వంకాయ మెంతి కారం

 

 

కావలసినవి:

వంకాయలు - పావుకేజీ 
చింతపండు - తగినంత 
మెంతులు - రెండు స్పూను 
ఆవాలు - ఒక స్పూను 
ఎండు మిరపకాయలు - ఆరు 
మినపపప్పు - ఒక స్పూను 
పసుపు, ఉప్పు, నూనె - తగినంత  


తయారుచేసే విధానం:

ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి, పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు  చింతపండు నుండి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ నీళ్ళల్లో వంకాయలు, చిటికెడు పసుపు, ఉప్పు వేసి ఉడికించాలి. ఒక పాన్‌లో కొంచెం  నూనె పోసి కాగాక ఆవాలు, మినపపప్పు, మెంతులు వేయించాలి. ఆఖరున ఎండు మిరపకాయలను వేసి దించేయాలి. వీటితో కొంచం ఉప్పు వేసి అన్నీ పొడిగా చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక పాన్‌లో తగినంత నూనె పోసి కాగాక ఉడికించిన వంకాయ ముక్కలను వేసి దోరగా వేయించాలి.ఈ మిశ్రమం వేగాక సిద్ధంగా వున్న పొడిని చల్లి ఇంకా కొంచెంసేపు వేయించి దించేయాలి. అంతే వంకాయ మెంతి కారం రెడీ.