LATEST NEWS
జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే  కడప  ఎంపీ, వైసీపీ సీనియర్ నేత వైఎస్ అవినాష్ రెడ్డికి పెలీసులు నోటీసులు అందజేశారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నివాసం నుంచి  బయటకు రావద్దని పోలీసులు ఆ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే , ఆ ఆంక్షలను ఖాతరు చేయకుండా  ఆయన భారీ వాహనశ్రేణితో పర్యటనకు బయలుదేరారు.  వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొనే ఉద్దేశంతో వైఎస్ అవినాష్ రెడ్డి సింహాద్రిపురం మండలంలోని అంకాలమ్మ గూడూరుకు శుక్రవారం (నవంబర్ 20) చేరుకున్నారు. పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది.  ఈ పరిణామాలకు ముందురోజు అంటే గురువారం (నవంబర్ 19)  టీడీపీ నేత బీటెక్ రవి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఎంపీ అవినాష్ రెడ్డి ప్రభుత్వ అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ, ఆయన వ్యవహార శైలిని తక్షణమే కట్టడి చేయాలని  డిమాండ్ చేశారు. ఇది జరిగిన  మరుసటే అవినాష్ రెడ్డి పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించి కాన్వాయ్‌తో పర్యటనకు వెళ్లడాన్ని టీడీపీ శ్రేణులు, స్థానికులు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే చర్యగా అభివర్ణిస్తూ   ఖండించారు. అదలా ఉండగా,  అంకాలమ్మ గూడూరు వద్ద తెలుగుదేశం, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. అయితే ఈ ఘటనలో ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్ పై పెట్రోల్ బాంబులతో దాడి జరిగిందంటూ వైసీసీయులు పెద్ద ఎత్తున ప్రచారం మొదలెట్టారు. అయితే ఎంపీ కాన్వాయ్ పై పెట్రోల్ బాంబు దాడి వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీసులు ఖండించారు.  ఆలా ఉండగా అంకాలమ్మ గూడురులో జరిగిన ఘర్షణలో తెలుగుదేశం కార్యకర్త ఒకరు గాయపడ్డారు.  ఇది కూడా చదవండి:  అవినాష్ రెడ్డి కాన్వాయ్ పై బాంబుదాడి: సింహాద్రిపురంలో ఉద్రిక్తత.! ప్రస్తుతం అంకాలమ్మ గూడూరులో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు. ఘర్షణ నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు. ఘర్ణణకు దిగిన వారిని స్వల్పంగా లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. పులివెందులలోనూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఆంక్షలు విధించి భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నిబంధనలను, ఆంక్షలను ఉల్లంఘిస్తూ కఠిన చర్యలు తప్పవని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు. మునిసిపల్, పరిషత్ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలు కావడంతో పంచాయతీ ఎన్నికలలో విధ్వంసం సృష్టించేందుకు కుట్రపన్నిందని తెలుగుదేశం వర్గీయులు ఆరోపిస్తున్నారు. మీకు నచ్చవచ్చు:   పులివెందులలోనూ వైసీపీ కుదేలు: రాజకీయం పతనానికి సంకేతమేనా? పులివెందులలో జగన్ కు మరో షాక్: జడ్పీటీసీ తెలుగుదేశం కైవసం.! [Kadapa MP YS Avinash Reddy, Violate, estrictions, HugeCanvoy, Ankalamma Guduru, Pulivendula, TeluguOne]
తెలుగుదేశం పార్టీతోనూ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతోనూ ఉన్న సన్నిహిత సంబంధాన్ని తాను ఎప్పుడో తెంచుకున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సిద్దిపేటలో నిర్వహించిన  ప్రజా పాలన  ప్రగతి బాట బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన.. తెలంగాణ ప్రయోజనాలే తనకు  ముఖ్యమని కుండబద్దలు కొట్టారు.     ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తనకు సంబంధాలు ఉన్నాయంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను రేవంత్ రెడ్డి   తిప్పికొట్టారు. తెలుగుదేశం పార్టీతో తాను ఏనాడో తెగదెంపులు చేసుకున్నానని, బాబుతో సన్నిహిత సంబంధాన్ని ఎప్పుడో విచ్ఛిన్నం చేసుకున్నానని  పునరుద్ఘాటించారు. తాను తెలంగాణ బిడ్డనని, తనను ముఖ్యమంత్రిని చేసిన ఈ గడ్డకు నీటి విషయంలో   అన్యాయం ఎలా చేస్తానని, ఎందుకు చేస్తానని  ప్రశ్నించారు. కృష్ణా జలాల వాటాలో తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయని గతంలో సంతకం చేసింది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, హరీశ్ రావు కాదా అని నిలదీశారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డిని ప్రగతిభవన్‌కు ఆహ్వానించి విందు ఇచ్చి, రాయలసీమ ప్రాజెక్టులకు సహకరించింది కేసీఆరేనని  ఆరోపించారు. కేసీఆర్, హరీశ్ రావుల రాజకీయ ప్రస్థానం, కుటుంబ ఆస్తులు, ప్రాజెక్టుల వ్యవహారాలపై రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు.  చింతమడకలో ఉన్న కేసీఆర్‌కు తొలిసారి రాజకీయ అవకాశం కల్పించింది దివంగత కాంగ్రెస్ నేత ఆనంతుల మదన్ మోహన్ అనీ,   అలాంటి వ్యక్తిపైనే కేసీఆర్ పోటీ చేశారని విమర్శించారు. ఆయన జ్ఞాపకార్థం సిద్దిపేట మెడికల్ కాలేజీకి మదన్ మోహన్ పేరు పెడతామని ప్రకటించారు. గత నాలుగు దశాబ్దాలుగా మామ, అల్లుడు, బావమరిది అంటూ వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయన్న రేవంత్ రెడ్డి.. 2004లో వార్డు మెంబర్ కూడా కాని హరీశ్ రావు, నాడు కాంగ్రెస్ దయతో  రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో మంత్రి పదవి పొందారని గుర్తుచేశారు. రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, జన్వాడ ప్రాంతాల్లో కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఫామ్ హౌస్‌లు, వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా సమకూరాయని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపైనా రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు ముందుండి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం మూడేళ్లకే కుప్పకూలిపోయిందని విమర్శించారు. ఆ ప్రాజెక్టులో అవినీతి జరిగిందనే కారణంతోనే, 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదని ఆరోపించారు. అలాగే తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని, తాము అధికారంలోకి వచ్చాక ఆమె అడగకపోయినా పిలిచి పదవి ఇచ్చి గౌరవించామని తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గ రాజకీయ భవిష్యత్తుపై మాట్లాడుతూ, ఇకపై సిద్దిపేట గడ్డ కాంగ్రెస్ అడ్డాగా మారబోతోందని రేవంత్  ధీమా వ్యక్తం చేశారు.  ఇది కూడా చదవండి: తెలంగాణలో పాలసీ పెరాలసీ లేదు..పెట్టుబడులకు సంపూర్ణ భద్రత: సీఎం రేవంత్ రాబోయే ఎన్నికల్లో సిద్దిపేట కార్యకర్తలు, నాయకులు చర్చించి సూచించిన అభ్యర్థికే కాంగ్రెస్ టికెట్ కేటాయిస్తామని, ఇక్కడ గెలిచే ఎమ్మెల్యేకు కీలకమైన మంత్రి పదవి అందిస్తామని హామీ ఇచ్చారు. 2029 ఎన్నికల్లోనూ తెలంగాణలో రెండోసారి ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని తాము రద్దు చేయలేదని, పైగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అనేక కొత్త పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేలా  5 లక్షల రూపాయల బీమా కవరేజీతో  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంచామన్నారు. మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంపై సిద్దిపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు.. సిద్దిపేట సభలో ప్రగల్భాలు, వ్యక్తిగత విమర్శలు తప్ప ప్రజలకు ఉపయోగపడే అంశం ఒక్కటీ లేదని విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన  దేవుళ్లపై ఒట్లు వేసి రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డి..  ఇప్పుడు ఒట్ల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, హరీశ్ రావు కౌంటర్‌తో సిద్దిపేటలో జరిగిన ఈ బహిరంగ సభ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.    మీకు నచ్చవచ్చు:   మోడీతో తెలంగాణ సీఎం రేవంత్ భేటీ: ఏం చర్చించారో తెలుసా.?​ తెలంగాణ విద్యావిధానంలో సమూల మార్పులు.. వచ్చే ఏడాది నుంచి 10+2 విధానం.! [Revanth Reddy, Siddipetpublicmeeting, Chandrababu, Harish Rao, IndirammaFamily LifeInsurance]
లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి తన వ్యాఖ్యలతో దేశ రాజకీయాల్లో పెను దుమారం రేపారు. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడల్లా దేశ అంతర్గత విషయాలపై విమర్శలు చేయడం ఆయనకు పరిపాటిగా మారిందన్న విమర్శలు మళ్లీ వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అమెరికాలోని ప్రఖ్యాత కొలంబియా విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో  చర్చకు దారితీశాయి.   కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో  అనేక లోపాలు ఉన్నాయని విదేశీ వేదికపై విమర్శించడం ఇప్పుడు అధికార పక్షంతో పాటు రాజకీయ పరిశీలకులు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  సాధారణంగా విదేశాలకు వెళ్లినప్పుడు తమ మాతృభూమి గొప్పతనాన్ని చాటిచెప్పడం భారత సంప్రదాయం. మన ఇతిహాసమైన మహాభారతంలో సైతం, అంతర్గత విభేదాలు ఎన్ని ఉన్నా బయటి వ్యక్తుల ముందు మన లోపాలను ఎత్తిచూపకూడదని ధర్మరాజు తన తమ్ముళ్లకు సూచించిన సందర్భాన్ని పరిశీలకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  అయితే.. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేత స్థానంలో ఉన్న రాహుల్ గాంధీ.. విదేశీ సదస్సుల్లో, విదేశీ మీడియా ముందు దేశ ప్రతిష్ఠను మసకబార్చులా  మాట్లాడటం   సమంజసం కాదన్న అభిప్రాయం గట్టిగా వ్యక్తమౌతోంది.    దేశంలో ఏవైనా సమస్యలు ఉంటే, ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంట్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసే  హక్కు రాహుల్ గాంధీకి ఉంది. ప్రభుత్వ విధానాల్లోని లోపాలను ఎత్తిచూపుతూ ప్రజలను చైతన్యవంతం చేయాలి. అవసరమైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనలు చేపట్టి ప్రభుత్వానికి నిర్దిష్ట సూచనలు ఇవ్వాలి.. కానీ, స్వదేశంలో చేయాల్సిన రాజకీయ పోరాటాన్ని పక్కనపెట్టి, విదేశీ గడ్డపై దేశ ఆర్థిక వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో ఇండియా ప్రతిష్ఠ దెబ్బతినే ప్రమాదం ఉందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది.  ప్రస్తుతం ఇండియా చుట్టూ ఉన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు   సున్నితంగా ఉన్నాయి. చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాలు భారత్‌లో అస్థిరతను సృష్టించేందుకు నిరంతరం ఏదో ఒక రకంగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో   దేశ బలహీనతలను విదేశీ వేదికలపై ఎత్తిచూపడం ద్వారా  శత్రుదేశాలకు   ఆయుధాలు అందించినట్లు అవుతుందని పరిశీలకులు అంటున్నారు.  ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమి నేతలు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని   అభిప్రాయపడుతున్నారు.   కొలంబియా విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ  విరుచుకుపడింది. రాహుల్ ఆరోపణలను ఖండిస్తూ, గత పన్నెండేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ ప్రజలు  సుఖసంతోషాలతో జీవిస్తున్నారని పేర్కొంది.. ఇప్పటికే ప్రధాని మోదీ పలు సందర్భాల్లో రాహుల్ గాంధీ రాజకీయ వైఖరిని ఎద్దేవా చేస్తూ మాట్లాడిన విషయాన్ని వారు గుర్తుచేశారు.  ఇది కూడా చదవండి:  రాహుల్ విదేశీ పర్యటన: శశిథరూర్ వ్యాఖ్యలు వైరల్.!​ అదలా ఉంటే.. ఇటీవల సోనియా గాంధీ ఆత్మకథ విడుదల సందర్భంగా తన తల్లిదండ్రులను పార్వతీపరమేశ్వరులతో పోలుస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు కూడా హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసి, మరో వివాదానికి తెరలేపాయి.   నిజానికి ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాలు సామాన్య ప్రజలను ఎంతో ఆకట్టుకున్నాయి. ఒక బలమైన ప్రతిపక్ష నేతగా ఆయన ఎదుగుతున్నారనే సంకేతాలు వెలువడ్డాయి. కానీ, ఆ సానుకూల వాతావరణాన్ని నిలబెట్టుకోవాల్సింది పోయి, ఆయన ఇలాంటి అనవసర వివాదాల్లో చిక్కుకుంటూ తన వ్యక్తిత్వాన్ని, రాజకీయ ప్రతిష్ఠను ఆయనే స్వయంగా తగ్గించుకుంటున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.    రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ తన ప్రసంగాల శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సందర్భోచితంగా, దేశ ప్రయోజనాలకు భంగం కలగని రీతిలో వ్యవహరించకపోతే, అది వ్యక్తిగతంగా ఆయనకే కాకుండా మొత్తం కాంగ్రెస్ పార్టీకి కూడా తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సమయోచిత వ్యాఖ్యలు చేయనంత కాలం హస్తం పార్టీకి రాజకీయ కష్టాలు తప్పవని, ప్రజల విశ్వాసాన్ని పూర్తిస్థాయిలో గెలుచుకోవడం కష్టతరమవుతుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.   మీకు నచ్చవచ్చు: రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై దుమారం​ 8 బిలియన్ డాలర్ల నుంచి 140 బిలియన్ డాలర్లకు.. అదానీ ఆస్తులు ఎలా పెరిగాయి: రాహుల్ గాంధీ   [Rahul Gandhi, ColumbiaUniversitySpeech, IndianEconomy, BJPReaction, TeluguOne]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబ వివాదం మరోసారి బహిర్గతమైంది. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు, వైసీపీ అధినేత  జగన్‌ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడిని ఆహ్వానించడాన్ని తప్పుపడుతూ జగన్ మీడియా ప్రచురించిన కథనంపై షర్మిల నిప్పులు చెరిగారు. తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.  సాధారణ కుటుంబ సంబంధాలను కూడా వక్రీకరించి మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యవహరించడాన్ని తప్పుపట్టారు.   మహిళలను గౌరవిస్తామని చెప్పే జగన్..  ఇలాంటి నిరాధారమైన,  దిగజారిన వార్తలను తన సొంత మీడియా ప్రచురించడాన్ని ఎలా సమర్థించుకుంటారని నిలదీశారు. ఈ  ప్రచురణ వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో జగన్ స్వయంగా సమాధానం చెప్పాలని   డిమాండ్ చేశారు. గతంలో తమ తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సైతం రాజకీయ విభేదాలను పక్కనబెట్టి తన పిల్లల పెళ్లిళ్లకు అందరినీ ఆహ్వానించిన విషయాన్ని ఈ సందర్భంగా  గుర్తుచేశారు. రాజకీయంగా ఎన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, కుటుంబ వేడుకల్లో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం జగన్ దిగజారుడుతనానికి పరాకాష్ఠగా షర్మిల అభివర్ణించారు. అన్నదమ్ముల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న   వివాదాల నేపథ్యంలో ఈ తాజా పరిణామం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం రాజకీయ లబ్ది కోసమే జగన్  కుటుంబ వ్యవహారాలను బహిరంగ వేదికలపైకి లాగుతూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని షర్మిల పదేపదే ఆరోపిస్తున్న సంగతి విదితమే. ఇది కూడా చదవండి: వెల్తారా, వెళ్లరా: షర్మిల కుమార్తె వివాహానికి జగన్ హాజరుపై చర్చ.! అయినా..  తమ ప్రత్యర్థి అయితే చాలు…  వ్యక్తిత్వహననానికి పాల్పడడం, మహిళలను కించపరచడం వైసీపీ నేతలకు అలవాటేనంటూ.. నాడు నిండు సభలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని అవమానించిన విషయాన్ని గుర్తు చేస్తూ పరిశీలకులు సైతం షర్మిలపై అనుచిత వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు.    అంతెందుకు గతంలో షర్మిల కూడా పలు సందర్భాలలో జగన్ ది సైతాన్ సైన్యం   విమర్శించిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబుకు తన కుమారుడి పెళ్లి పత్రిక ఇచ్చేందుకు పసుపు రంగు చీర కట్టుకొని వెళ్లిన షర్మిలను దూషించిన ఘనత వైసీపీ సైకో సైన్యానిది. ఇప్పుడు కూడా తన కూతురు అంజిలి పెళ్లి పత్రిక అందించేందుకు చంద్రబాబును కలిసిన షర్మిలపై వైసీపీయులు దుర్భాషలాడుతున్నతీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమౌతోంది. మీకు నచ్చవచ్చు:   ఉంటే ఉండు, లేకుంటే దేశం విడిచిపో: వైఎస్ కంటే గొప్పోడివా.. జగన్ ను ఉతికి ఆరేసిన షర్మిల కుటుంబం.! ఎలహంక ప్యాలెస్ లో షర్మిల కుమార్తె పెళ్లి: పేర్ని నానికెందుకు నొప్పి.? [YSSharmila, YSJagan, SharmiladaughterMarriage, Invitation, CBN, CharacterAssassination, TeluguOne]
తెలంగాణలోని కోట్లాది పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు శాశ్వత ఆర్థిక భద్రతను కల్పిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక అత్యంత చారిత్రాత్మక మరియు మానవతా దృక్పథంతో కూడిన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి నైతిక స్థైర్యాన్ని, భరోసానిచ్చేందుకు ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ (ఇందిరమ్మ జీవిత భీమా) పథకానికి పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసింది. ఈ ప్రతిష్టాత్మక సంక్షేమ పథకాన్ని నవంబర్ 19వ తేదీన సిద్దిపేట వేదికగా జరగబోయే భారీ బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. కుటుంబంలో అందరికీ అండగా ఉండి, ఏకైక ఆధారంగా నిలిచే సంపాదించే వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయి రోడ్డున పడకూడదనే సదుద్దేశంతో ప్రభుత్వం ఈ సార్వత్రిక జీవిత బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ అద్భుతమైన సంక్షేమ పథకం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా సుమారు 1 కోటి నుంచి 1.15 కోట్ల పేద కుటుంబాలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుంది. సమాజంలో పేద, ధనిక అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలనే లక్ష్యంతో ఈ పథకం రూపకల్పన జరిగింది. ఈ పథకం యొక్క ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే, కుటుంబంలో సంపాదించే ప్రధాన వ్యక్తికి ప్రమాదవశాత్తు లేదా సహజ మరణం సంభవిస్తే వారి నామినీకి లేదా కుటుంబ సభ్యులకు నేరుగా రూ. 5 లక్షల భారీ ఆర్థిక సహాయం అందుతుంది. ఈ బీమా సౌకర్యం పొందడానికి లబ్ధిదారుల కుటుంబాలు ఒక్క రూపాయి కూడా ప్రీమియం కింద చెల్లించాల్సిన అవసరం లేదు; బీమా ప్రీమియం మొత్తాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. రేషన్ కార్డు ఉన్న ప్రతి అర్హ కుటుంబానికి ఈ భద్రత వర్తిస్తుందని, కుటుంబంలో ఒకరికి మించి సంపాదించే వ్యక్తులు ఉన్నప్పటికీ నిబంధనల ప్రకారం ఒకరికి మాత్రమే ఈ బీమా నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకానికి అర్హత సాధించడానికి కుటుంబంలో సంపాదించే వ్యక్తి వయస్సు 18 నుండి 59 సంవత్సరాల మధ్య ఉండాలని ప్రభుత్వం కచ్చితమైన నిబంధన నిర్దేశించింది. అనగా 1967 నవంబరు 19 నుండి 2008 నవంబరు 18 మధ్య జన్మించిన వారు ఎవరైనా దీనికి అర్హులుగా పరిగణించబడతారు. వయస్సు మరియు అర్హత నిర్ధారణ కోసం ఆధార్ కార్డులో నమోదైన పుట్టిన తేదీని మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు. సాధారణంగా రేషన్ కార్డు సంఖ్యే దరఖాస్తుకు ప్రాతిపదిక అయినప్పటికీ, ఒకవేళ రేషన్ కార్డు లేని కుటుంబాలకు కూడా ప్రత్యేక కోడ్ కేటాయించి ఈ నమోదు ప్రక్రియలో భాగం కల్పిస్తున్నారు. ఇది కూడా చదవండి : ICICI Bank New Rules: డిసెంబర్ నుంచి మారనున్న క్రెడిట్ కార్డ్ నిబంధనలు ఇవే! నమోదు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా మరియు కింది స్థాయి వరకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. నవంబర్ 19 నుంచి డిసెంబర్ 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తుల స్వీకరణ మరియు నమోదు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. గ్రామ స్థాయిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించడంతో పాటు, అధికారులే నేరుగా ఇళ్లకు వచ్చి వివరాలు సేకరించేలా సరికొత్త ప్రణాళిక రూపొందించారు. రేషన్ షాపుల వారీగా, గ్రామ పంచాయతీల ద్వారా ఈ దరఖాస్తులను స్వీకరించి, జిల్లా కలెక్టర్లు మరియు స్థానిక యంత్రాంగం ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి దరఖాస్తుదారులు తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్రియాశీలకంలో ఉన్న బ్యాంకు ఖాతా వివరాలు మరియు నామినీ వివరాలను ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి. ఇంటి పెద్దను కోల్పోయి అనాథగా మారే కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందనే భరోసా కల్పిస్తున్న ఈ గొప్ప అవకాశాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. మీకు నచ్చవచ్చు: రూ. 1.57 కోట్లతో భారత్‌లో బైడీ డెన్జా జెడ్9 జిటి విడుదల! హ్యాకర్ల చేతిలో చిక్కిన AntiFox AI ఏజెంట్లు: AWS డేటాకు తీవ్ర ముప్పు!   [Indiramma Family Life Insurance, Telangana Government, Revanth Reddy, Telangana Welfare Schemes, ₹5 Lakh Life Insurance, Free Life Insurance Scheme, Ration Card Holders, Siddipet Public Meeting, Telangana Family Security, Indiramma Life Bima]
ALSO ON TELUGUONE N E W S
ప్రెజెంట్ థియేటర్స్ లో ఆకాశంలో ఒక తార పాజిటివ్ టాక్ తో దూసుకుపోతూ ఉంది. సాత్విక, దుల్కర్ తమ క్యారెక్టర్స్ లలో అద్భుతంగా చేసారని, ఆ ఇద్దరి కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలిచిపోవడం ఖాయమని చెప్తున్నారు. అదే టైంలో రోహిణిగా చేసిన శృతి హాసన్ తన మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మ్ తో ఆకాశంలో ఒక తారకి మరో ప్రధాన బలంగా నిలిచిందని కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో  తన కెరీర్‌లోనే ఒక అత్యుత్తమమైన గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చిందని సినీ విశ్లేషకులు, అభిమానులు ప్రశంసిస్తున్నారు. కేవలం గ్లామర్ రోల్స్ కే పరిమితం కాకుండా, కథని  మలుపు తిప్పే బలమైన రోల్ లో మెస్మరైజ్ చేసిన తీరు ప్రతి ఒక్కర్నికట్టిపడేస్తోంది. ‘రోహిణి’ అనే ఒక మోడ్రన్, ఫ్యాషన్ గర్ల్ రోల్ లో  కనిపించింది. నేటి తరం యువత ఆలోచనలకు, వారి జీవనశైలికి అద్దం పట్టేలా రోహిణి క్యారెక్టర్‌ను దర్శకుడు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దాడు.  తెరపై శ్రుతి హాసన్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సినిమా ముగిసే వరకు ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ముఖ్యంగా ఫ్యాషన్ రంగంలో రాణించాలనుకునే ఒక ఆధునిక యువతిగా ఆమె వేసుకున్న కాస్ట్యూమ్స్, ఆమె హెయిర్ స్టైల్, బాడీ లాంగ్వేజ్, ఆత్మవిశ్వాసం, స్వతంత్ర భావాలు యువతని, జెన్ జి బ్యాచ్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. బాడీలాంగ్వేజ్ సైతం చాలా సహజంగా పండించి లోకనాయకుడు కమల్ హాసన్ పుత్రికారత్నం అంటే  ఇలాగే ఉంటుంది మరి అనిపించింది.  రోహిణికి ఒక బలమైన ఎమోషనల్ కోణం కూడా ఉంది. కథలో కీలక మలుపులు తిరిగే సన్నివేశాల్లో శ్రుతి హాసన్ పలికించిన హావభావాలు థియేటర్లలో ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తున్నాయి. ఎమోషనల్ సీన్లలో ఆమె కళ్ళతోనే పలికించిన భావాలు, డైలాగ్ డెలివరీలో చూపించిన పరిణతి  ప్రధాన బలం. ఇది కూడా చదవండి: ఆకాశంలో ఒక తార మూవీ రివ్యూ! ఒక వైపు అల్ట్రా మోడ్రన్ గర్ల్‌గా కనిపిస్తూనే, మరోవైపు ఎంతో బాధ్యత కలిగిన వ్యక్తిగా ఆమె రోల్ సాగే తీరు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.కథలోని ఇతర ప్రధాన క్యారెక్టర్స్ కి, కథనానికి ఆమె రోల్ ఇచ్చిన బలం వల్లే సినిమా ఇంత పెద్ద హిట్ అయిందని ట్రేడ్ వర్గాలు  విశ్లేషిస్తున్నాయి.   గతంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన శ్రుతి హాసన్‌కు, ఈ సినిమా మళ్ళీ టాలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. మొత్తానికి నయా ఫ్యాషన్ గర్ల్ హోదాలో శృతి చాలా రోజుల తర్వాత తెలుగు సెల్యులాయిడ్ పై ఎంట్రీ ఇచ్చి తెలుగు ఎక్స్ క్లూజివ్ జెన్ జీ బ్యాచ్ కి రోల్ మోడల్ గా నిలిచింది. దైర్యం, ఆత్మ విశ్వాసం స్పెషల్ బోనస్. మీకు నచ్చవచ్చు: వరుస హిట్లతో దుల్కర్ సల్మాన్ సరికొత్త చరిత్ర! మీకు నచ్చవచ్చు: ఆకాశంలో ఒక తార: ఆడపిల్లల కలలకి ధైర్యాన్ని ఇచ్చే మూవీ!     [Shruti Haasan, Aakasamlo Oka Tara,Dulqer Salmaan, Sathvika Veeravalli, Pawan Sadineni]      
తెలుగు హీరోలే హిట్టు సినిమా కాన్సెప్ట్ తెలియక అలో లక్ష్మణ అంటు తర్జన భర్జన పడుతున్నారు. అలాంటిది మలయాళ కట్ అవుట్ దుల్కర్ సల్మాన్ వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. మాములు హిట్ అనుకోని పొగడటం తగ్గిద్దామని అనుకుంటే మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ లాంటి సూపర్ హిట్స్. తాజాగా వచ్చిన ‘ఆకాశంలో ఒక తార’ కూడా సూపర్ హిట్ ఖాతాలోకి చేరింది.అంటే అచ్చ తెలుగులో హ్యాట్రిక్ తర్వాత నాలుగో ఘనవిజయాన్ని అందుకున్నాడు. మరి వీటన్నింటిపై ఒక లుక్ వేద్దాం. దుల్కర్ సల్మాన్ తెలుగు సినీ ప్రయాణం అద్భుతమైన కథల ఎంపికతో మొదలైంది. 2018లో వచ్చిన ‘మహానటి’ సినిమాలో జెమినీ గణేశన్ పాత్రలో ఒదిగిపోయి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత 2022లో వచ్చిన ‘సీతారామం’తో క్లాసిక్ లవ్ స్టోరీకి కొత్త అర్థం చెప్పి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాడు. అనంతరం 2024లో విడుదలైన ‘లక్కీ భాస్కర్’ చిత్రంతో ఏకంగా 7.35 కోట్ల రూపాయల భారీ ఓపెనింగ్ నెట్ కలెక్షన్లతో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచి, వంద కోట్ల క్లబ్‌లో చేరాడు. ఇలా తెలుగులో చేసిన  మొదటి మూడు సినిమాలతోనే 100 శాతం సక్సెస్ రేట్ సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం కూడా అదే జోరుని కొనసాగిస్తోంది. స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్, లైట్‌బాక్స్ మీడియా వంటి ప్రతిష్టాత్మక సంస్థలు నిర్మించిన ఈ చిత్రం, ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రీమియర్ షోలలోనే 27.18 లక్షల రూపాయల గ్రాస్ వసూలు చేయగా, ముఖ్యంగా హైదరాబాద్‌లో 14.18 లక్షల రూపాయలతో పాటు డాల్బీ సినిమా ఫార్మాట్‌లో ఏకంగా 97.8 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేయడం విశేషం.    ఇది కూడా చదవండి: ఆకాశంలో ఒక తార మూవీ రివ్యూ! అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే 3.87 కోట్ల రూపాయల గ్రాస్ తో  2.96 లక్షల టికెట్లు అమ్ముడవడంతో ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ స్పష్టంగా కనిపించింది. దాదాపు 60 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందగా  మొదటి రోజు నుంచే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి 86 శాతం వాటాతో భారీ ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా శనివారం అడ్వాన్స్ బుకింగ్స్ కూడా 84 లక్షల రూపాయలు దాటడం ఆకాశంలో ఒక తార  లాంగ్ రన్‌కి  సంకేతంగా నిలుస్తోంది.   కమర్షియల్ మాస్ సినిమాల హవా నడుస్తున్న రోజుల్లో, కేవలం బలమైన కథ, భావోద్వేగాలను నమ్ముకుని దుల్కర్ సాధిస్తున్న ఈ వరుస విజయాలు టాలీవుడ్ హీరోలకు ఒక కొత్త పాఠంలా మారాయి. మలయాళంలో అప్పుడప్పుడు పరాజయాలు ఎదురైనా, తెలుగులో మాత్రం అపజయమే ఎరుగని హీరోగా దుల్కర్ సల్మాన్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్టే లెక్క.   మీకు నచ్చవచ్చు: ఆకాశంలో ఒక తార: ఆడపిల్లల కలలకి రెక్కలు తొడిగే అద్భుత సందేశం! మీకు నచ్చవచ్చు: ఓం ట్విట్టర్ రివ్యూ!   [Dulquer Salmaan, Aakasamlo Oka Tara, Satvika Veeravalli, Pawan Sadineni, Shruthi Haasan]  
చాలా రోజుల తర్వాత మళ్ళీ సినీ సర్కిల్స్, ప్రేక్షకుల్లో 'ఆకాశంలో ఒక తార' వల్ల తెలుగు సినిమా చూసి బాగుపడరా అనే సామెత వినిపిస్తూ ఉంది. అంతలా ఆకాశంలో ఒక తార నిన్న ప్రీమియర్స్ ప్రదర్శించిన దగ్గరనుంచి తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని     దోచుకుంటూ ఉంది. మరి ముఖ్యంగా అర్ధమైన మెసేజ్ ఏంటో చూద్దాం. సమాజంలో ఆడపిల్లలు ఎదగడానికి ఎన్నో అడ్డంకులు ఉంటాయి, కానీ వాటిని దాటుకుని ఆకాశమంత ఎత్తుకు ఎదగాలనే సంకల్పం ఉంటే ఏదీ అసాధ్యం కాదు. సరిగ్గా ఇదే బలమైన సందేశాన్ని మనసులకు హత్తుకునేలా అందిస్తోంది. కేవలం వినోదం కోసమే కాకుండా, ప్రతి ఒక్కరిలో ముఖ్యంగా మహిళల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపే అద్భుతమైన ప్రయత్నం. మన జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం ఎంత ముఖ్యమో, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్ని కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా ఎలా పోరాడాలో ఎంతో హృద్యంగా చూపిస్తుంది. అత్యంత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం ఆడపిల్లల భవిష్యత్తు గురించి ఇచ్చిన సందేశం. సాధారణంగా చాలామందికి పెద్దయ్యాక ఏం చేయాలో అనే ఆలోచన వస్తుంది. కానీ, ఈ చిత్రం పాఠశాల వయసు నుంచే ఆడపిల్లలు తమకంటూ ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలని గట్టిగా చెబుతోంది. చిన్నప్పటి నుంచే కలలు కనడం నేర్చుకుంటే, వాటిని నిజం చేసుకునే దిశగా అడుగులు వేయడం సులభమవుతుందని కళ్ళకు కట్టినట్లు చూపించారు. చదువుతో పాటు తమకు ఇష్టమైన రంగంలో రాణించడానికి అమ్మాయిలు ఎలా సిద్ధం కావాలో, తల్లిదండ్రులు వారికి ఎలా అండగా నిలవాలో  చక్కగా ఆవిష్కరించారు. ఇది కూడా చదవండి: ఆకాశంలో ఒక తార మూవీ రివ్యూ!  జీవిత ప్రయాణంలో ఎదురయ్యే అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, సమాజం విసిరే ప్రశ్నలు మహిళల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంటాయి. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కుంగిపోకుండా, తమలోని శక్తిని గుర్తించి ముందుకు సాగాలని 'ఆకాశంలో ఒక తార' గుర్తుచేస్తుంది. ఒక సాధారణ అమ్మాయి తన పట్టుదలతో, కఠోర శ్రమతో అందనంత ఎత్తులో ఉన్న తన లక్ష్యాన్ని ఎలా చేరుకుందనే ప్రయాణం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ప్రతి సన్నివేశంలోనూ సహజత్వం ఉట్టిపడుతూ, చూస్తున్న ప్రతి మహిళకు "నేను కూడా సాధించగలను" అనే ధైర్యాన్ని ఇస్తుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు.  మహిళా సాధికారత అనేది కేవలం మాటల్లో కాకుండా చేతల్లో ఉండాలని ఈ చిత్రం చాటిచెప్పింది. పాఠశాల విద్యార్థినుల నుండి గృహిణుల వరకు ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన మూవీ.ఆడపిల్లలకి  సరైన ప్రోత్సాహం అందిస్తే వారు ఆకాశంలో మెరిసే తారల్లా తమ ప్రతిభతో వెలుగులు నింపగలరని నిరూపించడంతో పాటు సమాజంలో ఆడపిల్లల పట్ల ఉండే ఆలోచనా విధానంలో తప్పకుండా ఒక మంచి మార్పును తీసుకొస్తుంది. లక్ష్య సాధనలో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క మహిళకి, పురుషులకి ఆకాశంలో ఒక తార ఒక గొప్ప మార్గదర్శిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.   మీకు నచ్చవచ్చు:ఓం ట్విట్టర్ రివ్యూ! మీకు నచ్చవచ్చు:ఆకాశంలో ఒక తార రివ్యూ!   [Aakasamlo Oka Tara, Satvika Veeravalli, Dulqer Salmaan, Shruthi Haasas, pawan Sadineni]
ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, అమరన్ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి వరల్డ్ వైడ్ గా 'ఓం'  తో సెల్యులాయిడ్ పై అడుగుపెట్టేసారు. దీంతో పాన్ ఇండియా ప్రేక్షకులు థియేటర్స్ కి క్యూ కట్టారు.  ప్రెజెంట్ బొమ్మ రన్ అవుతుంది. ఈ నేపథ్యంలో అసలు రివ్యూ వచ్చే లోపు ట్విట్టర్ రివ్యూ నాకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వు అంటుంది. మరి అదేంటో చూసేద్దాం.  'ఓం' కథ ఆంధ్రప్రదేశ్–తమిళనాడు సరిహద్దు అటవీ ప్రాంతాల్లో జరిగే ఎర్రచందనం, గంధపు చెక్కల అక్రమ రవాణా నేపథ్యంలో సాగుతుంది. ఈ కథలో సుమారు 1000 టన్నుల విలువైన గంధపు చెక్కల అక్రమ రవాణాకు ప్లాన్ చేయగా, అందులో కేవలం 300 టన్నుల సరుకు మాత్రమే చేరుతుందని, మిగిలిన 700 టన్నుల సరుకు మాయమవ్వడం వల్ల రెండు మాఫియా గ్రూపుల మధ్య పెద్ద యుద్ధమే మొదలవుతుందని కథాంశంగా నిలుస్తోంది. అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్‌వర్క్ అధినేత బర్మా కార్తికేయన్ అలియాస్ సియా క్యారక్టర్ లో మమ్ముట్టి కనిపించగా, అతని కుడిభుజంగా చెజియన్ అలియాస్ తిరు కుమరన్ గా  ధనుష్ నటించారు. అనూహ్య పరిస్థితుల్లో తన బాస్‌కే ధనుష్ పాత్ర ఎదురు తిరగడం కథలో కీలక మలుపుగా నిలుస్తోంది.   ఈ హై-ప్రొఫైల్ స్మగ్లింగ్ కేసును ఛేదించడానికి, మాఫియా ఆట కట్టించడానికి చేపట్టిన 'ఆపరేషన్ మోల్'కు ఐపీఎస్ అధికారి నిత్యారెడ్డిగా సాయి పల్లవి నాయకత్వం వహిస్తున్నారు.  పోలీసులను తక్కువ అంచనా వేసే మాఫియాపై ఆమె ఉక్కుపాదం మోపే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయని నెటిజన్లు పేర్కొంటున్నారు. మరోవైపు ధనుష్ భార్య రోజా పాత్రలో శ్రీలీల భావోద్వేగభరిత పాత్రలో కనిపించగా, రేణు దేశాయ్ కూడా కీలక పాత్రలో మెరిశారు.   ట్విట్టర్ రివ్యూలలో ప్రేక్షకులు ప్రధానంగా ధనుష్, మమ్ముట్టి కాంబినేషన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఆకాశంలో ఒక తార: ఆడపిల్లల కలలకి రెక్కలు తొడిగే అద్భుత సందేశం! ధనుష్ తన సహజసిద్ధమైన నటనతో, మమ్ముట్టి తన పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో సినిమాకు భారీ బలాన్ని ఇచ్చారని పలువురు యూజర్లు రాశారు. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు థియేటర్లలో హై మూమెంట్స్ ఇస్తున్నాయని, ఇంటర్వెల్ బ్లాక్ ఊహించని ఎమోషనల్ ట్విస్ట్‌తో ఆకట్టుకుంటోందని ట్వీట్లలో ప్రస్తావించారు. సాయి పల్లవి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించిన తీరుకు ప్రత్యేకంగా మెచ్చుకోలు లభిస్తోంది.   సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ అందించిన మ్యూజిక్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ 'నెక్స్ట్ లెవల్'లో ఉందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.  సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు కొంత నెమ్మదిగా సాగినప్పటికీ, కథలో లీనమైన తర్వాత మంచి ఫీల్ ఇస్తోందని ప్రేక్షకుల అభిప్రాయంగా ఉంది. మొత్తంగా మాస్ యాక్షన్, స్మగ్లింగ్ థ్రిల్లర్, కుటుంబ భావోద్వేగాల కలయికతో వచ్చిన 'ఓం' సినిమా తొలి షో నుంచే ఆడియన్స్‌లో మంచి బజ్‌ని  సొంతం చేసుకుంది. ఫ్యాన్స్ అయితే మేం ఊహించిన దాని కంటే ఎక్కువగా నచ్చిందంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.  
Cast: Dulquer Salmaan, Satvika Veeravalli, Shruthi Haasan, Ruhani Sharma, Swasika Vijay, Nasser, Murli Sharma  Crew:  Written by Pavan Sadineni, Gunnam Gangaraju, Vasanth Jurru Cinematography by Sujith Sarang Music by GV Prakash Kumar  Editing by KL Praveen  Directed by Pavan Sadineni  Produced by Sundeep Gunnam, Ramya Gunnam  Presented by Geetha Arts, Swapna Cinema    Dulquer Salmaan has been very picky with Telugu films but he has been delivering huge blockbusters. Now, he is back with Aakasamlo Oka Tara with Satvika Veeravalli debuting. Movie has gathered good anticipation and it released on 20th November. Let's discuss about it in detail.    Plot:  Kalpana (Satvika Veeravalli) gets fascinated by Space as a scientist (Nasser) takes a special class at her village's elementary school with a makeshift planetarium set-up. But her abusive father marries her off to Krishna (Dulquer Salmaan), a mechanic, as she passes out tenth. Krishna doesn't know she is too young and asks her about her dream, she says she wants to be an astronaut. He gets to know that she topped tenth class with state first rank.  Krishna takes a stand against everyone to help Kalpana reach her goal. She gets into IIT after acing the tests with 7th rank in AIR. Krishna decides to take a laborious driver job in Gujarat for 4 years to support her education. On the other hand, Kalpana designs a plasma engine but it fails at a test. She gives up on her dream due to the failure and Krishna finds a hope for her in Skyway MD Rohini (Shruthi Haasan). What happens next? Watch the film to know more.    Analysis:  Dulquer Salmaan is exceptional as Krishna. He is so believable as a naive driver and mechanic that we forget he is DQ while we watch him on screen. The moment when he understands, she finally achieved her dream, only a seasoned actor can give such a brilliant expression.  Satvika Veeravalli is a revelation. Her performance is so captivating and equal to Dulquer that whenever they appear together on screen, the scene lights up. She is in character throughout and suited it the best. Shruthi Haasan, Ruhani Sharma, Murli Sharma, Gautham Menon, Swasika and everyone did their roles, perfectly.  Pavan Sadineni executed the script really well. There are few shot selections that could have been bettered and some editing choices that seem rushed for effect, but overall, he did a good job. The performances are captured beautifully by Sujith Sarang and music by GV Prakash Kumar enhances the feel.  Editing could have been better and at places shots feel random than telling a story in proper motion. Director needed to see that such effect is minimised. At places, the writing tries to be too smart and at places, it dumbs down a little bit to take a convenient route to reach the next big step. This inconsistency could have been avoided.  For example, the mature handling of growing intimacy between Kalpana and Krishna gives way to very lazily written mid-portions of the mission. The amalgamation of a husband supporting his wife's dream and actually her achieving it needed much better catalysts for reaction to give a lasting compound.  At places, there are some force fit scenes to balance the weightage of characters. Such scenes needed a little bit more work to avoid them being rushed, at least on edit table. With such flaws too, the movie doesn't get random and sticks to one point delivering satisfying experience. It is a good watch for audiences of all ages.    Positives:  Dulquer Salmaan's performance  Satvika Veeravalli's performance  Ensemble cast  Visuals and technical brilliance  Basic plot point Shruthi Haasan scene with Dulquer    Negatives:  Slightly slow narrative  Few more scenes to showcase genius of Kalpana could've helped  Rushed feel in several important moments  Few edit patterns  Some force fit scenes  Sound design could've been better    Bottomline: A good watch with inspiring content!  Rating: 2.75/5    Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
  సినిమా పేరు:  ఆకాశంలో ఒక తార న‌టీన‌టులు: సాత్విక వీరవల్లి, దుల్కర్ సల్మాన్, శృతి హాసన్, రుహాణి శర్మ, శ్వాసిక, నాజర్, మురళి శర్మ  తదితరులు  సినిమాటోగ్ర‌ఫీ: సుజిత్ సారంగ్ ఎడిటింగ్: ప్రవీణ్ కే ఎల్ మ్యూజిక్:జివి ప్రకాష్ కుమార్  నిర్మాత‌లు: గుణ్ణం గంగరాజు, అల్లు అరవింద్,అశ్వనీదత్   బ్యానర్స్: లైట్ బాక్స్ మీడియా, స్వప్న సినిమాస్, గీతా ఆర్ట్స్   దర్శకత్వం: పవన్ సాదినేని  రిలీజ్ డేట్ : నవంబర్ 20, 2026  ప్రచార చిత్రాలతో క్రేజ్ సంపాదించుకుంది ఆకాశంలో ఒక తార. ఎంతలా అంటే మేకర్స్  రిలీజ్ ముందు రోజు ప్రీమియర్స్ ప్రదర్శిస్తే ఎంత బాగుండు అనేంతలా. మరి ప్రీమియర్స్ ప్రదర్శించారు. మూవీ ఎలా ఉందో చూద్దాం.  కథ కల్పన( సాత్విక వీరవల్లి) స్కూల్ చదివే వయసు నుంచే ఆస్ట్రోనట్(వ్యోమగామి) అయ్యి అంతరిక్షంలోకి వెళ్లాలని కలలు కంటూ ఉంటుంది. నిర్మలమైన మనసు, సాత్వికురాలు. ఇంటి ముందు వేసే ముగ్గు కూడా ఆకాశంతో పాటు నక్షత్రాలు లాగా వేస్తుంటుంది.  చదువులో టాపర్. అందరి కంటే వేరేలా ఆలోచించడం తన బలం. ఎంతమంది ఎగతాళి చేసినా, నవ్వుకున్నా మన గమ్యం అంటే ఏంటో చెప్పకపోతే దారి ఎవరైనా ఎలా చూపిస్తారు అనుకునే స్వభావం కూడా. తండ్రి శివయ్య తాగుబోతు. కూతురు అంటే ఆడపిల్ల కదా అని చిన్న చూపు. 10 th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ కూడా రాయనివ్వనంత  కఠినాత్ముడు. కల్పనకి  తల్లి గంగ  సపోర్ట్. కృష్ణ( దుల్కర్ సల్మాన్) ఒక మెకానిక్. సొంతంగా కారు కొనుక్కొని డ్రైవర్ అవ్వాలనేది కల. కృష్ణ, కల్పనకి పెళ్లి జరుగుతుంది. అప్పుడు కల్పన వయసు 16 ఏళ్ళు. దీంతో కృష్ణ షాక్ అవుతాడు. మరి కల్పన తన లక్ష్యం చేరుకోవడానికి వివాహబంధం అనేది అన్యాయం చేసిందా? సాయపడిందా? ఒక వేళ సాయపడితే సామాన్య మెకానిక్ భార్య తన లక్ష్యాన్ని ఎలా చేరుకుంది? ఆ చేరుకునే ప్రాసెస్ లో స్వార్ధం, పంతం, త్యాగం అనే మూడు శక్తులు కల్పన జీవితంలో ఎలా మహత్తర శక్తులుగా ఉన్నాయనేదే  ఆకాశంలో ఒక తార. ఎనాలసిస్  మూవీ స్టార్టింగ్ నుంచే మన మైండ్ లో ఆడపిల్లని తక్కువ అంచనా వెయ్యకూడదు.. అనుకున్నది సాధించడంలో ఎవరికీ తీసిపోదు అనే మాట మైండ్ లో రన్ అవుతూనే ఉంటుంది. పైగా మన ఇంట్లో ఆడపిల్ల ఉంటె నువ్వు ఏం అనుకుంటున్నావో చెప్పు నీ వెనక మేము ఉన్నామని ఇంట్లో వాళ్ళు అంటారు. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే రివర్స్ స్క్రీన్ ప్లే తో గుజరాత్ రాష్ట్రంలో ట్రక్ డ్రైవర్ గా పని చేస్తున్న కృష్ణ పాయింట్ లో నడిచిన కల్పన చైల్డ్ ఎపిసోడ్ సూపర్. గుజరాత్ లో కృష్ణ, బిజిలి( రుహాణి శర్మ) శర్మ సీన్స్ కూడా సూపర్. ఆ తర్వాత కల్పన, కృష్ణ పెళ్లి సీన్స్, కృష్ణ అక్క( శ్వాసిక) సీన్స్ బాగున్నాయి. కాకపోతే కల్పన లక్ష్యాన్ని కృష్ణ తెలుసుకునే ప్రాసెస్ ని టెన్షన్ బిల్డప్ చేస్తూ  లెన్త్ లో చూపించాల్సింది. ఎందుకంటే కథకి ఈ పాయింట్ నే కీలకం కాబట్టి ప్రేక్షకులు కూడా అయ్యో కల్పన లక్ష్యం ఇప్పుడెలా అని అనుకునేవారు. కల్పన, కృష్ణ హైదరాబాద్ రావడం, కల్పన కాలేజీ లో చేరడం, తన ఎడ్యుకేషన్, ఆ తర్వాత కేరళలో ఐఐటి క్యాంపస్ ఇలా అన్ని సీన్స్ బాగున్నాయి. కానీ అంతరిక్షం ప్రయోగం చేసే అవకాశం అనేది చాలా కష్టంతో రావాల్సింది అనేది ఎస్టాబ్లిష్ చేసి ఉండాల్సింది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది . సెకండ్ హాఫ్ చూసుకుంటే కృష్ణ, కల్పన మధ్య కొత్త పార్స్యానికి సంబంధించిన కథ రన్ అయ్యింది. అంతరిక్షంలోకి వెళ్లే రాకెట్స్ ని తయారు చేసే స్కై వే యజమాని రోహిణి పరిచయం కాగానే సీన్స్ అన్ని చాలా గమ్మత్తుగా, ఫ్రెష్ గా వచ్చాయి. ముఖ్యంగా కృష్ణ, రోహిణి, కల్పన మధ్య వచ్చిన సీన్స్. కృష్ణ, రోహిణి మద్యం తాగే సీన్స్ అయితే బాగున్నాయి.తన లక్ష్యం వద్దనుకుని  DRDO [డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్] లో జాబ్ చేస్తున్న కల్పనని కృష్ణ మళ్ళీ  తన లక్ష్యం వైపు వచ్చేలా చేయడం అనే ప్రాసెస్ ని హెవీ గా చూపించాల్సింది. కల్పనకి కృష్ణ దూరమవ్వడం అనే ఎపిసోడ్ తో పాటు ప్రీ క్లైమాక్స్,క్లైమాక్స్ సూపర్ గా ఉన్నాయి. నటీనటులు సాంకేతిక నిపుణల పని తీరు    కల్పన గా సాత్విక వీరవల్లి దిష్టి పెట్టేంత రేంజ్ లో మెస్మరైజ్ చేసింది. అసలు ఈ క్యారక్టర్ చెయ్యడం కోసమే తను ఈ భూమ్మీదకి వచ్చిందా అని అనుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నటనకి సంబంధించిన అన్ని వేరియేషన్స్ లో తన హవా సుస్పష్టం. కృష్ణ గా దుల్కర్ సైతం అంతే.. తన కెరీర్ లో ఆకాశంలో ఒక తార మరో మైలురాయి. కొన్నేళ్ల పాటు మంచి మొగుడు ఎవరు అంటే దుల్కర్ అని చెప్తారు. రోహిణి గా శృతి హాసన్ తన పెర్ఫార్మ్ తో మూవీకి మరో తారలా నిలిచింది. మోడరన్ అండ్ మంచి తనం కలగలిపిన ఒక ఎడ్యుకేట్, ప్రొఫిషినల్ గా పర్ఫెక్ట్ గా ఉండే అమ్మాయిలు  ఎలా ఉంటారో తన నటన ద్వారా చాటి చెప్పింది. నాజర్, మురళి శర్మ, కల్పన తల్లి తండ్రులు తో పాటు మిగతా అందరూ కూడా తమ క్యారెక్టర్స్ మాత్రమే కనపడేలా మెప్పించారు. జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫొటోగ్రఫీ అదనపు బలం. పవన్ సాదినేని దర్శకుడిగా ఇంకో మెట్టు పైకి ఎక్కాడు. షాట్ సెలక్షన్ సూపర్.  రైటర్స్ ఇంకొంచం మెరుగులు దిద్దాల్సింది. గుణ్ణం గంగరాజు, అల్లు అరవింద్, అశ్వని దత్ నుంచి వచ్చిన ప్రొడక్షన్ వాల్యూస్ మరో అతి పెద్ద బలం. బలాలు 1 . కథ 2 . సాత్విక, దుల్కర్, శృతి హాసన్ మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ 3 . డైరెక్షన్  4 . ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్  చివరిగా చెప్పాలంటే మూవీ చూస్తున్నంత సేపు మెస్మరైజ్ అవుతూనే ఉంటాం. అయ్యాక ఆడవాళ్ళని ఎంకరేజ్ చెయ్యాలని డిసైడ్ అవుతాం. రేటింగ్ 2 .75 /5                                                                                                               అరుణాచలం 
శర్వానంద్‌ అప్ కమింగ్ మూవీ ‘భోగి’. సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా ఎట్టకేలకు కొత్త విడుదల తేదీని ఖరారు చేసుకుంది. నవంబర్ 27న థియేటర్లలోకి రానున్నట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ‘LOCKED AND LOADED’ అంటూ రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసింది. అంతేకాదు.. థియేటర్లలో అద్భుతమైన యాక్షన్‌, ఎమోషనల్ ఎక్స్‌పీరియెన్స్‌కు సిద్ధంగా ఉండాలంటూ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది. వాస్తవానికి ‘భోగి’ ఆగస్టు 28న విడుదల కావాల్సి ఉంది. అయితే 1960ల నాటి ప్రపంచాన్ని తెరపై సహజంగా చూపించేందుకు విజువల్ ఎఫెక్ట్స్‌, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కారణంగా ఆ తేదీని వదులుకున్నారు. ఆ తర్వాత నవంబర్ 12న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ప్రమోషన్లు కూడా మొదలుపెట్టారు. కానీ సెన్సార్‌ ప్రక్రియలో ఎదురైన ఇబ్బందులతో చివరి నిమిషంలో విడుదల వాయిదా పడింది. సినిమాను రివైజింగ్‌ కమిటీకి పంపడంతో ట్రైలర్‌ లాంచ్‌, ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కూడా వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో అభిమానులు నిరాశ చెందారు. తాజాగా అన్ని అడ్డంకులు దాటుకుని నవంబర్ 27న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ సినిమాలో శర్వానంద్‌ ఇప్పటివరకు కనిపించని రస్టిక్‌ అవతార్‌లో కనిపించనున్నారు. 1960ల కాలంలో తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని ఓ గ్రామం నేపథ్యంలో కథ సాగుతుంది. అణచివేతకు ఎదురొడ్డి నిలిచే గంగ అనే పవర్‌ఫుల్‌ పాత్రలో శర్వానంద్‌ నటిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్‌, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇది కూడా చదవండి: రాధికా ఆప్టే వివాదంపై కీర్తి సురేష్ క్లారిటీ.. అప్పుడెందుకు నవ్వానంటే.? ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా శర్వానంద్‌ మాస్‌ లుక్‌, పీరియాడిక్‌ నేపథ్యం ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్‌ చేశాయి. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాని కేకే రాధామోహన్‌ శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ‘భోగి’లో భారీ యాక్షన్‌ సన్నివేశాలతో పాటు బలమైన భావోద్వేగాలు కూడా ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది. తాజాగా విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్స్‌ చేసిన పోస్టులోనూ యాక్షన్‌, ఎమోషన్‌ రెండింటినీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. మరి గంగ పాత్రలో శర్వానంద్‌ ఏ స్థాయిలో మెప్పిస్తారు? సంపత్‌ నంది ఈసారి ఎలాంటి యాక్షన్‌ ప్రపంచాన్ని చూపించబోతున్నారు? అన్నది ఆసక్తికరంగా మారింది. మీకు నచ్చవచ్చు:  తాత టైటిల్‌తో తారక్ మూవీ.. అనిల్‌ రావిపూడి ప్లాన్ మామూలుగా లేదు.! ఆకాశంలో ఒక తార vs డియర్ ఆస్ట్రోనాట్.. ఒకే రోజు ఒకే కథతో రెండు సినిమాలు.!       [Bhogi Release Date, Bhogi On November 27, Sharwanand, Sampath Nandi, Anupama Parameswaran]
సినిమా పాటల్లో కొన్ని వినడానికి బాగుంటాయి.. కానీ కొన్ని పాటలు మాత్రం మనసుకు హత్తుకునే ఓ భావోద్వేగాన్ని మిగులుస్తాయి. నాగచైతన్య ‘వృషకర్మ’ నుంచి వచ్చిన ‘చలో పదవే’ ఈ కోవలోకే వస్తుంది. తొలి పాట ‘స్వాగ్ ఆఫ్ అర్జున్‌’తో మాస్ టచ్ చూపించిన చిత్ర బృందం.. ఇప్పుడు రెండో పాటతో పూర్తిగా భిన్నమైన ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఈ పాటలో ప్రధానంగా కనిపించే అంశం ఓ ఆటిస్టిక్ చైల్డ్. ప్రపంచంతో కలవలేని ఆ చిన్నారికి.. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అనుభూతి చెందేలా చేసే ప్రయత్నం పాటలోని భావోద్వేగానికి కేంద్రంగా నిలుస్తోంది. ప్రకృతిని చూడటం మాత్రమే కాదు.. దాన్ని స్పర్శతో, శబ్దాలతో, మనసుతో అనుభవించవచ్చనే భావనను ఈ పాట గుర్తుచేస్తుంది. ఇక్కడ పాటలోని దృశ్యాలు కేవలం అందమైన విజువల్స్‌గా మిగిలిపోకుండా.. చిన్నారి అనుభవించే భావాలను ప్రేక్షకులకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే ‘చలో పదవే’లో కనిపించే చిన్నారి పాత్ర పాటకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. నాగచైతన్య, మీనాక్షి చౌదరి మధ్య కనిపించే అనుబంధం కూడా ఈ భావోద్వేగ ప్రపంచానికి మరో కోణాన్ని జోడిస్తోంది. ‘కాంతార’, ‘విరూపాక్ష’ వంటి సినిమాలతో తన సంగీతంలో ప్రత్యేకమైన వాతావరణాన్ని సృష్టించగలడని నిరూపించుకున్న అజనీష్ లోక్‌నాథ్.. ఈ పాటలో మెలోడీకి ప్రాధాన్యత ఇచ్చారు. సాయి విఘ్నేశ్ గాత్రం కూడా పాటకు చక్కగా సరిపోయింది. ఆయన గొంతులోని మాధుర్యం పాటలోని అమాయకత్వాన్ని, ఆత్మీయతను మరింతగా ఎలివేట్ చేస్తోంది. ఇది కూడా చదవండి: నీ గూడు చెదిరింది.. ప్రతి పదంలోనూ విషాదం.. పాటలోని అసలు భావం ఇదే.! ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. ‘చలో పదవే’ అనే టైటిల్‌లోనే ఓ ప్రయాణానికి సంబంధించిన పిలుపు వినిపిస్తుంది. అది కేవలం ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లే ప్రయాణం కాదు.. ఒక చిన్నారి ప్రపంచాన్ని కొత్తగా అనుభూతి చెందించే ప్రయాణంగా అర్థం చేసుకోవచ్చు. ‘విరూపాక్ష’తో ప్రేక్షకులను థ్రిల్ చేసిన కార్తీక్ దండు.. ఇప్పుడు నాగచైతన్యతో ‘వృషకర్మ’ అనే మైథలాజికల్ మిస్టరీ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇలాంటి మిస్టరీ, థ్రిల్లర్ కథల్లో భావోద్వేగాలకు కూడా చోటు ఉంటుందని ఈ పాట సూచిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. మీకు నచ్చవచ్చు: క్యూట్ వీడియో.. గాయత్రీ మంత్రం చదివిన ప్రియాంక చోప్రా కూతురు.! ప్రమోషన్స్‌ అంటే చాలు వచ్చేస్తాడు.. అనిల్‌ రావిపూడిపై కీర్తి, కృతి సెటైర్లు.!       [Chalo Padhave Song, Vrushakarma Movie, Naga Chaitanya, Meenakshi Chaudhary, Ajaneesh Loknath]  
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పినట్టుగా సూపర్ స్టార్ రజినీ కాంత్ జైలర్ 2 తోరికార్డుల కలెక్షన్స్ ని సృష్టించాడు. పైగా 'టైగర్ కా హుకుం' అంటూ పలు రికార్డులని అందుకొని అభిమానులు ముఖాల్లో చిరునవ్వులు కూడా నింపాడు. కానీ ఇప్పుడు ఆ నవ్వుల  స్థానంలో అంతేలే ఏం చేస్తాం, దక్కిందే మహాభాగ్యం వచ్చి చేరింది.   గత నెల అక్టోబర్  15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన జైలర్ తొలి రోజే 125.25 కోట్ల గ్రాస్ వసూలు చేసి భారీ ఓపెనింగ్ అందుకుంది. ఇందులో ఇండియా నెట్ రూ. 59.70 కోట్లు, ఇండియా గ్రాస్ 70.25 కోట్లు కాగా, ఓవర్సీస్ నుంచి సుమారు  55 కోట్ల గ్రాస్ వచ్చింది.అంతేకాదు, కేవలం ఐదు రోజుల్లోనే  500 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టి, గతంలో 'రోబో 2.0' పేరిట ఉన్న ఆల్ టైమ్ హయ్యెస్ట్ కలెక్షన్ల రికార్డును దాటేస్తూ తలైవా తన పాత రికార్డులను తానే తిరగరాశారు.  ఇలా ప్రపంచవ్యాప్తంగా మరియు పొరుగు రాష్ట్రాల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ, 'జైలర్ 2' రెండు ప్రధాన బాక్సాఫీస్ రికార్డులను మాత్రం అందుకోలేకపోవడం ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. సాధారణంగా రజనీకాంత్ సినిమా వస్తే సొంత రాష్ట్రమైన తమిళనాడులో రికార్డులు తుడిచిపెట్టుకుపోతాయి.  కానీ ఈసారి సీన్ కొద్దిగా మారింది. థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి 'జైలర్ 2' తమిళనాడులో  221 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. అయితే, 2023లో విడుదలైన దళపతి విజయ్ బ్లాక్‌బస్టర్ 'లియో' తమిళనాడులో సాధించిన  224 కోట్ల రికార్డును ఈ చిత్రం అధిగమించలేకపోయింది. కేవలం 3 కోట్ల స్వల్ప తేడాతో సొంత గడ్డపై నంబర్ వన్ స్థానాన్ని కోల్పోయి, రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇది కూడా చదవండి: చెప్పులు వేసుకోవడం మానేసిన విజయ్ ఆంటోని.. కారణం చెబుతూ భార్య ఫాతిమా ఎమోషనల్!    మరోవైపు, తమిళనాడు తర్వాత రజనీకాంత్‌కు అత్యంత భారీ మార్కెట్ ఉన్న తెలుగు రాష్ట్రాల్లోనూ 'జైలర్ 2'కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. విడుదలైన మొదటి వారం నుంచే జోరు చూపించిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో తప్పకుండా 100 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరుతుందని ట్రేడ్ విశ్లేషకులు  అంచనా వేశారు. కానీ 99 .65 కోట్ల గ్రాస్ దగ్గరే ఆగిపోవాల్సి వచ్చింది. దీంతో రెండు రికార్డులు రజినీ మిస్ చేసుకున్నాడు. దీనిపై రజనీ అభిమానులు, విజయ్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. సినీ ప్రేమికులైతే ఈ విషయమై స్పందిస్తూ డియర్ ఫ్యాన్స్  అనవసరంగా వాదనలు ఎందుకు చెప్పండి. 'దక్కేది దక్కక మానదు.. దక్కంది ఎన్నటికీ దక్కదు. రికార్డులు కూడా శాశ్వతం  కాదు. కొత్త రికార్డు నమోదు డేట్ కి దేవుడు  ముహూర్తం ఎప్పుడో సిద్ధం చేసుంటాడు    మీకు నచ్చవచ్చు: బాబు.. మీరు  సినిమా హీరో: మర్చిపోవద్దు! మీకు నచ్చవచ్చు :ఆదర్శ కుటుంబం అసిస్టెంట్ డైరెక్టర్ పై ప్రముఖ హీరోయిన్ వ్యాఖ్యలు వైరల్!     [Jailer 2 , Nelson, Rajini Kanth, Vijay, Leo]  
టాలీవుడ్‌ గురించి బాలీవుడ్‌ యాక్టర్స్ చేసే కొన్ని కామెంట్స్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తుంటాయి. తాజాగా నటి రాధికా ఆప్టే చేసిన కామెంట్స్ కూడా అలాంటి వివాదాన్నే రాజేశాయి. ఓ తెలుగు సినిమాలో తన పాత్ర మేనమామను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని, ఆ అనుభవం తనకు నచ్చలేదని రాధికా ఆప్టే చెప్పడం చర్చనీయాంశమైంది. అయితే ఆ సమయంలో ఆమె పక్కనే ఉన్న కీర్తి సురేష్ నవ్వుతూ స్పందించడం కూడా విమర్శలకు కారణమైంది. తాజాగా ఈ వ్యవహారంపై కీర్తి స్పందించారు. తన వెబ్ సిరీస్ ‘అక్క’ ప్రమోషన్లలో భాగంగా రాధికా ఆప్టే ఓ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాలో నటించిన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ సినిమాలో తన పాత్ర మేనమామను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని, తనకంటే ఎక్కువ వయసున్న నటుడితో రొమాన్స్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. అంతేకాదు, సినిమాలో తన పాత్ర మధ్యలోనే చనిపోవడం కూడా తనకు నచ్చలేదని వ్యాఖ్యానించారు. రాధికా ఆప్టే ఏ సినిమా పేరు చెప్పకపోయినా.. ఆమె వ్యాఖ్యలు బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ సినిమాను ఉద్దేశించేనని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఆ సినిమాలో రాధికా ఆప్టే హీరోయిన్ గా నటించారు. ఆమె కామెంట్స్ పై తెలుగు ఆడియన్స్ ఫైర్ అయ్యారు.  ఆ ఇంటర్వ్యూలో రాధిక పక్కనే కూర్చున్న కీర్తి సురేష్ నవ్వుతూ.. ‘మేనమామను పెళ్లి చేసుకోవడం తమిళ, తెలుగు సంప్రదాయాల్లో ఒకటి’ అనే అర్థం వచ్చేలా స్పందించారు. దీంతో కొందరు ప్రేక్షకులు కీర్తి తీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: ప్రమోషన్స్‌ అంటే చాలు వచ్చేస్తాడు.. అనిల్‌ రావిపూడిపై కీర్తి, కృతి సెటైర్లు.! తాజాగా తన కొత్త సినిమా ‘సత్యవాన్ సావిత్రి’ ప్రమోషన్ల సందర్భంగా ఈ వివాదంపై కీర్తి సురేష్‌కు ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ.. రాధికా ఆప్టే మొదట ఏమి చెబుతున్నారో తనకు అర్థం కాలేదని వివరించారు. ఆమె ‘మామ’ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని చెప్పినప్పుడు ఆ మాటల వెనుక ఉన్న సందర్భం తనకు వెంటనే అర్థం కాలేదని తెలిపారు. ఆ తర్వాత రాధిక సౌత్ ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న సంప్రదాయం గురించి మాట్లాడుతున్నారని అర్థం చేసుకున్నానని చెప్పారు. ఆ సంప్రదాయం గురించి తెలియని వ్యక్తికి వివరించే ప్రయత్నమే తాను చేశానని కీర్తి స్పష్టం చేశారు. ‘నేను మన సంస్కృతిని ఎప్పటికీ తక్కువ చేసి మాట్లాడను. సౌత్ లో ఈ సంప్రదాయం ఉందని చెప్పాను. నార్త్ వాళ్ళకి మన సంప్రదాయాల గురించి తెలియపోవచ్చు’ అని కీర్తి వివరించారు. మీకు నచ్చవచ్చు: బాలకృష్ణ 'దాదా' లేటెస్ట్ అప్డేట్.. సినిమాలో అదిరిపోయే ట్విస్ట్.! క్యూట్ వీడియో.. గాయత్రీ మంత్రం చదివిన ప్రియాంక చోప్రా కూతురు.!       [Radhika Apte Controversy, Keerthy Suresh Clarification, Nandamuri Balakrishna, Legend Movie]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఉదయం లేవగానే హడావుడిగా టిఫిన్ తినాల్సిన అవసరం లేకుండా, కేవలం ఒక్క గ్లాస్ రాగి అంబలి తాగితే చాలు శరీరానికి కావాల్సిన బలం, చలువ, ఉత్సాహం సులభంగా అందుతాయని నిపుణులు చెబుతున్నారు. ఎన్నో పోషకాల గనిగా నిలిచే రాగులు లేదా ఫింగర్ మిల్లెట్ మన సంప్రదాయ ఆహారంలో అత్యంత విలువైన చిరుధాన్యం. రాగి అంబలి లేదా రాగి సంగటి రూపంలో వీటిని తీసుకుంటే శరీరానికి అద్భుతమైన మేలు జరుగుతుంది. ముఖ్యంగా నేటి వేగవంతమైన జీవనశైలిలో నీరసం, ఒంట్లో వేడి, బరువు పెరగడం వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఈ సహజ పానీయం ఒక గొప్ప వరంలా పనిచేస్తుంది. రాగులలో కాల్షియం, ఐరన్, డైటరీ ఫైబర్, ప్రోటీన్ సమృద్ధిగా ఉంటాయి. వీటితో పాటు కార్బోహైడ్రేట్లు, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్, బి-విటమిన్లు అలాగే మిథియోనిన్, లైసిన్ వంటి ముఖ్యమైన అమైనో ఆసిడ్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. ప్రతి 100 గ్రాముల రాగులలో సుమారు 344 మిల్లీగ్రాముల నుంచి 364 మిల్లీగ్రాముల వరకు కాల్షియం ఉంటుందని పోషకాహార గణాంకాలు సూచిస్తాయి; ఇది గోధుమ పిండి లేదా జొన్నలతో పోలిస్తే దాదాపు 10 రెట్లు ఎక్కువ. ఈ అధిక కాల్షియం ఎముకలు మరియు దంతాల దృఢత్వానికి తోడ్పడుతుంది, అలాగే రాగుల్లోని ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను కాపాడటానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి మరియు స్థూలకాయం సమస్యతో బాధపడేవారికి రాగి అంబలి ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. కేవలం ఒక గ్లాసు రాగి అంబలి తాగినా చాలాసేపు ఆకలి వేయకుండా కడుపు నిండిన భావన కలుగుతుంది, తద్వారా అనవసరంగా ఎక్కువ ఆహారం తినాలనే కోరిక తగ్గుతుంది. సాధారణంగా ఒక గ్లాసు రాగి అంబలి సుమారు 80 నుంచి 110 కిలోక్యాలరీల శక్తిని అందిస్తూ, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (సుమారు 52) మరియు ఫైబర్ కారణంగా రక్తంలో చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తుంది. దీంతో రోజంతా స్థిరమైన శక్తి లభించడమే కాకుండా, జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. రాగి అంబలికి ఉండే ప్రధాన విశిష్టత దాని చలువ చేసే గుణం. శరీరంలో పేరుకుపోయిన అధిక వేడిని సమర్థవంతంగా తగ్గించి, శరీరాన్ని చల్లబరచడానికి రాగి అంబలి ఎంతో ఉపయోగపడుతుంది. మజ్జిగ లేదా నిమ్మరసం కలిపి తీసుకుంటే వేసవి తాపం నుంచి రక్షణ లభించడమే కాకుండా శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. అంతేకాకుండా, రాగి పిండిని 8 నుంచి 10 గంటల పాటు పులియబెట్టి తయారుచేస్తే అందులో మంచి బ్యాక్టీరియా పెరిగి ప్రోబయోటిక్ ప్రయోజనాలు లభిస్తాయి, ఫైటిక్ ఆమ్లం 40 నుంచి 60 శాతం వరకు తగ్గి ఖనిజాలు శరీరానికి మరింత సులభంగా అందుతాయి. ఇది కూడా చదవండి:నిద్రవేళలు, అస్తవ్యస్తంగా ఉన్నాయా? మగవారి గుండె ఆరోగ్యంపై కీలక హెచ్చరిక సంప్రదాయ పద్ధతిలో తయారుచేసే రాగి జావ లేదా రాగి అంబలిని చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తమ రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు. రాగి పిండి, నీరు, మజ్జిగ, కొద్దిగా ఉప్పుతో పాటు సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు లేదా జీలకర్ర, కరివేపాకు కలిపి తాగితే రుచితో పాటు అదనపు ఆరోగ్య ప్రయోజనాలు కూడా దక్కుతాయి. ఉదయం పరగడుపున లేదా అల్పాహారానికి బదులుగా ఒక గ్లాసు రాగి అంబలి తీసుకోవడం వల్ల రోజంతా చురుకుగా, శక్తివంతంగా పనిచేయగలరు. అయితే ఏదైనా ఆహార మార్పు చేసే ముందు మీ వ్యక్తిగత ఆరోగ్య స్థితిని దృష్టిలో ఉంచుకోవడం మంచిది. మధుమేహం, కిడ్నీ సంబంధిత సమస్యలు లేదా ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు క్రమం తప్పకుండా రాగి అంబలి తీసుకునే ముందు ఆరోగ్య నిపుణులను లేదా వైద్యుడిని సంప్రదించడం శ్రేయస్కరం. సరైన మోతాదులో, ఆరోగ్యకరమైన అలవాట్లతో కలిపి రాగి అంబలిని తీసుకుంటే దీర్ఘకాలంలో శరీరం దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుంది. మీకు నచ్చవచ్చు:చలికాలంలో, జలుబు దగ్గుకు చెక్ పెట్టే, మిరియాల కోడిగుడ్డు కూర!                          ప్రసాదాన్ని, తలపించే రుచి.. ఇంట్లోనే ఈజీగా బెల్లం గోధుమ రవ్వ కేసరి!     Ragi Ambali Benefits, Healthy Breakfast Alternative, Finger Millet Drink, Ragi Java Nutrition, Morning Energy Drink, Millet Diet Tips, Health Tips In Telugu.  
చలి గాలులు వీచే వేళ, వర్షపు జల్లులు కురిసే సాయంత్రం వేళ వేడివేడిగా, ఘాటుగా తినాలని మనసుకు అనిపిస్తుంది. అలాంటి సమయంలో రోజూ తినే సాధారణ కూరలకు భిన్నంగా మిరియాల కోడిగుడ్డు కూర చేసుకుంటే ఇంటిల్లిపాదీకి నోటికి కొత్త రుచి తగులుతుంది. వేడి అన్నం, చపాతీ, లేదా రోటీలలోకి ఈ కూర అద్భుతంగా సరిపోతుంది. ముఖ్యంగా చలి కాలం మరియు వానలు పడే రోజుల్లో నల్ల మిరియాల ఘాటుతో కూడిన ఇలాంటి వంటకాలు తినడం వల్ల జలుబు, దగ్గు వంటి సీజనల్ సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. ఇంట్లో సులభంగా దొరికే పదార్థాలతోనే ఈ రుచికరమైన కోడిగుడ్డు కూరను తక్కువ సమయంలోనే వండుకోవచ్చు. ఈ మిరియాల కోడిగుడ్డు కూర తయారీకి ముందుగా 4 కోడిగుడ్లు, అర టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు, 3 ఉల్లిపాయలు మరియు 2 టమాటాలను ముక్కలుగా కట్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. వీటితో పాటు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర సిద్ధం చేసుకోవాలి. తాలింపు మరియు రుచి కోసం 2 కరివేపాకు రెబ్బలు, తాజా కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్స్ నూనె, రుచికి సరిపడా ఉప్పు అవసరమవుతాయి. ఈ కొలతలతో చేసుకునే కూర కుటుంబ సభ్యులందరికీ చక్కని రుచిని అందిస్తుంది. మొదటి దశలో బాగా ఉడికించిన కోడిగుడ్లపై చిన్న చిన్న గాట్లు పెట్టుకోవాలి, తద్వారా మసాలాలు గుడ్ల లోపలికి చక్కగా చేరతాయి. ఆ తర్వాత పాన్‌లో కొద్దిగా నూనె వేసి, రుచికి సరిపడా పసుపు మరియు ఉప్పు కలిపి ఈ గుడ్లను బంగారు రంగులోకి వచ్చేవరకు బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇలా వేయించడం వల్ల కోడిగుడ్లకు మంచి రంగు రావడమే కాకుండా కూరలో విడిపోకుండా గట్టిగా, రుచిగా ఉంటాయి. చలి రోజుల్లో వేడివేడిగా మొదలయ్యే ఈ వంటక ప్రక్రియ ఇంటి వంటగదిని మంచి సువాసనతో నింపుతుంది. తర్వాత అదే పాన్‌లో మిగిలిన నూనె వేసి కొద్దిగా జీలకర్ర మరియు 4 కరివేపాకు ఆకులు వేసి చిటపటలాడించాలి. ఆ వెంటనే తరిగి పెట్టుకున్న 3 ఉల్లిపాయ ముక్కలను వేసి వాటి రంగు మారేవరకు ఓపికగా వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించాలి. అనంతరం కట్ చేసిన 2 టమాటా ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా పసుపు వేసి టమాటాలు మెత్తగా మగ్గే వరకు ఉడికించాలి. ఇది కూడా చదవండి:దంతాలపై పాచి పోవాలా? ఈ వంటింటి చిట్కా, పాటించండి! మసాలా గ్రేవీ బాగా మగ్గిన తర్వాత కొంచెం కారం, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, మరియు 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి 2 నిమిషాల పాటు మంచిగా కలపాలి. మిరియాల పొడి ఘాటు మసాలాతో కలిసి కూరకు ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. ఆ తర్వాత గ్రేవీకి సరిపడా నీరు పోసి 4 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. చివర్లో ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను గ్రేవీలో వేసి 3 నుంచి 4 నిమిషాల పాటు మసాలాలు పట్టేలా బాగా ఉడికించాలి. చివరగా తాజా కొత్తిమీర చల్లి దించుకుంటే ఘాటైన, రుచికరమైన మిరియాల కోడిగుడ్డు కూర సిద్ధమవుతుంది. చలి కాలంలో జలుబు, దగ్గు నుంచి రక్షణనిస్తూనే భోజనానికి కొత్త కళను తెచ్చే ఈ రెసిపీని తప్పకుండా ఇంట్లో ప్రయత్నించండి. వేడివేడి చపాతీ లేదా అన్నంతో కలిపి తింటుంటే ప్రతి ముద్దలోనూ నల్ల మిరియాల ఘాటు, మసాలాల రుచి ఆకట్టుకుంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్‌తో అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే ఈ వంటకం మీ డైలీ మెనూలో తప్పక చేర్చదగిన స్పెషల్ ఐటమ్. మీకు నచ్చవచ్చు:మధ్య వయస్కులకు, బెస్ట్ ఫిట్‌నెస్ టిప్స్: డిజిటల్ వ్యాయామాల క్రేజ్                               ఎముకల బలం మరియు, హార్మోన్ల సమతుల్యత, కోసం వేయించిన ఖర్జూరాలు!       Pepper Egg Curry, Miriyala Kodiguddu Kura, Winter Egg Recipes, Spicy Egg Masala, Winter Comfort Food, Easy Indian Curry, Cooking Recipes In Telugu.  
తీపి తినాలని మనసు కోరినప్పుడు పంచదారకు బదులుగా ఆరోగ్యానికి మేలు చేసే బెల్లం గోధుమ రవ్వ కేసరిని ఇంట్లోనే సులభంగా సిద్ధం చేసుకోవచ్చు. ఈ వంటకం ఇంచుమించుగా ప్రసిద్ధ అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం రుచిని పోలి ఉండటంతో ఇంటిల్లిపాదికీ ఎంతో ఇష్టంగా అనిపిస్తుంది. ఎర్ర గోధుమ రవ్వ, బెల్లం కలయికతో తయారయ్యే ఈ స్వీట్ రుచిలో అద్భుతంగా ఉండటమే కాకుండా మన శరీరానికి కూడా ఎంతో మంచిది. తక్కువ పదార్థాలతో, నిమిషాల్లోనే ఈ రుచికరమైన తీపి వంటకాన్ని వండేయడం వల్ల పండుగలు, ప్రత్యేక సందర్భాలు లేదా అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. ఈ రుచికరమైన బెల్లం గోధుమ రవ్వ కేసరి కోసం ముందుగా కొలతలను సరిగ్గా సిద్ధం చేసుకోవాలి. దీని కోసం 1 కప్పు లేదా అర కప్పు గోధుమ రవ్వ, ముప్పావు కప్పు బెల్లం తురుము, 2 కప్పుల నీళ్లు, 4 టేబుల్ స్పూన్ల నెయ్యి, కొన్ని జీడిపప్పు పలుకులు, కిస్మిస్‌లు, అర టీస్పూన్ యాలకుల పొడి అవసరం అవుతాయి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి, అది వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి కరిగాక జీడిపప్పులను వేసి కొద్దిగా రంగు మారే వరకు వేయించి, ఆపై కిస్మిస్‌లు వేసి అవి చక్కగా ఉబ్బేంత వరకు వేపుకోవాలి. ఇలా బంగారు రంగులోకి మారిన డ్రై ఫ్రూట్స్‌ను ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేయించిన అదే కడాయిలో మరొక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కరిగించాలి. తర్వాత అర కప్పు గోధుమ రవ్వను వేసి, స్టవ్ మంటను తక్కువలో ఉంచి 5 నుండి 10 నిమిషాల పాటు దోరగా, మంచి సువాసన వచ్చేంత వరకు వేయించాలి. రవ్వ లేత బంగారు రంగులోకి మారిన తర్వాత దానిని ఒక ప్లేట్‌లోకి తీసుకుని పక్కన ఉంచాలి. రవ్వను నెయ్యిలో ఇలా చక్కగా వేయించడం వల్ల కేసరి ముద్దలా కాకుండా పొడిపొడిగా, ఎంతో రుచిగా వస్తుంది. ఇప్పుడు అదే పాన్‌లో 2 కప్పుల నీళ్లు పోయాలి; అర కప్పు రవ్వకు 2 కప్పుల నీళ్లు వేయడం సరైన కొలతగా చెప్పవచ్చు. మంటను మధ్యస్థంగా ఉంచి నీళ్లు రోలింగ్ బాయిలింగ్ దశకు వచ్చే వరకు బాగా మరిగించాలి. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న గోధుమ రవ్వను నెమ్మదిగా కలుపుతూ వేయాలి. ఉండలు కట్టకుండా గరిటెతో కలిపి, మూత పెట్టి మధ్యస్థ మంటపై 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ సమయంలో రవ్వ నీటిని చక్కగా పీల్చుకుని మెత్తగా ఉడికిపోతుంది. ఇది కూడా చదవండి:యువతలో, ఊబకాయం చికిత్స: లాభాలు, దుష్ప్రభావాలు ఏంటి? గోధుమ రవ్వ మెత్తగా ఉడికిన తర్వాత ఒకసారి అంతా కలిపి, ముప్పావు కప్పు తురిమిన బెల్లాన్ని వేయాలి. తీపి ఎక్కువగా ఇష్టపడేవారు అదనంగా మరో 2 టేబుల్ స్పూన్ల బెల్లం తురుమును కూడా కలుపుకోవచ్చు. బెల్లం పూర్తిగా కరిగే వరకు గరిటెతో కలుపుతూ ఉండాలి, ఇలా కరిగిన తర్వాత కేసరి రంగు మారి మరింత మెరుస్తూ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. బెల్లం పూర్తిగా కరిగిపోయాక మళ్లీ మూత పెట్టి, మంటను తక్కువకు తగ్గించి మరో 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. దీనివల్ల రవ్వ బెల్లం పాకాన్ని బాగా పీల్చుకుని మరింత రుచికరంగా మారుతూ మిశ్రమం కొంచెం దగ్గర పడుతుంది. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మిశ్రమాన్ని ఒకసారి బాగా కలపాలి. చివరగా ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, అర టీస్పూన్ యాలకుల పొడి, అలాగే 2 నుండి 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. చివర్లో వేసే నెయ్యి, యాలకుల పొడి కేసరికి అద్భుతమైన సువాసనను, రుచిని అందిస్తాయి. వేడివేడిగా లేదా కొద్దిగా చల్లారిన తర్వాత వడ్డిస్తే ఈ బెల్లం గోధుమ రవ్వ కేసరి ప్రతి ముక్కలోనూ తీపి, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ రుచులు కలగలిసి పండుగ వాతావరణాన్ని గుర్తుచేస్తాయి. మీకు నచ్చవచ్చు:చలికాలం బహుమతులు: హాయినిచ్చే టాప్ 12 వస్తువులు ఇవే                              ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో, టీ మరియు బిస్కెట్లు తీసుకుంటున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి!         Bellam Godhuma Rava Kesari, Annavaram Prasadam Recipe, Jaggery Rava Kesari, Broken Wheat Sweet, Telugu Prasadam Sweets, Quick Dessert Recipes, Cooking Recipes In Telugu.
మన శరీర ఆరోగ్యానికి జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయడం ఎంతైనా అవసరం. పొట్ట ఆరోగ్యంగా ఉంటేనే రోగనిరోధక శక్తి పెరిగి శరీరం ఉత్సాహంగా ఉంటుంది. మన జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ఫైబర్ లేదా పీచు పదార్థం ప్రధాన పాత్ర పోషిస్తుంది. రోజువారీ ఆహారంలో సరైన పీచు పదార్థాలు తీసుకుంటే మలబద్ధకం వంటి సమస్యలు దూరమవడంతోపాటు పేగుల్లోని మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియా డవలప్ అవ్వడానికి సహాయపడే కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాల గురించి  వివరంగా తెలుసుకుంటే.. జామ.. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో జామకాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఒక మధ్యస్థ పరిమాణంలో ఉండే జామకాయ ద్వారా సుమారు ఐదు నుంచి ఆరు గ్రాముల పీచు పదార్థం లభిస్తుంది. ఇందులో కరిగే మరియు కరగని.. రెండు  రకాల పీచు పదార్థాలు  సమృద్ధిగా ఉంటాయి. ఇది జీర్ణక్రియ సజావుగా సాగేలా సహాయపడటంతోపాటు కడుపు నిండుగా ఉండే భావనను కలిగిస్తుంది. రాస్స్ బెర్రీస్.. రాస్స్ బెర్రీస్ పండ్లు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. ఒక కప్పు రాస్స్ బెర్రీస్ లో దాదాపు ఎనిమిది గ్రాముల పీచు పదార్థం ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఉండే కరగని పీచు పదార్థం పేగుల్లోని మంచి బ్యాక్టీరియా అభివృద్ధి చెందడానికి ఎంతగానో తోడ్పడుతుంది. అయితే ఇవి కొంచెం ఖరీదైనవి అయినప్పటికీ ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా ఎక్కువ. ఇది కూడా చదవండి   కిడ్నీ, లివర్ సమస్యలకు ముందే శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే!​ చియా గింజలు.. చియా గింజలలో పీచు పదార్థం చాలా మెరుగ్గా ఉంటుంది. కేవలం రెండు టీస్పూన్ల చియా గింజల ద్వారా సుమారు పది గ్రాముల పీచు లభిస్తుంది. ఇవి కడుపులోకి వెళ్లిన తర్వాత ఒక జెల్ లాంటి రూపంలో తయారవుతాయి. దీనివల్ల జీర్ణక్రియ నెమ్మదిగా జరిగి రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. వీటిని పెరుగుతో కలిపి తీసుకుంటే మరింత మంచి ఫలితం ఉంటుంది. నల్ల మినప్పప్పు.. మన దేశంలో సులభంగా లభించే పొట్టుతో కూడిన మినుములు లేదా నల్ల మినపప్పు జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. ఉడికించిన ఒక కప్పు మినపప్పులో దాదాపు పదహారు గ్రాముల పీచు పదార్థం లభిస్తుంది. ఇందులో కూడా కరిగే , కరగని పీచు పదార్థాలు సమృద్ధిగా ఉండటం వల్ల పేగుల కదలికలు సజావుగా సాగి జీర్ణశక్తి మెరుగవుతుంది. వేయించిన శనగలు.. వేయించిన శనగలు పీచు పదార్థాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాయి. ప్రతి వంద గ్రాముల వేయించిన శనగలలో సుమారు పదిహేడు గ్రాముల పీచు పదార్థం లభిస్తుంది. ఇందులో పీచుతో పాటు ప్రొటీన్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన భావన ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను పటిష్టంగా ఉంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.                                                                                                                                            *రూపశ్రీ మీకు నచ్చవచ్చు   ఈ ఐదు ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చాలు.. జీవితం మారిపోతుంది..                                  విటమిన్-డి లోపం ఉంటే పిల్లలు పుట్టడం కష్టమా..ఈ నిజాలు తెలుసుకోండి..!
బూడిద గుమ్మడి మనకు సులభంగా లభించే కూరగాయల్లో ఒకటి. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో పాటు శరీరానికి అవసరమైన కొన్ని పోషకాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా బూడిద గుమ్మడి రసం తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలామందికి ఆసక్తి ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండటంలో తగినంత నీరు తాగడం ఎంత ముఖ్యమైనది? బూడిద గుమ్మడి రసం కిడ్నీ ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది? మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు దీనిని తీసుకోవచ్చా? బూడిద గుమ్మడిలోని పోషకాలు గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియకు ఎలా తోడ్పడతాయి? అంతేకాకుండా ఎసిడిటీ సమస్య, శరీర బరువు నియంత్రణ విషయంలో బూడిద గుమ్మడి ఎలాంటి ప్రయోజనాలను అందించగలదు? బూడిద గుమ్మడి, సాధారణ గుమ్మడి కాయ రెండూ ఒకటేనా? వీటి మధ్య ఉన్న తేడాలు ఏమిటి? వాటిలో లభించే పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఎలా భిన్నంగా ఉంటాయి? ఈ ఆసక్తికరమైన విషయాలను సీనియర్ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ శిరీష ఈ వీడియోలో వివరించారు. బూడిద గుమ్మడి రసాన్ని ఎలా తీసుకోవాలి? దాని వల్ల కలిగే ప్రయోజనాలేమిటి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? వంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లలో భాగంగా బూడిద గుమ్మడిని ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. గమనిక: గమనిక: ఈ వీడియో కేవలం సమాచార, విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. బూడిద గుమ్మడి రసం కిడ్నీలో రాళ్లను కరిగిస్తుందని లేదా వాటిని నివారిస్తుందని శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు వైద్య నిపుణుల సలహా మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకుని, తగిన చికిత్స పొందాలి. వైద్యులు సూచించిన చికిత్సను ఆపి, దానికి బదులుగా ఇంటి చిట్కాలపై ఆధారపడకూడదు.
మన శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఇవి రక్తాన్ని నిరంతరం శుద్ధి చేస్తూ, శరీరంలోని వ్యర్థాలను, అదనపు నీటిని మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. అయితే, జీవనశైలిలో మార్పులు , వివిధ ఆరోగ్య సమస్యల కారణంగా కిడ్నీలు బలహీనపడే ప్రమాదం ఉంది. కిడ్నీలు దెబ్బతినడం మొదలైనప్పుడు మన శరీరం కొన్ని హెచ్చరిక సంకేతాలను ఇస్తుంది. ముఖ్యంగా, మూత్ర విసర్జనలో వచ్చే మార్పులు కిడ్నీ సమస్యలకు తొలి సంకేతాలుగా భావించవచ్చు. వీటిని ముందుగానే గుర్తించడం ద్వారా పెద్ద ముప్పు నుంచి బయటపడవచ్చు. మూత్రంలో నురుగు.. సాధారణంగా కిడ్నీల పనితీరు మందగించినప్పుడు మూత్రం రంగు, పరిమాణం , దాని స్వభావంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. కొందరిలో మూత్రం చేసే సమయంలో విపరీతంగా , ఎక్కువసేపు నిలిచి ఉండే తెల్లటి నురగ వస్తుంటుంది. ఇలా తరచూ జరగడం మూత్రంలో ప్రొటీన్ బయటకు పోతున్నదనేదానికి ముఖ్య సంకేతం. ఆరోగ్యవంతమైన కిడ్నీలు శరీరానికి అవసరమైన ప్రొటీన్‌ను ఉంచుకుని వ్యర్థాలను మాత్రమే బయటకు పంపిస్తాయి. కానీ కిడ్నీ ఫిల్టర్లు దెబ్బతిన్నప్పుడు ప్రొటీన్ మూత్రం ద్వారా కారిపోతుంది. మూత్రం రంగు.. మూత్రం రంగులో వచ్చే మార్పులను కూడా తేలికగా తీసుకోకూడదు. సాధారణంగా మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. కానీ ఎటువంటి కారణం లేకుండా మూత్రం ముదురు పసుపు రంగులో, గోధుమ రంగులో లేదా తేయాకు రంగులో పడుతుంటే అప్రమత్తం కావాలి. కొన్ని సందర్భాల్లో మూత్రం గులాబీ రంగులో లేదా ఎరుపు రంగులో రావడం కూడా జరుగుతుంది. దీనిని వైద్య పరిభాషలో హెమటూరియా అంటారు. కిడ్నీలో రాళ్లు ఏర్పడటం, ఇన్ఫెక్షన్లు తలెత్తడం లేదా వాపు కారణంగా ఇలా జరగవచ్చు. నొప్పులు లేకపోయినా మూత్రంలో రంగు మారడం లేదా రక్తం పడటం జరిగితే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. మూత్రవిసర్జన వేళలు.. మూత్ర విసర్జన చేసే వేళల్లో వచ్చే తేడాలు కూడా కిడ్నీ సమస్యలను సూచిస్తాయి. పగటిపూట లేదా రాత్రి సమయంలో సాధారణం కంటే చాలా ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం కిడ్నీల సామర్థ్యం తగ్గడానికి ఒక కారణం కావచ్చు. కిడ్నీలు మూత్రాన్ని సరిగ్గా ఫిల్టర్ చేయలేకపోవడం  వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. దీనికి తోడు డయాబెటిస్ లేదా ప్రోస్టేట్ సమస్యలు కూడా కారణం కావొచ్చు. మరోవైపు, అకస్మాత్తుగా మూత్రం వచ్చే పరిమాణం చాలా తగ్గిపోవడం లేదా పూర్తిగా ఆగిపోవడం జరిగితే అది చాలా ప్రమాదకరమైన పరిస్థితికి సంకేతం. ఇది కూడా చదవండి   కిడ్నీ, లివర్ సమస్యలకు ముందే శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే! వాసన.. మూత్రం నుండి తీవ్రమైన లేదా సాధారణం కాని ఘాటైన వాసన రావడం కూడా కొన్నిసార్లు శరీరంలో నీటిశాతం తగ్గడం వల్ల లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు. ఈ లక్షణాలతో పాటు పొత్తి కడుపులో  నొప్పి, జ్వరం లేదా మంట వంటి సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. మరికొన్ని సిగ్నల్స్.. మూత్రంలో కనిపించే ఈ మార్పులతో పాటు శరీరం ఇతర సంకేతాలను కూడా ఇస్తుంది. ముఖం మరియు పాదాలు ఉబ్బడం, ఒంట్లో తీవ్రమైన నీరసం నిరంతరం వేధించడం, ఆకలి మందగించడం, వికారంగా అనిపించడం, చర్మంపై విపరీతమైన దురద పుట్టడం , కండరాలు పట్టేయడం వంటి లక్షణాలు కనిపిస్తే కిడ్నీలు సరిగా పనిచేయడం లేదని అర్థం చేసుకోవాలి. శరీరంలో వ్యర్థాలు పేరుకుపోవడం వల్లే ఇవన్నీ జరుగుతాయి. అధిక రక్తపోటు, మధుమేహం దీర్ఘకాలికంగా నియంత్రణలో లేకపోవడం, కిడ్నీలో రాళ్లు, పదే పదే వచ్చే మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లు , వైద్యుల సలహా లేకుండా విచ్చలవిడిగా పెయిన్‌కిల్లర్స్ వంటి మందులను వాడటం వల్ల కిడ్నీలు తీవ్రంగా దెబ్బతింటాయి. కాబట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం, తగినంత నీరు తాగుతూ ఉండటం , ఏ చిన్న అనారోగ్య లక్షణం కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ద్వారా కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.                                                                                                                                              *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు   ఈ ఐదు ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చాలు.. జీవితం మారిపోతుంది..​                                  మోకాళ్ల నొప్పులతో ఇబ్బందా..ఈ 5 వ్యాయామాలు మిస్ అవ్వకండి .! ​