Home

»

Latest News

జైలర్ 2 ఊచకోత.. ఆ రెండు రికార్డులు మిస్.. ఆధారాలు పక్కాగా దొరికేసాయి!

Nov 19, 2026 4:55PM


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పినట్టుగా సూపర్ స్టార్ రజినీ కాంత్ జైలర్ 2 తోరికార్డుల కలెక్షన్స్ ని సృష్టించాడు. పైగా 'టైగర్ కా హుకుం' అంటూ పలు రికార్డులని అందుకొని అభిమానులు ముఖాల్లో చిరునవ్వులు కూడా నింపాడు. కానీ ఇప్పుడు ఆ నవ్వుల  స్థానంలో అంతేలే ఏం చేస్తాం, దక్కిందే మహాభాగ్యం వచ్చి చేరింది.  


గత నెల అక్టోబర్  15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన జైలర్ తొలి రోజే 125.25 కోట్ల గ్రాస్ వసూలు చేసి భారీ ఓపెనింగ్ అందుకుంది. ఇందులో ఇండియా నెట్ రూ. 59.70 కోట్లు, ఇండియా గ్రాస్ 70.25 కోట్లు కాగా, ఓవర్సీస్ నుంచి సుమారు  55 కోట్ల గ్రాస్ వచ్చింది.అంతేకాదు, కేవలం ఐదు రోజుల్లోనే  500 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టి, గతంలో 'రోబో 2.0' పేరిట ఉన్న ఆల్ టైమ్ హయ్యెస్ట్ కలెక్షన్ల రికార్డును దాటేస్తూ తలైవా తన పాత రికార్డులను తానే తిరగరాశారు. 

ఇలా ప్రపంచవ్యాప్తంగా మరియు పొరుగు రాష్ట్రాల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ, 'జైలర్ 2' రెండు ప్రధాన బాక్సాఫీస్ రికార్డులను మాత్రం అందుకోలేకపోవడం ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. సాధారణంగా రజనీకాంత్ సినిమా వస్తే సొంత రాష్ట్రమైన తమిళనాడులో రికార్డులు తుడిచిపెట్టుకుపోతాయి.


 కానీ ఈసారి సీన్ కొద్దిగా మారింది. థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి 'జైలర్ 2' తమిళనాడులో  221 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. అయితే, 2023లో విడుదలైన దళపతి విజయ్ బ్లాక్‌బస్టర్ 'లియో' తమిళనాడులో సాధించిన  224 కోట్ల రికార్డును ఈ చిత్రం అధిగమించలేకపోయింది. కేవలం 3 కోట్ల స్వల్ప తేడాతో సొంత గడ్డపై నంబర్ వన్ స్థానాన్ని కోల్పోయి, రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఇది కూడా చదవండి: చెప్పులు వేసుకోవడం మానేసిన విజయ్ ఆంటోని.. కారణం చెబుతూ భార్య ఫాతిమా ఎమోషనల్!

 

 మరోవైపు, తమిళనాడు తర్వాత రజనీకాంత్‌కు అత్యంత భారీ మార్కెట్ ఉన్న తెలుగు రాష్ట్రాల్లోనూ 'జైలర్ 2'కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. విడుదలైన మొదటి వారం నుంచే జోరు చూపించిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో తప్పకుండా 100 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరుతుందని ట్రేడ్ విశ్లేషకులు  అంచనా వేశారు. కానీ 99 .65 కోట్ల గ్రాస్ దగ్గరే ఆగిపోవాల్సి వచ్చింది. దీంతో రెండు రికార్డులు రజినీ మిస్ చేసుకున్నాడు.


దీనిపై రజనీ అభిమానులు, విజయ్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. సినీ ప్రేమికులైతే ఈ విషయమై స్పందిస్తూ డియర్ ఫ్యాన్స్  అనవసరంగా వాదనలు ఎందుకు చెప్పండి. 'దక్కేది దక్కక మానదు.. దక్కంది ఎన్నటికీ దక్కదు. రికార్డులు కూడా శాశ్వతం  కాదు. కొత్త రికార్డు నమోదు డేట్ కి దేవుడు  ముహూర్తం ఎప్పుడో సిద్ధం చేసుంటాడు 

 

మీకు నచ్చవచ్చు: బాబు.. మీరు  సినిమా హీరో: మర్చిపోవద్దు!
మీకు నచ్చవచ్చు :ఆదర్శ కుటుంబం అసిస్టెంట్ డైరెక్టర్ పై ప్రముఖ హీరోయిన్ వ్యాఖ్యలు వైరల్!

 

 

[Jailer 2 , Nelson, Rajini Kanth, Vijay, Leo]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com