ప్రభాస్-అనుష్కలు ఇక ఆపేస్తారా..?
on Jun 8, 2017

హీరో, హీరోయిన్లపై పుకార్లు రావడం కామన్. కానీ ప్రభాస్, అనుష్కలపై వచ్చినన్ని రూమర్స్ బహుశా ఎవరి మీదా వచ్చి వుండవు. వీరిద్దరూ లవ్‌లో ఉన్నారని ఒకసారి, పెద్దలు పెళ్లికి ఒప్పుకున్నారని..కాదు ఇరు కుటుంబాలకు మధ్య ఏదో వివాదం జరిగిందని ఇలా ఎన్ని రకాల వార్తలు రాయొచ్చో అన్ని వార్తలు వండి వర్చింది తెలుగు మీడియా. వీటిని ఖండించినంత కాలం ఇద్దరూ ఖండించారు. కానీ ఒక దశలో ప్రభాస్, అనుష్కలు పుకార్లకు అలవాటైపోయారు. బాహుబలి ముందు వరకు కాస్త పుకార్ల ప్రభావం తగ్గినప్పటికీ..ఆ తర్వాత పుకార్ల జోరు ఊపందుకుంది.
బాహుబలి ప్రమోషన్స్‌లో ప్రభాస్, అనుష్కల మధ్య చనువు చూసి మళ్లీ ఇద్దరి మధ్య మ్యాటర్ సీరియస్‌గా నడుస్తోందని ఇక వీరిద్దరూ ప్రేమకు ఫుల్‌స్టాప్ పెట్టేసి పెళ్లిపీటలెక్కడం ఖాయమంటూ నానా హడావిడి చేశారు. అయితే ప్రభాస్ ఎప్పటిలాగా లైట్ తీసుకున్నా..స్వీటీ మాత్రం ఈ వార్తలపై అంతెత్తున ఎగిరింది. ఇక నుంచి ఇలాంటి వార్తలు రాస్తే చట్టపరంగా ముందుకు వెళ్తాననని ఖరాఖండిగా వార్నింగ్ ఇచ్చేసింది. మరోవైపు ఇద్దరి ఇళ్లలోనూ సీరియస్‌గా పెళ్లి సంబంధాలు చూస్తున్నారట. రాశి సిమెంట్ అధినేత భూపతిరాజు మనవరాలితో ప్రభాస్‌కి త్వరలో ఎంగేజ్‌మెంట్ జరగబోతోందని..ఫిలింనగర్ టాక్..ఇద్దరిలో ఒకరి పెళ్లైనా ఇక ఇలాంటి వార్తలు రానట్లే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



