మాల్దీవుల్లో మెరిసిపోతున్న జాన్వీ సొగసులు!
on Apr 8, 2021
బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీల ఫేవరేట్ హాలిడే డెస్టినేషన్ ఇంకేమాత్రమూ సీక్రెట్ కాదు. వరుసబెట్టి ఒక్కొక్కరుగా మాల్దీవులకు వెళ్లూ, అక్కడ దిగిన గ్లామరస్ ఫొటోలను షేర్ చేసుకుంటూ కేక పుట్టిస్తున్నారు సెలబ్రిటీలు. దీంతో మాల్దీవులకు వచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఓవైపు పచ్చటి ప్రకృతి అందాలు, మరోవైపు నీలి సముద్రం.. ఆ అందం చూసి తీరాల్సిందే.. అన్నట్లు ఆహ్వానిస్తున్నాయి ఆ దీవులు. లేటెస్ట్‌గా అక్కడకు వెళ్లిన యంగ్ సెలబ్రిటీ జాన్వీ కపూర్. మాల్దీవుల్లో ఎలా గడపాలో, అక్కడ టైమ్‌ను ఎలా ఎంజాయ్ చేయాలో ఆమెకు మరొకరు నేర్పాలా! మాల్దీవుల సూర్యుడినీ, అక్కడి బ్లూ వాటర్స్‌నీ ఎంజాయ్ చేస్తూ తీయించుకున్న కొన్ని పిక్చర్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది జాన్వీ.
ఫస్ట్ పిక్చర్‌లో యెల్లో కలర్ ఔట్‌ఫిట్‌లో ఉన్న జాన్వీ సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా కనిపిస్తోంది. మరో మూడు సోలో పిక్చర్స్‌తో పాటు ఫ్రెండ్స్‌తో దిగిన రెండు ఫొటోలను కూడా ఆమె షేర్ చేసింది.
సోలో పిక్చర్స్‌లో హ్యాట్ పెట్టుకొని తీసుకున్న సెల్ఫీ.. సో క్యూట్ అనిపిస్తోంది. ఇంకో పిక్చర్‌లో యెల్లో కలర్ డ్రస్ వేసుకొని బ్రేక్‌ఫాస్ట్ చేస్తోందామె.
బాలీవుడ్ బ్రిగేడ్‌లో మాల్దీవుల్ని ఎంజాయ్ చేయడానికి వచ్చిన చివరిదాన్ని తానేనని మెన్షన్ చేసిన ఆమె, "Last to get on the Maldives bandwagon but I fully get the hype (sic)," అని రాసింది.
సినిమా షూటింగ్‌ల నుంచి కొద్దిపాటి బ్రేక్ తీసుకున్న ఈ సొగసుసుందరి ఇటీవల చెల్లెలు ఖుషీతో కలిసి లాస్ ఏంజెల్స్‌కు వెళ్లి గడిపి వచ్చింది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
