మొలకల దోశ

 

 

 

కావలసిన పదార్థాలు :
రాజ్‌మా: అరకప్పు
పచ్చిబఠాణీలు: అర కప్పు
పెసలు: అర కప్పు
శనగలు:అర కప్పు
ఉల్లిపాయ -  ఒకటి
జీలకర్ర - 2 స్పూన్లు
అల్లం - చిన్న ముక్క
బఠాణీలు: అర కప్పు
బియ్యంపిండి : ఒక కప్పు
పచ్చిమిర్చి: 6
ఉప్పు : రుచికి సరిపడా
నూనె : తగినంత.

 

తయారీ విధానం :
ముందుగా  (పెసలు, శనగలు, రాజ్‌మా, బఠాణీలు )ను శుభ్రంగా కడిగి  నానపెట్టుకోవాలి. తరువాత వాటన్నిటినీ ఒక వస్త్రంలో తీసుకుని మూటకట్టాలి. తరువాత రోజుకు మొలకలు వస్తాయి. వాటిలో పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఉల్లి, తరుగు కలిపి మిక్సీలో వేసి దోసెపిండిలా రుబ్బుకోవాలి. తర్వాత స్టౌ మీద దోసె పాన్‌ పెట్టి పిండితో దోసె వేసుకుని  మద్యలో ఉల్లిపాయ ముక్కలు మిర్చి  తరుగు వేసుకుని పైన కొంచం ఆయిల్ వేసుకుని  దోస రెండువైపులా  బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి.