LATEST NEWS
తమిళ చిత్రసీమలో అగ్ర నటుడిగా వెలుగొందుతున్న విజయ్ తమిళగ వెట్రి కజగం  పార్టీని స్థాపించి రాజకీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. విజయ్ రాకతో తమిళనాడు రాజకీయ సమీకరణాలు మారుతాయా?  అనే చర్చ సర్వత్రా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయ్ రాజకీయ భవిష్యత్తుపై తనదైన శైలిలో స్పందించారు. ముఖ్యంగా విజయ్‌ని తన మిత్రపక్షం నేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పోలుస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చకు దారితీశాయి.  విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే..  ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు. పవన్ పదేళ్ల పాటు ఓపికగా పోరాడి నేడు ఈ స్థాయికి చేరుకున్నారన్నారు.  పవన్ కళ్యాణ్ 2014లో పార్టీ పెట్టినప్పటికీ, తక్షణ అధికారం కోసం పాకులాడకుండా క్షేత్రస్థాయిలో సమస్యలపై పోరాడారు. ఓటములు ఎదురైనా వెరవకుండా, వెన్ను చూపకుండా నిలబడ్డారు.  ఆ నిబద్ధతే నేడు ఆయనను ఏపీ రాజకీయాల్లో కీలక శక్తిగా మార్చిందని చంద్రబాబు చెప్పారు. విజయ్ కూడా అదే బాటలో పయనిస్తేనే ఫలితం ఉంటుందని చంద్రబాబు పరోక్షంగా సూచించారు. సినిమా క్రేజ్ ఓట్లను తెచ్చిపెట్టొచ్చు కానీ..  రాజకీయాల్లో స్థిరపడాలంటే ప్రజలతో మమేకం కావడమొక్కటే మార్గమని చంద్రబాబు చెప్పారు.  తమిళనాడులో ఇప్పటికే డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి బలమైన శక్తులు ఉన్నాయి. ఈ తరుణంలో విజయ్ తన పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ ఏపీలో ఎలాగైతే తనకంటూ ఒక ప్రత్యేక ఓటు బ్యాంకుని సృష్టించుకున్నారో, విజయ్ కూడా అదే తరహాలో యువతను, మహిళలను ఆకట్టుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు మాటల్లో కూడా ఇదే వ్యూహం కనిపిస్తోంది.  మరోవైపు, పవన్ కళ్యాణ్ నాయకత్వ లక్షణాలను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించడం వారిరువురి మధ్యా ఉన్న బాండింగ్ కు నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ త్యాగాలకు సిద్ధపడ్డారని చంద్రబాబు ప్రత్యేకంగా చెప్పడం కూటమి ధర్మాన్ని ఆయన తు.చ. తప్పకుండా పాటిస్తున్నారనడానికి తార్కానంగా చెబుతున్నారు.   మొత్తానికి విజయ్ రాజకీయ ప్రయా ణం సాఫీగా సాగాలన్న ఆశాభావం వ్యక్తం చేసిన చంద్రబాబు.. నిలదొక్కుకుని రాణించాలంటే మాత్రం పవన్ కల్యాణ్ ను మోడల్ గా తీసుకోవాలని చెప్పకనే చెప్పారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ముఖద్వారంగా భావించే ఉత్తరాంధ్రలో  వైపీపీ ప్రభ పూర్తిగా మసకబారింది. గతంలో ఈ ప్రాంతంపై   పట్టు సాధించిన వైసీపీ ప్రస్తుతం చతికిలపడింది. పొలిటికల్ గా ఉత్తరాంధ్రలో ఆ పార్టీ ఇసుమంతైనా ప్రభావం చూపలేని పరిస్థితులకు దిగజారింది.   గత ఎన్నికలలో ఓటమి తరువాత ఆ పార్టీ ఉత్తరాంధ్ర నేతలలో అంతర్గతవిభేదాలు ఈ ప్రాంతంలో పార్టీ కుదేలయ్యేలా చేశాయి.   విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో  పార్టీ కేడర్‌ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత  స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు. దీంతో ఆయన చేసేదేం లేక చేతులెత్తేసి విశాఖ నగరానికే పరిమితమయ్యారు.    శ్రీకాకుళం జిల్లాలో  వైసీపీ పూర్తిగా ధర్మాన సోదరులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు వంటి నేతలను స్థానిక నాయకత్వమే పక్కన పెట్టింది. ఇందుకు విరుద్ధంగా, కింజరాపు కుటుంబం నేతృత్వంలో టీడీపీ జిల్లా వ్యాప్తంగా తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. జనసేన మద్దతు కూడా తోడవడంతో శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ఇక పుంజుకోవడం కష్టసాధ్యమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అదే విధంగా విజయనగరంలోనూ వైసీపీ కుదేలైంది. ఒకప్పుడు జిల్లాపై గట్టి పట్టున్న బొత్స సత్యనారాయణకు పార్టీలో ప్రాధాన్యత తగ్గడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. విజయనగరం జిల్లాలో  పార్టీ ముక్కలు ముక్కలుగా చీలిపోయి వర్గపోరు పరాకాష్టకు చేరుకుందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  కాగా జిల్లాలో జనసేన, తెలుగుదేశం పార్టీలు ఐక్యంగా పని చేస్తుండటంతో జిల్లాలో కూటమి బలం పెరిగింది.    ఇక విశాఖ జిల్లాలో వైసీపీ పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారింది. అక్కడ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు గుడివాడ అమర్నాథ్ కు పార్టీ అధిష్టానం ఇసుమంతైనా ప్రాధాన్యత ఇవ్వడం లేదని అంటున్నారు. ఇక మిగిలిన స్థానిక నేతలు కూడా పార్టీ వ్యవహారాలలో అంటీముట్టనట్టు వ్యవహరిస్తుండటంతో జిల్లాలో వైసీపీ పరిస్థితి ఉండీ లేనట్లుగా మారిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఏ రకంగా చూసినా  ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో వైసీపీ వర్గపోరుతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కీలక నేతల మధ్య ఉన్న విభేదాలు, సమన్వయ లేమి కారణంగా ఆ పార్టీ క్యాడర్ నిస్తేజంగా మారిపోయింది.   తక్షణమే నష్టనివారణ చర్యలు చేపట్టకపోతే ఈ ప్రాంతంలో వైసీపీ ఉనికే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
  నాదెండ్ల భాస్కరరావు  1935 జూన్ 23న  పిచ్చయ్య, వెంకాయమ్మ దంపతులకు గుంటూరు జిల్లా తెనాలి డివిజన్‌లోని దోసేపూడి గ్రామంలో జన్మించారు. బాల్యం మొత్తం అక్కడే గడిచింది. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆయన చదువులో రాణించారు. చిన్ననాటి నుంచే దేశభక్తి భావాలు కలిగిన వ్యక్తిగా ఎదిగిన భాస్కరరావుపై చదువుకునే రోజులలోనే రాజకీయాల ప్రభావం ఎక్కువగా ఉండేది. సమకాలీన రాజకీయాలు, సమాజంలోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉండేవారు. హైదరాబాద్‌లో బీఏ పూర్తిచేసి, అక్కడే ఈవెనింగ్ లా కాలేజీలో బి.ఎల్. (LLB) పట్టా పొందారు. అనంతరం న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1959లో  లలితని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. న్యాయవాదిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మంచి పేరు సంపాదించిన ఆయన, అదే సమయంలో రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు. కాంగ్రెస్ పార్టీలో చేరి, అనంతరం ఇందిరా కాంగ్రెస్‌లో ఏపీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. 1978లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978 నుండి 1989 వరకు రాష్ట్ర మంత్రివర్గంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. 1984 ఆగస్టు 16 నుండి సెప్టెంబర్ 16 వరకు ఒక నెలపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించారు. మర్రి చెన్నారెడ్డి,  టి. అంజయ్య మంత్రివర్గాల్లో కూడా పనిచేశారు. 1998లో ఖమ్మం నియోజకవర్గం నుండి 12వ లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. 1982 మార్చి 29న నందమూరి తారక రామారావు తెలుగు దేశం పార్టీని స్థాపించగా, 1983 ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించింది. ఎన్టీఆర్ ప్రభుత్వంలో నాదెండ్ల ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. భాస్కరరావుకి ఇద్దరు కుమారులు నాదెండ్ల మురళీ,  నాదెండ్ల మనోహర్. చిన్న కుమారుడు మనోహర్ 2004లో తెనాలి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్‌గా, 2011 నుండి 2014 వరకు చివరి శాసనసభ స్పీకర్‌గా సేవలందించారు. తరువాత 2018లో కొణిదెల పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరి ప్రస్తుతం రాష్ట్ర పౌర సరఫరాలు, ఆహారం, వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు
  తమిళనాడులో ఎన్డీయేకు పట్టం కట్టండి.. చెన్నైలో సీఎం చంద్రబాబు పిలుపు. చెన్నై ఎందుకు వెనుకబడింది?: తమిళ ఓటర్లకు చంద్రబాబు సూటి ప్రశ్న. ప్రధాని మోదీ నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష.. తమిళనాడులో చంద్రబాబు ప్రచారం తమిళనాడు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి మద్దతు తెలపాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళ ప్రజలను కోరారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన చెన్నైలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ, ప్రజలు మార్పును కోరుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశ ప్రగతి కోసం సుదూర లక్ష్యాలతో పనిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం ఎంతో అవసరమని చంద్రబాబు స్పష్టం చేశారు. సమర్థవంతమైన పాలన అందించే శక్తి కేవలం ఎన్డీయేకు మాత్రమే ఉందని, రాష్ట్రం ఆర్థికంగా, మౌలిక వసతుల పరంగా వృద్ధి చెందాలంటే సరైన ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆయన నొక్కి చెప్పారు. చెన్నై నగరంపై తనదైన శైలిలో విశ్లేషణ చేసిన సీఎం చంద్రబాబు, ఒకప్పుడు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉన్న ఈ నగరం, ప్రస్తుత పరిస్థితుల్లో ఎందుకు వెనుకబడిందనే చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. మౌలిక వసతులు, ఐటీ రంగాలు ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే చెన్నైలో మందగించాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్, బెంగళూరు నగరాలు పెట్టుబడులను ఆకర్షిస్తూ, వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయని, కానీ చెన్నై ఆ పోటీలో వెనకపడిందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలోని విమానాశ్రయం వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. అనుభవజ్ఞుడైన నాయకుడిగా, మారుతున్న కాలానికి అనుగుణంగా చెన్నైకి పూర్వవైభవం తేవాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు. సమర్థమైన పాలన, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే, తమిళనాడు మళ్లీ అగ్రపథంలో నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల ప్రచారం తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి, తమిళనాడు అభివృద్ధిపై చర్చ చేయడం, ఎన్డీయేకు ఓటు వేయాలని పిలుపునివ్వడంపై వివిధ వర్గాల నుండి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో తమిళనాడు ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. 
అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాల్లో పాకిస్థాన్ సైన్యాధిపతి జనరల్ అసిమ్ మునీర్ ఒక కీలక వ్యక్తిగా అవతరించడం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.  డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా యంత్రాంగం మునీర్‌ను రెండు దేశాల మధ్య ఒక దౌత్య వంతెనగా (డిప్లమాటిక్ బ్రిడ్జి) భావిస్తున్నప్పటికీ..  ఇది అమెరికా జాతీయ భద్రతకు ఏ మేరకు మేలు చేస్తుందనే దానిపై నిపుణుల్లో పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.    దౌత్యం కంటే.. నష్టనివారణ అంటే డ్యామేజ్ కంట్రోల్ వైపే మొగ్గు చూపుతున్న ట్రంప్ శైలి.. వాషింగ్టన్‌లోని భద్రతా వర్గాలను కలవరపెడుతోంది. మునీర్ ప్రస్తుతం కేవలం పాకిస్థాన్ సైనిక వ్యవహారాలకే పరిమితం కాకుండా.. టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య జరుగుతున్న రహస్య చర్చలలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.  అయితే..  ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. మునీర్‌కు ఇరాన్ అగ్రశ్రేణి సైనిక వర్గాలతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఒకవైపు చర్చలకు సహకరిస్తాయని భావిస్తున్నా..  అదే సమయంలో ఆయన విశ్వసనీయతపై అమెరికా నిఘా సంస్థలు   అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మధ్యవర్తిత్వం పేరుతో ఆయన అమెరికా ప్రయోజనాలకు గండి కొట్టేలా వ్యవహరిస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవ్వడమే కాకుండా, ఆ దిశగా  హెచ్చరికలు సైతం జారీ అవుతున్నాయి. చరిత్రను ఒకసారి పరిశీలిస్తే..  పాకిస్థాన్ విషయంలో అమెరికా నమ్మకం పలుమార్లు వమ్ము అయింది.  ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారంలో తాలిబాన్‌లకు మద్దతు ఇస్తూనే..  అమెరికా నుంచి భారీగా ఆర్థిక సాయాన్ని పొందిన గత రికార్డులను భద్రతా నిపుణులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. రెండు వైపులా చక్రం తిప్పే పాక్ వ్యూహం వల్ల వాషింగ్టన్ ఇప్పటికే చాలా నష్టపోయింది. ఇప్పుడు మునీర్‌పై అతిగా ఆధారపడటం అనేది ఒక రకమైన  జియోపాలిటికల్ జూదం  (జియోపాలిటికల్ గ్యాంబిల్)గా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఈ పరిణామాల మధ్య అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన పాకిస్థాన్ పర్యటనను అకస్మాత్తుగా రద్దు చేసుకోవడం గమనార్హం. దీనికి భద్రతా కారణాలు సాకుగా చూపుతున్నా..  తెరవెనుక నెలకొన్న అనిశ్చితి, మునీర్ నెట్‌వర్క్‌పై   అపనమ్మకమే   కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   సాంప్రదాయ దౌత్య మార్గాలను కాదని, స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ వంటి వ్యక్తిగత సన్నిహితుల ద్వారా ట్రంప్ ఈ వ్యవహారాన్ని నడిపించడం చర్చలకు ఇసుమంతైనా పారదర్శకత లేదనే అనుమానాలను  బలపరుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ తన వ్యాపార శైలికి తగ్గట్టుగా  డీల్ ఫస్ట్ అనే సూత్రంతో ముందుకు వెళ్తున్నారు. ఆయన దృష్టిలో మునీర్ ఒక  ఉపయోగకరమైన  వ్యక్తిగా కనిపిస్తున్నారు. అందుకే ఆయనను తన  ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్  గా మునీర్ ను అభివర్ణిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.  అయితే అంతర్జాతీయ సంబంధాలు కేవలం వ్యక్తిగత సాన్నిహిత్యం మీద కాకుండా.. స్పష్టమైన నిబంధనలు,  పారదర్శకత మీద నడవాలని నిపుణులు సూచిస్తున్నారు. మునీర్ విషయంలో పారదర్శకత సందేహాస్పదంమే. .మధ్యవర్తులను నియమించుకోవడం సులభమే కానీ, వారిని నియంత్రించడం చాలా కష్టం అంటారు. పాకిస్థాన్ గతం,  మునీర్‌కు ఉన్న ఇతర దేశాల సంబంధాలు అమెరికా వ్యూహాన్ని బలహీనపరిచేవిగానే ఉన్నాయి.  శాంతి ఒప్పందాల కోసం తీసుకుంటున్న ఈ చర్యలే రేపు భద్రతా లోపాలుగా మారితే అమెరికా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందనడంలో సందేహం లేదు.    ప్రస్తుతానికి మునీర్‌ను ఎంతగా నమ్మినా, అప్రమత్తత అవసరమని అమెరికా నిఘా వ్యవస్థ స్పష్టం చేస్తోంది. చివరిగా అమెరికాకు ఇప్పుడు కావాల్సింది కేవలం మధ్యవర్తులు కాదు, ఒక పటిష్టమైన, అదే సమయంలో విశ్వసనీయ విదేశాంగ విధానం. వ్యక్తిగత సంబంధాలపై ఆధారపడి చేసే దౌత్యం తాత్కాలికంగా ఫలితాలను ఇచ్చినా..  దీర్ఘకాలంలో దేశ ప్రయోజనాలను ప్రమాదంలో నెట్టే అవకాశం ఉంది. మరి మునీర్ అనే ఈ దౌత్య వంతెన అమెరికాను సురక్షితంగా ఇవతలి ఒడ్డుకు చేరుస్తుందో లేక కొత్త సమస్యల్లోకి నెడుతుందో వేచి చూడాలి. -సీతారాం కంఠంనేని
ALSO ON TELUGUONE N E W S
కామెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సత్య, హీరోగా మారి చేసిన లేటెస్ట్ మూవీ ‘జెట్లీ’ (Jetlee). రితేష్ రానా దర్శకుడు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా మరోసారి క్విర్కీ, డిఫరెంట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించబోతుందని ప్రామిస్ చేస్తోంది. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తున్నారు. మే 1న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ కథలో సత్య పోషిస్తున్న పాత్ర ప్రత్యేకంగా నిలుస్తోంది. జ్ఞాపకశక్తి కోల్పోయిన ఒక వ్యక్తిగా, తనను తాను వెతుక్కుంటూ వింత పరిస్థితుల్లో ఉంటాడు. కానీ తన ప్రశ్నలకు సమాధానాలు దొరకడం బదులుగా, చుట్టూ ఉన్నవారి నుంచి  సెటైర్లు ఎదురవుతాయి. ఈ కాన్సెప్ట్‌ను ఎమోషనల్‌గా కాకుండా పూర్తిగా కామెడీ ట్రాక్‌లో నడిపించడం ఈ సినిమాకి ప్రధాన బలం. ట్రైలర్‌లో కనిపించే మరో ఆసక్తికర అంశం.. రియాలిటీ, పర్సెప్షన్ మధ్య ఉన్న కాంట్రాస్ట్. అందరికీ సత్య ఒక జోక్‌లా కనిపించినా, తాను మాత్రం పెద్ద యాక్షన్ హీరోలా బిహేవ్ చేస్తాడు. ఈ మిస్మ్యాచ్ వల్లే సినిమా మొత్తం నవ్వుల వర్షంగా మారుతోంది. యాక్షన్ సీన్స్ కూడా సీరియస్‌గా కాకుండా, ప్యారడీ టచ్‌తో ఉండటం ప్రత్యేక ఆకర్షణ. సత్య తన సహజమైన స్టైల్‌లో అండర్‌ప్లే పెర్ఫార్మెన్స్‌తో నవ్వులు పండించారు. రియా సింగ్ గ్లామర్‌తో పాటు యాక్షన్‌లో కూడా ఆకట్టుకుంటుండగా, వెన్నెల కిషోర్, వైవా హర్ష తమ ట్రేడ్‌మార్క్ కామెడీతో కథను మరింత ఎంటర్‌టైనింగ్‌గా మార్చారు. దర్శకుడు రితేష్ రానా తన ప్రత్యేకమైన స్టైల్‌ను ఈసారి మరింత ఎలివేట్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సత్య మాట్లాడుతూ.. "రితేష్ కథ చెప్పగానే చాలా నచ్చింది. ఈ క్యారెక్టర్ చాలా నచ్చి సినిమా చేశాను. ఇందులో క్యారెక్టర్ హీరోలా కాకుండా కామెడీ స్పేస్ లోనే వుంటుంది. యాక్షన్ కామికల్ గానే వుంటుంది. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ తో జరిగే ఇంటరాక్షన్ చాలా ఆసక్తికరంగా వుంటుంది. ప్రతి సెగ్మెంట్ ని చాలా ఎంజాయ్ చేశాను. రితేష్ స్టయిల్ లో వర్క్ చేయడంతో ఇంట్రస్టింగ్ గా వుంటుంది. ఈ సినిమాలో చిరంజీవి గారి రిఫరెన్స్ లు వుంటాయి. మే1న అందరూ థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను." అన్నారు డైరెక్టర్ రితేష్ రానా మాట్లాడుతూ.. "ఇది యాక్టర్ ని బట్టి డిజైన్ అయ్యే  స్టొరీ. సత్య అనుకున్నప్పుడు తన స్టయిల్ క్యారెక్టరైజేషన్ బట్టి స్క్రిప్ట్ ని డిజైన్ చేశాం. సత్య యాడ్ అవ్వడం వలన కామెడీ మరింత ఎలివేట్ అయ్యింది. సినిమా విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను. మిషన్ ఇంపాజిబుల్ సినిమా సత్యతో తీస్తే ఎలా వుంటుందో 'జెట్లీ' అలా వుంటుంది.  ఇందులో యాక్షన్, కామెడీ, ట్విస్ట్ లు అన్నీ వుంటాయి. తెలుగులో ఈ సినిమా చాలా కొత్తగా వుంటుంది." అన్నారు. ప్రొడ్యూసర్ చెర్రీ మాట్లాడుతూ.. "ఈ సినిమాను ఐదు నెలల ఐదు రోజుల్లో షూటింగ్, ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేశాం. నిర్మాతగా ఇంతకంటే కావాల్సింది ఏమీలేదు. డైరెక్టర్ రితేష్ కి థాంక్ యూ. ఈ సినిమా విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను. సత్య, వెన్నెల కిషోర్ గారు చాలా బిజీగా ఉండే ఆర్టిస్టులు అయినప్పటికీ ఎంతో కోఆపరేట్ చేశారు. ఈ సినిమాకి ఒక ప్రత్యేకమైన యూఎస్పీ ఉంది. దాదాపు 80 శాతం షూటింగ్ ఫ్లైట్‌లోనే చేశాం. ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో అలాంటి కాన్సెప్ట్‌తో సినిమా రాలేదు. ఫ్లైట్‌లో జరిగే సంఘటనలు, కామెడీతో ఈ సినిమా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. రితేష్ తనదైన స్టైల్‌లో మంచి ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఇది ఒక మంచి థ్రిల్లర్. నిజానికి ముందుగా పెద్ద హీరోగా ఇంటెన్స్ థ్రిల్లర్‌గా చేయాలని అనుకున్నాం. కానీ కుదరలేదు. తర్వాత కామెడీ థ్రిల్లర్‌గా మార్చాం. కామెడీ అంటే రితేష్ కి ముందుగా గుర్తొచ్చే పేరు సత్య. సత్య, వెన్నెల కిషోర్ ఇద్దరినీ తీసుకుని ఈ సినిమా చేశాం. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది. మే 1న అందరూ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను." అన్నారు. వెన్నెల కిషోర్ మాట్లాడుతూ.. "ఇందులో నా పేరు మీరు నేరుగా థియేటర్‌లో తెలుసుకోవాలి. నేను దుబాయ్ నుంచి ఫ్లైట్‌లో వస్తున్నప్పుడు, ఆ ఫ్లైట్‌లో ఊహించని చిత్రవిచిత్రాలు జరుగుతాయి. నేను టిఎఫ్ఐ  బానిసను. కథ చెప్పగానే క్లూస్ పట్టేస్తుంటాను. టైమ్ పాస్ కోసం ఒక సినిమా సుడోకు గేమ్ ఆడుతుంటాను. ఆ గేమ్ నేను పూర్తి చేశానా లేదా అనేది మే 1న  ‘జెట్‌లీ’ సినిమా చూసి తెలుసుకోవాలి." అన్నారు. హీరోయిన్ రియా సింఘా  మాట్లాడుతూ.. "ఇందులో నా పేరు శివాని. నా పాత్ర ఎలా ఉంటుందో మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ప్రతి ఒక్కరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. మొత్తం ఫ్లయిట్ లో చేసిన సినిమా ఇది. ఆడియన్స్ కి చాలా కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. " అన్నారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. "ఇందులో నేను ఫాదర్ ఫీనిక్స్ అనే పాత్ర చేస్తున్నాను. కొందరు శైతాను రక్షకులు. వాళ్ళతో చాలా డేంజర్.  నాకు ఫ్లైట్‌లో ఎదురైన సంఘటన ఏమిటో, అది ఎలా మారిందో మే 1న మీరు థియేటర్‌లో చూసి తెలుసుకోవాలి." అన్నారు. గుండు సుదర్శన్ మాట్లాడుతూ.. "ఇందులో నేను నూర్జహాన్ అనే పాత్రలో కనిపిస్తాను. నాకు ఫ్లైట్‌లో ఒక ఆపరేషన్ జరుగుతుంది. దాని వల్ల పెద్ద గొడవ ఏర్పడుతుంది. అది ఏమిటో మే 1న సినిమా చూసి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను." అన్నారు.  
  వైవిధ్యమైన సినిమాలని అభిమానులు, ప్రేక్షకులకి అందించడానికి సెల్యులాయిడ్ నే స్వయంగా కొంత మంది హీరోలని ఎంచుకొని వాళ్ల దారిని సినీ రహదారిగా మారుస్తుంది. అలాంటి ఒక హీరో నాచురల్ స్టార్ నాని(Nani). ప్రస్తుతం పాన్ ఇండియాని షేక్ చేయడానికి 'ది ప్యారడైజ్'(The Paradise)ని రెడీ చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన  అప్ డేట్స్ ని అభిమానులు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా  చూసుకుంటూనే వాళ్ళు వెళ్లే దారిలో ఉన్న థియేటర్స్ వైపు ఒక లుక్ వేస్తు ప్యారడైజ్ రిలీజ్ రోజు థియేటర్స్ లోకి పరుగెత్తుకుంటూ వెళ్లడాన్ని తలుచుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు అంతకంటే ముందు థియేటర్స్ కి వెళ్లాల్సిన పరిస్థితి. నాని తన అభిమానులు, ప్రేమికులు, మూవీ లవర్స్, ప్రేక్షుకుల కోసం 'నిన్ను కోరి'  రీ రిలీజ్ చేస్తున్నాడు. వేసవి వేడి తాలూకు సెగని కనిపించకుండా చేయడానికి  మే 8 న  ల్యాండ్ అవుతున్నాడు. దీంతో థియేటర్స్ లో మరో సారి నాని చరిష్మా కొనసాగబోతుంది. ప్రేమికులకి, ప్రేమలో విడిపోయి వేరే పెళ్లిళ్లు చేసుకున్న వారికి నిన్ను కోరి ఆల్ టైం ఫేవరేట్ మూవీ. ప్రేమ అనేది మరణాన్ని దూరం చేసే  అమృతం కంటే గొప్పదని కూడా చెప్పిన ఈ మూవీలో నానితో పాటు ప్రతి ఒక్కరి నటన ఎంతగానో ఆకట్టుకుంటుంది. 'ఉమామహేశ్వరరావుగా నాని, పల్లవిగా  నివేదా థామస్, అరుణ్ క్యారక్టర్ లో ఆది పినిశెట్టి ప్రాణం పోశారు.  also read: Allu family: అల్లు ఫ్యామిలీ పుట్టిందే తెలుగు సినిమా కోసమా!. వైరల్ అవుతున్న తాజా న్యూస్  మ్యూజిక్ డైరెక్టర్  గోపీ సుందర్ నుంచి వచ్చిన మ్యూజిక్ కూడా నిన్ను కోరి కి అదనపు ఆకర్షణగా నిలిచాయి. అడిగా అడిగా', 'ఉన్నట్టుండి గుండె', 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ వైజాగ్' వంటి పాటలు ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ ప్లేలిస్ట్‌లో ఉన్నాయి. ఇప్పుడు వెండితెరపై 4K క్వాలిటీతో సాంగ్స్  వినడం గొప్ప అనుభూతిని ఇవ్వనుంది. శివ నిర్వాణ(Siva Nirvana)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ అందమైన ప్రేమకావ్యం విడుదలై ఏడు సంవత్సరాలు.  డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ పై ఆర్ఆర్ఆర్ దానయ్య నిర్మించాడు. ఇక మహా నటుడు రావు గోపాలరావు గారు చెప్పినట్టు 'చూడమ్మా శాంభవి ఒక్కొక్కలకి ఒక్కో సీజన్. కాబట్టి ఇది మా సీజన్ అన్నట్టుగా నిన్నే కోరి రాకతో మే మంత్ లవర్స్ సీజన్ అని చెప్పవచ్చు.     
ఏది ఏమైనా ప్రస్తుతం అల్లు వారి పని మూడు పువ్వులు ఆరుకాయలు అనే చందాన ఉంది. అవసరమైతే ఆ సామెతని మూడు పువ్వులు పన్నెండు కాయలుగా కూడా మార్చగలిగే అంత జోష్ తో అల్లు ఫ్యామిలీ ముందుకు దూసుకుపోతుంది. పుష్ప సిరీస్ తో పాన్ ఇండియా వ్యాప్తంగా అల్లుఅర్జున్(Allu Arjun)తన స్టామినాని పెంచుకోవడంతో పాటు 'రాకా'తో సరికొత్త సంచలనాలకి సిద్ధంగా ఉండటం, సినిమా కోసమే ఆసియాలోనే ఎక్కడ లేని ఫ్యూచర్స్ తో హైదరాబాద్ కోకాపేటలో అల్లు సినిమాస్ నిర్మించడంతో అల్లు ప్రతిష్ట అంతకు అంత పెరుగుతూనే ఉంది. రీసెంట్ గా అల్లు ఫ్యామిలీకి సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి సినీ సర్కిల్స్ లో గుడ్ మార్నింగ్ హోదాలో చక్కర్లు కొడుతుంది. ఆ న్యూస్ ఏంటో చూద్దాం   అల్లు కాంపౌండ్ లో ఇప్పటికే  గీతా ఆర్ట్స్(Geetha Arts), గీతా ఆర్ట్స్ 2 బ్యానర్స్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మూడో బ్యానర్ నిర్మిస్తునట్టుగా టాక్. ఈ మూడో బ్యానర్ ని తీసుకొస్తుంది ఎవరో కాదు అల్లు శిరీష్. దీంతో ఇప్పుడు ఈ న్యూస్ క్రేజీ న్యూస్ గా మారింది. అల్లు శిరీష్ హీరోగా అనేక చిత్రాలని చేసినా పెద్దగా సక్సెస్ ని అందుకోలేకపోయాడు. రీసెంట్ గానే తన వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో అల్లు శిరీష్ నిర్మాణ రంగంలో అడుగుపెడుతుండటం ఆసక్తికరంగా మారింది. మరి మనం ఏదో కాన్ఫిడెన్స్ గా చెప్పుకుంటున్నాం కానీ రూమర్ అనే వాళ్ళు కూడా లేకపోలేదు. also read: Divyanka Sirohi: గుండెపోటుతో ప్రముఖ నటి మృతి  ఇక గీతా ఆర్ట్స్, గీతా ఆర్ట్స్ 2  ఈ రెండు సంస్థలు  సక్సెస్ ఫుల్ గానే తమ సినీ జర్నీని కొనసాగిస్తున్నాయి. గీతా ఆర్ట్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు. తెలుగు సినిమా ఎదగడం,గీతా ఆర్ట్స్ ఎదుగుతుండటం పారలాల్ గా జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉంటాయి. మరి మూడో బ్యానర్ కూడా నిజమైతే తెలుగు సినిమా కోసమే అల్లు ఫ్యామిలీ పుట్టినట్టు అవుతుంది.  
  -ఎంతో భవిష్యత్తు ఉంది  -కానీ చిన్న వయసులోనే ఎందుకిలా   -రెస్ట్ అనేది లేకపోవడం గుండెపోటుకి కారణమా! ఎందుకో తెలియదు కానీ మరణానికి కాస్తయినా జాలి,దయ లేకుండా పోతుంది. ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియని రోజులు అనే వర్డ్ పై తన ఆధిపత్యాన్ని చెలాయిస్తూనే ఉంది. రీసెంట్ గా ఎంతో భవిష్యత్తుని ఉహించుకొని ముందుకు వెళ్తున్న ప్రముఖ నటి దివ్యంక సిరోహి చనిపోవడం ప్రతి ఒక్కర్ని కలిచి వేస్తుంది. పూర్తి వివరాలు చూద్దాం. దివ్యంక సిరోహి(Divyanka sirohi)..జీ టీవీ లో ప్రసారమైన  'బానో మెయిన్ తేరి దుల్హన్' అనే షోతో పరిచయమయ్యి అనతికాలంలోనే ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్, రాజ్‌నగర్  తన స్వస్థలం. మంగళవారం రాత్రి దివ్యంక అకస్మాత్తుగా  ఇంట్లో కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని హాస్పిటల్ కి తరలించారు.  అప్పటికే ఆమె గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.  పలు చిత్రాల్లో కూడా నటించిన దివ్యంక నుంచి వచ్చిన  50కి పైగా  మ్యూజిక్ వీడియోలు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా మాసూమ్ శర్మ, అమిత్ సైనీ వంటి ప్రముఖ గాయకులతో కలిసి ప్రైవేట్ ఆల్బమ్స్ ఓవర్ నైట్  స్టార్‌ డమ్ ని కట్టబెట్టాయి.  టిక్‌టాక్ వీడియోలతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. టిక్ టాక్ బాన్ అయ్యాక ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా తన సత్తా చాటుతు 1.3 మిలియన్లకి  పైగా సంపాదించుకుంది. మీరట్‌లోని చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ నుంచి BCA పూర్తి చేసి నటనపై ఉన్న మక్కువతో సాఫ్ట్‌వేర్ రంగం వైపు వెళ్లకుండా గ్లామర్ ప్రపంచాన్ని ఎంచుకున్నారు. also read: Vijay deverakonda: యాక్షన్ స్టైల్  ని విజయ్ దేవరకొండ మొదలు పెట్టాడా! దివ్యంక మరణవార్త తెలియగానే అభిమానులు సోషల్ మీడియా వేదికగా దివ్యంక గతంలో చేసిన పోస్టులని షేర్ చేస్తూ కన్నీటి పర్యంతమవుతున్నారు. గతేడాది ఆమె పెట్టిన ఒక పోస్ట్‌లో "శివా.. నన్ను నీ దగ్గరకు తీసుకెళ్లు" అనే క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ఆకస్మిక మృతి పట్ల హర్యానవీ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా పైన మనం చెప్పుకున్నట్టు మరణానికి  ఏ మాత్రం జాలి, దయ, కనికరం లేదు. మరణాన్ని శాశ్వత సమాధి రోజు చేసే రావాలని కోరుకుందాం. దివ్యంక వయసు ముప్పై సంవత్సరాలు.   
Following the success of the Mathu Vadalara franchise, actor Satya and director Ritesh Rana are back together for a new hijack comedy titled Jet Lee. The makers recently dropped the theatrical trailer, offering a glimpse into the film's eccentric premise. Instead of standard action tropes, the trailer suggests a lighthearted approach to the hijack genre, banking heavily on Satya's established comedic strengths. The trailer revolves around a hostage situation on a flight, where Satya’s character finds himself at the center of the chaos. Suffering from what appears to be memory loss or a severe case of delusion, he genuinely believes he is a larger-than-life action hero. The cuts highlight his unique body language and signature comic timing as he attempts to take charge of the crisis. Rhea Singha appears as an officer trying to logically salvage the situation, while Vennela Kishore is seen in a prominent supporting role. The footage hints at Satya portraying two different shades, driving the situational comedy.  On the technical front, Kaala Bhairava's background score complements the quirky tone typically associated with Ritesh Rana's direction. Produced by Mythri Movie Makers and Clap Entertainers, the film is gearing up for a theatrical release on May 1st.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
నిప్పులు కురిపించే యానిమేషన్స్, ఊహకందని యాక్షన్ సీక్వెన్స్‌లతో 'జెట్లీ' ట్రైలర్ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సత్య హీరోగా, రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ మిథ్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ మే 1న థియేటర్లలోకి రానుంది. ట్రైలర్ ఆరంభమే ఉత్కంఠను రేకెత్తించింది. సత్య తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించారు. ఒక భారీ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో సత్య తన యాక్షన్ స్కిల్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక వెన్నెల కిషోర్ మరియు ఇతర హాస్యనటుల కామెడీ టైమింగ్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. సినిమాలో విజువల్స్ మరియు గ్రాఫిక్స్ చాలా రిచ్ గా ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కీరవాణి వారసుడు కాల భైరవ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో వచ్చే మ్యూజిక్ ప్రేక్షకులకు రోమాంచితమైన అనుభూతిని కలిగిస్తోంది. ఈ చిత్రంలో రియా సింఘా కథానాయికగా నటిస్తుండగా, సత్య సరసన ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. యాక్షన్ సినిమాలకు సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చేలా ఈ సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. మే 1న విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో వేచి చూడాలి.
విక్టరీ వెంకటేష్ (Venkatesh), డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. (Aadarsha Kutumbam House No: 47) హైదరాబాద్‌లోని మలక్‌పేట్ మెట్రో స్టేషన్‌లో ఈ సినిమాకి సంబంధించిన ఒక కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్ర బృందం చిత్రీకరించింది. ఎప్పుడూ రద్దీగా ఉండే మెట్రో స్టేషన్‌లో వెంకటేష్ తన మార్క్ యాక్షన్‌తో విలన్లను ఊచకోత కోసే సన్నివేశం సినిమాకే హైలైట్‌గా నిలవనుందని తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమాల్లో యాక్షన్ కూడా చాలా స్టైలిష్‌గా ఉంటుంది, దానికి వెంకీ మామ మేనరిజమ్స్ తోడైతే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయం. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' చిత్రాలు క్లాసిక్స్‌గా నిలిచాయి. అయితే ఆ సినిమాలకు త్రివిక్రమ్ రచయితగా పనిచేశారు. మొదటిసారి త్రివిక్రమ్ డైరెక్షన్ లో వెంకటేష్ సినిమా చేస్తున్నారు.  ఈ సినిమాలో కూడా కడుపుబ్బ నవ్వించే కామెడీతో పాటు హృదయాన్ని హత్తుకునే కుటుంబ భావోద్వేగాలు ఉండబోతున్నాయి. శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి, ఈ చిత్రాన్ని దసరా పండుగ కానుకగా అక్టోబర్ నెలలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.   
    గోల్డెన్ స్పూన్ తో పుట్టాడురా అనుకునే మాట రేంజ్ లోనే  విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ని చూస్తే సినీ గోల్డెన్ స్పూన్ తో పుట్టాడని అనుకోవచ్చు. మరి ప్లాప్స్ లిస్ట్  చాలా వయ్యారంగా వంపులు తిరిగి కనపడుతున్నా పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తు అభిమానులకి  మై హునా అనే భరోసా కల్పిస్తున్నాడు. ప్రెజెంట్ తన శ్రీమతి రష్మిక(Rashmika)తో చేస్తున్న రణబాలి, రౌడీ జనార్ధన(Rowdy janardhana)శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్నాయి. సినీ సర్కిల్స్ లో రౌడీ జనార్ధన గురించి ఒక నయా అప్ డేట్ చక్కర్లు కొడుతుంది. అదేంటో చూద్దాం. Also read: Peddi: పెద్ది స్పెషల్ సాంగ్ లో గోల్డెన్ లెగ్ హీరోయిన్!.. నిజమవ్వాలని ఫ్యాన్స్ ఆశ రౌడీ జనార్ధనలో ఒక ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉందంట. సదరు ఎపిసోడ్ లో విజయ్ దేవరకొండ ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తాడట. సదరు యాక్షన్ సీన్స్ మూవీ మొత్తానికే మెయిన్ హైలైట్ గా నిలుస్తాయని సోషల్ మీడియాలో నయా అప్ డేట్ చక్కర్లు కొడుతుంది. ఈ న్యూస్ చూసిన ఫ్యాన్స్ రౌడీ జనార్దన ఊహల్లోకి వెళ్లిపోయారు.  స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మిస్తున్న రౌడీ జనార్ధనలో విజయ్‌కి జోడీగా కీర్తి సురేశ్‌ చేస్తుండగా సీనియర్‌ హీరో రాజశేఖర్‌(Rajasekhar)ముఖ్యమైన క్యారక్టర్ లో కనిపిస్తున్నాడు. ఈ సంవత్సరమే ప్రేక్షకుల ముందుకు రానుండగా రవి కిరణ్ కోలా(Ravikiran Kola) దర్శకుడు. విజయ్ రీసెంట్ గా హాయ్ నాన్న దర్శకుడు శౌర్యవ్ తో మరో కొత్త మూవీ అనౌన్స్ చేసాడు      
అక్కినేని వారసుడు అఖిల్ (Akhil Akkineni) తన కెరీర్‌లో సరైన కమర్షియల్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. 'ఏజెంట్' వంటి భారీ డిజాస్టర్ తర్వాత అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లెనిన్’ (Lenin). ఈ సినిమాపై అఖిల్ మాత్రమే కాకుండా, అక్కినేని అభిమానులు కూడా భారీ ఆశలే పెట్టుకున్నారు. అయితే, ఈ సినిమాను పక్కాగా మలచాలని తండ్రి నాగార్జున (Nagarjuna) రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, 'లెనిన్' అవుట్‌పుట్ చూసిన నాగార్జున కొన్ని కీలక మార్పులు సూచించారట. సినిమా గమనాన్ని దెబ్బతీసే కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయాలని ఆయన దర్శకుడి మురళీ కిషోర్ అబ్బూరుకి సలహా ఇచ్చినట్లు సమాచారం. నాగార్జునకు జడ్జిమెంట్ విషయంలో మంచి పట్టు ఉండటంతో, ఆయన సూచనల మేరకు టీమ్ ఇప్పుడు ప్యాచ్ వర్క్ పనుల్లో బిజీగా ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలోని క్లైమాక్స్ భాగం విషయంలో మేకర్స్ రాజీ పడకూడదని నిర్ణయించుకున్నారట. క్లైమాక్స్ మరింత ఎమోషనల్‌గా, పవర్‌ఫుల్‌గా ఉండేలా కొన్ని ప్యాచ్ వర్క్ సీన్స్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. క్లైమాక్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వాలని, థియేటర్ నుండి బయటకు వచ్చేటప్పుడు ఆ ఇంపాక్ట్ ఉండాలని నాగార్జున భావిస్తున్నారట. ప్రస్తుతం ఈ క్లైమాక్స్ రీషూట్‌కు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం. షూటింగ్ దాదాపుగా పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఎడిటింగ్, వీఎఫ్ఎక్స్ , బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాలని అఖిల్ కసిగా ఉన్నాడు. నాగార్జున పర్యవేక్షణలో రూపొందుతున్న ఈ మూవీ అఖిల్ కెరీర్‌ను మలుపు తిప్పుతుందేమో చూడాలి.  
Director Anil Ravipudi is gearing up for an exciting multi-starrer featuring Venkatesh Daggubati and Nandamuri Kalyanram in the lead roles. This project marks a significant reunion for Kalyanram and the director, who are teaming up after an 11-year gap since Anil's debut film, Pataas.  Additionally, this will be the fifth collaboration between Venkatesh and Anil, a combination that has consistently delivered box-office hits. The casting process is currently underway, and the director recently shared some exciting updates. During the recent LIK event, Anil officially confirmed that Krithi Shetty has been finalized as one of the female leads.  While she is set to share the screen with Kalyanram, the casting for the second female lead has also generated a lot of buzz. Reports strongly suggest that Keerthy Suresh will be starring opposite Venkatesh. Although her inclusion has not been officially announced by the makers yet, industry sources indicate she is locked in for the project.  The regular shoot for this highly anticipated film is expected to commence in June. Venkatesh and Keerthy Suresh will participate in the film's first schedule, which will begin right after Venkatesh wraps up his current project, AK47, directed by Trivikram Srinivas.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
పెళ్లి... ఎన్నో రొమాంటిక్ ఆలోచనలను గుర్తుకు తెచ్చే ఒక అందమైన పదం. బయటకు వెళ్లడం, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడం, ఖరీదైన బహుమతులు ఇచ్చుకోవడం.. వీటితో పాటు కాస్త ఆర్థికంగా బాగున్నవారైతే.. హనీమూన్ కు కూడా వెళ్తారు. పెళ్లయిన మొదట్లో..  కొన్ని నెలలు ఎంతో అద్బులంలా.. అంతా పరిపూర్ణంగా, సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ హనీమూన్  అయిపోయాక లేదా పెళ్లైన  రెండు మూడు నెలల తర్వాత.. అసలైన లైఫ్ మొదలవుతుంది.  ఇక్కడే అందరూ ఊహించుకునే పెళ్లి జీవితానికి,  వాస్తవానికి మధ్య చాలా తేడా ఉందని తెలుసుకుంటారు.  అసలు అంగీకరించలేని ఎన్నో విషయాలు బయటపడుతుంటాయి,  ఊహించుకున్న జీవితం చాలా రివర్స్ గా,  డిజప్పాయింట్ గా అనిపిస్తుంది.   పెళ్లి తర్వాత అర్థమయ్యే చేదు నిజాలు కొన్ని ఉన్నాయి. పెళ్ళి తర్వాత  జీవితం గురించి కలలు కనే ప్రతి ఒక్కరూ,  పెళ్లి తర్వాత జీవితాన్ని సినిమాటిక్ గా ఊహించుకునే ప్రతి ఒక్కరూ ఆ చేదు నిజాలను తెలుసుకోవాలి. దీని వల్ల పెళ్లి తర్వాత వారు డిజప్పాయింట్ అయ్యే పరిస్థితి ఎదురవ్వదు.  ఆ చేదు నిజాలు ఏంటో తెలుసుకుంటే..  ప్రేమ అంటే.. పెళ్లికి ముందు,  పెళ్లి తర్వాత కొన్ని రోజుల పాటు  ప్రేమ అంటే ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ, పొగడ్తలు చెప్పుకోవడమే అనుకుంటారు. నిజానికి చాలామందికి మొదట్లో అవే జరుగుతుంటాయి. కానీ పెళ్లైన రెండు మూడు నెలల తర్వాత సాధారణ  జీవితానికి తిరిగి వచ్చినప్పుడు, ప్రేమలో సరుకులు కొనడం, కరెంటు బిల్లు కట్టడం, బాధ్యతలు పంచుకోవడం కూడా ఉంటాయని మీరు గ్రహిస్తారు.  బయటకు వెళ్లి క్యాండిల్ లైట్ డిన్నర్ చేయాలని అనుకునేవారు.. పెళ్లైన కొన్ని నెలల తర్వాత.. ఈరోజు రాత్రి భోజనానికి ఏం వండాలి అని ఆలోచిస్తూ ఉంటారు. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కేవలం బెడ్ రూమ్ ముచ్చట కాదు.. అది ఇద్దరూ కలిసి బాధ్యతలు పంచుకోవడంలో కూడా ఉంటుంది. పర్పెక్ట్ లైఫ్ పార్టనర్.. పెళ్లికి ముందు కేవలం మాట్లాడుకుంటూ ఉండటం వల్ల తమకు బెస్ట్ పార్ట్నర్ లభించారని అనుకుంటారు.  కానీ పెళ్ళి  తర్వాత  ఒకే ఇంట్లో కలిసి జీవించడం  మనిషిలో నిజ స్వభావాన్ని బయటపెడుతుంది. మనిషి అలవాట్లు, మాటలు,   రోజువారీ ప్రవర్తన, కొన్నిసార్లు అతిగా రియాక్ట్ అవ్వడం,  కోపం చేసుకోవడం, వాగ్వాదం ఇవన్నీ పెళ్లి తర్వాత ఉంటాయి. ఇవన్నీ పర్పెక్ట్ అనే ట్యాగ్ ను చెరిపేస్తాయి.  అయితే..  అందరూ ఒప్పుకోవాల్సన నిజం ఏమిటంటే.. ఎవరూ కంప్లీట్ గా పర్పెక్ట్ గా ఉండరు. ప్రతి ఒక్కరికీ బలాలు ఉంటాయి,  బలహీనతలు ఉంటాయి. రెండింటినీ అంగీకరించాలి. గొడవలు.. పెళ్లి తర్వాత గొడవ పడని భార్యాభర్తలు ఎక్కడా ఉండరు.  గొడవ పడని  భార్యాభర్తలు ఉన్నారని అనుకోవడం కూడా చాలా పొరపాటు.  విభిన్న మనస్తత్వాలు గల ఇద్దరు వ్యక్తులు కలిసి నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టినప్పుడు అభిప్రాయ భేదాలు రావడం సర్వసాధారణం. టీవీ రిమోట్ దగ్గర నుండి మొదలుకుని ఎన్నో విషయాలలో భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూనే ఉంటాయి. చిన్న చిన్న విషయాలపై వాదనలు ప్రతి వైవాహిక జీవితంలో ఒక భాగమే. డబ్బు.. ప్రేమకు దాని స్థానం ఉంది, అలాగే డబ్బుకు దాని స్థానం ఉంది. పెళ్లి తర్వాత, ఇంటి బడ్జెట్‌ను రూపొందించుకోవడం, ఖర్చులను నిర్వహించుకోవడం, పొదుపు గురించి ఆలోచించడం వంటివి చాలా కీలకమవుతాయి. పెళ్లి తర్వాత దంపతులు తమ ఆర్థిక ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయిందని గ్రహిస్తారు. కొందరు పొదుపు చేయాలనుకుంటే, మరికొందరు ఖర్చు చేయాలనుకుంటారు. మరీ ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ సంపాదనా పరులైతే.. ఇద్దరి సంపాదన మీద ఒక్కరే అధికారం చూపించడం  వంటి పరిస్థితులు ఎదురైతే.. అది  వారి బంధంలో పెద్ద చీలికకు దారితీయవచ్చు. కాబట్టి వివాహం తర్వాత డబ్బు గురించి మాట్లాడటం మంచిదే కానీ.. డబ్బు కోసం బంధాన్ని విచ్చిన్నం చేయకూడదు. పర్సనల్ స్పేస్.. పెళ్లికి ముందు స్నేహితులతో మాట్లాడటం నుండి, స్నేహితులతో కలిసి బయటకు వెళ్లడం వరకు  పూర్తిగా స్వేచ్ఛగా ఉంటారు. కానీ పెళ్లి తర్వాత మారిపోతుంది. ప్రతి విషయంలోనూ  భాగస్వామిని కలుపుకోవాలి, వారి సౌకర్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కొన్నిసార్లు తమకోసం , స్నేహితుల కోసం సమయాన్ని కేటాయించడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. పైన చెప్పుకున్న విషయాలు చాలా సాధారణమైనవి. కానీ..పెళ్లికి ముందు చాలా జంటలు ఈ విషయాలలోనే ఊహించని అంచనాలు పెట్టుకుని, పెళ్లి తర్వాత చాలా డిజప్పాయింట్ అవుతారు. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.                          *రూపశ్రీ.
 ఈ కాలంలో మందు బిళ్లలు మింగకుండా ఒక్కరు కూడా ఉండటం లేదు.  పాపం చిన్న పిల్లలు సైతం  టాబ్లెట్లు మింగాల్సిన పరిస్థితి వస్తోంది.  చాలా మాత్రల మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. కొన్ని మాత్రలకు ఇది ఉండదు, కానీ చాలా మందులకు ఉంటుంది.  ఈ టాబ్లెట్ల మీద గీత చూసిన చాలామంది ఇది ఒక డిజైన్ అని అనుకుంటారు, కానీ ఈ గీత వెనుక పెద్ద కథే ఉంది.. వైద్య పరిభాషలో, ఈ గీతను స్కోర్ లైన్ అంటారు. మందును సమాన భాగాలుగా విభజించడానికి ఈ గీతను రూపొందిస్తారని  నిపుణులు చెబుతున్నారు. టాబ్లెట్స్ పైన ఈ గీతలు ఎందుకు ఉంటాయి.  ఫార్మా కంపెనీలు ఇలా టాబ్లెట్ల మీద గీతలు ఉంచడం వెనుక కారణం ఏంటి?  వివరంగా తెలుసుకుంటే.. టాబ్లెట్ల మీద గీత.. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొన్ని మాత్రలపై ఉండే గీత మందును సమాన భాగాలుగా విడగొట్టడానికి సహాయపడుతుంది, తద్వారా రోగులు సులభంగా సగం మాత్రను తీసుకోవచ్చు. వైద్యులు తరచుగా సగం మాత్ర మోతాదును కూడా సూచిస్తారు. ఈ గీత మాత్రను సగానికి విరవడాన్ని సులభతరం చేస్తుంది. రోగికి సరైన మోతాదు అందేలా చూసుకోవడానికి, మాత్రను తయారుచేసేటప్పుడు ఈ గీత వచ్చేలా చేస్తారట. గీతలు లేని టాబ్లెట్లు.. మందుపై గీత లేని మాత్రలు. అంటే, టాబ్లెట్ల పై  గీత లేకపోతే ఆ మాత్రను విరవకూడదట. లేకపోతే, దాని ప్రభావం తగ్గిపోవచ్చట. కొన్ని మందులకు ఎంటెరిక్ కోటింగ్ లేదా సస్టెయిన్డ్ రిలీజ్ వంటివి ఉంటాయని, వాటిని విరిస్తే టాబ్లెట్ల ప్రభావం మారవచ్చని వైద్యులు చెబుతున్నారు. అందుకే గీత లేని టాబ్లెట్లను విరవడం వల్ల దుష్ప్రభావాల ప్రమాదం పెరగవచ్చని అంటున్నారు. డిజైన్ మాత్రం కాదు.. నిపుణుల అభిప్రాయం ప్రకారం, టాబ్లెట్ మధ్యలో ఉండే గీత కేవలం డిజైన్ కోసం పెట్టేది కాదు.  అది టాబ్లెట్ డోస్ తీసుకోవడానికి సహాయపడుతుంది. ఆ గీత టాబ్లెట్‌ను సులభంగా విరవడానికి వీలు కల్పిస్తుంది. టాబ్లెట్ లో సగం డోసు తీసుకోవాల్సిన వారు  టాబ్లెట్‌ను సమాన భాగాలుగా విరవకపోతే సరైన డోస్ తీసుకోలేరు. దీని వల్ల  మందు కూడా ప్రభావవంతంగా పనిచేయదు.                                 *రూపశ్రీ.
వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లోనూ పెరుగు తినడం సర్వసాధారణం. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. కానీ వేడి పెరిగేకొద్దీ పెరుగు త్వరగా పులిసిపోతుంది. కొన్నిసార్లు రాత్రి తోడు పెట్టిన  పెరుగు ఉదయానికి తినడానికి వీలులేనంతగా పులిసిపోతుంది. అయితే  కొన్ని సులభమైన చిట్కాలతో పెరుగును ఎక్కువ కాలం తాజాగా,  రుచికరంగా ఉంచుకోవచ్చు. వేసవి కాలంలో పెరుగు పులుపు ఎక్కకుండా ఉండాలంటే ఎలా నిల్వ చేయాలి? ఆ చిట్కాలేంటి? తెలుసుకుంటే.. ఇది గుర్తుపెట్టుకోవాలి.. మొదటగా పెరుగు పులవడం అనేది ఒక సహజ ప్రక్రియ అని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పాలలో ఉండే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా లాక్టోజ్‌ను లాక్టిక్ ఆమ్లంగా మారుస్తుంది, దీనివల్ల పెరుగుకు కొద్దిగా పుల్లని రుచి వస్తుంది. అయితే అధిక వేడిలో ఈ ప్రక్రియ వేగవంతమవుతుంది, దీనివల్ల పెరుగు మరింత త్వరగా పులిసిపోతుంది. పెరుగు తోడు పెట్టడానికి పాల ఎంపిక చాలా కీలకం. ఎల్లప్పుడూ తాజా, నాణ్యమైన పాలను ఉపయోగించాలి. తాజాగా లేని పాలలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది, దీనివల్ల పెరుగు త్వరగా పాడవుతుంది. పాలను బాగా మరిగించి, గోరువెచ్చగా ఉన్నప్పుడే పెరుగు చుక్క  కలపాలి. పరిశుభ్రత.. పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.  పెరుగును నిల్వ చేసే పాత్రలు పూర్తిగా శుభ్రంగా , పొడిగా ఉండాలి. కొద్దిపాటి మురికి లేదా బ్యాక్టీరియా కూడా పెరుగు  రుచిని,  ఆకృతిని పాడుచేస్తుంది. వేసవిలో పెరుగు నిల్వ చేయడానికి సరైన ప్రదేశాన్ని ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యం. పెరుగును అధిక వేడికి లేదా ప్రత్యక్ష సూర్యరశ్మికి దూరంగా నిల్వ చేయాలి. చాలా వేడిగా ఉండే వాతావరణంలో పెరుగు త్వరగా పుల్లగా మారిపోతుంది. వంటగది చాలా వేడిగా ఉంటే, దానిని ఇంటిలోని చల్లని మూలలో నిల్వ చేయడం ఉత్తమం. ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.. పాలు పెరుగుగా మారే సమయంలో అందులో కాస్త పంచదార కలిపితే అందులో బ్యాక్టీరియా బాలెన్స్ గా ఉండటంలో సహాయపడుతుందట.పెరుగు త్వరగా పుల్లగా మారకుండా నివారిస్తుంది. అలాగే, ఎల్లప్పుడూ తాజా పెరుగునే తోడు చుక్కు కోసం  ఉపయోగించాలి. పెరుగు తయారైన తర్వాత దాన్ని ఎక్కువ సేపు బయట ఉంచకూడదు.  వెంటనే ఫ్రిజ్‌లో పెట్టాలి. చల్లని ఉష్ణోగ్రత బ్యాక్టీరియా పెరుగుదలను నెమ్మదింపజేస్తుంది, దీనివల్ల పెరుగు ఎక్కువ కాలం పాటు మంచి రుచిగా ఉంటుంది. ఎలాంటి వాసనలు రాకుండా ఉండటానికి పెరుగును ఎల్లప్పుడూ గాలి చొరబడని టైట్ కంటైనర్ లో నిల్వ చేయాలి. తీపి పెరుగు.. కొందరు స్వీట్ కర్డ్ ఇష్టపడతారు.  తీపి పెరుగు ఇష్టపడే వారు దాన్ని గడ్డకట్టించడానికి పాలలో ముందుగానే చక్కెర కలుపుకోవచ్చు. ఇది రుచిని మెరుగుపరిచి, పులుపును తగ్గిస్తుంది. పెరుగు పులిసిపోకుండా నివారించడం కష్టమేమీ కాదు. సరైన పాలు, శుభ్రమైన పాత్రలు,  ఉష్ణోగ్రత ఎక్కువ లేకుండా చూసుకోవడం,  సరైన పద్దతిలో నిల్వ చేయడం.. ఇవన్నీ చూసుకుంటే చాలు. ఈ సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా, రుచికరంగా, చిక్కగా ఉండే పెరుగును ఈ సమ్మర్ లో కూడా ఆస్వాదించవచ్చు.                               *రూపశ్రీ.
  ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు   ఎక్కువ సమయాన్ని మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ స్క్రీన్‌ల ముందు గడుపుతున్నారు. దీని ఫలితంగా, కంటి అలసట , చికాకు సర్వసాధారణమైపోయాయి. ఈ సమస్య నుండి కళ్లకు ఉపశమం కలిగించడానికి చాలా మంది బ్లూ లైట్ కళ్లద్దాలు వాడుతున్నారు.  ప్రస్తుతం ఈ బ్లూ లైట్ కళ్లద్దాల వినియోగం చాలా ఎక్కువైంది కూడా.  అయితే, ఈ కళ్లద్దాలు నిజంగా  కళ్లకు రక్షణ కవచంలా పనిచేస్తాయా? , లేక ఇవి కేవలం ఒక ట్రెండ్‌లో భాగమా? కంటి సంరక్షణ నిపుణులు దీని గురించి ఏం చెప్తున్నారు? తెలుసుకుంటే.. బ్లూ లైట్ ఎఫెక్ట్.. నీలి కాంతి అనేది ఒక రకమైన అధిక శక్తి గల కాంతి. ఇది కేవలం డిజిటల్ స్క్రీన్‌ల నుండే కాకుండా, సూర్యరశ్మి నుండి కూడా వెలువడుతుంది. మనం గంటల తరబడి స్క్రీన్‌లను చూస్తూ ఉన్నప్పుడు, కళ్ళు పొడిబారడం, చికాకు, అలసట , తలనొప్పి వంటి కంటి సమస్యలను ఎదురవుతాయి. ఇలా కంటి సమస్యలు రావడాన్ని  డిజిటల్ ఐ స్ట్రెయిన్ అని అంటారు. ఈ సమస్యలకు స్క్రీన్‌ల నుండి వెలువడే నీలి కాంతియే ప్రధాన కారణమని చాలా మంది భావిస్తారు. బ్లూ లైట్ గ్లాసెస్.. మార్కెట్లో లభించే బ్లూ లైట్ గ్లాసెస్, వాటి ప్రత్యేక లెన్సులు నీలి కాంతిని కళ్ళలోకి చేరకుండా అడ్డుకుంటాయని బ్లూ లైట్ గ్లాసెస్ అమ్మకం దారులు చెబుతారు. నీలి కాంతి మనిషిలో నిద్ర హార్మోన్లను ప్రభావితం చేస్తుంది కాబట్టి, ఇది కంటి ఒత్తిడిని తగ్గించి, నిద్రను మెరుగుపరుస్తుందని కంపెనీలు వాదిస్తున్నాయి. అయితే శాస్త్రీయంగా ఇది నిరూపణ కాలేదు.  బ్లూ లైట్ గ్లాసెస్ అమ్మకం దారులు చెప్పే విషయాలను పరిశోధనలు సమర్థించడం లేదు. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే.. బ్లూ లైట్ గ్లాసెస్  కంటి అలసటను తగ్గించడంలో అంత ప్రభావవంతంగా ఉండవు.  కంటి నొప్పి , పొడిబారడానికి అసలు కారణం బ్లూ లైట్ కాదు,  విరామం లేకుండా తదేకంగా  స్క్రీన్‌ను చూడటం ద్వారానే అసలు సమస్య వస్తోంది , కూర్చున్నప్పుడు  తప్పు పొజిషన్ లో కూర్చోవడం,  స్క్రీన్‌ను చూస్తున్నప్పుడు తక్కువగా కనురెప్పలు వాల్చడం వంటివి కళ్లకు అలసట, పొడిబారడం వంటి సమస్యలు తెచ్చిపెడతాయి. అందువల్ల, కేవలం కళ్లజోడు పెట్టుకోవడం వల్ల ఈ సమస్యను పూర్తిగా తొలగించలేము. బ్లూ లైట్ గ్లాసెస్ పనికిరావా? బ్లూ లైట్  కళ్లద్దాలు ధరించడం వల్ల కొంతమందికి కొంత సౌకర్యం కలగవచ్చనేది నిజమే. ముఖ్యంగా రాత్రి పొద్దుపోయే వరకు తమ మొబైల్ ఫోన్లు లేదా ల్యాప్‌టాప్‌లపై పనిచేసే వారికి కొంత ఉపశమనం లభించవచ్చు లేదా వారి నిద్ర పోవడానికి ఎక్కువ రిస్క్ లేకుండా ఈ బ్లూ లైట్ కళ్లద్దాలు కాస్త హెల్ప్ చేయవచ్చు.   కానీ పూర్తి కంటి రక్షణకు ఈ కళ్లద్దాలు పెట్టుకోవడం  ఏకైక పరిష్కారంగా భావించడం సరికాదని వైద్యులు చెబుతున్నారు.                                    *రూపశ్రీ.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సరైన నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే, రాత్రి పూట సరైన సమయానికి నిద్రపోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా రాత్రి 10 గంటలకు నిద్రపోవాలని  వైద్య నిపుణులు ఎందుకు చెబుతున్నారు? దీని వెనుక ఉన్న రహస్యాలేమిటో ఈ వీడియోలో చూద్దాం.  ముఖ్య అంశాలు: శరీర పునరుద్ధరణ: రాత్రి 10 నుండి తెల్లవారుజామున 2 గంటల మధ్య మన శరీరంలో కణాల మరమ్మత్తు ప్రక్రియ వేగంగా జరుగుతుంది.  మెదడు ఆరోగ్యం: సరైన సమయానికి నిద్రపోవడం వల్ల మెదడు చురుగ్గా మారుతుంది, ఒత్తిడి (Stress) తగ్గుతుంది మరియు జ్ఞాపకశక్తి పెరుగుతుంది.  యునానీ వైద్య విధానం: నిద్ర మరియు ఆరోగ్యంపై యునానీ వైద్య శాస్త్రం చెప్పిన అద్భుతమైన ఆరోగ్య సూత్రాలు.  బరువు నియంత్రణ: సరైన నిద్ర జీవక్రియను (Metabolism) మెరుగుపరిచి, బరువు తగ్గడానికి ఎలా సహాయపడుతుందో వివరించబడింది. మీరు నిత్యం ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలనుకుంటే మీ నిద్ర సమయాన్ని మార్చుకోవాల్సిందే. ఈ వీడియో చూసి, రాత్రి 10 గంటల నిద్ర వల్ల కలిగే మరిన్ని లాభాలను తెలుసుకోండి! ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాల కోసం మా యూట్యూబ్  "TeluguOne Health" ఛానెల్ ను సందర్శించండి. (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!) 🙏✨
AI..ప్రపంచం అంతా వాడుతున్న కృత్రిమ మేధస్సు ఇది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ కృత్రిమ మేధస్సు వాడకం చాలా పెరిగింది.  ఏ చిన్న సందేహం వచ్చినా ఏఐ ని వాడటం, దాన్ని సలహాలు, సూచలు అడగడం చేస్తున్నారు. ఇక చాలా మంది మరొక అడుగు ముందుకు వేసి జీవితానికి కీలకం అయిన ఉద్యోగాలు,  ఆరోగ్యం,  రిలేషన్షిప్స్ వంటి విషయాలలో సలహాలు కూడా ఈ కృత్రిమ మేధస్సును ప్రశ్నలు వేస్తున్నారు. అయితే ఇది మనిషి లాగా తప్పించుకుని పక్కకు వెళ్ళిపోయేది కాదు.. ఏ ప్రశ్న అడిగినా దానికి తగిన సమాధానం ఇస్తూ ఉంటుంది.  ఈ క్రమంలోనే చాలా మంది ఏఐ ను ఆరోగ్య సమస్యలకు సలహాలు తీసుకుని, స్వంత వైద్యం దిశగా వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఒక బ్రిటీష్ వైద్య పత్రిక ఏఐ ను ఆరోగ్య సలహాలు అడగడం, ఆ సలహాలు పాటించడం వంటి విషయాల గురించి చాలా షాకింగ్ నిజాలు ప్రచురించింది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. ఆరోగ్య సమస్యల కోసం ఏఐ ను సలహా అడగడం ఎంత పెద్ద తప్పూ  అర్థమవుతుంది. ఆరోగ్య సమస్యలపై తప్పుడు సమాచారం.. ఆరోగ్య సంబంధిత ప్రశ్నలకు ఏఐ ఇచ్చే సమాధానాలలో సుమారు 50 శాతం తప్పుగా ఉంటాయి. ఏఐ చాట్‌బాట్‌లు అందించే సమాచారం చాలా తప్పుగా ఉండవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఏఐ బలహీనత.. జెమిని, డీప్‌సీక్, మెటా ఏఐ, చాట్‌జీపీటీ , గ్రోక్ వంటి ఏఐ సాధనాలపై విస్తృతమైన పరిశోధనను ఒక శాస్త్రవేత్తల టీమ్ నిర్వహించిందట.  ఈ ఏఐ ప్లాట్పామ్ లలో  ఆరోగ్యానికి సంబంధించిన అనేక ప్రశ్నలు పరిశోధకులు అడిగారట. క్యాన్సర్ , వ్యాక్సిన్‌ల వంటి అంశాలపై ఏఐ ఇచ్చిన సమాధానాలు చాలా వరకు కచ్చితమైనవిగా ఉన్నాయి. అయితే మూల కణాలు , పోషణ వంటి అంశాలలో ఏఐ బలహీనంగా ఉన్నట్లు తేలిందట. తప్పుడు సమాధానాలు.. ఏఐతో ఉన్న అతిపెద్ద సమస్య.. అది నిస్సంకోచంగా తప్పుడు సమాచారాన్ని అందిస్తుందట. ఇది తరచుగా ఎటువంటి హెచ్చరిక లేదా నిరాకరణను అందించదు. ఫలితంగా, వినియోగదారులు సరైన సమాచారం, తప్పు సమాచారాల  మధ్య తేడాను గుర్తించలేరు. ఏఐ చెప్పే తప్పు సమాధానాలనే నిజం అనుకుని చాలామంది పొరపాట్లు చేస్తారు. అసలు ఏఐ చెప్పే సమాధానాలు నమ్మేలా అనిపించవని,  సమస్యకు సంబంధం లేని సమాచారాన్ని ఇస్తుందని అంటున్నారు. గమనిక.. పైన పేర్కొన్న విషయాలు సోషల్ మీడియాలో వచ్చిన సమాచారం ఆధారంగా రూపొందించినవి.                             *రూపశ్రీ.