ప్రాన్స్ ఫ్రై రెసిపి

 

 

 

కావలసిన పదార్ధాలు:

రొయ్యలు - అరకేజీ

ఉల్లిపాయ - ఒకటి

లవంగాలు - నాలుగు

దాల్చిన  చెక్క - చిన్న ముక్క

ధనియాలు - ఒక టేబుల్ స్పూన్

ఉప్పు - ఒక స్పూన్

కారం - ఒకటిన్నర స్పూన్

పసుపు - అరస్పూన్

కొత్తిమీర - ఒక కట్ట

టమాటా ప్యూరీ - ఒక టేబుల్ స్పూన్

జీడిపప్పు - 10 గ్రాములు

నూనె - తగినంత

పచ్చిమిర్చి - రెండు

జీలకర్ర - టీస్పూన్

గసగసాలు - టేబుల్ స్పూన్ చిన్న

అల్లం - చిన్న ముక్క

వెల్లుల్లి రెబ్బలు- ఆరు

కరివేపాకు - కొద్దిగా

 

తయారు చేసే విధానం:

ముందుగా రొయ్యలు శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి కట్ చేసిన ఉల్లిపాయలు,పచ్చి మిర్చి,కరివేపాకు వేసి వేయించాలి. తరువాత రొయ్యలు,కొంచం పసుపు వేయాలి. దాల్చిన చెక్క, ధనియాలు, గసగసాలు, అల్లం,వెల్లుల్లి, ఆరు జీడిపప్పులు వేసి పేస్ట్ చెయ్యాలి. రొయ్యలు ఉడికాకా టమాటా ప్యూరి వేసి కలిపి తరువాత మసాల పేస్ట్ వేసి ఉప్పు వేసి కలుపుకోవాలి.చివరిలో కొత్తిమిర వేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి...