Home

»

Latest News

ఆకాశంలో ఒక తార: ఆడపిల్లల కలలకి రెక్కలు తొడిగే అద్భుత సందేశం!

Nov 20, 2026 10:31AM

చాలా రోజుల తర్వాత మళ్ళీ సినీ సర్కిల్స్, ప్రేక్షకుల్లో 'ఆకాశంలో ఒక తార' వల్ల తెలుగు సినిమా చూసి బాగుపడరా అనే సామెత వినిపిస్తూ ఉంది. అంతలా ఆకాశంలో ఒక తార నిన్న ప్రీమియర్స్ ప్రదర్శించిన దగ్గరనుంచి తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని     దోచుకుంటూ ఉంది. మరి ముఖ్యంగా అర్ధమైన మెసేజ్ ఏంటో చూద్దాం.

సమాజంలో ఆడపిల్లలు ఎదగడానికి ఎన్నో అడ్డంకులు ఉంటాయి, కానీ వాటిని దాటుకుని ఆకాశమంత ఎత్తుకు ఎదగాలనే సంకల్పం ఉంటే ఏదీ అసాధ్యం కాదు. సరిగ్గా ఇదే బలమైన సందేశాన్ని మనసులకు హత్తుకునేలా అందిస్తోంది. కేవలం వినోదం కోసమే కాకుండా, ప్రతి ఒక్కరిలో ముఖ్యంగా మహిళల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపే అద్భుతమైన ప్రయత్నం.

మన జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం ఎంత ముఖ్యమో, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్ని కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా ఎలా పోరాడాలో ఎంతో హృద్యంగా చూపిస్తుంది. అత్యంత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం ఆడపిల్లల భవిష్యత్తు గురించి ఇచ్చిన సందేశం. సాధారణంగా చాలామందికి పెద్దయ్యాక ఏం చేయాలో అనే ఆలోచన వస్తుంది.

కానీ, ఈ చిత్రం పాఠశాల వయసు నుంచే ఆడపిల్లలు తమకంటూ ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలని గట్టిగా చెబుతోంది. చిన్నప్పటి నుంచే కలలు కనడం నేర్చుకుంటే, వాటిని నిజం చేసుకునే దిశగా అడుగులు వేయడం సులభమవుతుందని కళ్ళకు కట్టినట్లు చూపించారు. చదువుతో పాటు తమకు ఇష్టమైన రంగంలో రాణించడానికి అమ్మాయిలు ఎలా సిద్ధం కావాలో, తల్లిదండ్రులు వారికి ఎలా అండగా నిలవాలో  చక్కగా ఆవిష్కరించారు.

ఇది కూడా చదవండి: ఆకాశంలో ఒక తార మూవీ రివ్యూ! 

జీవిత ప్రయాణంలో ఎదురయ్యే అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, సమాజం విసిరే ప్రశ్నలు మహిళల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంటాయి. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కుంగిపోకుండా, తమలోని శక్తిని గుర్తించి ముందుకు సాగాలని 'ఆకాశంలో ఒక తార' గుర్తుచేస్తుంది.

ఒక సాధారణ అమ్మాయి తన పట్టుదలతో, కఠోర శ్రమతో అందనంత ఎత్తులో ఉన్న తన లక్ష్యాన్ని ఎలా చేరుకుందనే ప్రయాణం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ప్రతి సన్నివేశంలోనూ సహజత్వం ఉట్టిపడుతూ, చూస్తున్న ప్రతి మహిళకు "నేను కూడా సాధించగలను" అనే ధైర్యాన్ని ఇస్తుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు.

 మహిళా సాధికారత అనేది కేవలం మాటల్లో కాకుండా చేతల్లో ఉండాలని ఈ చిత్రం చాటిచెప్పింది. పాఠశాల విద్యార్థినుల నుండి గృహిణుల వరకు ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన మూవీ.ఆడపిల్లలకి  సరైన ప్రోత్సాహం అందిస్తే వారు ఆకాశంలో మెరిసే తారల్లా తమ ప్రతిభతో వెలుగులు నింపగలరని నిరూపించడంతో పాటు సమాజంలో ఆడపిల్లల పట్ల ఉండే ఆలోచనా విధానంలో తప్పకుండా ఒక మంచి మార్పును తీసుకొస్తుంది. లక్ష్య సాధనలో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క మహిళకి, పురుషులకి ఆకాశంలో ఒక తార ఒక గొప్ప మార్గదర్శిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

 

మీకు నచ్చవచ్చు:ఓం ట్విట్టర్ రివ్యూ!
మీకు నచ్చవచ్చు:ఆకాశంలో ఒక తార రివ్యూ!

 

[Aakasamlo Oka Tara, Satvika Veeravalli, Dulqer Salmaan, Shruthi Haasas, pawan Sadineni]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com