క్విక్ చాక్లెట్ స్పాంజ్ కేక్
 


కేక్ పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి ఈవినింగ్ స్నాక్స్ కావాలన్నప్పుడు వెంటనే వేడి వేడిగా చేసి పెడితే బావుంటుంది. చాక్లెట్ ఫేవర్ లో, ఫాస్ట్ గా అయిపోయే స్పాంజ్ కేక్ ఎలా చేయోచ్చో నేర్చుకుందాం. ఈ రోజు ఈ కేక్ పిల్లలతో చేయించండి. అప్పుడు వాళ్ల్తతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేసినట్టు ఉంటుంది, అలాగే ఒక కొత్త డిష్ చేయడం నేర్చుకుంటారు. కాబట్టి వాళ్లు ఆనందపడతారు.

 

కావలసిన పదార్ధాలు:

మైదా              - కప్పు
కో కో పౌడర్     - 2 చెంచాలు
బేకింగ్ పౌడర్   - 1/4 చెంచా
ఉప్పు             - చిటికెడు
బటర్              - 3 చెంచాలు
పంచదార       - 1/2 కప్పు
ఎగ్స్              - 3
వెనీలా ఎసన్స్ - 1 చెంచా
పాలు             - 1/2 కప్పు

 

తయారుచేసే విధానం:

* ముందుగా మైదా, బేకింగ్ పౌడర్, కో కో పౌడర్ లని బాగా కలిపి ఒకసారి జల్లించాలి.

పాలలో వెనీలా ఎసన్స్ కలిపి పక్కన ఉంచండి

అలాగే ఎగ్స్న్ ని పగలకొట్టి ఒక కప్పులో వేసి బాగా గిలక్కొట్టి ఉంచండి

పంచదార, బటర్ లని బాగా కలపండి. నురగలా వచ్చేవరకు బాగా కలపండి

* ఇప్పుడు గిలక్కొట్టిన ఎగ్ మిశ్రమాన్ని వేసి కలపండి

* ఆ తర్వాత నెమ్మదిగా మైదా, బేకింగ్ పౌడర్, కో కో పౌడర్ ల * మిశ్రమాన్ని పోస్తూ కలపండి. పొడి పిండి కాబట్టి కొంచెం కొంచెం వేస్తూ కలపాలి.

* ఆఖరిగా వెనీలా ఎసెన్స్ కలిపిన పాలని కొంచెం కొంచెం పోస్తూ అన్నీ సమంగా కలిపేలా చూడండి. గరిటలో అన్నింటిని బాగా కలపండి.

* ఇప్పుడు మైక్రోవేవ్ లో పెట్టడానికి వీలుగా కేక్ కప్ కి వెన్న రాయండి. కేక్ మిశ్రమాన్ని అందులో పోసి ఓ ఆరు నిమిషాలకి టైమ్ సెట్ చేసి మైక్రోవేవ్ లో పెట్టండి. ఆతర్వాత మరో ఐదునిమిషాలు అలాగే ఉంచి బయటకి తీయండి. చల్లారాకా ఓ ప్లేట్ లోకి తీసుకొని పిల్లలకి నచ్చే షేప్స్ లో కట్ చేసి పెట్టండి. మొత్తం తయారీకి 15 నిమిషాలు పడుతుంది. కాని వేడి వేడి స్పాంజ్ కేక్ అందులోనూ చాక్లెట్ ఫ్లేవర్ ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి ఈ సింపుల్ కేక్ ని.

 

-రమ