ఎన్టీఆర్+ఎన్టీఆర్+ఉపేంద్ర=డీజే
on Jun 8, 2017

ఒక సినిమాకు కథ తయారు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎంత లోతుగా ఆలోచించినా..అంతకు ముందు తీసిన ఏదో సినిమాతో రాసుకున్న కథకు లింక్ ఉండక తప్పదు. కానీ ఏం చేస్తాం..అలాగే బండి లాగిస్తుంటారు మన దర్శకనిర్మాతలు. ప్రేక్షకులు వాటికి అలవాటు పడిపోయారు. ఇప్పుడు ఈ సంగతి ఎందుకు చెబుతున్నాం అంటే..హరీశ్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ డీజే చేస్తున్నాడు. రెండు నెలల క్రితం టీజర్ వచ్చినప్పటి నుంచే ఈ సినిమా కథపై రకరకాల చర్చలు నడిచాయి. ముఖ్యంగా బన్నీ వేసిన బ్రాహ్మణ యువకుడి పాత్ర అంతకు ముందు జూనియర్ ఎన్టీఆర్ ఆదుర్స్‌లో పోషించిన చారి పాత్రను పోలీ ఉందని కొందరు పెదవి విరిచారు. అంతేకాదు ఆదుర్స్, రామయ్యా వస్తావయ్యాలను బేస్ చేసుకుని డీజేని హరీష్ శంకర్ రూపొందించాడని అంటున్నారు. ఇంకొందరైతే ఏకంగా కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర నటించిన శివంతో పోల్చేశారు. తెలుగులో ఆ సినిమా బ్రాహ్మణ అనే పేరుతో రిలీజైంది. ఎవరెన్నీ అనుకున్నా సినిమాలో ఏముంది తెలియాలంటే విడుదలయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



