
తెలుగు హీరోలే హిట్టు సినిమా కాన్సెప్ట్ తెలియక అలో లక్ష్మణ అంటు తర్జన భర్జన పడుతున్నారు. అలాంటిది మలయాళ కట్ అవుట్ దుల్కర్ సల్మాన్ వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. మాములు హిట్ అనుకోని పొగడటం తగ్గిద్దామని అనుకుంటే మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ లాంటి సూపర్ హిట్స్. తాజాగా వచ్చిన ‘ఆకాశంలో ఒక తార’ కూడా సూపర్ హిట్ ఖాతాలోకి చేరింది.అంటే అచ్చ తెలుగులో హ్యాట్రిక్ తర్వాత నాలుగో ఘనవిజయాన్ని అందుకున్నాడు. మరి వీటన్నింటిపై ఒక లుక్ వేద్దాం.
దుల్కర్ సల్మాన్ తెలుగు సినీ ప్రయాణం అద్భుతమైన కథల ఎంపికతో మొదలైంది. 2018లో వచ్చిన ‘మహానటి’ సినిమాలో జెమినీ గణేశన్ పాత్రలో ఒదిగిపోయి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత 2022లో వచ్చిన ‘సీతారామం’తో క్లాసిక్ లవ్ స్టోరీకి కొత్త అర్థం చెప్పి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాడు. అనంతరం 2024లో విడుదలైన ‘లక్కీ భాస్కర్’ చిత్రంతో ఏకంగా 7.35 కోట్ల రూపాయల భారీ ఓపెనింగ్ నెట్ కలెక్షన్లతో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచి, వంద కోట్ల క్లబ్‌లో చేరాడు. ఇలా తెలుగులో చేసిన మొదటి మూడు సినిమాలతోనే 100 శాతం సక్సెస్ రేట్ సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచాడు.
ఇప్పుడు ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం కూడా అదే జోరుని కొనసాగిస్తోంది. స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్, లైట్‌బాక్స్ మీడియా వంటి ప్రతిష్టాత్మక సంస్థలు నిర్మించిన ఈ చిత్రం, ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రీమియర్ షోలలోనే 27.18 లక్షల రూపాయల గ్రాస్ వసూలు చేయగా, ముఖ్యంగా హైదరాబాద్‌లో 14.18 లక్షల రూపాయలతో పాటు డాల్బీ సినిమా ఫార్మాట్‌లో ఏకంగా 97.8 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేయడం విశేషం.
.webp)
ఇది కూడా చదవండి: ఆకాశంలో ఒక తార మూవీ రివ్యూ!
అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే 3.87 కోట్ల రూపాయల గ్రాస్ తో 2.96 లక్షల టికెట్లు అమ్ముడవడంతో ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ స్పష్టంగా కనిపించింది. దాదాపు 60 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందగా మొదటి రోజు నుంచే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి 86 శాతం వాటాతో భారీ ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా శనివారం అడ్వాన్స్ బుకింగ్స్ కూడా 84 లక్షల రూపాయలు దాటడం ఆకాశంలో ఒక తార లాంగ్ రన్‌కి సంకేతంగా నిలుస్తోంది.
.webp)
కమర్షియల్ మాస్ సినిమాల హవా నడుస్తున్న రోజుల్లో, కేవలం బలమైన కథ, భావోద్వేగాలను నమ్ముకుని దుల్కర్ సాధిస్తున్న ఈ వరుస విజయాలు టాలీవుడ్ హీరోలకు ఒక కొత్త పాఠంలా మారాయి. మలయాళంలో అప్పుడప్పుడు పరాజయాలు ఎదురైనా, తెలుగులో మాత్రం అపజయమే ఎరుగని హీరోగా దుల్కర్ సల్మాన్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్టే లెక్క.
మీకు నచ్చవచ్చు: ఆకాశంలో ఒక తార: ఆడపిల్లల కలలకి రెక్కలు తొడిగే అద్భుత సందేశం!
మీకు నచ్చవచ్చు: ఓం ట్విట్టర్ రివ్యూ!
[Dulquer Salmaan, Aakasamlo Oka Tara, Satvika Veeravalli, Pawan Sadineni, Shruthi Haasan]






