Home » పిల్లల కోసం » హంస కధFacebook Twitter Google
హంస కధ

హంస కధ

 

అనగనగా ఓ హంస. ఆ హంస ఒకసారి ఓ చక్కని చెరువులో ఈత కొడుతూ తిరుగుతున్నది, తోటి హంసలతో బాటు. సరిగ్గా ఆ సమయానికే అ దేశపు మహారాజు ఏదో పని మీద వెళుతూ ఉన్నాడు ఆ త్రోవలో. వెళుతూ వెళుతూ దాహం తీర్చుకోవటంకోసం ఆయన చెరువులోకి దిగాడు. ఆయన్ని చూడగానే హంసలన్నీ ఎగిరిపోయాయి- కానీ మన హంస మాత్రం, పరధ్యానంలో ఉండి రాజు దగ్గరకే ఎగిరి వచ్చి, ఆయన చేతచిక్కింది.


ఆ మహారాజు కూడా పాపం మంచివాడు- ఆ హంసను ఏమీ చేయలేదు. ఊరికే దాని రెక్కలను దువ్వి విడిచి పెట్టేశాడు. దానికి ఆ హంస చాలా ఆనందపడి "ఓ మహారాజా! నీ చేత చిక్కినా కూడా నాకు ఏ ఆపదా కలిగించకుండా విడిచి పెట్టావు. అందుకు కృతజ్ఞతగా నేను నీకొక సహాయం చేస్తాను. మా దేశంలో మహారాజుకు ఓ కుమార్తె ఉంది.

ఆ అమ్మాయి చాలా చక్కనిది, మంచిది, అనేక శాస్త్రాలు చదివింది. నువ్వూ మంచివాడివే కనుక, నేను ఏం చేస్తానంటే- ఆమెకు నీ గురించి చెబుతాను. ఎలాగైనా ఆమెకు నువ్వంటే ఇష్టమయ్యేలా చేస్తాను. మరి నువ్వు కొన్ని రోజుల తర్వాత మా దేశానికి వచ్చి ఆ అమ్మాయిని పెళ్ళాడు!" అన్నది. రాజు అంగీకరించాడు. ఆ హంస అన్నంత పనీ చేసింది. తమ దేశపు యువరాణి దగ్గరకు వెళ్ళింది. ఆ యువరాణికి అందకుండా పరిగెత్తింది, మళ్ళీ ఆమె చేతికి చిక్కింది, ఆమెను మురిపించింది, ఆపైన 'త్ర-త్ర' అనుకుంటూ ఇట్లా మాట్లాడింది.

 

సహస్ర పత్రాసన పత్రహంస వంశస్య పత్రాణి పతత్రిణః స్మ ! 
అస్మాదృశాం చాటురసామృతాని స్వర్లోకలోకేతరదుర్లభాని 

 

"అమ్మాయీ! నేను బ్రహ్మవాహనమైన హంసల కుటుంబానికి చెందిన దాన్ని. నేను మాట్లాడే చమత్కారమైన మాటలు వినటం దేవతలకు కూడా సాధ్యంకాదు" అని దీని అర్థం. అట్లా తన పాండిత్యంతోటి ఆమెను మెప్పిస్తూ, మెల్లగా మాటలు కలిపింది; తను మాట యిచ్చిన మహారాజు రూప లావణ్యాల గురించి, శౌర్య ప్రతాపాల గురించి చెప్పింది; ఇలా చక్కటి దూతగా తన పని చేసింది. ఆపైన ఆ మహారాజు, వీళ్ల రాజ్యానికి రావటం, స్వయంవరంలో పాల్గొని యువరాణిని పెళ్ళాడటం జరిగిపోయింది!

ఆ మహారాజు పేరు నలుడు. యువరాణి దమయంతి! ఈ కథలో హంసను చేర్చి, అందంగా తీర్చిన కవి పేరు 'శ్రీహర్షుడు'. ఆయన సంస్కృతంలో వ్రాసిన కావ్యం పేరు 'నైషధీయచరితమ్'. ఈ కావ్యాన్నే కవిసార్వభౌముడైన శ్రీనాథుడు 'శృంగారనైషధమ్' అన్న పేరుతో తెలుగులోకి అనువదించాడు.


- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో


పవన్, గణేష్ ఇద్దరూ ఒక రోజున వాళ్ళ ఊరి ప్రక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళి, దారి తప్పారు. అడవిలో అంతా తిరిగి అలసిపోయారు. ...
Dec 18, 2019
తీరిన కష్టం
Aug 8, 2019
నన్ను కాపాడిన పిల్లి
Aug 27, 2019
అంతరంగ ఆలోచన..!!
May 10, 2019
అనగనగా నాగసముద్రంలో గంగరాజు అనే నేతగాడు ఒకడు ఉండేవాడు.
Apr 29, 2019
"అయ్యో, ఉడతా, నీ అమాయకత్వానికి నవ్వుతున్నాను! నీ చారలు చూసుకొనే నువ్వు..
May 13, 2019
పాముకి గుణపాఠం చెప్పిన కోడిపెట్ట
Apr 8, 2019
పిల్లలకు ఆకలి ఎక్కువ. టామీ కుక్కపిల్ల చిన్నగా ఉన్నప్పుడు దానికి కూడా చాలా ఆకలి ఉండేది.
Mar 1, 2019
రాజీవ్‌ అనే కుర్రవాడు చక్కగా చదివి, చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం వెతుక్కుంటూ పట్టణం చేరాడు..
Feb 23, 2019
పట్టువదలని విక్రం తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి, బేతాళాన్ని భుజంపైన వేసుకొని...
Feb 18, 2019
TeluguOne For Your Business
About TeluguOne