ప్రేమతో బేబీ పొటాటో యమ్మి కర్రీ

 


 

కావల్సిన పదార్థాలు: 

బేబీ పొటాటోలు - 1/4 కేజీ

పచ్చిమిర్చి - 4

ఉల్లిపాయలు - 2(ముద్ద చేసి ఉంచుకోవాలి)

టమాట - 1 (ముద్ద చేసి ఉంచుకోవాలి)

పసుపు - 1/2 స్పూన్

కారం - 1 స్పూన్ 

గరం మసాలా - 1/4 స్పూన్

జీలకర్ర - 1 స్పూన్

ఉప్పు - రుచికి తగినంత 
 

తయారు చేసే విధానం:

బేబి పొటాటోలు (చిన్న ఆలుగడ్డలు) నచ్చని వాళ్ళు ఉండరు. ఈ కర్రీ తయారు చేసుకోటానికి ముందుగా బేబీ పొటాటోస్ ను శుభ్రంగా కడగాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె వేసాకా బేబీ పొటాటోలు వేసి నిధానంగా ఫ్రై చేసుకోవాలి. ఒక పది నిమిషాలపాటు  గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి. బేబీ పొటాటో ఫ్రై అయిన తర్వాత నూనె నుండి పొటాటోలను బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. అదే పాన్లో మరికొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి అందులో ఉల్లిపాయ ముద్ద వేసి మరో అయిదు నిముషాలు వేయించాలి. ఉల్లిపాయ పచ్చివాసన పోయాకా అందులో టమోటో పేస్ట్ కూడా వేసి అయిదు నిముషాలు ఫ్రై చేసుకోవాలి. పసుపు,ఉప్పు కూడా వేయాలి. గ్రేవీ అడుగు అంటకుండా మెల్లిగా కదుపుతూ ఉండాలి. అందులోనే కారం, ధనియాల పొడి,గరం మసాలా వేయాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకొన్న బేబీ పొటాటోలను కూడా వేసి కలిపి మరో రెండు నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా తయారయిన కర్రీ ని బౌల్ లోకి తీసి కొత్తిమీరతో అలంకరించుకుంటే చూడటానికి అందంగా మాత్రమే కాదు చపాతిలతో గాని అన్నంతో గాని తినటానికి ఎంతో  రుచిగా కూడా  ఉంటుంది.