అల్లు అర్జున్ మెగాస్టార్ అయితే, మరి చిరంజీవి!
on Jul 4, 2017
ప్రతి హీరో కి ముందు ఒక ట్యాగ్ పెట్టడం నందమూరి తారక రామ రావు తరం నుండే మొదలయింది. అయితే, ఈ మధ్య కాలంలో ఆ హీరో హిట్ కొట్టాడా లేదా అని చూడకుండా ఆయన స్టార్ కుటుంబంలో నుండి వస్తే వెంటనే ఒక ట్యాగ్ తగిలించేస్తున్నారు. అయితే ఈ ట్యాగ్ ఎవరయినా ఇస్తున్నారా లేదా వాళ్లకు వాళ్లే తగిలించుకుంటున్నారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇక అసలు విషయానికి వస్తే, నిన్నటి వరకు స్టైలిష్ స్టార్ అని పిలిపించుకున్న అల్లు అర్జున్ పేరుకి ముందు టిక్కెటింగ్ పోర్టల్ బుక్ మై షో మెగాస్టార్ అనే బిరుదు తగిలించి వివాదానికి దారి తీసేలా చేసింది.
ఇది చూసిన మెగాభిమానులు, అల్లు అర్జున్ మెగాస్టార్ అయితే, మరి చిరంజీవి ఎవరు అని ప్రశ్నిస్తున్నారు. అంతేనా, రెండు మూడు హిట్లు కొట్టగానే బన్నీకి పొగరొచ్చేసింది అని తమ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ అభ్యంతరానికి ఆజ్యం పోస్తూ ఎవరో ఈ విషయమై అడిగితే, నాకు మెగాస్టార్ ట్యాగ్ తగిలించడం చాలా సంతోషం గా ఉంది అని అన్నారట. అది ఎంత వరకు వాస్తవమో తెలియదు. కానీ అల్లు అర్జున్ ఈ విషయంలో స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే, తనకి తాను మెగాస్టార్ అని ఒప్పేసుకున్నట్టే అవుతుంది. ఇప్పటికే, పవన్ కళ్యాణ్ అభిమానులకి శత్రువుగా మారిన అల్లు అర్జున్, ఈ ఉదంతంతో మిగతా మెగాభిమానులకూ దూరమవుతున్నారు అని అంటున్నారు. చూద్దాం, బన్నీ స్పష్టత ఇస్తాడా లేక సైలెంట్ గా ఉండిపోతాడా!