చిరు సరసన మెగాస్టార్ కోడలు
on May 3, 2017
.jpg)
తొమ్మిది సంవత్సరాల లాంగ్ గ్యాప్ తర్వాత ఖైదీ నెం.150తో ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి తన స్టామినా ఏంటో చూపించారు. ఫైట్లు, డ్యాన్సుల్లో ఇప్పటికీ తన లో గ్రేస్ తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నారు. దీంతో ఆయన 151వ సినిమాపై అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవితగాధను చిరు తన 151వ సినిమాగా తెరకెక్కించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు.
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తయిపోగా.. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ మూవీలో చిరు సరసన మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఐష్‌కు దర్శకుడు సురేందర్ రెడ్డి కథ వినిపించాడని..ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందని ఫిలింనగర్ టాక్. ఈ మూవీని కొణిదల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్ తేజ్ నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు..త్వరలోనే ఉయ్యాలవాడకు సంబంధించిన టెక్నీషియన్స్ వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



