Home

»

Latest News

హిందుస్థాన్ ఎవరి సొంతం కాదు: లెజండ్రీ సింగర్ కీలక వ్యాఖ్యలు!

Nov 16, 2026 5:17PM


రజినీకాంత్ ఫ్యాన్స్ రజినీని చూసినప్పుడల్లా 'స్టైలు, స్టైలు రా.. నీది సూపర్ స్టైలు రా అంటూ డాన్స్ చేసినట్టుగా ఇప్పుడు సేమ్ ప్రముఖ గాయకుడు 'దిల్జిత్ దోసాంజ్' ని చూసి అదే విధంగా పాడుకుంటున్నారు.

పంజాబీ సూపర్‌స్టార్ దిల్జిత్ దోసాంజ్ తన కచేరీల ద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. సంగీతంతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్న ఆయన, ఇటీవల తన లైవ్ షోల సమయంలో ఎదురవుతున్న వివాదాలు, ఆంక్షలపై చాలా స్పష్టంగా, నిర్భయంగా స్పందిస్తున్నారు. ఇండోర్‌లో జరిగిన ఒక కచేరీ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారాయి. 

కళాకారుల స్వేచ్ఛకు వస్తున్న ఆటంకాలపై ఆయన దివంగత ప్రఖ్యాత కవి రాహత్ ఇండోరి (Rahat Indori) పంక్తులని  ఉటంకిస్తూ తీవ్రమైన రీతిలో బదులిచ్చారు. ఈ భూమి మీద, ఈ దేశం మీద ప్రతి ఒక్కరి రక్తమూ కలిసి ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇండోర్ వేదికగా జరిగిన ఈ భారీ కచేరీకి ముందు పలు రకాల సవాళ్లు ఎదురయ్యాయి. 

నిర్వహణకు సంబంధించి చివరి నిమిషంలో క్లియరెన్స్ అడ్డంకులు, చివరకి  బాంబు బెదిరింపుల వంటి ఉద్రిక్త పరిస్థితులను లెక్కచేయకుండా దిల్జిత్ వేదికపైకి దూసుకువచ్చారు. మరోవైపు, బాలల పరిరక్షణ అధికారులు (District Child Protection Officer) నవంబర్ 6వ తేదీన జారీ చేసిన ఆదేశాల ప్రకారం, ఆయన పాడాల్సిన పాటలలో 'పాటియాలా పెగ్', 'ఫైవ్ తారా', 'కేస్', 'జాట్ ఉఠ్ ఫైర్ కర్దా' వంటి మొత్తం 4 ప్రముఖ పాటలపై ఆంక్షలు విధించారు.

2019 నాటి పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ఆదేశాల ఆధారంగా హింసను, మద్యం మరియు మాదకద్రవ్యాలను ప్రోత్సహించే సాహిత్య శైలిని చిన్నపిల్లలపై ప్రభావం చూపకుండా నియంత్రించాలనే నిబంధనను తెరపైకి తెచ్చారు. అయితే, ఈ ఆంక్షలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ దిల్జిత్ తనదైన శైలిలో అభిమానులను అలరిస్తూనే గట్టి కౌంటర్ ఇచ్చారు.  

ఇది కూడా చదవండి: సాయిపల్లవి తల్లి దుమారం: మరి అభిమానించి అందలం ఎక్కిస్తే ఇలాగే చేస్తారు!  

 ఈ ఆంక్షల పట్ల స్పందిస్తూ, "ఈ నేలలో ప్రతి ఒక్కరి రక్తమూ కలిసి ఉంది. ఇది ఎవరి తండ్రి జాగీరూ కాదు" అనే రాహత్ ఇండోరి ప్రసిద్ధ కవిత్వాన్ని మైక్ ముందు గట్టిగా వినిపించారు. ఎవరూ కూడా  తమని ఇక్కడ ప్రదర్శనలు ఇవ్వకుండా ఆపలేరని, గతంలో ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలోనూ ఇలాంటి ఇబ్బందులే ఎదురైనప్పటికీ, తన 'దిల్-లుమినాటి ఇండియా టూర్' (Dil-Luminati India Tour) ప్రదర్శనలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేస్తానని ఆయన తేల్చిచెప్పారు.

 డిసెంబర్ 20వ తేదీన భారత్ నుంచి బయలుదేరేలోగా షెడ్యూల్ చేసిన అన్ని నగరాల్లోనూ షోలను దిగ్విజయంగా ముగిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ కచేరీల చుట్టూ కేవలం పాటల ఆంక్షలే కాకుండా కొన్ని సంస్థల నుంచి తీవ్ర నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. బజ్‌రంగదళ్, విశ్వ హిందూ పరిషత్ వంటి సంఘాలు కచేరీల్లో జరిగే మద్యం విక్రయాలు, మిశ్రమ లింగ సీటింగ్ ఏర్పాట్లను తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ కార్యక్రమాలు మాదకద్రవ్యాల వినియోగాన్ని పెంచుతాయని, కొన్ని అవాంఛనీయ ధోరణులకు దారితీస్తాయని వారు ఆరోపణలు గుప్పించారు.

అయినప్పటికీ, వేలాదిగా తరలివచ్చిన అభిమానుల కేరింతల మధ్య దిల్జిత్ తన ప్రదర్శనను విజయవంతంగా ముగించారు. సంగీతం ఎవరికైనా ఒక్కటేనని, ప్రేమను పంచడమే తన ఏకైక లక్ష్యమని ఆయన నిరూపిస్తున్నారు. అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, లక్నో, చండీగఢ్, కోల్‌కతా తదితర ప్రధాన నగరాల్లో డిసెంబర్ అంతటా ఆయన ఈ మ్యూజికల్ టూర్‌  కొనసాగించనున్నాడు.  

 

మీకు నచ్చవచ్చు:పెంపుడు కుక్క విషయంలో త్రిష కీలక నిర్ణయం!
మీకు నచ్చవచ్చు:వంద సిగరెట్లు తాగి దొరికిపోయిన హీరోయిన్ తల్లి!

 

[Diljit Dosanjh, Indore concert, Hindusthan, Dil Luminati Tour India, Bollywood]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com