
శర్వానంద్ అప్ కమింగ్ మూవీ ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఎట్టకేలకు కొత్త విడుదల తేదీని ఖరారు చేసుకుంది. నవంబర్ 27న థియేటర్లలోకి రానున్నట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ‘LOCKED AND LOADED’ అంటూ రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసింది. అంతేకాదు.. థియేటర్లలో అద్భుతమైన యాక్షన్, ఎమోషనల్ ఎక్స్‌పీరియెన్స్‌కు సిద్ధంగా ఉండాలంటూ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది.
వాస్తవానికి ‘భోగి’ ఆగస్టు 28న విడుదల కావాల్సి ఉంది. అయితే 1960ల నాటి ప్రపంచాన్ని తెరపై సహజంగా చూపించేందుకు విజువల్ ఎఫెక్ట్స్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కారణంగా ఆ తేదీని వదులుకున్నారు. ఆ తర్వాత నవంబర్ 12న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ప్రమోషన్లు కూడా మొదలుపెట్టారు. కానీ సెన్సార్ ప్రక్రియలో ఎదురైన ఇబ్బందులతో చివరి నిమిషంలో విడుదల వాయిదా పడింది.
సినిమాను రివైజింగ్ కమిటీకి పంపడంతో ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో అభిమానులు నిరాశ చెందారు. తాజాగా అన్ని అడ్డంకులు దాటుకుని నవంబర్ 27న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ సినిమాలో శర్వానంద్ ఇప్పటివరకు కనిపించని రస్టిక్ అవతార్‌లో కనిపించనున్నారు. 1960ల కాలంలో తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని ఓ గ్రామం నేపథ్యంలో కథ సాగుతుంది. అణచివేతకు ఎదురొడ్డి నిలిచే గంగ అనే పవర్‌ఫుల్ పాత్రలో శర్వానంద్ నటిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా కనిపించనున్నారు.
ఇది కూడా చదవండి: రాధికా ఆప్టే వివాదంపై కీర్తి సురేష్ క్లారిటీ.. అప్పుడెందుకు నవ్వానంటే.?
ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా శర్వానంద్ మాస్ లుక్, పీరియాడిక్ నేపథ్యం ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాని కేకే రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

‘భోగి’లో భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు బలమైన భావోద్వేగాలు కూడా ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది. తాజాగా విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్స్ చేసిన పోస్టులోనూ యాక్షన్, ఎమోషన్ రెండింటినీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. మరి గంగ పాత్రలో శర్వానంద్ ఏ స్థాయిలో మెప్పిస్తారు? సంపత్ నంది ఈసారి ఎలాంటి యాక్షన్ ప్రపంచాన్ని చూపించబోతున్నారు? అన్నది ఆసక్తికరంగా మారింది.
మీకు నచ్చవచ్చు:
తాత టైటిల్‌తో తారక్ మూవీ.. అనిల్ రావిపూడి ప్లాన్ మామూలుగా లేదు.!
ఆకాశంలో ఒక తార vs డియర్ ఆస్ట్రోనాట్.. ఒకే రోజు ఒకే కథతో రెండు సినిమాలు.!
[Bhogi Release Date, Bhogi On November 27, Sharwanand, Sampath Nandi, Anupama Parameswaran]





