LATEST NEWS
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది. మరో నెల రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని తన నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో పలు కీలక సూచనలు చేశారు.డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్లు అందించే వరకు ప్రతి దశలోనూ పూర్తి పారదర్శకత పాటించాలని మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న ఉపాధ్యాయ నియామక విధానాన్ని దేశవ్యాప్తంగా పరిశీలిస్తున్నారని, రాష్ట్ర విధానాలను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించే అవకాశం ఉందని తెలిపారు. పదో తరగతి ఫలితాలే లక్ష్యంగా ‘మిషన్ మార్చ్’.! పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ‘మిషన్ మార్చ్’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని లోకేష్ ఆదేశించారు. విద్యార్థుల ప్రగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, మెరుగైన ఫలితాల సాధనకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. డ్రాప్‌అవుట్స్ నివారణకు ప్రత్యేక కార్యాచరణ.! పాఠశాల విద్యకు దూరమవుతున్న పిల్లల సమస్యపై కూడా సమీక్షలో చర్చించారు. స్కూల్ డ్రాప్‌అవుట్స్ భవిష్యత్తులో డ్రగ్స్ వినియోగం సహా పలు సామాజిక సమస్యలకు దారితీసే అవకాశం ఉందని ఇటీవల తిరుపతి పర్యటనకు వచ్చిన సింగపూర్ హోం మంత్రి షణ్ముగం చేసిన వ్యాఖ్యలను లోకేష్ ప్రస్తావించారు. పిల్లలు చదువుకు దూరం కాకుండా కమ్యూనిటీ లీడర్లను భాగస్వాములను చేస్తూ ‘జీరో డ్రాప్ అవుట్ మిషన్’ చేపట్టాలని సూచించారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా ఇప్పటికే ‘డ్రగ్స్ వద్దు బ్రో’ వంటి కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఆదర్శంగా తీర్చిదిద్దిన నిడమర్రు పాఠశాలను సందర్శించేందుకు సింగపూర్ మంత్రి షణ్ముగంను త్వరలో ఆహ్వానిస్తామని వెల్లడించారు. 175 పాఠశాలలను ‘లీప్ స్కూల్స్‌’గా అభివృద్ధి.! రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుంచి ఒక పాఠశాలను ఎంపిక చేసి, మొత్తం 175 పాఠశాలలను ‘లీప్ స్కూల్స్‌’గా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ పాఠశాలల అభివృద్ధికి అవసరమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు.! రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలో ఖాళీగా ఉన్న 1,523 అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని లోకేష్ ఆదేశించారు. ఈ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ పూర్తయిందని ఉన్నత విద్య డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తా తెలిపారు. డిసెంబర్‌లో రాత పరీక్ష నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో క్యాంపస్‌ల ఏర్పాటుకు ప్రముఖ వర్సిటీల ఆసక్తి.! ఆంధ్రప్రదేశ్‌లో క్యాంపస్‌లు ఏర్పాటు చేసేందుకు జేఎస్ఎస్ యూనివర్సిటీ, థాపర్ యూనివర్సిటీ, యూపీఈఎస్, జేయూఎస్ యూనివర్సిటీ, బెన్నెట్ యూనివర్సిటీ, సవిత యూనివర్సిటీ తదితర విద్యాసంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు అధికారులు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలు క్యాంపస్‌ల ఏర్పాటుకు అవసరమైన భూమిని గుర్తించాలని మంత్రి సూచించారు. నిర్మాణ పనులు త్వరగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో అమలవుతున్న ‘సాల్ట్’ (Supporting Andhra's Learning Transformation) కార్యక్రమంపై కూడా మంత్రి సమీక్ష నిర్వహించారు. తొలి దశ కార్యక్రమం డిసెంబర్ నాటికి పూర్తికానున్న నేపథ్యంలో రెండో దశ అమలుకు అవసరమైన చర్యలను ఇప్పటి నుంచే చేపట్టాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 125 ప్రాంతాల్లో ఆటిజం సెంటర్ల ఏర్పాటును వేగవంతం చేయాలని లోకేష్ ఆదేశించారు. తొలిదశలో 21 ఆటిజం సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన కౌన్సిలర్లను గుర్తించినట్లు సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు తెలిపారు. ఆటిజం, భవిత సెంటర్లు సాధ్యమైనంత వరకు ఒకే ప్రాంతంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఈ నెలాఖరులోగా 14 సెంటర్ల సివిల్ నిర్మాణ పనులు పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు. విశాఖలో ప్రతిష్టాత్మక గ్రంథాలయం.! ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో విశాఖపట్నంలో ప్రతిష్టాత్మక గ్రంథాలయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పబ్లిక్ లైబ్రరీ శాఖ భాగస్వామ్యంతో నిర్మించనున్న ఈ గ్రంథాలయానికి సంబంధించి రూపొందించిన పలు నమూనాలను మంత్రి నారా లోకేష్ పరిశీలించారు.       [ Nara Lokesh, AP DSC 2.0 Notification, DSC Recruitment 2026, Andhra Pradesh Education Department, Mission March, Class 10 Public Exams, Zero Dropout Mission, Leap Schools, Teacher Recruitment, AP Education News ]
హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలోని జోన్లు, డివిజన్లు, పోలీస్‌స్టేషన్ల పరిధులను ప్రభుత్వం పునర్విభజించింది. మొత్తం 76 ప్రాంతాలకు సంబంధించి పరిధుల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఉన్న ప్రాంతాలను ఇతర జోన్లు, డివిజన్లకు బదిలీ చేశారు. ముఖ్యంగా మార్కెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కొన్ని ప్రాంతాలను మల్కాజిగిరి కమిషనరేట్‌ పరిధిలోకి మార్చారు. శంషాబాద్‌, మహేశ్వరం, సైబరాబాద్‌ పరిధుల్లోనూ కీలక మార్పులు చేశారు. శంషాబాద్‌ డివిజన్‌లోని పోలీస్‌స్టేషన్ల పరిధులను సైతం పునర్వ్యవస్థీకరించారు.  ఇందులో భాగంగా ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌ పేరును శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌గా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆర్‌జీఐఏ, శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్ల పరిధుల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి.ఇక రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పలు ప్రాంతాలను ఇతర పోలీస్‌స్టేషన్ల పరిధుల్లోకి మార్చారు. అబ్దుల్లాపూర్‌మెట్‌, మీర్‌పేట్‌ ప్రాంతాల్లోనూ పోలీస్‌ పరిధులను పునర్విభజించారు. నగరంలోని ప్రధాన ప్రాంతాలైన జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, సనత్‌నగర్‌ పరిధుల్లోనూ పోలీస్‌స్టేషన్ల సరిహద్దులను సవరించారు. ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులు, పరిపాలనా అవసరాలకు అనుగుణంగా పరిధులను మార్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సాధారణ పోలీస్‌స్టేషన్లకే పరిమితం కాకుండా ట్రాఫిక్‌ పోలీస్‌ విభాగంలోనూ జోన్లు, డివిజన్లను పునర్వ్యవస్థీకరించారు. మహిళల భద్రతకు సంబంధించిన వుమెన్‌ సేఫ్టీ వింగ్‌ పరిధిలోనూ కొత్తగా జోన్లను కేటాయించారు.అదేవిధంగా పెరుగుతున్న సైబర్‌ నేరాలను దృష్టిలో ఉంచుకుని జోనల్‌ సైబర్‌ సెల్‌ పరిధులను కూడా ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. మొత్తంగా నగర పోలీస్‌ వ్యవస్థలోని వివిధ విభాగాలు, జోన్లు, డివిజన్లు, పోలీస్‌స్టేషన్ల పరిధుల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం G.O.Ms.No.84 జారీ చేసింది. తాజా పునర్వ్యవస్థీకరణతో పోలీస్‌ పరిపాలనను మరింత సులభతరం చేయడంతో పాటు ఆయా ప్రాంతాల్లో పోలీసింగ్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు మార్గం సుగమం కానుంది.     [ Hyderabad Police Commissionerate, .Shamshabad, Maheshwaram, Cyberabad, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand, Hyderabad police, Telugu One, Telugu News ]
దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 2024 నుంచి పెండింగ్‌లో ఉన్న కరవు భత్యాల్లో (డీఏ) రెండింటిని మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా సుమారు రూ.2,500 కోట్ల అదనపు భారం పడుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. కేబినెట్‌ సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌ మీడియాకు మంత్రివర్గ నిర్ణయాలను వివరించారు. 1. ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు డీఏలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు రెండు డీఏలు మంజూరు చేసేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2024 నుంచి పెండింగ్‌లో ఉన్న డీఏల్లో రెండింటిని వెంటనే మంజూరు చేయాలని నిర్ణయించింది. బకాయిలను విడతల వారీగా చెల్లించనున్నారు. ఉద్యోగ సంఘాలతో ఇటీవల జరిగిన చర్చల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై ఏటా సుమారు రూ.2,500 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుంది. 2. ఎల్‌నినో, కరువు పరిస్థితులపై సమీక్ష. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. ఈ వానాకాలంలో సుమారు 17 శాతం వర్షపాతం లోటు నమోదైందని, దాదాపు 235 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ప్రభుత్వం పేర్కొంది. కరువు ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన తక్షణ ఉపశమన చర్యలపై కేబినెట్‌ సబ్‌ కమిటీలో చర్చించాలని నిర్ణయించింది. త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతు సంఘాలు, వివిధ రంగాల నిపుణులతో సమావేశాలు ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. కరువు మండలాల ప్రకటనతో పాటు రాష్ట్రానికి తగిన సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని కేబినెట్‌ నిర్ణయించింది. రాష్ట్ర పరిస్థితులను వివరించేందుకు త్వరలో మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లనుంది. 3. ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు. ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. త్వరలోనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. ఈ సీజన్‌లో సుమారు 65 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. 4. విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా. రాష్ట్రంలో పెరిగిన విద్యుత్‌ వినియోగంపై మంత్రివర్గం ప్రత్యేకంగా చర్చించింది. సాధారణంగా రోజువారీ విద్యుత్‌ వినియోగం సుమారు 15 వేల మెగావాట్లుగా ఉండగా, ఈ సీజన్‌లో గరిష్ఠ డిమాండ్‌ 19,892 మెగావాట్లకు చేరిందని ప్రభుత్వం వెల్లడించింది. గత ఏడాది నమోదైన గరిష్ఠ డిమాండ్‌ 16,613 మెగావాట్లుగా ఉంది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని కేబినెట్‌ నిర్ణయించింది. రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్‌ కోతలు లేకుండా అవసరమైన విద్యుత్‌ను సమకూర్చుకోవాలని, అవసరమైన మేరకు కొనుగోలు చేయాలని సూచించింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని సుమారు 7,800 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త విద్యుత్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేసే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఇందులో 3,000 మెగావాట్ల సౌర విద్యుత్‌, 4,000 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌, 800 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా బిడ్డింగ్‌ విధానంలో ఈ ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించింది. 5. కోహెడలో ప్రపంచస్థాయి పండ్ల మార్కెట్‌. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కోహెడలో ప్రపంచస్థాయి సమగ్ర పండ్ల మార్కెట్‌ ఏర్పాటును వేగవంతం చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఈ మార్కెట్‌ను పూర్తిగా ప్రభుత్వ నిధులతో నిర్మించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. 6. పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టులపై కీలక నిర్ణయం. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పునఃసమీక్షించాలని మంత్రివర్గం నిర్ణయించింది. గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈపీసీ విధానంలో చేపట్టి అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను రద్దు చేసే అంశంపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఇందులో భాగంగా 10 ఈపీసీ సాగునీటి ప్రాజెక్టులను నిలిపివేసేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 7. డిజిటల్‌ మీడియా ప్రకటనలకు ప్రత్యేక పాలసీ. తెలంగాణలో డిజిటల్‌ మీడియా ప్రకటనల కోసం ప్రత్యేక విధానాన్ని అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ రూపొందించిన డిజిటల్‌ అడ్వర్టైజ్‌మెంట్‌ పాలసీకి అనుగుణంగా రాష్ట్రంలోనూ ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఆమోదం తెలిపింది. 8. ఢిల్లీలో తెలంగాణ భవన్‌కు అదనపు సిబ్బంది. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్‌ పోస్టు మంజూరుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఢిల్లీలో విధులు నిర్వహించేందుకు మరో నలుగురు గ్రూప్‌-1 అధికారులను నియమించాలని నిర్ణయించింది.మొత్తంగా ఉద్యోగుల డీఏల నుంచి కరువు పరిస్థితులు, ధాన్యం కొనుగోళ్లు, విద్యుత్‌ సరఫరా, సాగునీటి ప్రాజెక్టులు, డిజిటల్‌ మీడియా పాలసీ వరకు పలు కీలక అంశాలపై తెలంగాణ మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంది.     [ Telangana Cabinet Decisions, Telangana Government Employees DA Hike, Two DA Approvals, CM Revanth Reddy, Telangana Cabinet Meeting October 1, Government Employees DA, Pensioners Dearness Relief, Ponguleti Srinivas Reddy, Telangana Drought Conditions ]
 ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల కదలికలు, అధికార పక్షం అనుసరిస్తున్న విధానాలు రాష్ట్ర రాజకీయాలను నిత్యం వేడెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్న నూతన రాజకీయ వ్యూహాలు, ఆయన అడుగులు ఏ విధంగా మారుతున్నాయనే అంశంపై రాష్ట్ర రాజకీయ విశ్లేషకులు తీవ్రంగా చర్చిస్తున్నారు. వాస్తవ వేదిక కార్యక్రమంలో తెలుగు వన్ ఎండీ కంఠమనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకులు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని పలు ఆసక్తికర అంశాలపై చర్చించారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే, ఎన్నికల ఫలితాల తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  దాని అధినేత జగన్  తమ ఉనికిని కాపాడుకోవడానికి, ప్రజల్లో నిత్యం ఉండేందుకు వినూత్న మార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే, పార్టీ శ్రేణుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు నాయకత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తోంది. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ప్రజాక్షేత్రంలో గళం విప్పేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. మరోవైపు, ప్రభుత్వ పథకాల అమలుతీరు, ఎన్నికల హామీల వైఫల్యాలపై ప్రజలను చైతన్యవంతం చేయడమే లక్ష్యంగా వైఎస్సార్‌‌సీపీ అడుగులు వేస్తోంది. జగన్  ప్రవేశపెడుతున్న ఈ కొత్త స్కెచ్ వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉంది. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేయడం, సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, ప్రజలతో నేరుగా మమేకమయ్యే కార్యక్రమాలను రూపొందించడం ఈ వ్యూహంలో ప్రధాన భాగాలు. ఎన్నికల ఫలితాల ద్వారా వచ్చిన రాజకీయ వెనకడుగును అధిగమించడానికి, నాయకత్వ శైలిలోనూ, ప్రజా సమస్యల స్పందనలోనూ మార్పులు తీసుకువస్తున్నారు. ఈ వ్యూహం వల్ల పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నిండినప్పటికీ, అధికార పక్షం నుంచి వచ్చే ప్రతిఘటనను సమర్థవంతంగా ఎదుర్కొనే సవాలు కూడా జగన్ ఎదుట నిలిచింది. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయడం ద్వారా మళ్లీ ప్రజల్లో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని పార్టీ భావిస్తోంది. ఈ రాజకీయ పరిణామాలు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. రానున్న కాలంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉంది. జగన్ అనుసరిస్తున్న కొత్త రాజకీయ వ్యూహాలు ఫలితమిస్తే, అది రాష్ట్రంలో బలమైన ద్విముఖ పోరుకు దారితీసే అవకాశం ఉంది. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడడం ద్వారా అధికార పార్టీని ఇరుకున పెట్టడంలో ఈ వ్యూహాలు ఎంతవరకు విజయవంతమవుతాయనేది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనప్పటికీ, ఈ రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల లేదా భవిష్యత్ ఎన్నికలపై గణనీయమైన ముద్ర వేయడం ఖాయం.     [ Vasthava Vedika, Kanthamaneni Ravi Shankar, Dolendra Prasad, TOne News, Telugu one, YSJagan, CM Chandrababu, Naralokesh, YSRCP, TDP,  Telugu One, Telugu News ]
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకవైపు ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అనర్హతతో నియోజకవర్గం ఖాళీ కాగా.. మరోవైపు ఉపఎన్నిక నోటిఫికేషన్‌ విషయంలో హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఖైరతాబాద్‌ ఉపఎన్నికకు సంబంధించి కాంగ్రెస్‌ నేత పి. విజయారెడ్డి దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ తుది పరిష్కారం అయ్యే వరకు ఉపఎన్నిక నోటిఫికేషన్‌ జారీ చేయబోమని భారత ఎన్నికల సంఘం (ECI) హైకోర్టుకు తెలిపింది. విజయారెడ్డి 2024లోనే దానం నాగేందర్‌ ఎన్నికను సవాల్‌ చేస్తూ ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నుంచి దానం నాగేందర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గెలిచారు.  అనంతరం ఆయన కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ ఫిరాయింపుపై దాఖలైన పిటిషన్ల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్‌ 18న దానం నాగేందర్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించింది. ఆ తర్వాత ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడింది. దానం నాగేందర్‌ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేసినప్పటికీ.. సెప్టెంబర్‌ 24న ఆయన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.  దీంతో ఖైరతాబాద్‌కు ఉపఎన్నిక జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో 2024లో దానం నాగేందర్‌ ఎన్నికను సవాల్‌ చేస్తూ తాను దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ తుది తీర్పు వచ్చే వరకు ఉపఎన్నిక నోటిఫికేషన్‌ ఇవ్వకుండా ఈసీఐని ఆదేశించాలని విజయారెడ్డి తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఎలక్షన్‌ పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నందున ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక నిర్వహించబోమని ఈసీఐ హైకోర్టుకు తెలిపింది. ఇప్పుడు ఈ పిటిషన్‌పై హైకోర్టు తీసుకునే నిర్ణయం కీలకంగా మారింది. కోర్టు విచారణ నేపథ్యంలో ఖైరతాబాద్‌ ఉపఎన్నిక నోటిఫికేషన్‌ ఎప్పుడు వెలువడుతుందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. దీంతో ఖైరతాబాద్‌ ఉపఎన్నికపై రాజకీయ ఆసక్తితో పాటు న్యాయపరమైన ఉత్కంఠ కూడా కొనసాగుతోంది.       [ Khairatabad by-election notification, Telangana High Court, Danam Nagender, Election Commission, Vijaya Reddy, CM Revanth reddy, BRS Party, KTR, Telugu One, Telugu News ]
ALSO ON TELUGUONE N E W S
నటీనటులు: హర్ష్ రోషన్, నక్షత్ర, అజయ్, శరణ్య, రాజ్‌కుమార్ కసిరెడ్డి సాంకేతిక బృందం: రచన: నందు సవిరిగాన సంగీతం: విజయ్ బుల్గానిన్ సినిమాటోగ్రఫీ: కె.వి. గుహన్ ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ దర్శకత్వం: రమేష్ బండిరెడ్డి నిర్మాత: కృష్ణ కొమ్మలపాటి   హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటించిన తెల్ల కాగితం ( Thella Kaagitham) సినిమా లీకైన ఇంటిమేట్ సీన్, ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్ థీమ్‌తో భారీ బజ్ క్రియేట్ చేసింది. ఈ రోజు విడుదలైన ఈ యువతరం చిత్రం, తెరపై ఈ కథాంశాన్ని ఎలా ఆవిష్కరించిందో వివరంగా చూద్దాం.   కథ: రాము (Harsh Roshan) తన క్లాస్‌మేట్ ఆశా (Nakshatra)తో ప్రేమలో పడతాడు. మొదట ఆమె అంగీకరించకపోయినా, అతని ప్రయత్నాలతో ప్రేమలో పడుతుంది. ఒకరోజు వారు శారీరకంగా దగ్గరవుతారు. ఆ తర్వాత ఆమె గర్భం దాల్చిందనే ఆందోళన మొదలవుతుంది. అది నిజమని తెలిశాక, ఈ విషయాన్ని తల్లిదండ్రుల నుంచి దాచడానికి ఇద్దరూ పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఆ తర్వాత ఏం జరిగింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.   విశ్లేషణ: అమాయక యువకుడి పాత్రలో హర్ష్ రోషన్ నటన బాగుంది. అయితే, ఇలాంటి సున్నితమైన సినిమాల్లో ఉండే రెగ్యులర్ టెంప్లేట్ కారణంగా, అతను కొత్తగా చేయడానికి ఏమీ లేదు. అయినా తన వంతు న్యాయం చేశాడు.  నక్షత్ర బాగానే చేసినా, సెకండాఫ్‌లో ఆమె పాత్ర కేవలం భయపడటం, ఏడవడంకే పరిమితమైంది. అజయ్, శరణ్య పాత్రలు పెద్దగా ప్రభావం చూపలేదు. సినిమా సింపుల్‌గా సాగినంత సేపు బాగానే అనిపిస్తుంది. యువతీయువకుల మధ్య ఉండే పరిపక్వత లేని ప్రేమను ఫస్ట్ హాఫ్‌లో చక్కగా చూపించారు. కానీ, సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి కొత్తదనం లోపించి కథ సాగదీసినట్లు అనిపిస్తుంది. అనవసరమైన మెలోడ్రామా తగ్గించి ఉంటే సినిమా ఇంకాస్త మెరుగ్గా ఉండేది.  కథను సులభంగా ఊహించగలగడం పెద్ద మైనస్, కానీ ఫస్ట్ హాఫ్ కాస్త ఎంగేజింగ్‌గా ఉంటుంది. సంగీతం, ఎడిటింగ్ ఇంకా బాగుండాల్సింది. కొన్ని చోట్ల సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. మొత్తంగా, సాగదీసిన మెలోడ్రామా సినిమాకే ప్రతికూలంగా మారింది.   ప్లస్ పాయింట్స్: హర్ష్ రోషన్, నక్షత్ర మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకునే ఫస్ట్ హాఫ్ సామాజిక సందేశం రెండు పాటలు   మైనస్ పాయింట్స్: కొత్తదనం లేని కథ  నెమ్మదిగా సాగే కథనం మోతాదు మించిన మెలోడ్రామా  సెకండాఫ్ క్రైసిస్‌లో సాగతీత చప్ప గా సాగే క్లైమాక్స్   చివరి గా: నిర్ణయం తీసుకోలేని వయసు తొందరపాటు తెచ్చే సందిగ్ధతపై ఒక తెల్ల కాగితం, కానీ మరీ సాగదీశారు.   రేటింగ్: 2.5/5   గమనిక: ఈ రివ్యూలో వ్యక్తపరిచిన అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతమైనవి. వీటికి సంస్థకు ఎలాంటి బాధ్యత లేదు. పాఠకులు తమ విచక్షణతో వ్యవహరించగలరు.
Cast: Harsh Roshan, Nakshatra, Ajay, Saranya, Rajkumar Kasireddy  Crew:  Written by Nandu Savirgana  Music by Vijai Bulganin  Cinematography by KV Guhan  Editing by Karthika Srinivas  Directed by Ramesh Bandireddy  Produced by Krishna Kommalapati    Thella Kaagitham starring Harsh Roshan and Nakshatra got a huge buzz with viral leak intimate scene and Inter College students theme. The movie released today and being about young-adults, let's see how the movie deals with this theme on screen, in detail.    Plot:  Ramu (Harsh Roshan) falls in love with his classmate Asha (Nakshatra). She doesn't love him at first but his pursuit convinces her to fall for him. One day, they get intimate and now, they are worried about her pregnancy. When it is confirmed, he and she try everything to hide it from parents. What happens next? Watch the movie to know more.    Analysis:  Harsh Roshan is decent in this role and his performance as a young-adult is apt. But there is nothing new for him to perform well in the movie that follows regular template in such sensitive movies. Still, he did his best.  Nakshatra is good but her character did not get enough variety as it feels like she had only few emotions in the second half, either fear or cry. Ajay and Saranya did not roles that leave an impact.  Thella Kaagitham works when it tries to keep it simple and easy. The romance portions featuring two young-adults are written to represent such immaturity. Hence, those portions appeal but when the second hour losses the novelty. It feels similar and dragged to death.  The portions might have worked better had the things been simplified and not went too much into melodrama. Predictability factor also harms the film big time but the first hour's novelty makes it enjoyable to an extent. Music and editing could have been better while cinematography in some portions is very good. Overall, movie undermines its own narrative with over stretched melodrama.    Positives:  Harsh Roshan and Nakshatra chemistry  Enjoyable first hour  Social message Two songs    Negatives:  Predictable story  Lethargic narrative  Over dependency on melodrama  No innovation in second hour crisis  Over stretched mid-portions and pre-climax    Bottomline: A white paper on indecisiveness but drags too much.    Rating: 2.5/5    Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
-సినిమా పేరు: డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ -న‌టీన‌టులు: ఫాహద్ ఫాజిల్, సారా ఫాలేకర్, సౌరబ్ సచ్ దేవ్, మహేష్ మంజ్రేకర్, సుబ్బరాజు తదితరులు  -సినిమాటోగ్ర‌ఫీ: బ్రాడ్ ఫ్రాన్సిస్  -ఎడిటింగ్: ప్రవీణ్ ఆంటోనీ -మ్యూజిక్: కాళభైరవ  -నిర్మాత‌లు: ఎస్ ఎస్ కార్తికేయ, శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ -బ్యానర్స్: ఆర్కా మీడియా వర్క్స్ , షోయింగ్ బిజినెస్  -సమర్పణ: ఎస్ ఎస్ రాజమౌళి -రచన,దర్శకత్వం: శశాంక్ యేలేటి  -రిలీజ్ డేట్ : అక్టోబర్ 2 ,2026  స్టార్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్, రాజమౌళి, రాజమౌళి తనయుడు కార్తికేయ, బాహుబలి నిర్మాతలు కలిసి 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' తో థియేటర్స్ లో అడుగుపెట్టారు. ఎన్టీఆర్, మహేష్ బాబు ల మెప్పు సైతం పొందిన డోంట్ ట్రబుల్ కి  ఈ రోజు మేకర్స్  ప్రీమియర్స్ కూడా ప్రదర్శించారు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ దివ్య( సారా ఫాలేకర్) అతీంద్రియ శక్తులు కలిగి ఉన్న పాప. బాగా డబ్బున్న ఫ్యామిలీ. తన శక్తి ఎలాంటిదంటే వెళ్తున్న మెట్రో రైలు సైతం ఒక పిడుగుపడినట్టుగా 1000 వాల్ట్ ల విద్యుత్ ప్రవాహంతో పెను విపత్తు సంభవించి  ఆగిపోవాల్సిందే..సూరి (ఫాహద్ ఫాజిల్) అంబులెన్స్  డ్రైవర్..బాగా డబ్బు పిచ్చి ఉన్న వ్యక్తి. అలా అని  చెడ్డ వ్యక్తి కాదు కానీ డబ్బు  కోసం ఏమైనా చేసే నైజం. సింపుల్ గా చెప్పాలంటే చిన్న సైజు స్వార్దపరుడు.   అలాంటి సూరి దగ్గరకి దివ్య వచ్చి  మా అమ్మ, నాన్నని నేను మ్యాజిక్ చేసి మాయం చేశాను. మా అమ్మ, నాన్నని  నువ్వు తీసుకురాలని అంటుంది. అందుకు సూర్య ఒప్పుకుంటాడు. దివ్య చెప్పేది నిజమేనా!..తన శక్తులు వెనుక ఉన్న కథ ఏంటి? సూరి ఎందుకు ఒప్పుకున్నాడు? అసలు సూరి దగ్గరకే ఎందుకు వచ్చింది? ఆ ఇద్దరి ట్రావెల్ లో ఏం జరిగిందనేదే  డోంట్ ట్రబుల్ గోల ది ట్రబుల్. ఎనాలసిస్  సినిమా స్టార్టింగ్ పది నిమిషాలు పాటు మామూలుగానే ఉన్నా, కథలోకి వెళ్లేకొద్దీ మంచి  సీన్స్ వచ్చాయి. కాకపోతే నెక్స్ట్ ఏం  జరుగుతుందో  ముందుగానే ఊహించేస్తాం. కథకి కీలమైన  బలమైన సన్నివేశాలని సింపుల్ గా తేల్చేసారు. ఆ విధంగా కాకుండా బలమైన సన్నివేశాలపై మరింత ఇంట్రెస్ట్ గా సీన్స్ పుట్టించాల్సింది. ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే దివ్య, సూరి, మధ్య వచ్చిన అన్ని సీన్స్ బాగున్నాయి. సూరి, ఓల్డ్ సిటీ లోని డాన్ అస్లాం మధ్య వచ్చిన సీన్స్ మాత్రం రొటీన్. ఫ్రెండ్ తో  వచ్చిన సీన్స్  కూడా అంతే ఇంటర్వెల్ తో పాటు ముందు వచ్చిన సుమారు 20 నిమిషాల ట్రాక్ అయితే అదిరిపోయింది. సెకండ్ హాఫ్ లో చూసుకుంటే సీన్స్ పరంగా చెప్పుకోవడానికి ఏమి ఉండవు. అస్లాం తో దివ్య, సూరి ఫైట్ చేసే ఎపిసోడ్ ని వేరేలా ప్లాన్ చేసి ఉండాల్సింది.ఎందుకంటే అలాంటి సీన్స్ చాలా సినిమాల్లో చూసేసాం. దివ్యని అల్లా ఉద్దీన్ అద్భుత దీపం లా ఉపయోంచాలనుకునే సూరి థాట్ ని మరింత విసృత పరిచి ఎంటర్ టైన్ మెంట్ ని సృష్టించాల్సింది. . దివ్యకి తన ప్రాబ్లమ్ తెలిసినప్పుడు మామూలుగానే ఫీల్ అవుతుంది. అలా కాకుండా  తనకున్న ప్రాబ్లెమ్ సాల్వ్ చెయ్యమని సూరిని కోరితే ఫీల్ అయినా వచ్చేదేమో. ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ బాగున్నా, మనం ఆ ఇద్దరినీ ఓన్ చేసుకునేలా స్క్రీన్ ప్లే మ్యాజిక్ ని పండించలేకపోయారు. నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు  సూరిగా ఫాహద్ ఫాజిల్ సూపర్ గా చేసాడు. తన 'ఆరా' మూవీ చివరి వరకు ఏ మాత్రం తగ్గకుండా సూరి నే మనతో ఉన్నాడనేలా క్యారక్టర్ లో జీవించి పడేసాడు. దివ్యగా సారా ఫాలేకర్ సైతం ఒక రేంజ్ పెర్ఫార్మ్ చేసింది. ఎంతలా అంటే ముందు ముందు ఎలాంటి సినిమాలో అయినా పాప పెర్ఫార్మ్ వస్తే తనే గుర్తుకొస్తుంది. మిగతా క్యారెక్టర్స్ లో చేసిన సౌరబ్ సచ్ దేవ్, మహేష్ మంజ్రేకర్, సుబ్బరాజు  తమ క్యారెక్టర్స్ పరిధి మేరకు సూపర్ గా చేసారు. ముఖ్యంగా సౌరబ్ సచ్ దేవ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఒక రేంజ్ లో ఉంది. తనే ముసలి బాబాగా కూడా చేసి మెప్పించాడు.  శశాంక్ యేలేటి రచన పరంగాను, దర్శకత్వం పరంగాను పర్వాలేదనిపించాడు. డైలాగ్స్  సో సో.బ్రాడ్ ఫ్రాన్సిస్ ఫొటోగ్రఫీ కాళభైరవ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నిర్మణ విలువలు మాత్రం సూపర్.  బలాలు  ఫాహద్ పెర్ఫార్మెన్స్  సారా ఫాలేకర్ ప్రొడక్షన్ వాల్యూస్  బ్యాక్ గ్రౌండ్ స్కోర్  బలహీనతలు  స్క్రీన్ ప్లే బలంగా లేకపోవడం నెక్స్ట్ ఏం జరుగుతుందనేది మనకి ముందే తెలిసిపోతుండటం చివరిగా చెప్పాలంటే కొత్తగాలేదు..క్వాలిటీ గా ఉంది                                                                                                                                                      రేటింగ్ 2 .75 /5                                                                                                                                                               అరుణాచలం 
Actress and producer Amala Akkineni launched S.S. Krishna Kiriti’s debut novel Shiva Rupaya Vishnave: Part One – The Warhorse and The Dancer at an event held at Annapurna Studios, Hyderabad, on September 30. The launch was attended by students and alumni of Annapurna International School of Film and Media, where Krishna Kiriti is an alumnus. Published by Mayasabha Publications, Shiva Rupaya Vishnave: Part One – The Warhorse and The Dancer is the opening volume of a planned trilogy that explores faith, memory, political power, loyalty, betrayal and the human consequences of belief against the backdrop of South Indian history. The story begins three years after a war, with Emperor Sri Krishna Devaraya returning to a prosperous Vijayanagara. Unable to escape the weight of his memories despite trying conventional remedies, he encounters a dancer from Kuchipudi who offers him an unusual cure — a story. The narrative then moves backwards through nearly eight centuries, connecting the lives of kings, warriors, sculptors, philosophers, priests, dancers and ordinary people whose choices eventually contribute to the creation of a God. A distinctive feature of the novel is its reverse-chronological narrative, with the trilogy beginning with consequences and gradually moving towards the origins of the story. Written in English but deeply rooted in Telugu cultural and historical traditions, the book combines historical fiction, mythology, literary fiction and philosophical inquiry. The book also features an original song written by Krishna Kiriti, composed by Mani Sharma and sung by the late S.P. Balasubrahmanyam, which readers can access through a QR code inside the novel. Krishna Kiriti holds a Master's degree in Film and Media from Annapurna International School of Film and Media and has worked as a writer and assistant director in Telugu cinema. Shiva Rupaya Vishnave: Part One – The Warhorse and The Dancer marks his first novel and the beginning of the planned trilogy. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, ఆయన ప్రేయసి, నటి-సింగర్ సబా ఆజాద్ తమ సంబంధంలో మరొక అద్భుతమైన మైలురాయిని చేరుకున్నారు. 2026 అక్టోబర్ 1వ తేదీన ఈ  జంట కలిసి ఐదేళ్ల బంధాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని హృతిక్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని మధురమైన, మునుపెన్నడూ చూడని వెకేషన్ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. "ఇది మన బర్త్‌డే.. హ్యాపీ 5త్ మై లవ్" అంటూ అత్యంత ప్రేమపూర్వక శీర్షికను జోడించి సబాపై ఉన్న ప్రేమాభిమానాన్ని వ్యక్తపరిచారు. విమానంలో పైలట్ హెడ్‌సెట్‌లతో దిగిన క్యాజువల్ సెల్ఫీ, సముద్రపు ఒడ్డున సూర్యాస్తమయం వేళ పక్కపక్కనే నిలబడిన అందమైన జ్ఞాపకాలు వీరిద్దరి మధ్య ఉన్న గాఢమైన అనుబంధాన్ని ప్రతిబింబిస్తున్నాయి. వీరిద్దరి ప్రేమ ప్రయాణం 2021 చివరలో ప్రారంభమైనప్పటికీ, 2022లో ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ 50వ జన్మదిన వేడుకలకు ఇద్దరూ చేతిలో చెయ్యి వేసి హాజరవ్వడంతో వీరి ప్రేమ వ్యవహారం ప్రపంచానికి అధికారికంగా తెలిసింది. 1974 జనవరి 10న జన్మించిన 52 ఏళ్ల హృతిక్, 1985 నవంబర్ 1న జన్మించిన 40 ఏళ్ల సబా ఆజాద్‌ ల మధ్య దాదాపు 12 ఏళ్ల వయస్సు వ్యత్యాసం ఉంది. వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, నిజమైన ప్రేమకు భావాలు, అర్థం చేసుకునే మనసే ముఖ్యమని వీరు నిరూపించారు.2000 సంవత్సరంలో సుసాన్ ఖాన్‌ను వివాహం చేసుకుని, 14 ఏళ్ల సుదీర్ఘ బంధం తర్వాత 2014లో విడాకులు తీసుకున్న హృతిక్, ఆమెతో ఇద్దరు కుమారులు హ్రేహాన్, హ్రిదాన్‌లను పంచుకుంటున్నారు. అయితే వీరి గతం వీరి ప్రస్తుత ఆనందానికి ఏమాత్రం అడ్డంకిగా మారలేదు. హృతిక్ మాజీ భార్య సుసాన్ ఖాన్ కూడా ఈ ముచ్చటైన జంటను అభినందిస్తూ "సో స్వీట్, హ్యాపీ యానివర్సరీ" అంటూ హృదయపూర్వక కామెంట్ చెయ్యడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సబా సైతం రోషన్ కుటుంబంలో ఒకరిగా మారిపోయి, పండుగలు, కుటుంబ వేడుకలు మరియు ఫ్యామిలీ డిన్నర్లలో క్రమం తప్పకుండా పాల్గొంటోంది.        ఇది కూడా చదవండి: అశ్లీల సన్నివేశాలు: అమలాపాల్ షాకింగ్ కామెంట్స్.. ఎవరి కోసం!  కెరీర్ విషయానికి వస్తే, హృతిక్ రోషన్ ఇటీవల ఎన్టీఆర్, కియారా అద్వానీలతో కలిసి భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'వార్ 2'లో కబీర్ ధలివాల్ పాత్రలో నటించి ఆకట్టుకోగా, అలియా భట్ 'ఆల్ఫా'లో అతిథి పాత్రలో మెరిసారు. సబా ఆజాద్ కూడా అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన 'బందార్' చిత్రంలో మరియు సంగీత ప్రపంచంలో తన సత్తా చాటుతోంది. ఐదేళ్లుగా నిలకడగా, అప్యాయంగా సాగుతున్న ఈ ప్రయాణం రాబోయే రోజుల్లో వివాహ బంధంగా మారుతుందేమోనని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.   [Hrithik Roshan Saba Azad celebrate Five Years Together,Hrithik Roshan, Saba Azad, Bollywood, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]  
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో నాయక్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలతో' వంటి చిత్రాల్లో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న భామ అమలాపాల్.దీంతో ఆమె పేరు చెప్పగానే మెమొరీబుల్ సినీ మూమెంట్స్ గుర్తుకొస్తాయి.  ఇక తను  2019వ సంవత్సరంలో వచ్చిన ‘ఆడై’ (తెలుగులో ‘ఆమె’) చిత్రం ద్వారా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద సంచలనమే సృష్టించారు. రత్నకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమలాపాల్ కామిని అనే టీవీ జర్నలిస్ట్ పాత్రలో కనిపించి, ఎవరూ చేయని విభిన్నమైన సాహసాన్ని చేశారు. అయితే, తాజాగా ఈ సినిమాలో తాను చేసిన రిస్కీ నగ్న ఘట్టాల చిత్రీకరణ గురించి, ఆ సమయంలో పడ్డ భయాల గురించి అమలాపాల్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.   ముఖ్యంగా ఈ చిత్రంలోని ఒక అత్యంత కీలకమైన అశ్లీల సన్నివేశాన్ని దర్శకుడు రత్నకుమార్ ఏ విధంగా తీస్తారో అనే తీవ్రమైన ఆందోళన తనను వెంటాడిందని ఆమె తెలిపారు.  కథలోని ఆత్మను పక్కన పెట్టి, కేవలం ఆ బోల్డ్ మరియు న్యూడ్ అంశంపైనే శ్రద్ధ పెడతారేమో అని తను తీవ్రంగా భయపడినట్లు వివరించారు. ఆ సినిమా మేకర్ల ఆలోచనా విధానాన్ని, విజన్‌ను పూర్తిగా అర్థం చేసుకోవడానికి తనకు దాదాపు 2 నెలల సుదీర్ఘ సమయం పట్టిందని అమలాపాల్ గుర్తుచేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై నిర్ణయం తీసుకునే ముందు చిత్ర బృందంతో కలిసి ప్రయాణం చేస్తూ వారి నిజాయితీని పరిశీలించిన తర్వాతే తను ముందడుగు వేశారు.   ఒక వైపు తన వ్యక్తిగత ఇమేజ్ దెబ్బతింటుందేమోనన్న భయం, మరోవైపు భవిష్యత్తు కెరీర్‌లో కూడా తనను ఇలాంటి టైప్ కాస్ట్ లేదా స్టీరియోటైప్ పాత్రలకే పరిమితం చేస్తారేమోనన్న ఆందోళన ఆమెను తీవ్రంగా కలిచివేశాయి. అయినప్పటికీ, దర్శకుడి పనితనం పై ఉన్న నమ్మకంతో ఒక పెద్ద రిస్క్ తీసుకుని  గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది కూడా చదవండి: ది ప్యారడైజ్ కి సంబంధించి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారో తెలుసా: పాపం భయ్యా!      చిత్రీకరణ సమయంలో తనను ఎంతో సౌకర్యవంతంగా ఉంచడానికి సెట్‌లో కేవలం అతితక్కువ మంది క్రూ సభ్యులను మాత్రమే అనుమతించారని, సుమారు 20 రోజులకు పైగా సాగిన ఈ తరహా బోల్డ్ షూటింగ్‌లో తనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేకర్స్ జాగ్రత్త పడ్డారని చెప్పారు.   అప్పట్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుని, సెన్సార్ బోర్డు నుండి ఏ సర్టిఫికెట్ పొందింది. అయితే తన జీవితంలో వయస్సు, అనుభవంతో పాటు ప్రాధాన్యతలు మారాయని చెబుతూ, 'ఒకవేళ ఇప్పుడు గనుక నన్ను ఆడై వంటి పాత్ర చేయమని అడిగితే, కచ్చితంగా నేను అలాంటి నిర్ణయం తీసుకోను మరియు నటించను' అని అమలాపాల్ స్పష్టం చేశారు.      [Amala Paul About Aadai Movie Bold Scenes,Amala Paul, Aadai Movie, Amala Paul Nude Scene, Aame Movie Telugu, Amala Paul Interview, Telugu Cinema News, Telugu Cinema, Tollywood Cinema News, Tollywood]  
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు.. ఈ పేరు చెప్పగానే తెలుగు సినిమా అమ్ముల పొదిలో  దాగి ఉన్న తన సినీ లిస్ట్ బయటకి వస్తుంది. కామెడీ, స్ఫూఫ్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సంపూర్ణేష్ బాబునేచురల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' లో బిర్యానిగా అలరించాడు.  రీసెంట్ గా తను ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు 'గతం లో నేను  హీరోగా చేసినప్పుడు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చేవారో , అంతకు మూడు రెట్లు రెమ్యూనరేషన్ ఇచ్చారని చెప్పుకొచ్చాడు. అంటే 3 కోట్ల రూపాయిలు వరకు అన్నమాట. అయితే రెమ్యూనరేషన్ పరంగా సంపూర్ణేష్ బాబు కి న్యాయం చేశారు కానీ , అతనిలో మంచి నటుడు ఉన్నాడని , ఆ నటుడిని వాడుకోలేకపోయారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి కామెంట్స్ వినిపిస్తోంది. తాను చెప్పడమే కాకుండా ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం, 'ది ప్యారడైజ్' 2 కోట్ల నుండి 3 కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.  ఇది కూడా చదవండి: ఓటిటిలోకి మహేంద్రగిరి వారాహి: కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే!     మరి హీరోగా సంపూర్ణేష్ బాబు ఎంత అందుకునేవాడని  3 కోట్ల రూపాయిలు అంటున్నారో, సినీ సర్కిల్స్ లో కూడా అదే 3 కోట్లు ఎందుకు చక్కర్లు కొడుతుందో తెలియదు. ఏది ఏమైనా కరెక్ట్ రెమ్యునరేషన్ చెప్పేవరకు 3 కోట్లు అనేది రూమర్ మాత్రమే. రూమర్ వీరుల ఆనందాన్ని మనమెందుకు కాదనాలి.   [Sampoornesh Babu Remuneration For The Paradise Movie, Sampoornesh Babu Remuneration, The Paradise Telugu Movie, Nani The Paradise, Telugu Cinema News, Telugu Cinema, Tollywood Cinema News, Tollywood]  
    సుదీర్ఘ నటనా అనుభవం ఉన్న  సుమంత్ నుంచి వచ్చిన రీసెంట్ చిత్రం మహేంద్రగిరి వారాహి'. డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కగా.సెప్టెంబర్ 11, 2026న థియేటర్లలో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకుంది.  అయితే థియేట్రికల్ రన్ ముగిసిన కేవలం 21 రోజుల్లోనే ఈ డివైన్ థ్రిల్లర్ డిజిటల్ ప్రియుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ప్రసిద్ధ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' (Amazon Prime Video) వేదికగా అక్టోబర్ 2, 2026 నుంచి ఈ సినిమా గ్రాండ్ స్ట్రీమింగ్ కానుంది. విశేషమేమిటంటే, ఈ చిత్రం ఒక్క తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మరియు మలయాళం అనే 5 ప్రధాన భారతీయ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే, గతంలో సుమంత్‌తో 'సుబ్రహ్మణ్యపురం' లాంటి సూపర్ హిట్ డివోషనల్ థ్రిల్లర్ తీసిన దర్శకుడు సంతోష్ జాగర్లపూడి, ఈ చిత్రాన్ని వారాహి అమ్మవారి నేపథ్యంతో 200 ఏళ్ల నాటి రాజవంశ శాపం చుట్టూ అత్యంత ఆసక్తికరంగా మలిచారు. మహేంద్రగిరి సంస్థానంలోని ఒక రాజవంశంలో జన్మించిన మగవారికి 33 ఏళ్లు నిండగానే ప్రాణాలు కోల్పోయే భయంకరమైన దోషం ఉంటుంది. అయితే కథలో కథానాయకుడు సిద్ధార్థ్ (సుమంత్) మూఢనమ్మకాలు, దొంగ బాబాలను ఎండగట్టే ఒక ప్రముఖ యూట్యూబర్. దేవుడు, దెయ్యాలను అస్సలు నమ్మని సిద్ధార్థ్, తన సోదరుడు రాజీవ్ (రాజీవ్ కనకాల) కి ఉన్న దోష నివారణ కోసం కుటుంబంతో కలిసి మహేంద్రగిరిలోని వారాహి అమ్మవారి క్షేత్రానికి వెళ్తాడు. అక్కడ ఊహించని రీతిలో రాజీవ్ మరణించడంతో కథ తీవ్ర ఉత్కంఠభరిత మలుపు తిరుగుతుంది. ఇది కూడా చదవండి: హాస్యనటిగా ఓ వెలుగు వెలిగింది.. కానీ ఆ అలవాటుకి బానిస అవ్వడంతో!   తన అన్నయ్య మరణం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని, ఆ రాజవంశాన్ని వెంటాడుతున్న 200 ఏళ్ల నాటి శాపం నిజమైనదా లేక దాని వెనుక ఏదైనా మానవ కుట్ర ఉందా అనే కోణంలో సిద్ధార్థ్ అన్వేషణ ప్రారంభిస్తాడు. మొదటి భాగంలో వచ్చే ఆలయ మిస్టరీ, ఇంటర్వెల్ లో ఇచ్చే భారీ ట్విస్ట్, మరియు క్లైమాక్స్ లో వచ్చే రెండు అనూహ్యమైన టర్నింగ్ పాయింట్స్ ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడతాయి. ఈ చిత్రంలో సుమంత్‌కి జోడీగా మీనాక్షి గోస్వామి నటించగా, ఐశ్వర్య రాజేష్, మాళవిక నాయర్, సిద్ధు జొన్నలగడ్డ, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించి మెప్పించారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు బ్రిడ్జ్ ఫిల్మ్స్ బ్యానర్లపై భారీ నిర్మాణ విలువలతో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి అనూప రూబెన్స్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ డివైన్ థ్రిల్‌ను పీక్స్‌కి తీసుకెళ్లింది. థియేటర్లలో మిస్ అయిన సస్పెన్స్, మిస్టరీ థ్రిల్లర్ అభిమానులకు ఈ దసరా పండగ పూట ప్రైమ్ వీడియోలో ఓవర్ నైట్ బెస్ట్ ఆప్షన్‌గా 'మహేంద్రగిరి వారాహి' నిలవనుంది.   [Mahendragiri Varahi Ott Release Date, Mahendragiri Varahi OTT Release, Sumanth Mahendragiri Varahi Prime Video, Mahendragiri Varahi OTT Date, Telugu Cinema News, Telugu Cinema, Tollywood Cinema News, Tollywood]  
కొంత మంది నటీనటులపై కాలానికి ఏమైనా కన్ను గొడుతుందో, లేక వాళ్ళ స్వయంకృతాపరాధమో తెలియదు కానీ ఒక వెలుగు వెలిగిన జీవితాలు హఠాత్తుగా చీకటి కోణంలోకి నెట్టబడతాయి. తెలుగు చలనచిత్ర స్వర్ణయుగంలో తన సహజసిద్ధమైన నటనతో, హాస్య చతురతతో, అద్భుతమైన హావభావాలతో కోట్లాదిమంది ప్రేక్షకులను అలరించిన లెజెండరీ నటి సురభి బాలసరస్వతి. తెరపై ఎప్పుడూ నవ్వులు పూయించే ఈ మహానటి జీవితం వెనుక ఒక గుండెలను పిండేసే విషాద కోణం ఉందంటే నమ్మడం కష్టం.  నాటక రంగానికి పెట్టింది పేరైన సురభి కుటుంబం నుంచి వచ్చిన ఆమె, చిన్నతనంలోనే నటనపై మక్కువ పెంచుకుని నాటకాల ద్వారా చిత్రసీమలోకి అడుగుపెట్టారు. 1950ల కాలంలో తెలుగు, తమిళ భాషల్లో స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, అప్పటి అగ్ర కథానాయకులైన ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, శివాజీ గణేషన్ వంటి దిగ్గజ సరసన నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్యతో సురభి బాలసరస్వతి కాంబినేషన్ అప్పట్లో ఒక పెద్ద సంచలనం. వీరిద్దరూ కలిసి నటించిన హాస్య సన్నివేశాలు, పాటలు ప్రేక్షకులు పొట్టచెక్కలయ్యేలా నవ్వించేవి. "శాంతి నివాసం", "కన్యాశుల్కం", "ఇల్లరికం" వంటి 100కు పైగా అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలు ఇప్పటికీ తెలుగు సినీ ప్రేక్షకులకు చిరస్మరణీయమే. 1950 నుండి 1970 మధ్యకాలంలో విడుదలైన పదుల కొద్దీ సినిమాల్లో ఆమె కీలక పాత్రల్లో నటించి టాలీవుడ్ తెరపై చెరగని ముద్ర వేశారు. ఇది కూడా చదవండి: తెలుగు సినిమాని చంపేస్తోంది ఏంటి: వాళ్ళు రాకపోవడం కూడా ఒక కారణమా! అయితే వెండితెరపై నిరంతరం డిమాండ్ ఉన్న నటిగా, వెలుగులు విరజిమ్మిన కథానాయికగా కోట్లాదిమంది గుండెల్లో నిలిచిన ఈ నటి వ్యక్తిగత జీవితం మాత్రం తీవ్ర నైరాశ్యంలో సాగింది. నటన ద్వారా సంపాదించిన కోట్లాది రూపాయల ఆస్తులు, పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ, ఆమె చివరి రోజుల్లో అనుభవించిన మానసిక వేదన అపారం. బాలసరస్వతిది ముక్కుసూటి మనస్తత్వం. శకునాలు, జాతకాలని నమ్మేవారు కాదు. జీవితంలో ఒంటరి పోరాటం చేశారు.     పరిశ్రమలో తోడు అవసరమని భావించి, దర్శకుడు తాపీ చాణక్యతో కొంతకాలం సహజీవనం చేశారు. ఆయనకు అప్పటికే వివాహమైంది. పిల్లలు లేరు. చాణక్య హఠాన్మరణంతో ఆమె జీవితం మరో మలుపు తిరిగింది. నలుగురితో స్నేహంగా మెలిగే ఆమె, మహానటి సావిత్రికి మంచి స్నేహితురాలు. సావిత్రికి మద్యం అలవాటు చేసింది బాలసరస్వతినే అనే ప్రచారమూ ఉంది. వృత్తిపరంగా పోటీ పెరిగి అవకాశాలు తగ్గడం, మద్యానికి బానిస కావడం ఆమె చివరి రోజులను దుర్భరంగా మార్చాయి. మద్రాసు వదిలి గూడూరు చేరుకున్న బాలసరస్వతి, 1983 సెప్టెంబర్ 10న దీనమైన పరిస్థితుల్లో కన్నుమూశారు.      [Surabhi Balasaraswati Untold Life Story, Surabhi Balasaraswati, Surabhi Balasaraswati story, Surabhi Balasaraswati movies, Yesteryear Telugu actress Balasaraswati, telugu Cinema News, Telugu Cinema, Tollywood Cinema News, Tollywood]  
సినిమా.. అందులోనూ తెలుగు సినిమా.. సరైన తెలుగు సినిమా పడిందంటే దివి నుంచి దేవతలు సైతం దిగొచ్చి మానవరూపంలో సినిమా చూసి తెలుగు ప్రేక్షకులు ఎంతటి అదృష్టవంతులు అని ఈర్ష్య పడుతుంటారని సినీ ప్రేమికులు తమ చాయ్, బిస్కెట్ కబుర్లలో చెప్పుకుంటూ ఉంటారు. అంతటి కథ, కథనం, పాటలు, మాటలు, పెర్ ఫార్మెన్స్  కలగలిపిన తెలుగు సినిమా చాలా ఏళ్ళ నుంచి దిగులని మనసులో ఉంచుకొని పైకి మాత్రం నవ్వుతు ఉంది. అందుకు కారణమేంటో చూద్దాం. తెలుగు సినిమా పరిశ్రమలో ఒకప్పుడు ఒక హిట్ సినిమా వచ్చిందంటే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టి, అదే సినిమాని రెండు మూడు సార్లు చూసే సంస్కృతి స్పష్టంగా కనిపించేది. కానీ ఈ డిజిటల్ యుగంలో ఆ ‘రిపీట్ వాచ్ కల్చర్’ క్రమంగా మాయమవుతోందనే చర్చ టాలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా, దీర్ఘకాలం థియేటర్లలో నిలబడటానికి రిపీట్ ఆడియన్స్ ఎంతో కీలకం. అయితే నేటి కాలంలో ఒక్కసారి చూస్తే చాలు అనే భావన ప్రేక్షకుల్లో పెరిగిపోవడానికి అసలు కారణాలు ఏమిటి?  ఇది కూడా చదవండి: ఈ సారి 'ఇరుముడి'ని మించిన టైటిల్: ఏడూకొండల వాడ వెంకటేశా! .ఈ పరిస్థితికి ప్రధాన కారణాల్లో మొదటిది ఆకాశాన్నంటిన టికెట్ ధరలు మరియు స్నాక్స్ ఖర్చులు. మల్టీప్లెక్స్‌లలో ఒక్కో టికెట్ ధర . 295 నుంచి . 413 వరకు పెరిగిపోవడం, దానికి తోడు 300 నుంచి 500 వరకు ఉండే ఆహార పదార్థాల ధరలు సగటు కుటుంబ బడ్జెట్‌ను దెబ్బతీస్తున్నాయి. నలుగురు ఉన్న ఒక కుటుంబం సినిమాకు వెళ్తే  2,000 నుంచి 3,000 వరకు ఖర్చవుతుండటంతో, థియేటర్ అనుభవం కాస్త భారం గా మారుతోంది.      ఇక రెండవ ముఖ్యమైన అంశం ఓటీటీ (OTT) ప్లాట్‌ఫారమ్‌ల వేగవంతమైన విస్తరణ. థియేటర్ విడుదలైన కేవలం 3 నుంచి 4 వారాల వ్యవధిలోనే (వంద శాతం ఓటీటీ విండో) డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుండటంతో, సెకండ్ టైమ్ చూడాలనుకునే వారు ఓటీటీ రిలీజ్ కోసమే వేచి చూస్తున్నారు. ఇది ఓటీటీ హక్కుల ద్వారా నిర్మాతలకు 20% నుండి 30% వరకు అదనపు రాబడిని అందిస్తున్నప్పటికీ, థియేట్రికల్ ఫుట్‌ఫాల్స్‌పై మాత్రం తీవ్ర ప్రభావం చూపుతోంది.   అంతేకాకుండా కంటెంట్ నాణ్యత కూడా ఇక్కడ కీలక పాత్ర పోషిస్తోంది. మొదటి రోజు ఉదయం ఆట పూర్తయిన 5 గంటల్లోపే సోషల్ మీడియా ద్వారా పబ్లిక్ టాక్, రివ్యూలు విస్తృతంగా ప్రచారంలోకి వస్తున్నాయి. సినిమా కథలో బలమైన ఎమోషన్లు, రిపీట్ వాల్యూ లేకపోతే ప్రేక్షకులు కేవలం ఒకసారి చూసి వదిలేస్తున్నారు. పైగా రిలీజ్ అయిన 5 గంటల్లోనే పైరసీ వెర్షన్లు అందుబాటులోకి రావడం కూడా థియేటర్ రన్ సమయాన్ని తగ్గిస్తోంది. ఇటీవల టికెట్ ధరలను అందుబాటులో ఉంచిన మీడియం బడ్జెట్ సినిమాలు, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న చిత్రాలు మాత్రమే థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులతో మంచి విజయం సాధించడం గమనార్హం.అయితే ఆ సినిమాలకి కూడా రిపీట్ ఆడియెన్స్ ఉండటం లేదు. ఏది ఏమైనా రిపీట్ ఆడియన్స్ ఉన్నప్పుడే తెలుగు సినిమా పూర్తి ఆనందంతో ఉండగలదు.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
నేటి వేగవంతమైన జీవనశైలిలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరిగి చాలామంది కఠినమైన డైట్ ప్రణాళికలను అనుసరిస్తున్నారు. వారం పొడవునా తక్కువ కేలరీలు, పోషకాలు ఉన్న ఆహారాన్ని తింటూ తమ శరీరాన్ని క్రమశిక్షణలో ఉంచుకుంటారు. అయితే వారం చివర్లో లేదా ప్రత్యేకమైన సందర్భాలలో చాలామంది తమకు అత్యంత ఇష్టమైన ప్రాసెస్డ్ ఫుడ్, నూనెలో వేయించిన తినుబండారాలు, తీపి పదార్థాలు మరియు ఫాస్ట్ ఫుడ్‌ను ఆస్వాదించడానికి  చీట్ డే  (Cheat Day) లేదా  చీట్ మీల్  క్రమాన్ని ఎంచుకుంటారు. వారం మొత్తం పడిన కష్టానికి ఇది ఒక రివార్డులా అనిపించినప్పటికీ, ఒక్కసారిగా అత్యధిక కేలరీలు, అధిక మోతాదులో సోడియం (ఉప్పు), సంతృప్త కొవ్వులు (Saturated Fats) మరియు ప్రాసెస్డ్ చక్కెరలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల మన హృదయనాళ వ్యవస్థ (Cardiovascular System) పై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో ఒకేసారి భారీగా కేలరీలు చేరుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ మరియు ట్రైగ్లిజరైడ్ల స్థాయిలు హఠాత్తుగా పెరుగుతాయి. దీనివల్ల రక్తనాళాలలో తాత్కాలికంగా వాపు (Inflammation) ఏర్పడి, రక్తనాళాలు కుంచించుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఒక్క చీట్ మీల్ వల్ల రక్తపోటు (Blood Pressure) తాత్కాలికంగా పెరగడమే కాకుండా, గుండె రక్తాన్ని పంప్ చేయడానికి సాధారణం కంటే ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. నిపుణుల పరిశోధనల ప్రకారం, వారంలో క్రమం తప్పకుండా తీసుకునే కఠినమైన డైట్ కంటే, చీట్ డే సమయంలో ఒకేసారి పరిమితికి మించి ఎక్కువ కేలరీలు తీసుకోవడం గుండె ఆరోగ్యానికి ఎక్కువ హాని కలిగిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, డయాబెటిస్ లేదా కుటుంబంలో గుండెజబ్బుల చరిత్ర ఉన్నవారు చీట్ మీల్స్ విషయంలో తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తే అది తీవ్రమైన గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. అయితే చీట్ డేస్ అనేవి కేవలం శారీరక ఆరోగ్యాన్నే కాకుండా మానసిక సమతుల్యతను కూడా ప్రభావితం చేస్తాయి. డైట్ క్రమంలో ఇష్టమైన ఆహారానికి దూరంగా ఉండటం వల్ల కలిగే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి పరిమితమైన చీట్ మీల్స్ తోడ్పడతాయి. కానీ దీనిని ఆరోగ్యకరంగా నిర్వహించడం చాలా అవసరం. చీట్ డే రోజున ఆకలిని తట్టుకోలేక ఒకేసారి పెద్ద మొత్తంలో తినడానికి బదులుగా, పోర్షన్ కంట్రోల్ (పరిమిత పరిమాణం) పాటించడం అత్యంత ముఖ్యం. ఉదాహరణకు చీట్ మీల్‌లో అధికంగా ఆయిల్ ఉన్న పిజ్జాలు, బర్గర్లు, ఫ్రైడ్ చికెన్ వంటి ప్రాసెస్డ్ పదార్థాలకు దూరంగా ఉంటూ.. ఇంటి వద్ద తక్కువ నూనెతో శుభ్రంగా తయారుచేసిన ఇష్టమైన వంటకాలను ఎంచుకోవచ్చు. అలాగే ఆహారాన్ని నమిలి మెల్లగా తినడం వల్ల తక్కువ ఆహారంతోనే కడుపు నిండిన భావన కలిగి గుండెపై అదనపు భారం పడకుండా ఉంటుంది. చీట్ మీల్ తీసుకున్న తర్వాత రోజంతా పుష్కలంగా నీరు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు, అధికంగా ఉన్న సోడియం సమర్థవంతంగా బయటకు వెళ్లిపోతాయి. అంతేకాకుండా చీట్ మీల్ తిన్న తర్వాత కొద్దిసేపు తేలికపాటి నడక లేదా వ్యాయామం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా అదుపులో ఉంటాయి. ఆహారాన్ని ఎంజాయ్ చేయడం ఎంత ముఖ్యమో, దాని పరిమితులను గుర్తించి గుండెను కాపాడుకోవడం అంతకంటే ప్రధానం. కఠినమైన డైటింగ్ మినహాయింపుల పేరుతో గుండె ఆరోగ్యాన్ని పణంగా పెట్టకుండా, సమతుల్య ఆహారం మరియు క్రమబద్ధమైన వ్యాయామంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యాధికారులు స్పష్టం చేస్తున్నారు.     Cheat day impact on heart health, high calorie cheat meal risks, junk food effect on heart, cheat meals cardiovascular risk, fitness cheat day heart warning.
మన పూర్వీకులు 80 నుండి 90 ఏళ్ల వయస్సు వచ్చినా కూడా ఎలాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేకుండా చాలా ఆరోగ్యంగా, చలాకీగా తమ పనులు తామే చేసుకుంటూ జీవించేవారు. వారు అంతటి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటానికి ముఖ్యమైన కారణం మన సాంప్రదాయ ఆయుర్వేద విలువలు కలిగిన ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లే. ముఖ్యంగా పొలం గట్లపై, ఇంటి చుట్టుపక్కల దొరికే ప్రకృతి ప్రసాదిత ఆకుకూరలను రోజూవారి వంటకాల్లో భాగంగా పప్పు, పచ్చడి రూపంలో తీసుకునేవారు. అటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన మొక్కల్లో ప్రధానమైనది తెల్ల గలిజేరు . సాధారణంగా చూసేందుకు పొలాల్లో ఏదో పిచ్చిమొక్కలా కనిపిస్తున్నప్పటికీ, ఆయుర్వేద వైద్యంలో దీనిని  పునర్నవ అని ఎంతో గౌరవంగా పిలుస్తారు. శాస్త్రీయంగా బోరేవియా డిఫ్యూసా (Boerhavia diffusa) అని పిలిచే ఈ మొక్క పేరులోని  పునః  అంటే మళ్లీ,  నవ  అంటే కొత్తగా అని అర్థం. అంటే పాడైపోయిన శరీర కణాలకు మరియు ముఖ్యమైన అవయవాలకు మళ్లీ కొత్త జీవాన్ని పోసి పునరుజ్జీవింపజేసే గొప్ప శక్తి ఈ తెల్ల గలిజేరుకు ఉంది. వైద్య నిపుణులు మరియు ఆయుర్వేద పరిశోధకుల ప్రకారం, తెల్ల గలిజేరు సుమారు 350కి పైగా రకాల కిడ్నీ సంబంధిత వ్యాధులకు మరియు మూత్రనాళ సమస్యలకు ఒక దివ్యౌషధంగా లేదా సంజీవనిగా పనిచేస్తుంది. ఆధునిక కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న మూత్రనాళ ఇన్ఫెక్షన్లు (UTI), యూరియా మరియు క్రియాటినిన్ స్థాయిలు పెరగడం, శరీరంలో విపరీతంగా నీరు చేరి వాపులు రావడం వంటి తీవ్రమైన సమస్యలకు ఇది అద్భుతంగా తోడ్పడుతుంది. తెల్ల గలిజేరులో విటమిన్ సి, విటమిన్ డి, క్యాల్షియం, ఐరన్ తో పాటు పొటాషియం నైట్రేట్ మరియు హైడ్రోక్లోరైడ్ వంటి అత్యంత కీలకమైన బయోయాక్టివ్ సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని విషపదార్థాలను సమర్థవంతంగా బయటకు పంపి, డయాబెటిస్ బాధితుల్లో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే రక్తపోటును సమతుల్యం చేసి, గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదాలను తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇంతటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న తెల్ల గలిజేరును మన ఇంట్లోనే ఎంతో రుచికరమైన పచ్చడి రూపంలో సులభంగా తయారుచేసుకోవచ్చు. ఈ పచ్చడి తయారీకి 3 కప్పుల శుభ్రం చేసిన తెల్ల గలిజేరు ఆకులు, పావు కప్పు వేరుశనగ గుళ్లు (పల్లీలు), 3 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, 1 చెంచా జీలకర్ర, 2 చెంచాల ధనియాలు, పావు చెంచా మిరియాలు, నిమ్మకాయ పరిమాణమంత చింతపండు, చిటికెడు ఇంగువ, 6 వెల్లుల్లి రెబ్బలు మరియు తగినంత ఉప్పు, నూనె అవసరమవుతాయి. తయారీ విధానంలో భాగంగా ముందుగా గలిజేరు ఆకులను బాగా కడిగి తడి లేకుండా ఆరబెట్టాలి. బాండీలో నూనె లేకుండా ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, వేరుశనగ గుళ్లు, మిరియాలను దోరగా వేయించి చల్లార్చుకోవాలి. వీటిని మిక్సీలో బరకగా పొడి చేసిన తర్వాత, అందులో గలిజేరు ఆకులు, చింతపండు, వెల్లుల్లి, ఉప్పు చేర్చి కొద్దిగా నీటితో మిక్సీ పట్టుకోవాలి. చివరగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, ఇంగువతో నూనెలో తాలింపు వేస్తే నోరూరించే తెల్ల గలిజేరు పచ్చడి సిద్ధమవుతుంది. ఈ తెల్ల గలిజేరు పచ్చడి సుమారు 4 రోజుల పాటు చెక్కుచెదరకుండా నిల్వ ఉంటుంది. వేడివేడి అన్నంతో పాటు ఇడ్లీ, దోశల్లోకి కూడా ఇది ఎంతో రుచిగా ఉంటుంది. వారానికి 2 నుండి 3 సార్లు ఈ పచ్చడిని లేదా ఆకుకూరను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మూత్రపిండాల పనితీరు గణనీయంగా మెరుగుపడుతుంది. అయితే ఆయుర్వేద నిపుణుల సూచన ప్రకారం, ఐరన్ మరియు శక్తివంతమైన మూలికా ప్రభావం ఎక్కువగా ఉండే తెల్ల గలిజేరును గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు మరియు 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు తీసుకోకూడదు. తీవ్రమైన గుండె సంబంధిత సమస్యలు లేదా ఆటో ఇమ్యూన్ జబ్బులు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే దీనిని వాడటం శ్రేయస్కరం. ఈ సహజసిద్ధమైన ఆయుర్వేద మూలికను మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చు.     Learn how to make Tella Galijeru (White Punarnava) leaves chutney, an ancient Ayurvedic natural remedy known for supporting kidney health and boosting immunity.
భారతీయ వంటకాల్లోనూ, సాంప్రదాయ గృహ వైద్యంలోనూ వెల్లుల్లికి ప్రత్యేక స్థానం ఉంది. వెల్లుల్లి కేవలం వంటకాలకు రుచి, సువాసనను అందించడమే కాకుండా అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుందని శతాబ్దాలుగా విశ్వసిస్తున్నారు. చాలామంది రాత్రి వేళల్లో శ్వాస సరిగ్గా ఆడటానికి, శ్వాసనాళాలు శుభ్రపడటానికి లేదా ప్రశాంతమైన నిద్ర కోసం వెల్లుల్లిని తినడం లేదా దిండు కింద పెట్టుకోవడం వంటి చిట్కాలను పాటిస్తుంటారు. అయితే, నిద్రపోతున్న సమయంలో వెల్లుల్లి ఘాటైన వాసన శ్వాసనాళాలను శుభ్రం చేసి శ్వాస తీసుకోవడాన్ని సులభతరం చేస్తుందనే వాదనను బలంగా నిర్ధారించే ఎలాంటి ప్రత్యక్ష మానవ వైద్య ఆధారాలు (Human Clinical Trials) ప్రస్తుతం లేవు అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వెల్లుల్లికి వచ్చే ప్రత్యేకమైన ఘాటైన వాసనకు మరియు రుచికి అందులోని  అల్లిసిన్  (Allicin) అనే శక్తివంతమైన సమ్మేళనం ప్రధాన కారణం. వెల్లుల్లి రెబ్బలను కోసినప్పుడు, నలిపినప్పుడు లేదా మెత్తగా చేసినప్పుడు ఈ అల్లిసిన్ ఏర్పడుతుంది. ప్రయోగశాల (Laboratory) స్థాయిలో జరిగిన అధ్యయనాలలో అల్లిసిన్‌కు అద్భుతమైన యాంటీ మైక్రోబయల్ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ (ఉపాధి, వాపు నిరోధక) లక్షణాలు ఉన్నట్లు తేలింది. అల్లిసిన్ కలిగిన వెల్లుల్లి సప్లిమెంట్లను వాడిన ఒక చిన్న అధ్యయనంలో జలుబు కేసులు తక్కువగా నమోదైనప్పటికీ, ఈ ప్రయోగశాల ఫలితాలను నేరుగా మనుషులలో నిద్ర సమయంలో శ్వాస మెరుగుపడటానికి అన్వయించలేమని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అనేకమంది భావిస్తున్నట్లుగా వెల్లుల్లి తినడం లేదా దాని వాసన పీల్చడం ద్వారా రాత్రివేళ శ్వాసనాళాలు శుభ్రపడి గురక, ముక్కు దిబ్బడ తగ్గుతాయని చెప్పడానికి అందుబాటులో ఉన్న ఆధారం చాలా పరిమితం. అందువల్ల ఆస్తమా, గురక, స్లీప్ అప్నియా (Sleep Apnea) వంటి తీవ్ర శ్వాసకోశ సమస్యలకు వెల్లుల్లిని ఒక ప్రాథమిక వైద్య చికిత్సగా భావించడం ఎంతమాత్రం సరికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెల్లుల్లిని సాధారణ ఆహారంలో భాగంగా పప్పులు, కూరలు, సూప్‌లలో పరిమిత మోతాదులో (రోజుకు 1,2 రెబ్బలు) తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తికి, గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కానీ నిద్రలో ఊపిరి ఆడకపోవడం, ఛాతిలో తీవ్రమైన నొప్పి లేదా విపరీతమైన గురక వంటి సమస్యలు ఉన్నవారు సొంత వైద్యంపై ఆధారపడకుండా వెంటనే అర్హులైన వైద్యులను సంప్రదించి సరైన పరీక్షలు చేయించుకోవడం అత్యంత అవసరం.     Eating garlic before bed health effects, garlic and sleep apnea breathing, nighttime raw garlic benefits risks, garlic before sleep breathing issues, garlic side effects at night.
చేతులు వణకడం, కాళ్లలో బలహీనంగా అనిపించడం, చేతులు లేదా కాళ్లలో తిమ్మిర్లు, మొద్దుబారడం, చిన్న పని చేసినా త్వరగా అలసిపోవడం వంటి సమస్యలను చాలామంది సాధారణ నీరసంగా భావిస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇవి నరాల ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలకు సంకేతాలు కావచ్చు. నరాల బలహీనతకు కారణాలు ఏమిటి? నరాలపై ప్రభావం చూపించే సమస్యలు ఏంటి? చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, నొప్పి, వణుకు, బలహీనత ఎందుకు వస్తాయి? నరాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి ఆహారం, జీవనశైలి పాటించాలి? ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ నరాల బలహీనతకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను సులభంగా వివరిస్తున్నారు. అలాగే నరాల ఆరోగ్యానికి ఉపయోగపడే సంప్రదాయ పద్ధతిలో అశ్వగంధ, వాము, దాల్చిన చెక్క, లవంగాలతో తయారు చేసుకునే చిట్కా గురించి కూడా తెలుసుకోవచ్చు. నరాల బలహీనత, నరాల నష్టం, తాత్కాలిక నీరసం మధ్య తేడా ఏమిటి? నరాలు దెబ్బతిన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? నరాల ఆరోగ్యానికి మంచి ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి ఎందుకు అవసరం? వంటి విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి. నరాలకు సంబంధించిన సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, లక్షణాలు కొనసాగితే వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం. నరాల ఆరోగ్యం గురించి పూర్తి అవగాహన కోసం ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
క్యాన్సర్ పేరు వినగానే భయపడాల్సిన అవసరం లేదు. అయితే శరీరంలో చాలాకాలంగా కొనసాగుతున్న కొన్ని అసాధారణ మార్పులను నిర్లక్ష్యం చేయకుండా, వాటికి కారణం ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా సాధారణ సమస్యలుగా భావించే కొన్ని లక్షణాలు తరచూ కనిపిస్తుంటే వైద్యుల సలహా తీసుకోవడం అవసరం. నోటిలో తగ్గకుండా ఉండే పుండ్లు, రొమ్ములో కనిపించే మార్పులు, జీర్ణవ్యవస్థలో సమస్యలు, కారణం లేకుండా బరువు తగ్గడం, శరీరంలో అసాధారణ మార్పులు వంటి వాటిని ఎప్పుడు సీరియస్‌గా తీసుకోవాలి? క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించేందుకు స్క్రీనింగ్ పరీక్షలు ఎంతవరకు ఉపయోగపడతాయి? ఏ వయసులో ఎలాంటి జాగ్రత్తలు అవసరం? అంతేకాదు, క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్సా విధానాలు ఏమిటి? రోబోటిక్ సర్జరీ, ఆంకో-రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ, మైక్రోసర్జరీ, బ్రెస్ట్ రీకన్‌స్ట్రక్షన్ వంటి విధానాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సీనియర్ రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అజయ్ వరుణ్ రెడ్డి క్యాన్సర్‌కు సంబంధించిన ముఖ్యమైన విషయాలను సులభంగా వివరించారు. క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోవడంతో పాటు, శరీరం ఇచ్చే అసాధారణ సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా ఉండేందుకు ఈ వీడియో ఉపయోగపడుతుంది. గమనిక: ఈ వీడియో అవగాహన కోసం మాత్రమే. ఏదైనా అసాధారణ లక్షణం కొనసాగితే స్వయంగా నిర్ధారణ చేసుకోకుండా వైద్య నిపుణులను సంప్రదించండి.మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఒక వినూత్నమైన వ్యాయామ విధానం విపరీతంగా ట్రెండ్ అవుతోంది. నెమ్మదిగా, ప్రశాంతంగా, డాన్స్ చేస్తున్నట్లుగా సాగే ఆ కదలికలే "తాయ్ చి". నార్మల్ గా అందరూ చేసే  జిమ్ వర్కౌట్లు, వేగంగా రన్నింగ్ చేయడం వంటివి కాకుండా  మానసిక ప్రశాంతతతో పాటు శరీరానికి  దారుఢ్యాన్ని ఇచ్చే ఈ ప్రాచీన విధానం వైపు నేటి యువత, ఫిట్‌నెస్ ప్రేమికులు విశేషంగా ఆకర్షితులవుతున్నారు. సోషల్ మీడియా లో రీల్స్, షార్ట్స్ లో వేలాదిమంది దీనికి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తుండటంతో ఇది నెట్టింట వైరల్ గా మారింది. అసలు ఏమిటీ తాయ్ చి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? వివరంగా తెలుసుకుంటే.. తాయ్ చి.. తాయ్ చి అనేది చైనాకు చెందిన ఒక ప్రాచీన మార్షల్ ఆర్ట్ విధానం. మొదట్లో  ఇది ఒక ఆత్మరక్షణ విద్యగా ఉద్భవించినప్పటికీ, కాలక్రమేణా ఇది ఒక అద్భుతమైన ఆరోగ్య, ఫిట్‌నెస్ సాధనగా రూపాంతరం చెందింది. దీనిని తరచుగా మూమెంట్ మెడిటేషన్ అని పిలుస్తారు. ఈ విధానంలో వేగవంతమైన కదలికలు ఉండవు. చాలా నెమ్మదిగా, శ్వాసపై ధ్యాస ఉంచుతూ, శారీరక సమతుల్యతను కాపాడుకుంటూ ఒక పోజిషన్ నుంచి మరొక పొజిషన్ కు  శరీరాన్ని తిప్పుతారు. శ్వాస ప్రక్రియను శరీర కదలికలతో అనుసంధానించడమే దీనిలోని ప్రధాన సూత్రం. ఇది శరీరంలోని అంతర్గత శక్తిని నిద్రలేపి, శరీరం అంతటా సరిగ్గా ప్రసరించేలా చేస్తుంది. చైనీస్ సంస్కృతిలో దీనిని 'చి' అని పిలుస్తారు. తాయ్ చి చేసే విధానం.. తాయ్  చి సాధనలో మూడు ముఖ్యమైన అంశాలు ఉంటాయి.. నెమ్మదిగా చేసే కదలికలు.. శరీరంలోని ప్రతి కండరాన్ని ఉపయోగిస్తూ, కీళ్లపై ఎటువంటి ఒత్తిడి పడకుండా చాలా సజావుగా కదలికలు ఉంటాయి. లోతైన శ్వాస.. కదలికలకు అనుగుణంగా ప్రశాంతంగా, లోతుగా శ్వాస తీసుకోవడం , వదలడం జరుగుతుంది. మానసిక ఏకాగ్రత.. వ్యాయామం చేసే సమయంలో దృష్టి మొత్తం శరీరం , శ్వాసపైనే ఉంటుంది. దీనివల్ల బయటి ఆలోచనల నుంచి మనస్సుకు విశ్రాంతి లభిస్తుంది. తాయ్ చి అందించే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. సోషల్ మీడియాలో ఇది కేవలం ఒక ఫ్యాషన్ గా మాత్రమే ట్రెండ్ కావడం లేదు, దీని వెనుక ఎన్నో శాస్త్రీయ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి తగ్గింపు.. ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన సర్వసాధారణమయ్యాయి. తాయ్ చి లోని లోతైన శ్వాస , ఏకాగ్రతతో కూడిన కదలికలు నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తాయి. ఇది శారీరక ఒత్తిడిని తగ్గించి, మనస్సుకు తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. శరీర బ్యాలెన్స్ , దృఢత్వం.. వయసు పైబడిన వారికి లేదా కాళ్ళ బలం తక్కువగా ఉన్నవారికి తాయ్ చి ఒక వరప్రసాదం. ఇది కాళ్ళు, నడుము భాగాల్లోని కండరాలను బలోపేతం చేసి, శరీర సమతుల్యతను పెంచుతుంది. దీనివల్ల కింద పడిపోయే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.. ఇది తక్కువ తీవ్రత కలిగిన వ్యాయామం అయినప్పటికీ, రక్తాప్రసరణను మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా చేయడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది, గుండె పనితీరు మెరుగుపడుతుంది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం.. ఆర్థరైటిస్ (కీళ్ల వాతం) లేదా కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. వేగవంతమైన వర్కౌట్ల వల్ల కీళ్లపై పడే భారంతో పోలిస్తే, తాయ్ చి కీళ్లను మెల్లిగా కదిలిస్తూ నొప్పులను తగ్గిస్తుంది. శ్వాసకోశ వ్యవస్థకు మంచిది.. దీనిలో శ్వాసపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. శరీరంలోని ప్రతి కణానికి ప్రాణవాయువు సమృద్ధిగా అందుతుంది. నిద్రలేమి సమస్యకు పరిష్కారం.. ప్రతిరోజూ కొద్దిసేపు తాయ్ చి సాధన చేయడం వల్ల రాత్రి వేళల్లో మంచి, ప్రశాంతమైన నిద్ర పడుతుందని అనేక పరిశోధనల్లో తేలింది. ఏకాగ్రత , జ్ఞాపకశక్తి.. శరీరం , మనస్సు రెండింటినీ ఒకేసారి ఉపయోగించడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇది ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంచడంలో దోహదపడుతుంది. ఎవరైనా చేయవచ్చా? తాయ్ చి యొక్క అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే, దీనికి ప్రత్యేక పరికరాలు కానీ, పెద్ద స్థలం కానీ అవసరం లేదు. చిన్న పిల్లల నుంచి వయోవృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ దీనిని సాధన చేయవచ్చు. ఎటువంటి శారీరక శ్రమ లేకుండా, సున్నితమైన పద్ధతిలో ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన మార్గం.                    *రూపశ్రీ.