రామ్ చరణ్ వీళ్లిద్దరినీ కలిపాడా?
on Dec 20, 2014
'ఆగడు’ సినిమా షూటింగ్ టైంలో దర్శకుడు శ్రీనువైట్ల, ప్రకాష్ రాజ్ మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఆ వివాదం తరువాత ప్రకాష్ రాజ్, శ్రీనువైట్ల కలిసి పనిచేయడం కష్టమేనని అందరూ అనుకున్నారు. కానీ అందరూ ఆశ్చర్యానికి గురిచేస్తూ వీరిద్దరూ కలిసి మరో సినిమాలో కలిసి పనిచేయబోతున్నారు. రాంచరణ్ తో శ్రీనువైట్ల తీయబోయే సినిమాలో ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్ర పోషించనున్నట్టు సమాచారం. ఈ చిత్రం కోసం ప్రకాష్ రాజ్, శ్రీనువైట్లను కూర్చోపెట్టి వారిద్దరి మధ్య సమస్యను చరణ్ సాల్వ్ చేసినట్టు సమాచారం. గతంలో దర్శకుడు కృష్ణవంశీ, ప్రకాష్ రాజ్ మధ్య కూడా విభేదాలు తలెత్తాయి. అయితే చరణ్ నటించిన ‘గోవిందు అందరి వాడెలే’ సినిమాకి వీరిద్దరూ మళ్లీ కలిసి పని చేశారు.