గ్రీన్ రైస్

 

 

 

పిల్లలకి ఎంతో నచ్చేలాగా చేసామంటే అందులో అమ్మ ఏం వేసిందో అని కూడా చూడరు... తినేస్తారు. ఎందుకంటే ఆకు కూరలు, ఆనపకాయ, ఇలాంటివి పిల్లలకి తినిపించాలంటే చాలా కష్టం. అలాంటప్పుడు వాటన్నిటిని ఉపయోగిస్తూ ఒక రైస్ ఐటమ్ చేసామనుకోండి పిల్లలు ఇష్టంగా తినేస్తారు.

 

కావలసిన పదార్ధాలు
ఉడికించుకున్న రైస్ - 1 కప్పు (పెద్ద కప్పు)
పాలకూర మిశ్రమం - అరకప్పు
గ్రీన్ పీస్ - పావుకప్పు
ఆనపకాయ ముక్కలు - పావుకప్పు
ఉల్లి తరుగు - చిన్న కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - పావుకప్పు
పచ్చిమిర్చి - 2
పంచదార - 1 చెంచా
నిమ్మరసం - 1 చెంచా
నూనె - 2 చెంచాలు
నెయ్యి- 2 చెంచాలు
ఉప్పు - రుచికి తగినంత
గరం మసాలా - 2 చెంచాలు

 

 

తయారుచేసే విధానం
ముందుగా ఒక బాణలిలో నెయ్యి, నూనె వేసుకొని దానిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయిస్తాం. అప్పుడు అవి కొంచెం వేగిన తరువాత దానిలో అల్ల వెల్లుల్లి పేస్ట్ వేయించి తరువాత అందులో పాలకూర మిశ్రమం( పాలకూర ఉడికించి మిక్సీ వేసుకోవాలి) వేసి వేయిస్తాం. అది కొంచెం వేగిన తరువాత ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు, బఠాణీ వేసి కలపాలి. ఆతరువాత అందులో ఉప్పు, గరంమసాలా, కొంచెం పంచదార వేసి కలుపుకొని ఆఖరిలో ఉడికించిన అన్నం కలుపుకోవాలి. దింపే ముందు కొంచెం నిమ్మరసం వేసి కలుపుకొని దించుకోవాలి.

 

 

 

టిప్
పిల్లలకైతే పంచదార వేసుకుంటే కొంచెం తియ్యగా, కొంచెం స్పైసీగా ఉండటం వల్ల ఇష్టంగా తింటారు. పెద్దవాళ్లకైతే పంచదార వేసుకున్నా, వేసుకోకపోయినా పర్లేదు.

 

 

 

-రమ