్డ్ టాక్‌లోనూ 'సరిలేరు' భారీ కలెక్షన్లు సాధిస్తుండగా, ఫుల్ పాజిటివ్ టాక్‌తో 'అల' వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల విషయంలో రెండు సినిమాల నిర్మాతలు వెల్లడిస్తున్న కలెక్షన్లపై ట్రేడ్ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. 

కీర్తి చేజారింది.. ప్రియమణి అందుకుంది!

ఇది నిజంగా సెన్సేషనల్ న్యూస్! సంచల తార కీర్తి సురేశ్ స్థానంలో వెటరన్ హీరోయిన్ ప్రియమణి వచ్చింది!! అవును. అజయ్ దేవ్‌గణ్ హీరోగా రూపొందుతోన్న బాలీవుడ్ ఫిల్మ్ 'మైదాన్'లో నాయికగా ఎంపికైన కీర్తి సురేశ్.. ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది....

దానికి 100 కోట్ల గ్రాస్.. దీనికి 100 కోట్ల షేర్!

మహేశ్ హీరోగా నటించిన 'దూకుడు' సినిమా సూపర్ హిట్ అయ్యిందనే విషయం మనకు తెలిసిందే. శ్రీను వైట్ల డైరెక్షన్‌లో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌పై ఆ మూవీని రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర కలిసి నిర్మించారు. ఇప్పుడు అనిల్ సుంకర సపరేట్‌గా ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌పై సినిమాలు తీస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన ఆ బేనర్‌పై మహేశ్ హీరోగా నిర్మించిన 'సరిలేరు నీకెవ్వరు' మూవీ సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాని 'బ్లాక్‌బస్టర్ కా బాప్' అంటూ ప్రమోట్ చేస్తున్నారు.

'నేల టికెట్' ఫ్లాప్‌పై రవితేజ స్పందన

రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన 'డిస్కో రాజా' ఈ నెల 24న విడుదల కానుంది. ఆల్రెడీ విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అన్నిటి కంటే ముఖ్యంగా నిర్మాత ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా సినిమా తీశారని ట్రయిలర్స్, ప్రోమోస్ చూస్తుంటే తెలుస్తోంది. రవితేజతో 'నేల టికెట్' తీసిన రామ్ తాళ్లూరి...

ఇప్పటికీ తండ్రి సలహానే పాటిస్తున్న వెంకటేష్

ప్రతి ఒక్కరికి వయసుతోపాటు పద్ధతులు, అలవాట్లు మారుతూ ఉంటాయి. కాలంతో పాటు కొన్ని సంప్రదాయాలను సైతం మన సమాజం మార్చుకుంటూ ఉంది. ఈ కాలంలో పెద్దల సలహాలను ఎంతమంది తు.చ తప్పకుండా పాటిస్తున్నారో తెలియదు. కానీ, విక్టరీ వెంకటేష్ మాత్రం ఇప్పటికీ ఓ విషయంలో తండ్రి సలహానే పాటిస్తున్నారు....

‘బాహుబలి’తో సరిలేరు...‘బాహుబలి 2’తో అల...

సంక్రాంతికి గోదావరి జిల్లాల్లో పందెం కోళ్లకు కట్టిన కత్తులు తీసి పక్కన పెట్టేసి ఉంటారు. సంక్రాంతి బరిలో, ప్రచార పోటీలో ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల... వైకుంఠపురములో’ సినిమా యూనిట్స్‌ కట్టిన కత్తులు ఇంకా తీయలేదు. థియేటర్లలోకి రావడానికి ముందు విడుదల తేదీ విషయంలో పోటీ పడ్డారు. ప్రచారంలో పోటీ పడ్డారు.

రానాకు ఆరోగ్య సమస్యలు... నిజమే 

దగ్గుబాటి రానాకు ఆరోగ్యం బాలేదు. అందుకని, చికిత్స కోసం అమెరికా వెళ్లాడని తెలుగు మీడియా ఎప్పుడో చెప్పింది. వీటిని దగ్గుబాటి ఫ్యామిలీ ఖండించింది. 'విరాట పర్వం'లో మావోయిస్ట్ క్యారెక్టర్ కోసం బరువు తగ్గి, సన్నగా కావడం కోసం రానా అమెరికా వెళ్లాడని రామానాయుడు కాంపౌండ్ సన్నిహిత వర్గాల నుండి అందిన సమాచారం. ఓ హిందీ సినిమా...

చెప్పి మరీ బన్నీ బ్లాక్‌బస్టర్ కొట్టాడు.. ఈడు మగాడ్రా బుజ్జీ!

ఏడాదిన్నర క్రితం ఒక మంచి సినిమా చెయ్యడానికి కొంచెం టైం తీసుకుంటానని, దాని కోసం కొంచెం ఓపిక వహించమని ట్విట్టర్ ద్వారా తన ఫ్యాన్స్‌ను అభ్యర్థించాడు అల్లు అర్జున్. ఇన్నాళ్ల తర్వాత ఆ ట్వీట్‌కు ఒక అభిమాని రెస్పాండై పెట్టిన పోస్ట్ బన్నీకి బాగా నచ్చేసింది. ఆ రిప్లై ట్వీట్‌ను తనికెళ్ల భరణి చేత చదివి వినిపింపజేశాడు బన్నీ. దానికీ ఒక కారణముంది.

అమెరికాలో అరుదైన రికార్డు సృష్టించిన మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా తొలిరోజు నలభై ఆరు కోట్ల 77 లక్షల రూపాయల షేర్ సాధించింది. ఓవర్సీస్ మార్కెట్ లో కూడా సినిమాకు బీభత్సమైన వసూళ్లు వస్తున్నాయి. ఆల్రెడీ ఈ సినిమా వన్ మిలియన్...

హీరోలందరినీ కవర్ చేసిన అల్లు అర్జున్

'వచ్చాడయ్యో సామి... నింగి సుక్కలతో గొడుగు ఎత్తింది భూమి' - ఇది మహేష్ సినిమా 'భరత్ అనే నేను'లో పాట. సంక్రాంతి హిట్ 'అల... వైకుంఠపురములో' సినిమాకు వెళితే... అందులో ప్రేక్షకులకు ఈ పాట వినిపిస్తుంది. వినిపించడమే కాదు... ఈ పాటకు మహేష్ బాబులా అల్లు అర్జున్ స్టెప్పులు వేసే దృశ్యం కనిపిస్తుంది కూడా!