నీహారిక హీరోయిన్ కావడం వాళ్ళకి ఇష్టం లేదా?
on Oct 8, 2015
టాలీవుడ్ సెలబ్రిటీల్లో చాలామంది తమ వారసులుగా కొడుకులనే ముందుకు తీసుకొస్తూ వుంటారు. ఒకవేళ కూతుళ్ళను తీసుకొచ్చినా ఏ ప్రొడ్యూసర్లుగానో పట్టుకొస్తారు తప్ప హీరోయిన్లుగా వాళ్ళని ఎంతమాత్రం ఎంకరేజ్ చేయరు. అయితే మోహన్‌బాబు లాంటి హీరోలు వేరనుకోండి. మోహన్‌బాబు తన కుమార్తె మంచు లక్ష్మిని నటిగా ఎంకరేజ్ చేసినందుకు ఆయనకు హేట్సాఫ్. మోహన్బాబులాగా హేట్సాఫ్ అందుకోదగ్గ మరో నటుడు నాగబాబు. అవునండీ... నాగబాబు తన ముద్దుల కూతురు నీహారికను హీరోయిన్గా ప్రోత్సహిస్తున్నారు.
ఇప్పటికే టీవీ యాంకర్‌గా ఇరగదీస్తున్న నీహారిక వెనుక నాగబాబు ప్రోత్సాహం బోలెడంత వుంది. ఇప్పుడు ఆమె హీరోయిన్గా కూడా నటిస్తోంది. నాగశౌర్య పక్కన ‘ఒక మనసు’ అనే సినిమాలో హీరోయిన్గా నటించడానికి ఆమె ఓకే చెప్పేసింది. నీహారిక హీరోయిన్గా నటించడానికి ఓకే చెప్పిందని తెలుసుకుని చాలామంది నిర్మాతలు, దర్శకులు తమ సినిమాల్లో నీహారికని హీరోయిన్గా పెట్టుకోవాలని ఆలోచిస్తున్నారట. అయితే నీహారిక హీరోయిన్ కావడం నాగబాబు కుటుంబానికి తప్ప మిగతా ‘మెగా’ ఫ్యామిలీకి ఎంతమాత్రం ఇష్టంలేదని ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఏదో ముచ్చటపడి యాంకరింగ్ చేసుకుంటోంది.. ఎంచక్కా ఓ మంచి సంబంధం చూసి పెళ్ళి చేసేయక ఈ హీరోయిన్ వేషాలేంటని సణుక్కుంటున్నారట. అయితే నాగబాబు ఫ్యామిలీ మాత్రం ఈ సణుగుళ్ళని ఎంతమాత్రం పట్టించుకోకుండా ప్రొసీడ్ నీహారికా అని ప్రోత్సహిస్తున్నారట.