గడ్డం తీసేసి వంద డౌట్లు పెట్టాడు
on Jan 4, 2018
ఖైదీ నెంబర్ 150తో కలెక్షన్ల దుమ్ము దులిపి గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చి తన నెక్ట్స్ మూవీపై అంచనాలు పెంచేశారు మెగాస్టార్ చిరంజీవి. అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే విధంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో.. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా సైరా మూవీ చేస్తున్నారు మెగాస్టార్. ఈ పాత్ర కోసం పూర్తిగా మెకోవర్ అయ్యారు చిరు. బాడీ ఫిట్నెస్, లుక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందు గడ్డం, కోర మీసంతో కనిపించిన చిరంజీవి లుక్ అభిమానుల్ని ఆకట్టుకుంది. రీసెంట్గా సైరా ఫస్ట్ షెడ్యూల్‌ని కంప్లీట్ చేసి సెకండ్ సీజన్ కోసం రెడీ అవుతున్నారు మెగాస్టార్.
సరిగ్గా ఇలాంటి టైంలో ఆయన గడ్డం లేకుండా క్లీన్ షేవ్‌తో కనిపించడంతో ఫ్యాన్స్ షాకయ్యారు. ఇక పుకారు రాయుళ్లు ఊరుకుంటారా..? సైరా ఆగిపోయిందని.. ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత చిరంజీవి సంతృప్తి చెందకపోవడంతో సినిమాను ఆపేయాలని డిసైడ్ అయ్యారంటూ ఓ వార్త ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొట్టింది. ఆ వార్త జనానికి చేరేలోపలే.. ఈ సినిమాలో మెగాస్టార్ డ్యూయెల్ రోల్లో నటిస్తున్నారని.. కాదు కాదు కొత్త షెడ్యూల్‌కు టైం పడుతుందని అందుకే గడ్డం తీసేశారని.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఈ విషయంపై స్పందిస్తున్నారు. దీంతో ఏది నిజమో..? ఏది ఆబద్ధమో తేల్చుకోలేక జనం బుర్రలు గొక్కుంటున్నారు.
ఈ లోగా ఈ వార్త యూనిట్ దాకా వెళ్లడంతో మెగా కాంపౌండ్ క్లారిటీ ఇచ్చింది. సినిమాలో సిజీ వర్క్ కోసం చిరంజీవిపై ఓ ఫోటోషూట్ చేయబోతున్నారట. ఇందుకోసం మెగాస్టార్ ముఖ కవలికలు, హావభావాలు క్యాప్చర్ చేసి వాటిని కంప్యూటర్లో అప్లోడ్ చేసి ఆ తర్వాత సిజీ వర్క్ చేస్తారు. అయితే ఈ పని కోసం గడ్డం అడ్డురావడంతో ఆ గడ్డాన్ని తొలగించారట చిరు. సో.. అదన్నమాట అసలు సంగతి. అయితే మెగాస్టార్ మరోసారి గడ్డాన్ని పెంచుతారా.? లేక మరో మార్గంలో పని కానిచ్చేస్తారా అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.