సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన మ్యూజిక్‌తో దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తున్న ఈ యువ సంగీత దర్శకుడు.. అతి తక్కువ సమయంలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆయన అందించే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, పాటలకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. తాజాగా సంగీత దర్శకుడిగా తన ప్రయాణం మొదలై 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అనిరుధ్ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.
15 ఏళ్ల క్రితం ఇదే రోజున తన తొలి పాట ప్రేక్షకుల ముందుకు వచ్చిందని అనిరుధ్ గుర్తుచేసుకున్నారు. అప్పటి నుంచి ఈ ప్రయాణంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు, అద్భుతమైన అనుభవాలు ఉన్నాయని తెలిపారు. తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో పాటలు రూపొందించే అవకాశం రావడం తన అదృష్టమని చెప్పారు. అంతేకాదు.. ఇండిపెండెంట్ మ్యూజిక్, అంతర్జాతీయ కళాకారులతో కలిసి పనిచేయడం, వివిధ భాషల్లో పాటలు పాడటం వంటి అనుభవాలను కూడా గుర్తుచేసుకున్నారు.
ఇక ఈ 15 ఏళ్లలో దేశంలోని ప్రముఖ దర్శకులు, నటులు, నిర్మాతలతో కలిసి పనిచేసే అవకాశం దక్కిందని అనిరుధ్ తెలిపారు. స్ట్రీమింగ్ రికార్డులు సృష్టించడం, కోట్లాది మంది శ్రోతలకు తన సంగీతాన్ని చేరువ చేయడం, ప్రపంచవ్యాప్తంగా మ్యూజిక్ కన్సర్ట్స్ నిర్వహించడం మర్చిపోలేని అనుభవాలని పేర్కొన్నారు.
చార్ట్‌బస్టర్ పాటలతో పాటు వేలాది మంది అభిమానులు తన పాటలను గొంతెత్తి పాడటం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. ఈ ఏడాది కూడా అనిరుధ్‌కు చాలా ప్రత్యేకం. ఆయన సంగీతం అందించిన 'LIK', 'జననాయగన్', 'DC', 'పారడైజ్', 'జైలర్ 2' సినిమాలు 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ఇది కూడా చదవండి: హీరో కావాలని వచ్చారు.. ఆరు సార్లు అవకాశాలు చేజారినా చివరకు 650 సినిమాల్లో నటించిన గిరిబాబు.!
ఈ సందర్భంగా అనిరుధ్ మాట్లాడుతూ.. ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు, సవాళ్లు ఎదురైనా ఒక్కరోజు కూడా విరామం తీసుకోకుండా పనిచేశామని తెలిపారు. సంగీతంపై మొదటిరోజు ఉన్న ప్రేమే ఇప్పటికీ తమను ముందుకు నడిపిస్తోందని చెప్పారు. తన పాటలను మళ్లీ మళ్లీ వింటూ, పాడుతూ ఆదరిస్తున్న అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఇటీవలే కావ్య మారన్‌ను వివాహం చేసుకున్న అనిరుధ్.. 15 ఏళ్ల ప్రయాణం పూర్తయిన ఇంకా సాధించాల్సిన కలలు ఎన్నో ఉన్నాయని, తన అత్యుత్తమ సంగీతం ముందుందని పేర్కొన్నారు. అనంతరం మళ్లీ స్టూడియోలోకి అడుగుపెడుతున్నానంటూ తన సందేశాన్ని ముగించారు.
మీకు నచ్చవచ్చు:
‘కాకా‘లో స్పెషల్ సాంగ్: మెగాస్టార్‌తో రితికా సింగ్ మాస్ స్టెప్పులు!
త్రిష పెంపుడు కుక్క బర్త్‌డే సెలబ్రేషన్స్: గెస్ట్‌గా ఎవరొచ్చారో తెలిస్తే షాక్ అవుతారు.!
[AnirudhRavichander, Anirudh15Years, AnirudhMusic, AnirudhEmotionalPost, AnirudhLatestNews]





