సూపర్ స్టార్ కి 300 కోట్ల ఆఫర్..!!
on Sep 4, 2015
బాలీవుడ్ లో సూపర్ స్టార్ లతో అక్కడి బడా నిర్మాణ సంస్థలు ముందుగానే వారి నిర్మాణ సంస్థలో ఇన్ని సినిమాలు చేయాలని భారీ మొత్తానికి డీల్స్ సెట్ చేసుకుంటాయి. అలాంటివి అక్కడ కొత్తెమికాదు. ఐతే సౌత్ లో ఇప్పటిదాకా ఈ సంస్కృతి లేదు. కానీ తొలిసారి ఈ సంస్కృతి కి సూపర్ స్టార్ మహేష్ శ్రీకారం చుట్టబోతున్నాడు. మహేష్ బాబు సినిమాలను వరుసగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ, అతని క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఓ భారీ డీల్ అతని ముందు వుంచినట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్. 300 కోట్ల దాకా ఆ డీల్ ఉండొచ్చన్నది టాలీవుడ్ బోగట్టా. ఐతే ఈ డీల్ ఎన్ని సినిమాలకు ఎన్నేళ్లకు అన్నది ఇంకా తెలియట్లేదు. మహేష్ ను బాలీవుడ్ లోకి కూడా తీసుకువెళ్ళే ప్రణాళిక కూడా ఇందులో ఉన్నట్లు సమాచారం. అలాగే ఇంకా సౌత్ లో మంచి పొటెన్షియాలిటీ ఉన్న హీరోలను లాక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.