టొమాటో రసం

 

 

కావలసిన పదార్ధాలు:-

టొమాటోలు - పావుకిలో

నీళ్ళు - తగినన్ని

ఉప్పు - తగినంత

పసుపు - చిటికెడు

నూనె - 2 టేబుల్ స్పూన్లు

పచ్చిమిర్చి - 8 ( సంన్నగా తరగాలి )

చింతపండు - 2 రెబ్బలు 

కరివేపాకు -  2 రెబ్బలు

జీలకర్ర - పావు టీ స్పూను

ఆవాలు - పావు టీ స్పూను

మెంతులు - అర టీ స్పూను

ఎండుమిర్చి - 5 ( చిన్నముక్కలుగా తరగాలి )

కొత్తిమీర - 1 కట్ట


తయారు చేసేవిధానం:-

చింతపండు పది నిమిషాలు నీటిలో నానబెట్టాలి. తరువాత ఆ నీటిలో చింతపండు, టొమాటో మెత్తగా మెదిపి తుక్కు తీసేయాలి. ఆ నీటిలో చిటికెడు పసుపు, నిలువుగా చీరిన పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి స్టౌపై వుంచి ఎక్కువసేపు మరగకుండా చూడాలి. రసం కొద్దిగా మరిగాక బాణలిలో నూనె, ఎండుమిర్చి, కొద్దిగా శనగపప్పు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు మెంతులు వేసి పోపు పెట్టుకోవాలి. దించే ముందు సంన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి.