LATEST NEWS
DRDO ఉద్యోగి ఎదురింట్లో ఉన్న ఓ యువతిపై మనసు పడ్డాడు.. అవకా శం కోసం ఎదురుచూశాడు యువతి ఒంటరిగా ఉన్నట్లు గుర్తించి ఇంట్లోకి చొరబడ్డాడు. యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో స్థానికులు రంగప్రవేశం చేసి అతడిపై దాడికి పాల్పడటంతో DRDO ఉద్యోగి మృతి చెందాడు. ఈ ఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న రామ్మోహన్ (40) DRDO ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.  తన నివాసానికి ఎదురుగా ఉన్న ఫ్లాట్‌లో ఉంటున్న ఓ యువతిపై మనసు పడ్డాడు. ఈ క్రమంలో యువతి ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె ఇంట్లోకి వెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో సదరు యువతి గట్టిగా కేకలు వేయడంతో పక్క ఫ్లాట్‌లో ఉన్న వ్యక్తులు వెంటనే స్పందించి ఘటనాస్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అర్థం చేసుకున్న వారు రామ్మోహన్‌పై విచక్షణా రహితంగా దాడి చేశారు.  ఈ దాడిలో రామ్మోహన్ తలకు తీవ్ర గాయాల య్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.       [ DRDO employee Rammohan, Attempted rape of a young woman, Chikkadapalli Police Station, Crime news, Hyderabad Police, CP Sajjanar, DGP C.V. Anand, Telugu One, Telugu News ]  
ఆకలి వేస్తే అన్నం పెట్టే విశాల హృదయం మనది.. దాహమేస్తే గుక్కెడు మంచినీళ్లు ఇవ్వడం మన సంస్కృతి. కానీ నేటి సమాజంలో మనుషుల ప్రాణాల కంటే విలువైన వస్తువులే ఎక్కువైపోతున్నాయా? క్షణికావేశం, అంతులేని క్రూరత్వం కలిసి ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న అమానవీయ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో తీవ్ర కలకలం రేపింది. కేవలం ఇరవై రూపాయల విలువైన ఒక వాటర్‌ బాటిల్‌ దొంగిలించాడనే అనుమానంతో ముప్పై మూడేళ్ల యువకుడిని విద్యుత్‌ స్తంభానికి కట్టేసి, రెండు గంటల పాటు విచక్షణారహితంగా కొట్టి చంపిన ఉదంతం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.  తెలంగాణలోని నల్గొండకు చెందిన మాస సాయికుమార్‌ (33) కొంతకాలంగా తన భార్య, ఇద్దరు కుమార్తెలు మరియు ఒక కుమారుడితో కలిసి విజయవాడలో నివాసముంటున్నాడు. ఉపాధి కోసం కుటుంబానికి దూరంగా ఉంటున్న సాయికుమార్ జీవితంలో ఆ అమావాస్య నాటి తెల్లవారుజామున ఊహించని విషాదం ముంచుకొచ్చింది.ఈ నెల 19వ తేదీ తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో సాయికుమార్ విజయవాడలోని పటమట డొంకరోడ్డు ప్రాంతంలో ఉన్న ఒక పాన్‌షాపు వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో తీవ్ర దాహంతో తాళం వేసి ఉన్న ఫ్రిజ్‌ నుంచి వాటర్ బాటిల్ తీసేందుకు ప్రయత్నించాడు.  అటుగా వచ్చిన ఒక పాల వ్యాన్ డ్రైవర్ దీనిని గమనించి వెంటనే పాన్‌షాప్‌లో పనిచేసే రవిశంకర్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. ఆ తర్వాత ఆ డ్రైవర్ సాయికుమార్‌ను రవిశంకర్‌కు అప్పగించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అక్కడికి చేరుకున్న రవిశంకర్ ఎలాంటి విచారణ లేకుండా సాయికుమార్‌పై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో అతడిని ఈడ్చుకుంటూ వెళ్లి సమీపంలోని మద్యం దుకాణం వెనుక ఉన్న సందులోకి తీసుకెళ్లాడు. అక్కడ  బార్‌లో పనిచేసే అయ్యప్ప శంకర్ కూడా వారితో చేరడంతో ఇద్దరూ కలిసి సాయికుమార్ చేతులను వెనక్కి విరిచి విద్యుత్‌ స్తంభానికి గట్టిగా కట్టేశారు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న పోతంశెట్టి నవీన్, సాయి ప్రణీత్ అనే ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కూడా ఆ నలుగురితో జతకలిశారు. నలుగురు నిందితులు కలిసి కర్రలతో సాయికుమార్‌పై తీవ్రమైన దాడికి పాల్పడ్డారు. దెబ్బల వల్ల కలిగే నరకయాతనతో విలవిలలాడిపోయిన సాయికుమార్, "దయచేసి నన్ను కొట్టకండి.. నాకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు, నన్ను వదిలేయండి" అంటూ కన్నీళ్లతో ప్రాధేయపడ్డాడు. అయినప్పటికీ ఆ రాక్షసుల మనసులు కరగలేదు. ఏమాత్రం కనికరం లేకుండా సుమారు రెండు గంటల పాటు అతడిని కర్రలతో పదే పదే కొడుతూ చిత్రహింసలకు గురిచేశారు.  ఈ విపరీతమైన దాడి కారణంగా సాయికుమార్ తీవ్ర గాలాలతో స్పృహ కోల్పోయి నేలకొరిగారు. అతడు చలనం లేకుండా పడిపోవడాన్ని గమనించిన ఆ నలుగురు నిందితులు భయపడి అక్కడి నుంచి పరారయ్యారు.ఉదయం 6 గంటల సమయంలో అటుగా వెళ్లిన స్థానికులు, సచివాలయంలో వీఆర్వోగా పనిచేస్తున్న నాగేశ్వరరావుకు సమాచారం అందించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. రక్తపు గాయాలతో ప్రాణం కోల్పోయి పడి ఉన్న మృతదేహాన్ని చూసి స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు.  సమాచారం అందుకున్న పటమట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) పవన్ కిషోర్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీసీటీవీ (CCTV) పుటేజీలను పరిశీలించి జరిగిన ఘోరాన్ని నిర్ధారించారు. మృతుడు సాయికుమార్‌గా గుర్తించి అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. కేవలం ఒక నీళ్ల బాటిల్ కోసం నలుగురు కలిసి ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న ఈ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.       [ Vijayawada murder, water bottle theft case, Patamata crime news, Sai Kumar death, AP crime updates, Vijayawada news today, CM Chandrababu, Home minister Anitha, Naralokesh ,AP Police ]  
తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి  అన్నామలై కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఒక్కప్పుడు ప్రధాని మోడీకి అత్యంత విధేయుడు, కరడుగట్టిన బీజేపీ కార్యకర్త, అయిన అన్నామలై  బీజేపీకి గుడ్ బై చెప్పి..  వి ది లీడర్ అనే పేరుతో ఒక కొత్త స్వతంత్ర ఉద్యమాన్ని ప్రారంభించిన సంగతి విదితమే. అయితే సొంత కుంపటి పెట్టిన అన్నామలై ఇంత వరకూ కేంద్రంపై కానీ, కేంద్ర విధానాలపై కానీ ఘాటు విమర్శలు చేసిన సందర్భం లేదు. అటువంటి అన్నామలై, ఇప్పుడు..  ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా, అలాగే సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్ తో కేంద్రానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా సీజేపీ చేస్తున్న ఆందోళనకు బాహాటంగా మద్దతు పలికారు.   దేశవ్యాప్తంగా సర్వత్రా చర్చనీయాంశమవుతున్న ఎస్‌ఐఆర్  వివాదాలు, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీనామా డిమాండ్లు, అలాగే విపక్షాలు,  యువత చేపడుతున్న ఆందోళనలను కేంద్రం అణచివేయాలని చూడటాన్ని అన్నమలై తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన కేంద్రానికి రాసిన సుదీర్ఘ లేఖలో  ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో యూపీఏ ప్రభుత్వాన్ని విమర్శించిన పాత వ్యాఖ్యలను గుర్తుచేశారు. అప్పట్లో మోదీ చేసిన కామెంట్లను నేడు కేంద్ర ప్రభుత్వానికి అన్వయిస్తూ ఆయన పలు ప్రశ్నలు సంధించారు. మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు జంతర్ మంతర్ ప్రాంతాన్ని నిరసనలకు అనర్హమైనదిగా ప్రకటించడం, నీట్ పరీక్షల లీకేజీ వ్యవహారాలు వంటి అనేక కీలక అంశాలను ఆయన తన   లేఖలో ప్రస్తావించారు. కేవలం  వాట్సాపిజం ఎదురుదాడి ధోరణిని ప్రదర్శించకుండా, ప్రజలు లేవనెత్తుతున్న   ప్రశ్నలకు కేంద్రం సూటిగా సుత్తి లేకుండా సమాధానం ఇవ్వాలని అన్నామలై తన లేఖలో డిమాండ్ చేశారు.    సమస్యలకు వ్యతిరేకంగా వినిపిస్తున్న గొంతులను అణచివేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని అన్నామలై నిప్పులు చెరిగారు.    దసరా సందర్భంగా రావణ దహనంలో బొద్దింక దిష్టిబొమ్మను తగలబెట్టడం వంటి ఘటనలను సీజేపీకి ఉచిత ప్రచారం కల్పించడమేనని వ్యాఖ్యానించారు.  ఈ సందర్భంగా అన్నామలై కేంద్రంలోని మోడీ సర్కార్ ను నిలదీస్తూ కొన్ని ప్రశ్నలను సంధించారు.  సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.  ఇప్పటికే పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకతతో అసలే ఇబ్బందుల్లో ఉన్న బీజేపీకి, ఇప్పుడు నాటి మోడీ విధేయుడు సంధించిన ప్రశ్నాస్త్రాలు మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసినట్లైందనడంలో సందేహం లేదు.   [Annamalai Fires Center, Repression, Peoples Movement, BJP Central Government, Modi Old Comments, Tamil Nadu Politics, Annamalai We The Leader, Telugu One]
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో  భేటీ అయ్యారు. గురువారం (అక్టోబర్ 22) ఆయన   కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.   ఎన్నికల సంఘం 100 నియోజకవర్గాల్లో ఎన్నికలను నిలిపివేయడం, ఈ ప్రక్రియపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో  వీరిరువురి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.  అంతేకాకుండా, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తీరుపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు, ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో సీఎం, డిప్యూటీ సీఎం భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. అన్నిటికీ మించి   ఉప ముఖ్యమంత్రి పదవికి పవన్ రాజీనామా చేస్తారనీ, తెలుగుదేశం, జనసేన పొత్తు విచ్ఛిన్నం అంటూ సోషల్  మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం మధ్య జరిగిన భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  ముఖ్యంగా బుధవారం (అక్టోబర్ 21) రాత్రి నుంచీ  సోషల్ మీడియా వేదికగా డిప్యూటీ సీఎం పదవికి పవన్ కళ్యాణ్ రాజీనామా చేయబోతున్నారని, తెలుగుదేశం పార్టీతో జనసేన తెగతెంపులు చేసుకోనుందంటూ కొందరు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. జనసేన పార్టీకి చెందిన కొన్ని సోషల్ మీడియా ఖాతాలలో కూడా ఈ వదంతు ప్రచారం అయ్యాయి.  దీంతో  ఈ ఊహాగానాలన్నింటికీ తెరదించుతూ పవన్ కళ్యాణ్ నేరుగా సీఎం నివాసానికి వెళ్లి ఎలాంటి భద్రత లేకుండా సమావేశం అయ్యారని అంటున్నారు.  కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వాములైన జనసేన, తెలుగుదేశం మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని, రాష్ట్ర అభివృద్ధి,  ఎన్నికల వ్యూహాలపై ఇద్దరు నేతలు ఎప్పటికప్పుడు స్పష్టమైన సమన్వయంతో ముందుకు వెళ్తున్నారని ఈ భేటీ మరోసారి చాటింది. ఎలాంటి ప్రోటోకాల్స్‌ను పాటించకుండా, అత్యంత సాధారణంగా పవన్ కళ్యాణ్  సీఎంను ఆయన అధికారిక నివాసానికి వెళ్లి కలవడం ఇరు పార్టీల మధ్యా ఉన్న సఖ్యత, సమన్వయాన్ని మరింత బలంగా చాటిందని పరిశీలకులు అంటున్నారు.    [Pawan Kalyan Meet  Chandrababu Naidu, AP Politics, Jana Sena TDP Alliance, Local Body Elections, Resign Rumours, Andhra Pradesh Politics, Telugu One]
భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ'   చేపట్టిన ఉద్యమాన్ని అడ్డుకోవడానికి, లేదా అణచివేయడానికి కేంద్రంలోని మోడీ సర్కార్ చేయగలిగినంతా చేస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ కీలక నేతలను అరెస్టు చేయడం, అలాగే మొదటి దశ నిరసనను అణచివేయడంలో కేంద్రం ఒకింత సక్సెస్ అయ్యింది కూడా. వరుస అరెస్టులు కేసులతో బొద్దింకల పార్టీ ఓ మెట్టు దిగి.. దీపావళి తరువాత వరకూ ఉద్యమానికి విరామం ఇస్తున్నట్లు ప్రకటించింది కూడా. కానీ అంతలోనే మళ్లీ  శుక్రవారం (అక్టోబర్23) నిరసనకు పిలుపునిచ్చారు. అది పక్కన పెడితే.. కాక్రోచ్ ఉద్యమానికి పరకాల ప్రభాకర్ బహిరంగంగా మద్దతు తెలపడం ద్వారా కేంద్రానికి బిగ్ షాక్ ఇచ్చారు. ఇంతకీ ఈ పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.    కేంద్ర విత్త మంత్రి భర్త, ప్రముఖ ఆర్థిక వేత్త అయిన  పరకాల ప్రభాకర్, ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా అక్టోబర్ 23న జరగనున్న బొద్దింకల నిరసనలో  పాల్గొంటానని ప్రకటించడం ద్వారా కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.  ఎన్నిక  అక్రమాలు, ఈవీఎం  నిర్వహణలో అవకతవకలపై పరకాల ప్రభాకర్ గత కొంతకాలంగా బహిరంగ విమర్శలు చేస్తున్న సంగతి విదితమే.  కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న నిర్మలా సీతారామన్ భర్తే  ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా నిరసనలో పాల్గొనడం కేంద్రానికి మింగుడుపడటం లేదు.    శుక్రవారం (అక్టోబర్ 23) జరగనున్న బొద్దింకల నిరసనలో కేంద్ర విత్త మంత్రి భర్త పరాకాల ప్రభాకర్‌తో పాటు నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ తదితరులు  పాల్గొంటున్నారు.  అసలింతకీ సర్ విషయంలో పరకాల ప్రభాకర్ గత కొంత కాలంగా తన అభ్యంతరాలను బాహాటంగానే వెల్లడిస్తూ వస్తున్నారు. ఓటర్ల జాబితా నుంచి అర్హుల పేర్లను కూడా తొలగిస్తున్నారంటూ ఆయన ఇప్పటికే పలుమార్లు విమర్శలు గుప్పించారు.  ఓటర్ల జాబితాల్లో పేర్లు తొలగిన వారు  తమ హక్కుల కోసం సంఘటితంగా పోరాడాలని కూడా ఆయన పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.   ఈ నేపథ్యంలోనే ఆయన ఒక అడుగు ముందుకు వేసి ఇప్పుడీ ఆందోళనలో ప్రత్యక్షంగా పొల్గొనేందుకు సిద్ధపడటం ద్వారా కేంద్రంపై ఒత్తిడిని మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. పరకాల ప్రభాకర్ బొద్దింకల ఆందోళనలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నట్లు ప్రకటించడం విత్త మంత్రి నిర్మలా సీతారామన్ కు నిస్సందేహంగా ఇబ్బందికరంగా మారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అది పక్కన పెడితే.. విధానాల పరంగా నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ ల అభిప్రాయాలు వేరు వేరు అన్న సంగతి గతంలో కూడా పలు సందర్భాలలో బయటపడింది. నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రిగా తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలను గతంలో కూడా పరకాల ప్రభాకర్ పలు మార్లు విమర్శించారు.  కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలు, ప్రజాస్వామ్య సంస్థల పనితీరుపై పలు మార్లు ఘాటు విమర్శలు చేశారు.  మరీ ముఖ్యంగా  ఆయన రచించిన ది క్రూకడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా ( The Crooked Timber of New India) పుస్తకంలోనూ కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనను బాహాటంగా మద్దతు ఇవ్వడం ద్వారా ఆయన కేంద్రానికి బిగ్ షాక్ ఇచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  [Parakala Prabhakar Join CJP Protests, Union Minister Nirmala Sitharaman Husband, SIR Protest, Gyanesh Kumar,Resign Demand,  Shock, Center, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
Kiran Abbavaram is making his directorial debut with Reality, a family entertainer that explores middle-class emotions through relatable everyday moments. After generating positive buzz with its first glimpse, the film has now released its first single, Bhaja Govindam, sung by Vaikom Vijayalakshmi. Composed by Bheems Ceciroleo and written by Sanare, the song stands out for its simplicity and meaningful lyrics. Rather than relying on loud arrangements and heavy percussion, it celebrates the little joys of everyday life and conveys how contentment can bring happiness beyond the pursuit of material milestones.  Vaikom Vijayalakshmi's soulful rendition adds warmth to this pleasant musical outing. Kiran's approach to the song is equally noteworthy. The visuals capture familiar middle-class situations with a naturalness that makes them feel like moments from everyday life rather than staged cinematic sequences.  His performance adds a light-hearted touch, while his directorial choices underline the beauty of ordinary experiences. The song offers another glimpse into his attempt to portray familial emotions without unnecessary exaggeration. Devika Bhat plays the female lead in the film, produced by Sudhakar Chaganti. Reality is scheduled to release in theatres on December 25. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.  
హాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొల్పిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘డ్యూన్: పార్ట్ త్రీ’ విడుదలకు ముందే రికార్డుల వేట మొదలుపెట్టింది. క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కిస్తున్న ‘ది ఓడిస్సీ’ సినిమాపై ఉన్న అంచనాలను మించి, అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. లండన్‌లోని ప్రముఖ బీఎఫ్‌ఐ ఐమ్యాక్స్ థియేటర్‌లో కేవలం 24 గంటల్లోనే 33 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ టికెట్ల విక్రయాల ద్వారా 8.8 లక్షల పౌండ్లకు పైగా వసూళ్లు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఈ థియేటర్‌లో మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు ‘ది ఓడిస్సీ’ పేరిట ఉండేది. ఆ సినిమా 24 గంటల్లో సుమారు 7.5 లక్షల పౌండ్ల విలువైన టికెట్లను విక్రయించింది. ఇప్పుడు ‘డ్యూన్: పార్ట్ త్రీ’ ఆ రికార్డును అధిగమించి అగ్రస్థానంలో నిలిచింది. ఈ లెక్కలు ప్రపంచవ్యాప్తంగా జరిగిన బుకింగ్స్‌కు సంబంధించినవి కావు.. ఒక్క బీఎఫ్‌ఐ ఐమ్యాక్స్ థియేటర్‌లో నమోదైన అడ్వాన్స్ టికెట్ విక్రయాలు మాత్రమే. డెనిస్ విల్లెన్యూవ్ దర్శకత్వం వహిస్తున్న ‘డ్యూన్: పార్ట్ త్రీ’లో తిమోతీ షాలమే మరోసారి పాల్ అట్రైడీస్ పాత్రలో కనిపించనున్నారు. జెండయా, ఫ్లోరెన్స్ పగ్, జాసన్ మోమోవా, రాబర్ట్ ప్యాటిన్సన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మునుపటి చిత్రాల కథకు కొనసాగింపుగా తెరకెక్కుతున్న ఈ సినిమా, పాల్ అట్రైడీస్ పాలనలో ఎదురయ్యే పరిణామాలు, కొత్త శత్రువులు, ద్రోహాల చుట్టూ సాగనుంది. ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్ 70ఎంఎం ఫార్మాట్‌లో ప్రదర్శించనుండటంతో అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. డిసెంబర్ 15 నుంచి బీఎఫ్‌ఐ ఐమ్యాక్స్‌లో ప్రత్యేక ప్రివ్యూ ప్రదర్శనలు ప్రారంభం కానుండగా, ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 18, 2026న సినిమా విడుదల కానుంది. విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే ‘డ్యూన్: పార్ట్ త్రీ’ చూపిస్తున్న ప్రభావం హాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.     [Dune Part Three, Dune Part Three Advance Bookings, The Odyssey Movie, Dune 3 IMAX Record, Denis Villeneuve, Dune Part Three Release Date, BFI IMAX Ticket Sales]
తలైవా ఎప్పటికప్పుడు గత బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్నింటికీ 'జుజుబీ' అంటూ నయా రికార్డ్స్ సృష్టించడమే పనిగా పెట్టుకున్నాడు. అదే రీతిలో  జైలర్ 2' వారం రోజుల్లో వరల్డ్ వైడ్‌గా దాదాపు 582.45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్టుగా తెలుస్తుంది.  ఈ మేరకు ట్రేడ్ వర్గాలు కూడా అధికారకంగా వెల్లడి చేసాయి.  పూర్తి డీటెయిల్ గా చూద్దాం. .  ఇండియా గ్రాస్ - .338.45 కోట్లు ఓవర్సీస్ గ్రాస్ - 204 కోట్లు వరల్డ్‌వైడ్ గ్రాస్ -.582.45 కోట్లు ఇది కూడా చదవండి: సినిమా ఎందుకు ప్లాప్ అవుతుందో తెలుసా! బయటకొచ్చిన అసలు నిజం ఇదే సినీ బ్రదర్!   జైలర్ 2’కు కేరళలోనూ మంచి స్పందన లభిస్తోంది. ఏడు రోజులకి 60 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్  నివేదికలు వెల్లడించాయి. దీంతో విజయ్ తన లియో తో సాధించిన టోటల్ 60 కోట్ల కలెక్షన్స్ ని రజినీ వారం రోజుల్లోనే దాటినట్లయింది. మలయాళ స్టార్ మోహన్ లాల్ జైలర్ 2 లో కనిపించిన విషయం తెలిసిందే.   [Jailer 2 Collections, Rajinikanth vs vijay, Jailer 2, Jailer 2 box office, Jailer 2 worldwide gross, Jailer 2 Kerala records, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]  
టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రస్తుతం షూటింగులకు కాస్త విరామం ఇచ్చి వియత్నాం వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి అందమైన ప్రదేశాలను సందర్శిస్తూ సరదాగా గడుపుతున్నారు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా బ్లూ కలర్ డ్రెస్‌లో వియత్నాం సంప్రదాయ శైలిని ప్రతిబింబించే దుస్తుల్లో కనిపిస్తూ, చేతిలో అక్కడి ప్రత్యేకమైన శంఖాకార టోపీతో పోజులిచ్చిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రకృతి అందాలు, పురాతన కట్టడాల మధ్య మీనాక్షి చౌదరి తీసుకున్న ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఎప్పుడూ సినిమాలు, షూటింగులతో బిజీగా ఉండే ఈ భామ.. ఇలా వెకేషన్‌కు వెళ్లి కొత్త ప్రదేశాలను అన్వేషిస్తూ రిలాక్స్ అవుతున్నారు. ఆమె పంచుకుంటున్న ట్రావెల్ ఫోటోలకు సోషల్ మీడియాలో అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సినిమాల విషయానికి వస్తే, మీనాక్షి చౌదరి ప్రస్తుతం అక్కినేని నాగచైతన్యకు జోడీగా ‘వృషకర్మ’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆమె దక్ష అనే ఆర్కియాలజిస్ట్ పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు కార్తీ హీరోగా తెరకెక్కుతున్న ఆయన 30వ సినిమాలోనూ కథానాయికగా నటిస్తున్నారు. ఇలా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే, వెకేషన్‌కు సమయం కేటాయిస్తూ అభిమానులతో తన ఆనందకరమైన క్షణాలను పంచుకుంటున్నారు.     [Meenakshi Chaudhary, Meenakshi Chaudhary Vietnam Vacation, Meenakshi Chaudhary Blue Dress, Vrushakarma Movie, Naga Chaitanya Vrushakarma, Meenakshi Chaudhary Latest Photos, Meenakshi Chaudhary Viral Pics]
                              మేకర్స్ అందరు హిట్ బొమ్మ తెరకెక్కించాలనే లక్ష్యంతోనే సినిమా తెరకెక్కిస్తారు. కానీ  కొంత మంది హిట్ విషయంలో ఫెయిల్ అవుతున్నారు. ఈ ఫెయిల్ నెంబర్ ఈ రోజుల్లో చాలా ఎక్కువయ్యింది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. కథ మాత్రం కారణం కాదు. ఇది నిజం. ఎందుకంటే దాదాపుగా అందరు మంచి 'కథ' నే ఎంచుకుంటారు. ఎప్పుడో గాని మరి తేలిపోయే కథలతో తమ ప్రతాపాన్ని చాటుతూ ఉంటారు .  అసలు విషయానికి వస్తే 'ఒక సినిమా విజయంలో కథది ఎంతటి కీలక రోలో, దానిని తెరపై నడిపించే ‘స్క్రీన్ ప్లే’ (Screenplay) ది అంతకంటే వేయి రెట్లు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఒక గ్రిప్పింగ్ డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేదా హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు ఉన్న కథ కాగితం మీద ఎంత అద్భుతంగా అనిపించినా, దానిని సీన్ బై సీన్ తెరపై ఎలా ఆవిష్కరిస్తున్నారనేదే అసలు సిసలైన పరీక్ష. కథ అనేది కేవలం వెన్నుముక మాత్రమే. కానీ ఆ శరీరానికి ప్రాణం, కదలిక, వేగం ఇచ్చేది మాత్రం స్క్రీన్ ప్లేనే. స్క్రీన్ ప్లే అంటే కేవలం సన్నివేశాల వరుస క్రమం కాదు; ఏ సన్నివేశం ఎప్పుడు రావాలి, క్యారెక్టర్స్ పరిచయం ఎలా జరగాలి, ఏ క్షణంలో ట్విస్ట్ ఇస్తే ప్రేక్షకుడు షాక్ అవుతాడు, విరామానికి (Intervalls) ముందు డ్రామా ఏ స్థాయికి చేరుకోవాలి, క్లైమాక్స్ లో ఎలాంటి ఎమోషనల్ హై ఇవ్వాలి అనే ప్రతి అంశాన్ని కొలతలతో సహా డిజైన్ చేసే సున్నితమైన సినీ కళ.  మన భారతీయ చిత్ర పరిశ్రమలో 100 కోట్లు, 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కి, స్టార్ హీరోలు నటించిన 60% కంటే ఎక్కువ సినిమాలు కేవలం కథనం (Screenplay) లో వేగం తగ్గడం వల్ల, రెండవ భాగం (Second Half) లాగ్ కావడం వల్ల బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయని సినీ విశ్లేషణలు చెబుతున్నాయి. ప్రేక్షకుడు సినిమా చూస్తున్నప్పుడు "తర్వాతి సీన్ ఏంటి?" అనే ఉత్సుకత (Curiosity) కోల్పోయాడంటే, అక్కడ దర్శకుడు స్క్రీన్ ప్లే రూపకల్పనలో విఫలమైనట్లే. ఇది కూడా చదవండి: ఈ వారం ఓటిటిలో అదిరిపోయే చిత్రాలు: సినీ ప్రియులని చూసి అసూయ!       చాలా సందర్భాల్లో కథాంశం (Storyline) చాలా కొత్తగా ఉంటుంది. ఉదాహరణకు, ఒక విప్లవాత్మకమైన కాన్సెప్ట్ లేదా సైన్స్ ఫిక్షన్ కథనం కావచ్చు. కానీ స్క్రీన్ ప్లే సరిగ్గా కుదరకపోతే, మొదటి 30 నిమిషాల్లోనే ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురవుతారు. ఒక సర్వే ప్రకారం, థియేటర్‌కు వచ్చే 85% మంది ప్రేక్షకులు కథలోని నెరేషన్ స్పీడ్ (Narration Pace) మరియు సీన్ల మధ్య ఉండే ఆర్గానిక్ కనెక్షన్‌ను బట్టే సినిమా బాగుందో లేదో నిర్ణయిస్తారు. మొదటి భాగంలో సీన్లు వేగంగా సాగి, ఇంటర్వెల్ వద్ద మంచి బ్యాంగ్ ఇచ్చినప్పటికీ, సెకండ్ హాఫ్‌లో అనవసరమైన పాటలు, కామెడీ సీన్లు లేదా సుదీర్ఘమైన సంభాషణలు పెట్టి కథనాన్ని సాగదీస్తే, ఆ సినిమాను కాపాడటం ఏ సూపర్ స్టార్ వల్ల కూడా కాదు. సినిమా స్క్రీన్ ప్లే అనేది ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది; ఎప్పుడు పైకి వెళ్లాలో, ఎప్పుడు దిగాలో సరిగ్గా ప్లాన్ చేయకపోతే ప్రయాణం గందరగోళంగా మారుతుంది. అందుకే  సినీ ప్రపంచంలో ఒక ప్రసిద్ధ నానుడి ఉంది "మంచి కథ లేకపోయినా అద్భుతమైన స్క్రీన్ ప్లేతో సినిమాని హిట్ చేయవచ్చు, కానీ ఎంత గొప్ప కథ ఉన్నా చెత్త స్క్రీన్ ప్లే తో ప్లాప్ చెయ్యచ్చు అని.  కాబట్టి సినిమాని చూసే ప్రేక్షకుడు రెండున్నర లేదా మూడు గంటల పాటు థియేటర్ సీట్లో కూర్చోవాలంటే, అతని దృష్టిని తెరపైనే నిలిపి ఉంచే మ్యాజిక్ ఒక్క స్క్రీన్ ప్లే మాత్రమే చేయగలదు. ఈ సినీ వాస్తవం తెలుసు కాబట్టే హాలీవుడ్ లో స్క్రీన్ ప్లే కి పది మంది రచయితలు పని చేస్తారు. డైరెక్షన్ ది ఏముంది పెన్నుతో పేపర్ పై రాసింది కెమెరా తో తెరపై చెప్పడమే కదా అని కూడా వాళ్ళ అభిప్రాయం. అందుకే డైరెక్టర్ నే స్క్రీన్ ప్లే మాస్టర్ అనే ఇంకో సినీ సత్యం కూడా  వినిపిస్తూ ఉంటుంది.    [Why Good Stories Fail Without Good screenplay, screenplay importance in cinema, why good stories fail in movies, movie screenplay vs story, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అక్టోబర్ 22 నుంచి తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. థియేటర్లలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా ఆ విమర్శలు కొనసాగుతున్నాయి. థియేట్రికల్ వెర్షన్ నిడివి 2 గంటల 54 నిమిషాలు కాగా, ఓటీటీ విడుదలకు ముందు సినిమా రన్‌టైమ్‌ను తగ్గిస్తారనే ప్రచారం జరిగింది. ట్రోలింగ్‌కు గురైన సన్నివేశాలను తొలగిస్తారని చాలామంది భావించారు. అయితే, సినిమా నిడివిలో పెద్దగా మార్పులు చేయకుండా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ధూమావతి ఫైట్ ఎపిసోడ్‌లో ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కొన్న జడల్ తల్లి డ్యాన్స్ సన్నివేశాన్ని తొలగించారు. మొత్తంగా సుమారు నాలుగు నిమిషాల సన్నివేశాలను కట్ చేయడంతో పాటు, కొన్ని చోట్ల గ్రాఫిక్స్‌ను మెరుగుపరిచినట్లు సమాచారం. అయితే, ఓటీటీ వెర్షన్‌లోనూ మిగిలిన సన్నివేశాలను నెటిజన్లు వదిలిపెట్టడం లేదు. సినిమా విడుదల సమయంలో చేసిన విమర్శలు, మీమ్స్‌ను మళ్లీ తెరపైకి తీసుకొస్తూ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలను టార్గెట్ చేస్తున్నారు. ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్‌ను దృష్టిలో పెట్టుకుని మరిన్ని మార్పులు చేస్తారని భావించినవారికి, పెద్దగా మార్పుల్లేకుండా సినిమా స్ట్రీమింగ్ కావడం చర్చనీయాంశమైంది. దీంతో ‘ది ప్యారడైజ్’ ఓటీటీ ఎంట్రీ తర్వాత కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఆగడం లేదు. ఈ చిత్రంలో నానికి జోడీగా కయాదు లోహర్ నటించగా, మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. కీర్తి సురేష్ ప్రత్యేక గీతంలో కనిపించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, చెరుకూరి సుధాకర్ నిర్మించారు. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ సినిమా, ఓటీటీలోనైనా ప్రేక్షకుల అభిప్రాయాన్ని మార్చుకుంటుందా అనేది చూడాలి.       [Nani The Paradise OTT, The Paradise Netflix, Nani Movie OTT Release, Srikanth Odela Trolling, The Paradise OTT Version, Dhumavathi Scene Cut, The Paradise Social Media Reactions]
నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన నటనతోనే కాదు.. తన మాటలు, సినిమాలు, వ్యక్తిగత జీవితంతోనూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాల్లో ఆమె మాట్లాడే హిందీ యాసపై సోషల్ మీడియాలో కొందరు ట్రోలింగ్ చేస్తుంటారు. అయితే ఇలాంటి విమర్శలకు తాను పెద్దగా ప్రాధాన్యం ఇవ్వనని, తన యాస విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని రష్మిక స్పష్టం చేశారు. దక్షిణ భారతదేశానికి చెందిన తనకు ఆ ప్రాంతపు యాస ఉండటం సహజమేనని, అది లేదని ఆశించడం సమంజసం కాదని ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దీంతో ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా తన భర్త, హీరో విజయ్ దేవరకొండతో కలిసి ‘కాఫీ విత్ కరణ్’ సీజన్ 9లో పాల్గొన్న రష్మిక.. భాషలు, యాసల విషయంలో ఎదురవుతున్న విమర్శలపై స్పందించారు. కెరీర్ ప్రారంభం నుంచే తన నటన, భాష, మాట్లాడే విధానం, యాస వంటి అనేక అంశాలపై విమర్శలు ఎదుర్కొంటున్నానని తెలిపారు. అయితే వాటిని తన కెరీర్‌కు అడ్డంకులుగా మార్చుకోవాలని ఎప్పుడూ అనుకోలేదని చెప్పారు. ఒకే చిత్ర పరిశ్రమకు, ఒకే భాషకు పరిమితం కాకుండా అన్ని భాషల్లోనూ సినిమాలు చేయాలనేది తన కోరిక అని వెల్లడించారు. అందుకే విభిన్నమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నానని వివరించారు. తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పడం కూడా తనకు ఎంతో సంతృప్తినిస్తుందని రష్మిక తెలిపారు. అవసరమైతే తన పాత్రలకు మరో డబ్బింగ్ ఆర్టిస్ట్‌తో వాయిస్ ఇప్పించుకోవచ్చని దర్శకులకు ముందుగానే చెబుతానని, అయితే ఇప్పటివరకు తన సినిమాల్లో తన గొంతునే కొనసాగించాలని దర్శకులు కోరుకున్నారని పేర్కొన్నారు. పలు భాషల్లో స్వయంగా డబ్బింగ్ చెప్పడం వెనుక ఎంతో కష్టముందని, అలా చేయగలగడం తనకు గర్వకారణమని అన్నారు. భాషను పరిపూర్ణంగా మాట్లాడటం కంటే, ఆ భాషలోని ప్రేక్షకులతో అనుసంధానం కావడం, వారికి తన నటన ద్వారా చేరువ కావడం ముఖ్యమని ఆమె భావిస్తున్నారు. ‘యానిమల్’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’ వంటి విభిన్నమైన సినిమాల్లో నటించడం తనకు ఎంతో సంతృప్తినిస్తుందని రష్మిక గతంలోనూ చెప్పుకొచ్చారు. ఒకే తరహా పాత్రలకు పరిమితం కాకుండా, భిన్నమైన పాత్రల్లో తనను తాను నిరూపించుకోవాలనేది తన లక్ష్యమని ఆమె మాటల్లో స్పష్టమవుతోంది. దక్షిణాది యాస ఉందంటూ విమర్శించే వారికి తన నేపథ్యాన్ని గుర్తుచేస్తూనే, అలాంటి వ్యాఖ్యలు తన అవకాశాలను అడ్డుకోలేవని రష్మిక చెప్పకనే చెప్పారు. మరి ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు ఎలా స్పందిస్తారో చూడాలి.     [Rashmika Mandanna, Rashmika Hindi Accent, Rashmika Mandanna Trolling, Koffee With Karan Season 9, Vijay Deverakonda, Rashmika Dubbing, South Indian Accent]
ప్రెజెంట్ ఓటిటి సినీ లవర్స్ మూడ్ ఎలా ఉందంటే  ఎంజాయ్ అంటే మాదే అనుకుంటూ చిన్న సైజు స్టెప్స్ కూడా వేస్తున్నారు. మరి ఈ వీక్ కూడా ఒకటి కాదు, రెండు కాదు, నెంబర్ ఆఫ్ సినిమాలు వాళ్ళ కోసమే నిర్మాణం జరుపుకున్నట్టుగా ఓటిటిలో క్యూ కడితే  అంతే కదా! ప్రేక్షకులే మాములు ఎంజాయ్ మెంట్ తో  ఉండరు. మరి వాళ్ళు చెప్తున్న లిస్ట్ ఏంటో చూద్దాం.   నెట్ ఫ్లిక్స్ ‘ది ప్యారడైజ్’ (ఈ రోజు నుంచి అంటే అక్టోబర్ 22 ] . తెలుగు , తమిళం , హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో  చూడొచ్చు. ఇక నెట్ ఫ్లిక్స్ విడుదల అవ్వబోయే మరో చెప్పుకోదగ్గ చిత్రం దొరతి. కీర్తి సురేష్ , రిషి కాంత్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ , కలెక్షన్స్ మాత్రం రాలేదు. కానీ ఓటీటీ ఆడియన్స్ కి మాత్రం కచ్చితంగా ఈ చిత్రం నచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ 23 నుండి, అంటే రేపటి నుంచి నెట్ ఫ్లిక్స్ లో తెలుగు తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. అదే విధంగా గజబ్ రాత్ అనే బాలీవుడ్ చిత్రం , షాడోస్ ఆఫ్ ది టిన్ నింజా అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ , సర్వైవింగ్ హరికేన్ ఒటీస్ అనే ఇంగ్లీష్ చిత్రం కూడా నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 23 నుండి స్ట్రీమింగ్ కాబోతున్నాయి.  జియో హాట్ స్టార్ విషయానికి వస్తే.. ఈ వారం తెలుగు సినిమాలు చెప్పుకోదగినవి లేవనే చెప్పాలి. మోనా అనే ఇంగ్లీష్ సినిమా ప్రస్తుతానికి స్ట్రీమింగ్ అవుతోంది. ఇది తెలుగు లో కూడా అందుబాటులో ఉంది . అదే విధంగా హిందీ లో మహిషాశుర వథ్ అనే వెబ్ సిరీస్ ని దసరా కానుకగా విడుదల చేశారు. దీనికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతే కాకుండా వరం అనే వెబ్ సిరీస్ ఈ నెల 22 నుండి స్ట్రీమింగ్ అవ్వబోతుండగా , ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ వెబ్ సిరీస్ సీజన్ 7 అక్టోబర్ 23 నుండి స్ట్రెమైన్గ్ కాబోతుంది. ఇది కూడా చదవండి: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ: ఈ  హీరోనే!    అమెజాన్ ప్రైమ్ వీడియో చెప్పుకోదగినవి లేవు. రీసెంట్ గానే ‘ది టెర్మినల్ లిస్ట్ ‘ సీజన్ 2 వెబ్ సిరీస్ మొదలైంది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. అదే విధంగా తేజ సజ్జ హోస్ట్ గా వ్యవహరించిన ‘ది ట్రైటర్స్’ రియాలిటీ షో కి సంబంధించి కొత్త ఎపిసోడ్స్ ని అప్లోడ్ చేశారు. అదే విధంగా చార్ యార్ అనే హిందీ వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇవన్నీ చూసుకునే ఓటిటి సినీ ప్రేమికుల గర్వానందం..      [Ott Releases This Week, this week ott releases, telugu ott updates, netflix movies this week, amazon prime releases, new ott movies, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్ 2’ సినిమాపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. రజనీకాంత్ స్టార్ పవర్, ఆయన స్టైల్, ఆరా ఈ సినిమాలో అద్భుతంగా ఆవిష్కృతమయ్యాయని పేర్కొన్నారు. ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతూ, ఆద్యంతం ఉత్సాహాన్ని రగిలించే కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ‘జైలర్ 2’ నిలిచిందని కొనియాడారు. సినిమాలో సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ పనితీరును కూడా అల్లు అర్జున్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ‘కిల్డ్ ఇట్’ అంటూ ఆయన సంగీతానికి కితాబిచ్చారు. ఈ సినిమా కోసం నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాత మనసుపెట్టి పనిచేశారని అభిప్రాయపడ్డారు. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తనదైన శైలిలో అద్భుతమైన విజయాన్ని అందించారని ప్రశంసించారు. రజనీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు చిత్రబృందం కృషి సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని అల్లు అర్జున్ వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వసూళ్లపై కూడా సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. చొక్కా నలగకుండా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం రజనీకాంత్‌కే సాధ్యమంటూ ఆయన అభిమానులు ప్రశంసిస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలు, హడావుడి లేకుండానే తన స్టైల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే రజనీ ప్రత్యేకతను ఈ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నాయి. అయితే రూ.500 కోట్లకు పైగా వసూళ్లకు సంబంధించిన విషయాన్ని అధికారిక బాక్సాఫీస్ గణాంకాలతో ధ్రువీకరించిన తర్వాతే వార్తలో వాస్తవంగా పేర్కొనాలి. అల్లు అర్జున్ వంటి పాన్ ఇండియా స్టార్ మరో సూపర్‌స్టార్ సినిమాను ఈ స్థాయిలో ప్రశంసించడం సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. రజనీకాంత్ స్టార్‌డమ్, అనిరుధ్ సంగీతం, నెల్సన్ దర్శకత్వ శైలి కలిస్తే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపుతాయో మరోసారి చర్చకు వస్తోంది. ముఖ్యంగా రజనీకాంత్‌ను అభిమానించే ప్రేక్షకులతో పాటు ఇతర సినీ ప్రముఖుల నుంచి కూడా ‘జైలర్ 2’కు ప్రశంసలు రావడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.     [Allu Arjun Jailer 2, Rajinikanth Jailer 2, Allu Arjun Praises Rajinikanth, Jailer 2 Movie, Nelson Dilipkumar, Anirudh Ravichander, Jailer 2 Box Office]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు ‘కాకా’ అనే పవర్‌ఫుల్ సబ్జెక్టుతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మేకర్స్ జెట్ స్పీడ్‌లో పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో జనవరి 13న సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో మెగా అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు చిరంజీవి నుంచి రావాల్సిన భారీ విజువల్ వండర్ ‘విశ్వంభర’ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా సంక్రాంతి బరిలోకి వస్తుందని, ఈ సినిమా కోసం ‘కాకా’ త్యాగం చేస్తుందని గతంలో పలు వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలను ఖండించి, తాము సంక్రాంతికే వస్తామని కాకా టీం స్పష్టం చేసింది. దీంతో మెగాస్టార్ సినిమాల రిలీజ్ డేట్లపై ఒక క్లారిటీ వచ్చిందని అంతా భావించారు. కానీ ఇప్పుడు మళ్లీ కథ మొదటికొచ్చినట్లు కనిపిస్తోంది. తాజా ప్రచారం ప్రకారం.. ‘కాకా’ను సంక్రాంతి రేసు నుంచి తప్పించి మార్చిలో విడుదల చేయొచ్చని టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే, ఆ స్థానంలో ‘విశ్వంభర’ను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో మరోసారి చిరంజీవి సినిమాల విడుదల తేదీలపై చర్చ మొదలైంది. మరి ‘కాకా’ అనుకున్నట్టుగానే సంక్రాంతికి వస్తుందా? లేక ఆ ప్లేస్ లో ‘విశ్వంభర’ వస్తుందా? అన్నది తెలియాలంటే మేకర్స్ స్పందించే వరకు ఎదురుచూడాల్సిందే. ఇది కూడా చదవండి: అర్ధరాత్రి అల్లు అర్జున్‌కు ఫోన్ చేసిన విజయ్.. పక్కనే రష్మిక కూడా.!       [Kaaka Postponement Rumors, Chiranjeevi Kaaka Movie, Kaaka Release Date, Vishwambhara Release Date, Vishwambhara Sankranthi 2027, Chiranjeevi Upcoming Movies, Sankranthi 2027 Movies, Megastar Chiranjeevi, Telugu Film News]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
 ఎమోషనల్ చీటింగ్.. తామే తప్పు చేసి, భాగస్వామిని మోసం చేసే వ్యక్తుల తెలివైన  మార్గమిది..! ఒక ఆరోగ్యకరమైన సంబంధానికి పునాది పరస్పర నమ్మకం, గౌరవం , నిజాయితీ. రెండు మనస్సులు కలిసి ప్రయాణించేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు, అభిప్రాయ భేదాలు రావడం చాలా సహజం. అయితే, కొన్ని సంబంధాలలో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. తప్పు ఒకరు చేస్తే, ఆ నిందను మరొకరిపైకి నెట్టేసి, ఎదుటివారిని తప్పుగా నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతుంటాయి. దీనినే మానసిక నిపుణులు ఎమోషనల్ మానిప్యులేషన్ లేదా ఎమోషనల్ చీటింగ్  అని పిలుస్తారు. భాగస్వామి తన స్వార్థం కోసం లేదా తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎదుటివారి ఎమోషన్స్ తో  ఆడుకుంటున్నప్పుడు, అది మీ మనశాంతిని, ఆత్మవిశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఇలాంటి ప్రవర్తనను ప్రేమ అనుకుని పొరబడటం వల్ల చాలామంది మానసికంగా నలిగిపోతున్నారు. భాగస్వామి చేసే తప్పులకు మిమ్మల్ని బాధ్యులను చేస్తూ, మిమ్మల్ని మానసిక గందరగోళంలోకి నెట్టే మోసగాళ్ల మార్గాలు , వారు ఉపయోగించే ప్రమాదకరమైన పద్దతులు ఉన్నాయి. వాటి  గురించి వివరంగా తెలుసుకుంటే.. విషయాన్ని పక్కదారి పట్టించడం.. ఎప్పుడైనా భాగస్వామి చేసిన పొరపాటును మీరు ఎత్తిచూపినప్పుడు, వారు ఆ పొరపాటు  గురించి సమాధానం చెప్పడానికి నిరాకరిస్తారు. నిజమైన విషయాన్ని పక్కన పెట్టి, సంభాషణను పూర్తిగా వేరే వైపు తిప్పుతారు. చివరకు అసలు సమస్య ఏంటో మర్చిపోయి, వారు బాధితుల్లా నటించడం మొదలుపెడతారు. మీరు లేవనెత్తిన తప్పును వదిలేసి, మీరు మాట్లాడే తీరును లేదా ఇతర చిన్న విషయాలను పెద్దది చేసి, మీరే వారిని వేధిస్తున్నట్లు క్రియేట్ చేస్తారు. నిందను ఎదుటివారిపైకి నెట్టడం , గిల్ట్ ఫీలింగ్ కలిగించడం.. ఎమోషనల్ మానిప్యులేటర్లు తమ తప్పును ఎప్పటికీ ఒప్పుకోరు. క్షమాపణలు చెప్పడానికి బదులుగా, మీకే మానసిక అసౌకర్యం లేదా తప్పు చేశాం అనే ఫీలింగ్  కలిగేలా ప్రవర్తిస్తారు. ఉదాహరణకు, మీ వల్ల వారు ఎంత బాధపడుతున్నారో, వారి మానసిక ప్రశాంతత ఎలా పాడైందో చెబుతూ మిమ్మల్ని గిల్ట్ త్రిప్‌లోకి నెడతారు. వారు చేసే తప్పులన్నింటికీ మీ ప్రవర్తనే కారణమని నమ్మించడానికి ప్రయత్నిస్తారు. దీంతో మీరు అసలు తప్పును వదిలేసి, వారిని సముదాయించే పనిలో పడిపోతారు. మీ ఆలోచనలనే అనుమానించేలా చేయడం.. దీనినే గ్యాస్‌లైటింగ్ అని అంటారు. వీరు తమ తప్పుల నుంచి తప్పించుకోవడానికి మీ జ్ఞాపకశక్తిని లేదా మీ అర్థం చేసుకునే సామర్థ్యాన్నే ప్రశ్నిస్తారు. అలాంటిదేమీ జరగలేదని, మీరు ఊహించుకుంటున్నారని, లేదా మీకు సరిగ్గా గుర్తులేదని పదే పదే చెబుతారు. దీంతో మీపై మీకే అనుమానం మొదలవుతుంది. నేను ఆలోచిస్తున్నది నిజమేనా లేదా నేను పొరబడుతున్నానా అనే గందరగోళంలోకి మీరు వెళ్ళిపోతారు. ఇది ఎదుటి వ్యక్తి మిమ్మల్ని పూర్తిగా తన అదుపులోకి తీసుకోవడానికి వాడే అత్యంత ప్రమాదకరమైన మార్గం. పాత విషయాలను మధ్యలోకి తీసుకురావడం.. ప్రస్తుతం జరుగుతున్న వివాదంలో తమ తప్పు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు, వీరు వెంటనే గతాన్ని తవ్వుతారు. మీరు ఎప్పుడో గతంలో చేసిన చిన్న తప్పులను లేదా పొరపాట్లను గుర్తుచేస్తూ, నువ్వు కూడా ఆ రోజు ఇలాగే చేశావు కదా అని ఎదురుదాడి చేస్తారు. పాత విషయాలను మధ్యలోకి తీసుకురావడం వల్ల మీరు డిఫెన్సివ్ మోడ్‌లోకి వెళ్తారు. దీనివల్ల ప్రస్తుత తప్పు గురించి మాట్లాడటం ఆగిపోయి, పాత విషయాలపై చర్చ మొదలవుతుంది.  నకిలీ క్షమాపణలు.. ఒకవేళ వారు క్షమాపణలు చెప్పాల్సి వచ్చినా, అది ఎంతో నాటకీయంగా ఉంటుంది. మనస్ఫూర్తిగా తమ తప్పును అంగీకరించి  క్షమాపణ చెప్పరు.  గొడవను తొందరగా ముగించడానికో లేక మిమ్మల్ని నోరు మూయించడానికో నకిలీ క్షమాపణలు చెబుతారు. సారీ చెప్పేటప్పుడు కూడా, నీకు అంతగా అనిపిస్తే సారీ లేదా నేను చేసిన ప్రతిదీ తప్పేలే అనే వ్యాఖ్యలు జోడిస్తారు. ఇందులో నిజమైన పశ్చాత్తాపం ఉండదు. పైగా దెప్పిపొడుపు ఉంటుంది. మానసిక ఆరోగ్యానికే ప్రమాదం.. ఇలాంటి పరిస్థితులు సంబంధంలో ఎప్పుడూ  కొనసాగుతూ ఉంటే , అది మీ మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. క్రమంగా మీ ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. ప్రతి చిన్న విషయానికి మీరే బాధ్యులమనే భయం  స్థిరపడిపోతుంది. భాగస్వామి ప్రవర్తనలో ఈ ప్రమాదకరమైన సంకేతాలు కనిపిస్తే వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. సరిహద్దులను నిర్ణయించుకోవడం, స్పష్టంగా మాట్లాడటం , అవసరమైతే సంబంధం గురించి బాగా ఆలోచించుకోవడం లేదా నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.                                           *రూపశ్రీ.
 భార్యాభర్తల మధ్య ఎమోషనల్ గ్యాప్ పెరుగుతోందా..ఈ విషయాలు నిర్లక్ష్యం చేయకండి..! భార్యాభర్తల మధ్య బంధం కేవలం ఒకరికొకరు తోడుగా ఉండటం మాత్రమే కాదు, ఇద్దరి మధ్య ఉండే భావోద్వేగాల అనుబంధం కూడా చాలా ముఖ్యం. కొన్నిసార్లు దంపతులు ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ, వారి మధ్య మానసిక దూరం పెరుగుతూ వస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో లేదా మనసులోని భావాలను పంచుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయంలో భాగస్వామి మనల్ని పట్టించుకోవడం లేదనే భావన కలగడం సహజం. బంధంలో ఇలాంటి ఎమోషనల్ గ్యాప్ రావడం వల్ల ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగే అవకాశం ఉంటుంది.  ఈ విషయాన్ని ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే.. వివాహం తర్వాత పెరిగే దూరం.. పెళ్లయిన కొత్తలో ఉన్న ఆప్యాయత, సంభాషణలు కాలక్రమేణా మరుగున పడిపోవడం చాలా జంటల్లో కనిపిస్తుంది. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండటం, మానసిక ఒత్తిడి లేదా ఇతర కారణాల వల్ల ఒకరికొకరు సమయం కేటాయించడం తగ్గిపోతుంది. అయితే, ఈ దూరం చిన్న చిన్న విషయాల నుంచి ప్రారంభమై పెద్ద సమస్యగా మారుతుంది. భాగస్వామి ప్రవర్తనలో వచ్చే మార్పులను సరిగ్గా గమనించకపోతే, అది మానసికంగా ఇద్దరినీ ఒంటరి చేసేస్తుంది. కాబట్టి సంబంధంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందో లేదో తెలుసుకోవడానికి కొన్ని కీలకమైన లక్షణాలను అర్థం చేసుకోవడం ముఖ్యం. రెస్పాండ్ కాకపోవడం.. మీరు చెప్పే విషయాలను లేదా మీ సమస్యలను భాగస్వామి గమనించకపోవడం లేదా వాటికి సరైన స్పందన ఇవ్వకపోవడం చాలా స్పష్టమైన సంకేతం. రోజులో జరిగిన విషయాలు లేదా  మనసులోని ఆందోళనలను పంచుకోవడానికి ప్రయత్నించినప్పుడు, వారు ఫోన్ చూస్తూ ఉండటం లేదా మీ మాటలను మధ్యలోనే ఆపేయడం చేస్తుంటే అక్కడ ఎమోషనల్ బాండింగ్  సన్నగిల్లుతోందని అర్థం చేసుకోవాలి. కేవలం వినడం మాత్రమే కాకుండా, మీ మాటలకు విలువ ఇవ్వకపోవడం వల్ల  అభద్రతాభావం పెరుగుతుంది. నిర్లక్ష్యం.. మీ ఫీలింగ్స్  లేదా మీ ఆవేదనను తేలికగా తీసుకోవడం లేదా చిన్నచూపు చూడటం కూడా ఎమోషనల్ గ్యాప్ పెరుగుతోందని చెప్పడానికి ఒక సంకేతం. మీకు ఏదైనా విషయంలో బాధ కలిగినప్పుడు, భాగస్వామి మిమ్మల్ని ఓదార్చాల్సింది పోయి మీరు అతిగా  ఆలోచిస్తున్నారని అనడం లేదా చిన్న విషయాలకే పెద్దవి చేస్తున్నారని అనడం సరికాదు. మీ ఫీలింగ్స్ కు  గౌరవం ఇవ్వకపోవడం వల్ల మీ మనసులోని మాటలను ఎవరితో పంచుకోవాలో తెలియని అయోమయం ఏర్పడుతుంది. ఇలాంటి ప్రవర్తన ఇద్దరి మధ్య ఎమోషనల్ గ్యాప్ ను  మరింత పెంచుతుంది. షేర్ చేసుకోకపోవడం..   భాగస్వామి తమ వ్యక్తిగత విషయాలు లేదా మనసులోని ఆలోచనలను మీతో పంచుకోవడం మానేయడం కూడా ఇద్దరి మధ్య ఎమోషనల్ గ్యాప్ పెరుగుతోంది అనడానికి సంకేతం. గతంలో ప్రతి చిన్న విషయాన్ని మీతో చెప్పే వారు, ఇప్పుడు తమ ప్లానింగ్స్, ఇబ్బందులు లేదా అనుభవాలను పూర్తిగా దాచడం ఒకవేళ అడిగినా కూడా   ఏదో ఒక సాకు  చెప్పి దాటవేయడం చేస్తుంటే అక్కడ దూరం పెరుగుతోందని గ్రహించాలి. ఎమోషన్స్ ను లేదా మనసులోని విషయాలను ఒకరికొకరు షేర్ చేసుకోలేని చోట బంధం కేవలం పేరుకే మిగులుతుంది. బంధం కోసం ప్రయత్నం.. బంధాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఎప్పుడూ ఒక  వైపు నుంచే జరగడం  అనేది కూడా భార్యాభర్తల మధ్య ఎమోషనల్ దూరం పెరుగుతోంది అనడానికి సంకేతం. మాట్లాడటం మొదలుపెట్టడం, కలిసి సమయం గడపడానికి ప్లాన్ చేయడం లేదా మనస్పర్ధలను సరిదిద్దడానికి ప్రయత్నించడం వంటి బాధ్యతలన్నీ  ఒక్కరి మీదే పడటం గమనించవచ్చు. భాగస్వామి తరపు నుంచి ఎలాంటి చొరవ లేకపోవడం వల్ల ఆ బంధం ఒకే వైపు నుంచి నడుస్తున్న అనుభూతి కలుగుతుంది. ఒంటరితనం.. భాగస్వామి పక్కనే ఉన్నప్పటికీ తీవ్రమైన ఒంటరితనం అనుభవించడం. ఇద్దరూ ఒకే గదిలో ఉన్నా, ఒకరినొకరు పలకరించుకోకుండా ఎవరి ప్రపంచంలో వారు ఉండటం భావోద్వేగ శూన్యతను సూచిస్తుంది. మీ మనసులోని సంతోషాన్ని లేదా బాధను పంచుకునే ముందు అవతల వ్యక్తి వింటారో లేదో అని ఆలోచించాల్సిన పరిస్థితి వస్తే, ఆ బంధంలో మార్పు అవసరమని అర్థం. పరిష్కారం ఎలా? ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం కంటే ప్రశాంతమైన వాతావరణంలో మాట్లాడుకోవడం చాలా ముఖ్యం. వారి ప్రవర్తన వల్ల మీకు కలుగుతున్న భావోద్వేగాలను నిరాశకు గురి కాకుండా, స్పష్టంగా వివరించాలి. అవతలి వ్యక్తి ఏవైనా ఇతర ఒత్తిళ్లలో ఉన్నారేమో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇద్దరూ కలిసి కూర్చుని మనసు విప్పి మాట్లాడితే చాలా వరకు ఈ దూరాన్ని తగ్గించుకోవచ్చు. ఒకవేళ పరిస్థితి అలాగే కొనసాగితే, నిపుణుల సహాయం తీసుకోవడం,  కౌన్సెలింగ్ తీసుకోవడం  ద్వారా సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది.                                                                                                                                                  *రూపశ్రీ.
 భార్యాభర్తల మధ్య ఎమోషనల్ గ్యాప్ పెరుగుతోందా..ఈ విషయాలు నిర్లక్ష్యం చేయకండి..! భార్యాభర్తల మధ్య బంధం కేవలం ఒకరికొకరు తోడుగా ఉండటం మాత్రమే కాదు, ఇద్దరి మధ్య ఉండే భావోద్వేగాల అనుబంధం కూడా చాలా ముఖ్యం. కొన్నిసార్లు దంపతులు ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ, వారి మధ్య మానసిక దూరం పెరుగుతూ వస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో లేదా మనసులోని భావాలను పంచుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయంలో భాగస్వామి మనల్ని పట్టించుకోవడం లేదనే భావన కలగడం సహజం. బంధంలో ఇలాంటి ఎమోషనల్ గ్యాప్ రావడం వల్ల ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగే అవకాశం ఉంటుంది.  ఈ విషయాన్ని ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే.. వివాహం తర్వాత పెరిగే దూరం.. పెళ్లయిన కొత్తలో ఉన్న ఆప్యాయత, సంభాషణలు కాలక్రమేణా మరుగున పడిపోవడం చాలా జంటల్లో కనిపిస్తుంది. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండటం, మానసిక ఒత్తిడి లేదా ఇతర కారణాల వల్ల ఒకరికొకరు సమయం కేటాయించడం తగ్గిపోతుంది. అయితే, ఈ దూరం చిన్న చిన్న విషయాల నుంచి ప్రారంభమై పెద్ద సమస్యగా మారుతుంది. భాగస్వామి ప్రవర్తనలో వచ్చే మార్పులను సరిగ్గా గమనించకపోతే, అది మానసికంగా ఇద్దరినీ ఒంటరి చేసేస్తుంది. కాబట్టి సంబంధంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందో లేదో తెలుసుకోవడానికి కొన్ని కీలకమైన లక్షణాలను అర్థం చేసుకోవడం ముఖ్యం. రెస్పాండ్ కాకపోవడం.. మీరు చెప్పే విషయాలను లేదా మీ సమస్యలను భాగస్వామి గమనించకపోవడం లేదా వాటికి సరైన స్పందన ఇవ్వకపోవడం చాలా స్పష్టమైన సంకేతం. రోజులో జరిగిన విషయాలు లేదా  మనసులోని ఆందోళనలను పంచుకోవడానికి ప్రయత్నించినప్పుడు, వారు ఫోన్ చూస్తూ ఉండటం లేదా మీ మాటలను మధ్యలోనే ఆపేయడం చేస్తుంటే అక్కడ ఎమోషనల్ బాండింగ్  సన్నగిల్లుతోందని అర్థం చేసుకోవాలి. కేవలం వినడం మాత్రమే కాకుండా, మీ మాటలకు విలువ ఇవ్వకపోవడం వల్ల  అభద్రతాభావం పెరుగుతుంది. నిర్లక్ష్యం.. మీ ఫీలింగ్స్  లేదా మీ ఆవేదనను తేలికగా తీసుకోవడం లేదా చిన్నచూపు చూడటం కూడా ఎమోషనల్ గ్యాప్ పెరుగుతోందని చెప్పడానికి ఒక సంకేతం. మీకు ఏదైనా విషయంలో బాధ కలిగినప్పుడు, భాగస్వామి మిమ్మల్ని ఓదార్చాల్సింది పోయి మీరు అతిగా  ఆలోచిస్తున్నారని అనడం లేదా చిన్న విషయాలకే పెద్దవి చేస్తున్నారని అనడం సరికాదు. మీ ఫీలింగ్స్ కు  గౌరవం ఇవ్వకపోవడం వల్ల మీ మనసులోని మాటలను ఎవరితో పంచుకోవాలో తెలియని అయోమయం ఏర్పడుతుంది. ఇలాంటి ప్రవర్తన ఇద్దరి మధ్య ఎమోషనల్ గ్యాప్ ను  మరింత పెంచుతుంది. షేర్ చేసుకోకపోవడం..   భాగస్వామి తమ వ్యక్తిగత విషయాలు లేదా మనసులోని ఆలోచనలను మీతో పంచుకోవడం మానేయడం కూడా ఇద్దరి మధ్య ఎమోషనల్ గ్యాప్ పెరుగుతోంది అనడానికి సంకేతం. గతంలో ప్రతి చిన్న విషయాన్ని మీతో చెప్పే వారు, ఇప్పుడు తమ ప్లానింగ్స్, ఇబ్బందులు లేదా అనుభవాలను పూర్తిగా దాచడం ఒకవేళ అడిగినా కూడా   ఏదో ఒక సాకు  చెప్పి దాటవేయడం చేస్తుంటే అక్కడ దూరం పెరుగుతోందని గ్రహించాలి. ఎమోషన్స్ ను లేదా మనసులోని విషయాలను ఒకరికొకరు షేర్ చేసుకోలేని చోట బంధం కేవలం పేరుకే మిగులుతుంది. బంధం కోసం ప్రయత్నం.. బంధాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఎప్పుడూ ఒక  వైపు నుంచే జరగడం  అనేది కూడా భార్యాభర్తల మధ్య ఎమోషనల్ దూరం పెరుగుతోంది అనడానికి సంకేతం. మాట్లాడటం మొదలుపెట్టడం, కలిసి సమయం గడపడానికి ప్లాన్ చేయడం లేదా మనస్పర్ధలను సరిదిద్దడానికి ప్రయత్నించడం వంటి బాధ్యతలన్నీ  ఒక్కరి మీదే పడటం గమనించవచ్చు. భాగస్వామి తరపు నుంచి ఎలాంటి చొరవ లేకపోవడం వల్ల ఆ బంధం ఒకే వైపు నుంచి నడుస్తున్న అనుభూతి కలుగుతుంది. ఒంటరితనం.. భాగస్వామి పక్కనే ఉన్నప్పటికీ తీవ్రమైన ఒంటరితనం అనుభవించడం. ఇద్దరూ ఒకే గదిలో ఉన్నా, ఒకరినొకరు పలకరించుకోకుండా ఎవరి ప్రపంచంలో వారు ఉండటం భావోద్వేగ శూన్యతను సూచిస్తుంది. మీ మనసులోని సంతోషాన్ని లేదా బాధను పంచుకునే ముందు అవతల వ్యక్తి వింటారో లేదో అని ఆలోచించాల్సిన పరిస్థితి వస్తే, ఆ బంధంలో మార్పు అవసరమని అర్థం. పరిష్కారం ఎలా? ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం కంటే ప్రశాంతమైన వాతావరణంలో మాట్లాడుకోవడం చాలా ముఖ్యం. వారి ప్రవర్తన వల్ల మీకు కలుగుతున్న భావోద్వేగాలను నిరాశకు గురి కాకుండా, స్పష్టంగా వివరించాలి. అవతలి వ్యక్తి ఏవైనా ఇతర ఒత్తిళ్లలో ఉన్నారేమో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇద్దరూ కలిసి కూర్చుని మనసు విప్పి మాట్లాడితే చాలా వరకు ఈ దూరాన్ని తగ్గించుకోవచ్చు. ఒకవేళ పరిస్థితి అలాగే కొనసాగితే, నిపుణుల సహాయం తీసుకోవడం,  కౌన్సెలింగ్ తీసుకోవడం  ద్వారా సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది.                                                                                                                                                  *రూపశ్రీ.
ఇయర్ బడ్స్ పెట్టుకుని రాత్రిళ్లు నిద్రపోయే అలవాటుందా.. ఈ నిజాలు తెలుసుకోండి..! ఈరోజుల్లో చాలామందికి రాత్రి పడుకునే ముందు ప్రశాంతంగా నిద్ర పట్టడం కోసం ఇయర్ బడ్స్ పెట్టుకుని పాటలు, భజనలు లేదా పాడ్‌కాస్ట్‌లు వినే అలవాటు ఉంటుంది. ఈ చిన్న అలవాటు త్వరగా నిద్రపోవడానికి సహాయపడుతుందని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాత్రి అంతా లేదా ఎక్కువ సమయం పాటు ఇయర్ బడ్స్ ధరించి పడుకోవడం వల్ల  చెవుల ఆరోగ్యానికి ఎంతో హానికరమని వైద్యులు చెబుతున్నారు. ఈ చిన్న అలవాటు వల్ల భవిష్యత్తులో చెవులకు సంబంధించి పెద్ద సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. రాత్రి సమయంలో ఇయర్ బడ్స్ పెట్టుకుని పడుకోవడం వల్ల మన చెవుల్లో రకరకాల ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా నిద్రలో అటు ఇటు తిరుగుతున్నప్పుడు లేదా  బోర్లా పడుకున్నప్పుడు దిండుకు ఇయర్ బడ్స్‌కు మధ్య పడే ఒత్తిడి కారణంగా చెవి భాగంలో తీవ్రమైన నొప్పి, చికాకు లేదా మంట పుట్టే అవకాశం ఉంటుంది. ఈ విధంగా రోజూ జరగడం వల్ల చెవి చుట్టూ ఉన్న సున్నితమైన చర్మం దెబ్బతింటుంది , నొప్పి మరింత పెరుగుతుంది. ఇయర్ బడ్స్ చెవి రంధ్రంలో బిగుతుగా ఉండటం వల్ల చెవి లోపలికి గాలి సరిగ్గా వెళ్లకుండా అడ్డుపడుతుంది. దీనివల్ల చెవిలో తేమ , చెమట పేరుకుపోయి బ్యాక్టీరియా పెరగడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇది చెవిలో ఇన్‌ఫెక్షన్లు రావడానికి ప్రధాన కారణం అవుతుంది. కొందరు ఇయర్ బడ్స్‌ను శుభ్రం చేయకుండా వాడటం లేదా ఇతరులతో షేర్ చేసుకోవడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. చెవుల్లో దురద, వాపు లేదా ఒక రకమైన ద్రవం కారడం వంటి లక్షణాలు కనిపిస్తే అది ఇన్‌ఫెక్షన్‌గా గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదించాలి. రాత్రి మొత్తం ఇయర్ బడ్స్ ద్వారా పెద్ద శబ్దాలతో మ్యూజిక్ వినడం వల్ల మన వినికిడి శక్తి క్రమంగా మందగించే ప్రమాదం ఉంది. ఎక్కువ గంటలు చెవులకు శబ్దం తగలడం వల్ల చెవిలోని నరాలు బలహీనపడతాయి. కొందరు తక్కువ సౌండ్ పెట్టుకుని   వింటున్నాము కదా అనుకుంటారు, కానీ రోజంతా లేదా రాత్రంతా చెవుల్లో ఆ పరికరాలు ఉంచుకోవడం వల్ల చెవి లోపల ఉండే సున్నితమైన భాగాలకు  నష్టం కలుగుతుంది. దీనివల్ల భవిష్యత్తులో వినికిడి సమస్యలు వచ్చే ముప్పు పెరుగుతుంది. మ్యూజిక్ వింటే ప్రశాంతంగా నిద్ర పడుతుందని అనుకుంటాం కానీ, రాత్రి అంతా పాటలు లేదా పాడ్‌కాస్ట్‌లు ప్లే అవుతూ ఉంటే  మెదడు పూర్తిగా విశ్రాంతి తీసుకోలేకపోతుంది. శబ్దాల కారణంగా మధ్యమధ్యలో నిద్రకు డిస్టర్బ్  కలుగుతుంది. దీనివల్ల ఉదయం లేచిన తర్వాత కూడా శరీరం అలసిపోయినట్లుగా , సుస్తీగా అనిపిస్తుంది. నిద్ర నాణ్యత దెబ్బతినడం వల్ల రోజంతా ఉత్సాహం లోపిస్తుంది. ఈ సమస్యలన్నింటి నుంచి సురక్షితంగా ఉండాలంటే కొన్ని చిన్న జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం... మీకు ఒకవేళ మ్యూజిక్ వింటూ నిద్రపోయే అలవాటు ఉంటే, పాటలు ఆటోమేటిక్‌గా ఆగిపోయేలా టైమర్ సెట్ చేసుకోవడం మంచిది. వీలైతే ఇయర్ బడ్స్‌కు బదులుగా తక్కువ సౌండ్‌తో రూమ్‌లో చిన్న స్పీకర్ ఉపయోగించవచ్చు.  ఇయర్ బడ్స్‌ను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి , అంతేకాదు  ఎవరితోనూ వాటిని షేర్ చేసుకోకూడదు. చెవుల్లో ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే వైద్య నిపుణుల సలహా తీసుకోవడం చాలా మంచిది.                                                                                                                                                *రూపశ్రీ.
షుగర్ వ్యాధి ఉన్నవారిలో కిడ్నీ సమస్యలు ఎందుకు వచ్చే అవకాశం ఉంది? రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ కాలం నియంత్రణలో లేకపోతే మూత్రపిండాల పనితీరుపై ఎలాంటి ప్రభావం పడుతుంది? కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాలను తెలుసుకోవడం ప్రతి డయాబెటిస్ పేషెంట్‌కు ఎంతో ముఖ్యం. ఈ TeluguOne Health వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ షుగర్ వ్యాధి, కిడ్నీల ఆరోగ్యం, సంప్రదాయ వైద్య విధానాల్లో ఉపయోగించే ఔషధ మొక్కల గురించి వివరిస్తారు. ముఖ్యంగా తెల్ల గలిజేరు అని పిలిచే పునర్నవ మొక్క, పల్లేరు గింజలు, పండ్ల సంప్రదాయ ఉపయోగాల గురించి తెలుసుకోవచ్చు. ఈ మూలికలను సంప్రదాయ వైద్యంలో ఎలా పరిగణిస్తారు, వాటిని ఉపయోగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు అవసరమో తెలుసుకోవచ్చు. డయాబెటిస్ వల్ల కిడ్నీలపై ఎలాంటి ప్రభావం పడవచ్చు? షుగర్ పేషెంట్లు మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? పునర్నవ (తెల్ల గలిజేరు) మొక్కకు సంప్రదాయ వైద్యంలో ఉన్న ప్రాధాన్యత ఏమిటి? పల్లేరు గింజలు, పండ్లను సంప్రదాయ వైద్య విధానాల్లో ఎలా ఉపయోగిస్తారు? మూలికలతో తయారుచేసే ఔషధాలను వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కిడ్నీ సమస్యలను ముందుగానే గుర్తించడానికి వైద్య పరీక్షలు ఎందుకు ముఖ్యం? వంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు కిడ్నీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం, వైద్యుల సూచనల ప్రకారం మందులు వాడటం, అవసరమైన కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. కిడ్నీ సమస్యలు ప్రారంభ దశలో ఉన్నప్పుడు స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. అందువల్ల క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. షుగర్ వ్యాధి ఉన్నవారు తమ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పునర్నవ మరియు పల్లేరు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ వివరణతో కూడిన ఈ TeluguOne Health వీడియోను పూర్తిగా చూడండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మూలికలు కిడ్నీ వ్యాధులను నయం చేస్తాయని నిర్ధారిత ఆధారాలు లేవు. వైద్యుల సూచన లేకుండా షుగర్ మందులను ఆపకండి లేదా మూలికలను వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించకండి.
ఆరోగ్యంగా ఉండాలని చాలామంది విటమిన్ సప్లిమెంట్లు, ఇతర మందులు వాడుతుంటారు. అయితే ఏ మందును ఎంత మోతాదులో తీసుకోవాలి? ఎన్ని రోజులు వాడాలి? ఇతర మందులతో కలిపి తీసుకోవచ్చా? అనే విషయాలు తెలుసుకోకుండా మందులు వాడితే అనవసరమైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా Vitamin D, Vitamin B12 వంటి సప్లిమెంట్లను వైద్యుల సూచనల మేరకు తీసుకోవడం ఎంతో ముఖ్యం. మందులు వాడేటప్పుడు చేసే చిన్న పొరపాట్లు కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. వైద్యులకు తమ ఆరోగ్య సమస్యలను పూర్తిగా చెప్పకపోవడం, వాడుతున్న మందుల వివరాలను తెలియజేయకపోవడం, సొంతంగా మందుల మోతాదును మార్చుకోవడం వంటి అలవాట్లు చికిత్సకు ఆటంకం కలిగించవచ్చు. ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవం (World Patient Safety Day) సందర్భంగా, రోగుల భద్రతకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను హోమియోపతి వైద్యులు డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఈ వీడియోలో వివరించారు. Vitamin D, B12 సప్లిమెంట్లు వాడేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? Vitamin D శరీరంలో కాల్షియం శోషణకు, ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైనది. Vitamin B12 నరాల పనితీరుకు, ఎర్ర రక్తకణాల తయారీకి అవసరం. ఈ విటమిన్ల లోపం ఉన్నప్పుడు వైద్యులు తగిన పరీక్షలు చేసి, అవసరాన్ని బట్టి సప్లిమెంట్లను సూచించవచ్చు. అయితే ఈ మందులను ఎక్కువ మోతాదులో తీసుకుంటే త్వరగా ఆరోగ్యం మెరుగుపడుతుందని భావించడం సరైంది కాదు. ముఖ్యంగా Vitamin D అధిక మోతాదులో తీసుకోవడం వల్ల రక్తంలో కాల్షియం స్థాయులు పెరిగి ఆరోగ్య సమస్యలు రావచ్చు. అందువల్ల వైద్యుల సలహా లేకుండా మోతాదును పెంచడం లేదా ఎక్కువకాలం కొనసాగించడం చేయకూడదు. వైద్యులకు మీ ఆరోగ్య సమస్యలను ఎందుకు పూర్తిగా చెప్పాలి? కొంతమంది తమకు ఉన్న లక్షణాలను, గతంలో ఎదురైన ఆరోగ్య సమస్యలను లేదా ప్రస్తుతం వాడుతున్న మందులను వైద్యులకు పూర్తిగా తెలియజేయరు. మరికొందరు ఇతరుల సలహాతో మందులు వాడుతుంటారు. ఇలాంటి వివరాలు దాచడం వల్ల సరైన చికిత్స నిర్ణయించడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీకు ఉన్న లక్షణాలు, అలర్జీలు, ఇప్పటికే వాడుతున్న మందులు, విటమిన్ సప్లిమెంట్లు, గతంలో తీసుకున్న చికిత్సల గురించి వైద్యులకు స్పష్టంగా చెప్పాలి. ఈ సమాచారం సరైన చికిత్స అందించడానికి, మందుల మధ్య అవాంఛిత ప్రతిచర్యల ప్రమాదాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మందుల మోతాదులో చేసే పొరపాట్లు ఎంత ప్రమాదకరం? వైద్యులు సూచించిన మోతాదు కంటే ఎక్కువగా లేదా తక్కువగా మందులు తీసుకోవడం, సమయానికి తీసుకోకపోవడం, ఒకరి మందులను మరొకరు వాడటం వంటి పొరపాట్లను నివారించాలి. మందుల పేర్లు, మోతాదు, తీసుకోవాల్సిన సమయం, వాడే కాలం గురించి స్పష్టత లేకపోతే వైద్యుడిని లేదా ఫార్మసిస్ట్‌ను అడిగి తెలుసుకోవాలి. మందుల వల్ల ఏవైనా అసాధారణ లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. వైద్యుల సలహా లేకుండా సూచించిన చికిత్సను నిలిపివేయడం లేదా మోతాదును మార్చడం కూడా సరికాదు. రోగుల భద్రతలో మన బాధ్యత ఏమిటి? రోగుల భద్రత అనేది వైద్యుల బాధ్యత మాత్రమే కాదు. రోగులు కూడా తమ ఆరోగ్యం గురించి అవగాహన కలిగి ఉండాలి. మందుల వివరాలను సరిచూసుకోవడం, వైద్యులు సూచించిన విధంగా వాడటం, సందేహాలు ఉంటే అడగడం, అవసరమైన పరీక్షలు చేయించుకోవడం వంటి అలవాట్లు చికిత్సను మరింత సురక్షితంగా మార్చడంలో సహాయపడతాయి. ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవం సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ కుమార్ అందించే ఈ వీడియోలో Vitamin D, Vitamin B12 మందుల వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్యులకు ఆరోగ్య వివరాలను చెప్పడం ఎందుకు అవసరం, మందుల మోతాదులో పొరపాట్లను ఎలా నివారించాలి, సురక్షితమైన చికిత్స కోసం రోగులు పాటించాల్సిన పద్ధతులు వంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి. గమనిక: ఈ సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా మందులు, విటమిన్ సప్లిమెంట్లు వాడేందుకు వైద్యులను సంప్రదించండి. వైద్యుల సూచన లేకుండా మందుల మోతాదును మార్చవద్దు.