LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం (జులై 22) హస్తిన పర్యటనకు వెడుతున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆయన హఠాత్తుగా హస్తిన పర్యటనకు వెళ్లడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  బాబు పర్యటనకు కారణమేంటన్న విషయంలో సర్వత్రా ఆసక్కి వ్యక్తం అవుతోంది.  కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన , మహిళా రిజర్వేషన్ రాజ్యాంగ సవరణ బిల్లులు తీసుకురానుందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన కీలకంగా మారింది.  ఈ బిల్లులకు తెలుగుదేశం సంపూర్ణ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. చంద్రబాబు హస్తిన పర్యటన చేపట్టారు. ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతగా,  చంద్రబాబు ఇప్పుడు హస్తిన పర్యటనలో పార్లమెంటులో ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన మెజారిటీ  కూడగట్టడం కోసం..   వివిధ   పార్టీల నాయకులతో చర్చలు జరిపేందుకు ఆయన హస్తినకేగుతున్నారన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.  ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా..  దాంతోపాటు 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలయ్యేలా జాతీయ స్థాయిలో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందేందుకు ఆయన పలు పార్టీల నేతలతో చర్చలు జరిపే అవకాశం ఉందని అంటున్నారు.  ఈ బిల్లుల అజెండాతో పాటు, రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక పెండింగ్ అంశాలపైనా చంద్రబాబు ఈ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా.. అమరావతి రాజధాని నిర్మాణం, పొలవరం ప్రాజెక్టు పూర్తి,  కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విడుదల అంశాలపై ఆయన  ప్రధాని,  మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో పాటు పలువురు   కేంద్ర మంత్రులతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉందని తెలుగుదేశం ఎంపీల సమాచారం. మొత్తం మీద చంద్రబాబు  ఢిల్లీ పర్యటన అటు జాతీయ రాజకీయాల్లో,  ప్రాధాన్యత సంతరించుకుంది. CBN, Womens Reservation Bill, Delimitation Bill,  Andhra Pradesh Politics,  NDA Government 
ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో కరోనా కాలం నాటి తీవ్ర కలకలానికి కారణమైన డాక్టర్ సుధాకర్ ఉదంతం మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా  చర్చనీయాంశంగా మారింది.   కొవిడ్ సమయంలో తాము అందించిన వైద్య సేవలు, ఆరోగ్య రంగానికి చేసిన మేలు గురించి ప్రకటనలు చేయడంతో  పాటు రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసుల ఉధృతి పెరుగుతున్నా ప్రభుత్వం ఎటువంటి చర్యలూ చేపట్టడం లేదంటూ వైసీపీ విమర్శలు గుప్పించడంతో డాక్టర్ సుధాకర్ ఉదంతాన్ని గుర్తు చేస్తూ నెటిజనులు వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.   గతంలో కరోనా మహమ్మారి తొలి విడత ఉధృతంగా ఉన్న సమయంలో, నర్సీపట్నం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్ కే. సుధాకర్ రావు ప్రభుత్వ వైద్యులకు, సిబ్బందికి ప్రాథమిక రక్షణ పరికరాలైన ఎన్ 95 మాస్కులు, పీపీఈ కిట్లు అందుబాటులో లేవని బహిరంగంగా విమర్శించారు. ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న వైద్యులకు కనీస రక్షణ కల్పించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పటి వైసీపీ సర్కార్..    సమస్యను పరిష్కరించాల్సింది పోయి, డాక్టర్ సుధాకర్ పై  సస్పెన్షన్ వేటు వేసి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే నెపంతో వేధింపులు ప్రారంభించింది.   మాస్కుల కొరతపై మాట్లాడిన కొద్ది రోజులకే విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం రహదారిపై డాక్టర్ సుధాకర్‌ను పోలీసులుఆయనను అదుపులోనికి తీసుకుని,  చొక్కా లేకుండా ఉన్న ఆయన చేతులను వెనక్కి విరిచి కట్టడం, వీధిలో ఈడ్చుకెళ్లి ఆటోలో పడేయడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి జాతీయ స్థాయిలో నిరసనలకు దారితీశాయి. పోలీసులు ఆయనపై కేసులు నమోదు చేయడమే కాకుండా, ఆయన మానసిక స్థితి సరిగా లేదంటూ కేజీహెచ్‌కు, ఆ తర్వాత మానసిక చికిత్సాలయానికి తరలించారు. ఈ దారుణ ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించి, పోలీసుల దాష్టీకంపై సీబీఐ విచారణకు ఆదేశించింది. ప్రభుత్వ వేధింపులు, మానసిక ఒత్తిడి తాళలేక చివరకు సుధాకర్ గుండెపోటుతో కన్నుమూశారు.  ఇక ప్రస్తుతానికి వస్తే.. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ కొవిడ్ సమయంలో తాము అద్భుతంగా పనిచేశామని, వైద్య కళాశాలలు నిర్మించామని చెప్పుకుంటూ.. ఇప్పుడు రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతున్నా అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందంటూ వైసీపీ విమర్శల పర్వం మొదలు పెట్టింది.  మందులు లేవు.. మాస్కులు లేవు అంటూ వైసీపీ సొంత మీడియా సోషల్ మీడియా కథనాలు వండి వారుస్తోంది.  కరోనా కేసులో క్రమంగా పెరుగుతున్నా పరీక్షా కేంద్రాలు, ఆసుపత్రులలో ప్రత్యేక వార్డులు, ఏర్పాట్లు, వాక్సినేషన్ వంటివి ఏర్పాటు చేయలేదని, ఈ కారణంగా కరోనాతో చనిపోతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఆ కథనాల్లో పేర్కొంటోంది. దీంతో గతం మరిచారా జగన్ అంటూ.. డాక్టర్ సుధాకర్ ఉదంతాన్ని గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   ycp carona comments, netizens remember, sudhakar, incident
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనాపరంగా చక్కటి పని తీరు కనబరుస్తోంది.  వివిధ శాఖల్లో ప్రక్షాళన చర్యలు చేపడుతున్నది. అయితే  కొన్ని విషయాలలో మాత్రం పార్టీగా తప్పుటడుగులు వేస్తున్నదని పరిశీలకులు అంటున్నారు.  తిరుమల తిరుపతి దేవస్థానం  లో జరిగిన  ఒక నియామకం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనూ, దేవస్థాన వర్గాల్లోనూ తీవ్ర సంచలనంగా మారింది.  జగన్ హయాంలో  అప్పటి ప్రతిపక్ష నేత అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్కిల్ కేసులో అక్రమంగా అరెస్టైన సంగతి తెలిసిందే. ఈయన అరెస్ట్   హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచి మరీ సంబరాలు చేసిన ఒక వ్యక్తిని ఇప్పుడు తెలుగుదేశం కూటమి సర్కార్ టీటీడీలో కీలక పోస్ట్ లో నియమించడం కలకలం రేపుతోంది.   2023లో స్కిల్ డెవలప్‌మెంట్ కేసు నెపంతో అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిని సిఐడి అధికారులు  అరెస్ట్ చేసిన సంగతి విదితమే. ఆ సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) హోదాలో విధులు నిర్వర్తిస్తున్న ఒక అధికారి.. అత్యుత్సాహం ప్రదర్శించారు. చంద్రబాబు అరెస్టును పురస్కరించుకుని స్వీట్లు పంచారు. అక్కడితో ఆగకుండా చంద్రబాబు జైలులోనే మరణిస్తే పండుగ చేస్తానంటూ అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు.   ప్రభుత్వ సర్వీసులో బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ, ఒక రాజకీయ పార్టీకి కొమ్ముకాయడమే కాకుండా, సీనియర్ నాయకుడి అరెస్ట్‌పై హర్షం వ్యక్తం చేయడం అప్పట్లో  వివాదంగా మారింది.   ఒక రాజకీయ నాయకుడి పట్ల ఇటువంటి ద్వేషపూరిత భావజాలాన్ని ప్రదర్శించడం సరికాదని తోటి సిబ్బంది ఆయనను వారించినప్పటికీ పట్టించుకోలేదని సమాచారం. ఆయన అప్పట్లో వైసిపికి కరడుగట్టిన మద్దతుదారుడిగా వ్యవహరిస్తూ ఇష్టారీతిగా వ్యవహరించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.   2024 ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రజా తీర్పుతో వైసీపీ ప్రభుత్వం గద్దెదిగి, అఖండ మెజారిటీతో తెలుగుదేశం కూడటమి అధికారం చేపట్టింది.  కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తరువాత..   గత ప్రభుత్వ హయాంలో రాజకీయ పక్షపాతంతో, కక్షపూరితంగా ప్రవర్తించిన అధికారులను గుర్తించి వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారని అందరూ భావించారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడి అరెస్ట్ వేళ అత్యంత వివాదాస్పదంగా వ్యవహరించిన  ఈ టీటీడీ ఏఈఈపై కఠిన చర్యలు ఉంటాయని, ఆయనను విధులకు దూరంగా ఉంచుతారని టీటీడీ ఉద్యోగ వర్గాలు, టిడిపి శ్రేణులు భావించాయి. అయితే అందుకు పూర్తి భిన్నంగా జరిగింది.  సదరు వివాదాస్పద ఏఈఈ స్థాయి అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్దుబాట్లు,  పోస్టింగ్‌లలో ఆయనకు కీలక స్థానం దక్కింది.   ప్రస్తుతం ఆయన టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఏఈఈ హోదాలోనే అత్యంత కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.  గతంలో చంద్రబాబుపై అత్యంత దారుణంగా విషం చిమ్మిన వ్యక్తికే  తెలుగుదేశంకూటమి ప్రభుత్వంలో కీలక పదవి  దక్కడం వెనుక అసలు రహస్యం ఏమిటనే దానిపై టీటీడీ పరిపాలనా భవనంలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పాటిస్తున్నామని చెబుతున్న వేళ ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ పరిణామం అటు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న సాధారణ ఉద్యోగులను, ఇటు తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్తలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.   ఐదేళ్ల  వైసిపి పాలనలో తీవ్ర వేధింపులను తట్టుకుని పార్టీ కోసం నిలబడిన కార్యకర్తలకు తమ అధినేతను  దూషించిన వ్యక్తికి కీలక పోస్టింగ్ దక్కడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.  ప్రభుత్వం మారినప్పటికీ కొందరు ఉన్నతాధికారుల నిర్లక్ష్యం లేదా అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగానే ఇలాంటి వివాదాస్పద వ్యక్తులకు రక్షణ లభిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ప్రభుత్వ పెద్దల దృష్టికి రాకుండానే సదరు అధికారి తన పలుకుబడి ఉపయోగించుకుని ఈ పోస్టింగ్ పొంది ఉంటారని ప్రచారం జరుగుతోంది. భవిష్యత్తు పరిణామాల విషయానికి వస్తే..  తిరుమల వంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో పనిచేసే సిబ్బందికి రాజకీయ తటస్థత, క్రమశిక్షణ అత్యంత అవసరం. భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న ఆధ్యాత్మిక సంస్థలో రాజకీయ ద్వేషాలను ప్రదర్శించిన వ్యక్తులను ప్రోత్సహిస్తే సమాజంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని పరిశీలకులు అంటున్నారు. . ఈ వివాదాస్పద నియామకంపై ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతుండటంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం,  టీటీడీ ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. CBN Arrest Controversy, TTD AEE Official Posting, NDA Government, Tirumala Tirupati Devasthanams News,  TTD Employee SweetsDistribution
వైసీపీ సీనియర్ నాయకుడు, జగన్ హయాంలో అసెంబ్లీ స్పీకర్ గా పని చేసిన  తమ్మినేని సీతారాం ఇప్పుడు కుటుంబంతో సహా పరారీలో ఉన్నారు. తమ్మినేని కుటుంబం   భూకబ్జా, ఫోర్జరీకి పాల్పడిందన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకు సంబంధించిన కేసులోనే అరెస్టును తప్పించుకోవడానికి ఆయన రాత్రికి రాత్రే.. సొంత కార్లు, ఫోన్లూ కూడా వదిలేసి పరారైపోయారు. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. బతికున్న వ్యక్తి చనిపోయినట్లుగా బోగస్ డెత్ సర్టిఫికేట్ సృష్టించి భూమిని కబ్జా చేశారన్న అభియోగాలపై ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మంది అరెస్టయ్యారు. ఆ కేసులో తమ్మినేని కుటుబ సభ్యులు అరెస్టు భయంతో అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. ఈ విషయంపై జగన్ ఇప్పటి వరకూ స్పందించకపోవడంతో పొలిటికల్ సర్కిల్స్ లో జగన్.. తమ్మినేనికి వెనకేసుకు వస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అసలు రాజకీయంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఈ కేసు పూర్వాపరాల్లోకి వెడితే..  శ్రీకాకుళం జిల్లాలో  4 కోట్ల రూపాయల విలువైన  స్థలాన్ని హస్తగతం చేసుకునేందుకు తమ్మినేని సీతారాం నకిలీ పత్రాలు, తప్పుడు వారసత్వ ఆధారాలు సృష్టించారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఈ కేసులో పోలీసులు అరెస్టుల పర్వానికి తెరతీశారు. కొందరిని అరెస్టు చేశారు కూడా.. ఈ నేపథ్యంలోనే తమ్మినేని కుటుంబంతో సహా పరారయ్యారు. ఈ కేసులో   ప్రధాన నిందితులుగా   తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులే ఉన్నారు. అటువంటి తమ్మినేనికి వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ అండగా నిలిచి వెనకేసుకు వస్తున్నారన్న చర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతోంది.    చట్టపరమైన విచారణ ఎదుర్కొంటున్న నేతలకు రాజకీయ అభయం ఇస్తూ, వారిపై విచారణ  అధికార తెలుగుదేశం కూటమి కక్షసాధింపుగా అభివర్ణించే ప్రయత్నం చేయడం జగన్ కు రివాజుగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   ఇప్పుడు తమ్మినేని విషయంలో కూడా జగన్ మౌనం ఆయనకు సమర్ధనే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తమ్మినేని కుటుంబం బరితెగింపుగా కబ్జాకు పాల్పడిందన్న విషయంలో   భూ యజమాని కుటుంబ సభ్యులు పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో  వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు చేపట్టిన పోలీసులు,  అక్రమ రిజిస్ట్రేషన్ కుట్ర వెనుక ఉన్న భారీ నెట్‌వర్క్‌ను ఛేదించారు. మొత్తం 13 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా, ఇందులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను A6 గా, ఆయన కుమారుడు చిరంజీవి నాగ్‌ను A5 గా, భార్య తమ్మినేని వాణిని A7 గా చేర్చారు. అంతేకాకుండా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ఈ ఫోర్జరీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసిన స్థానిక సబ్ రిజిస్ట్రార్ బొడ్డేపల్లి అరుణను A13 గా చేర్చారు. ఈ క్రమంలోనే కుట్రలో భాగస్వాములైన 8 మంది నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాధితులకు న్యాయం జరగాల్సిన ఘటనలో, నిందితులుగా ఉన్న తమ పార్టీ సీనియర్ నేతకు   జగన్  మద్దతుగా నిలవడం విమర్శలకు తావిస్తున్నది.  గతంలోనూ పార్టీ నేతలపై కేసులు నమోదైన సందర్భాల్లో జగన్ తీసుకున్న వైఖరి తరహాలోనే, ఈ కేసులోనూ తమ్మినేని సీతారాంకు పూర్తి అభయం ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఈ విషయంపై జగన్ ఇంత వరకూ స్పందించలేదు. పార్టీ పరంగా తమ్మినేని సీతారాంపై చర్యా తీసుకోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.     Srikakulam land grabbing case, fake death certificate forgery, YSR Congress Party
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు అయిన సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నరు.   ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో ఆర్థిక వ్యవస్థ, పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని, విద్యుత్ రంగం, శాంతిభద్రతలు, మైనింగ్ మరియు ఎక్సైజ్ విధానాలపై విడుదల చేసిన 7 కీలక శ్వేతపత్రాలకు   కొనసాగింపుగా, ఇప్పుడు సమగ్ర ప్రగతి నివేదికలను విడుదల చేయాలని నిర్ణయించారు.    వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్రంగా దెబ్బతిన్న వ్యవస్థలను గాడిన పెట్టడమే కాకుండా, సంస్కరణలు, పారదర్శక పాలన,  సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ఎలా నడిపించామో ఈ నివేదికల ద్వారా ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే అన్ని శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలను ఒకే చోట చేర్చి ప్రచురించాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.   ఈ  ప్రగతి ప్రకటనలో భాగంగా ప్రభుత్వం మొత్తం 10 ప్రధాన అంశాలపై ప్రత్యేక నివేదికలు సిద్ధం చేస్తున్నది.  గతంలోని అంటే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రబుత్వం కొలువుదీరిన తొలి నాళ్లలో విడుదల చేసిన 7 శ్వేతపత్రాల యాక్షన్ టేకెన్ నివేదికలతో పాటు,  అభివృద్ధి  , సుపరిపాలన,  సంక్షేమం, సాధికారత   విభాగాలపై సమగ్ర నివేదికలు విడుదల చేయనుంది.  అభివృద్ధి నివేదికలో వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు,  పర్యాటక రంగాల పురోగతిని పొందుపరచగా, సుపరిపాలన నివేదిక ద్వారా నూతన విధానాలు, డిజిటల్ విప్లవం,  వాట్సాప్ గవర్నెన్స్ వంటి  సేవల వివరాలను అందించనుంది.   ఆర్థిక, అభివృద్ధి, సంక్షేమ, పాలనా నివేదికలను స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేస్తారు. మిగిలిన నివేదికలను సంబంధిత శాఖల మంత్రులు ప్రజా సమక్షంలో ఆవిష్కరిస్తారు.   రెండేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రికార్డు స్థాయి నిధులను పంపిణీ చేసింది. ముఖ్యంగా పేదలు, వృద్ధులు,  వికలాంగులకు ఆర్థిక భద్రత కల్పిస్తూ  ఏడాదికి సగటున రూ. 33,000 కోట్లకు పైగా కేవలం పెన్షన్ల కోసమే వెచ్చించడం దేశ సంక్షేమ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం. అదే విధంగా, పేదవారి ఆకలి తీర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చి, ఇప్పటివరకు రూ. 230 కోట్ల నిధులను కేటాయించింది. దీనివల్ల ప్రతి నెలా వేలాది మంది నిరుపేదలు, ఆటో డ్రైవర్లు,  కూలీలు భోజన ఖర్చులలో రూ. 2,500 నుండి రూ. 3,000 వరకు పొదుపు చేయగలుగుతున్నారు. మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ చేపట్టిన  స్త్రీశక్తి  ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ పథకం రాష్ట్రంలో ఊహించని విజయాన్ని సాధించింది. ఈ ఉచిత ప్రయాణ సదుపాయం కోసం ప్రభుత్వం  రూ. 2,565 కోట్ల సబ్సిడీ భార భారాన్ని  భరించి మహిళల ఉపాధి, విద్య,  ప్రయాణ స్వేచ్ఛకు ఊతమిచ్చింది.   అమరావతి ప్రాజెక్టు పనులతో పాటు పోలవరం నిర్మాణం, రహదారుల అభివృద్ధి మరియు డ్రోన్ నిఘా ద్వారా  నిర్మూలన వంటి చర్యలతో రాష్ట్రంలో శాంతిభద్రతలు, ఆర్థిక స్థిరత్వం  నెలకొన్నాయి. ఈ నివేదికలు,  డేటా పాయింట్లు ప్రతి పౌరుడికి ప్రభుత్వ పనితీరుపై పూర్తి అవగాహనను, భరోసాని కలిగిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.  AP Govt White Papers, Chandrababu Naidu 2 Years Governance, AP Coalition Govt Progress Report, NTR Bharosa Pension Scheme
ALSO ON TELUGUONE N E W S
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మోస్ట్ వెయిటెడ్ ప్రాజెక్ట్ 'NBK 111' షూటింగ్ సెట్‌లో అనుకోకుండా ఒక ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో గడచిన మూడు రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన అత్యంత కీలకమైన షెడ్యూల్ శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో భాగంగా ప్రముఖ నటుడు మంచు మనోజ్ తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేసుకుని ఇప్పటికే హైదరాబాద్ చేరుకోగా, కేజీఎఫ్ ఫేమ్ 'గరుడ' రామ్, బాలకృష్ణల మధ్య భారీ ఫైట్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ సన్నివేశం తీస్తున్న సమయంలోనే ఊహించని విధంగా బాలకృష్ణ కాలు స్లిప్ అయ్యి కిందపడిపోవడంతో, ఆయన మోకాలు నేరుగా నేలకు బలంగా గుద్దుకుంది. ఈ అనూహ్య ఘటనతో ఆయన మోకాలి వద్ద ఉన్న కండరం తీవ్రంగా గాయపడింది (మజిల్ టియర్). అయితే, గాయం తగిలిన వెంటనే సెట్‌లోని ప్రొడక్షన్ బృందం తీవ్రంగా కంగారు పడినప్పటికీ, బాలయ్య మాత్రం ఏమాత్రం అధైర్యపడలేదు. "ఏమీ కాదు షూటింగ్ కొనసాగిద్దాం.. లంచ్ బ్రేక్ తర్వాత హాస్పిటల్ కి వెళ్దాం" అంటూ సెట్‌లో ఉన్న ప్రతి ఒక్కరిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. కానీ, చిత్ర యూనిట్ ఒత్తిడి మేరకు ఆయనను కాకినాడలోని సమీప ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించిన అనంతరం, మోకాలి జాయింట్ వద్ద మజిల్ టియర్ అయినట్లు స్పష్టం చేశారు. పూర్తి కోలుకోవడానికి ఒక చిన్నపాటి సర్జరీ అవసరమని వైద్యులు సూచించడంతో, తదుపరి చికిత్స నిమిత్తం ఆయన హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా సోషల్ మీడియా వేదికగా అప్‌డేట్ ఇచ్చారు. కాగా, జులై 28 వరకు ప్లాన్ చేసిన ఈ సుదీర్ఘ షెడ్యూల్‌లో రాజమండ్రి జైలు బ్యాక్‌డ్రాప్‌లో జరిగే సీన్లకు హీరో అవసరం లేకపోవడంతో, చిత్ర బృందం యథావిధిగా షూటింగ్‌ను కొనసాగిస్తోంది. ఈ ఘటనపై NBK హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్, బాలయ్య వీరాభిమాని అనంతపురం జగన్ 'తెలుగువన్'తో స్పందిస్తూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేనికి ఫోన్ చేసి పరిస్థితి తెలుసుకున్నట్లు చెప్పిన జగన్, " బాలయ్య గారికి చిన్న గాయమైంది. గాయంతోనే షూటింగ్ చేయడానికి సిద్ధపడ్డారు. మూవీ టీం ఒత్తిడితో హాస్పిటల్ కి వెళ్ళారు. సర్జరీ తర్వాత విశ్రాంతి తీసుకొని, మళ్ళీ ఉత్సాహంగా తిరిగి వస్తారు. బాలయ్యకు గాయాలు కొత్త కాదు. ఆయనకు డూప్ లు పెట్టుకోవడం నచ్చదు. డూప్‌లను పెడితే ఆ డూప్ చేసే వ్యక్తి కూడా ఒక మనిషే కదా, ఆయనకు ప్రాణాపాయం రాకూడదు అనే ఉదార స్వభావం ఆయనది. అభిమానులను సంతోషపెట్టడం కోసం ఎంతటి రిస్క్ అయినా చేయడానికి సిద్ధపడే మా బాలయ్యకు కోట్లాది మంది అభిమానుల దీవెనలు ఉన్నాయి" అంటూ భావోద్వేగానికి గురయ్యారు. గతంలో 'లెజెండ్' సినిమా చిత్రీకరణ సమయంలో కూడా గుర్రం గ్లాస్ బ్రేకింగ్ సీన్ చేయగా ఆయన ముక్కుపై గాజు పెంకు గుచ్చుకుని గాయమైంది. అలాగే ట్రైన్ ఇంజిన్ పైనుంచి రొటేట్ అవుతున్న సుమో వాహనంపైకి రోప్ సాయంతో దూకే క్రమంలో, టైమింగ్ మిస్సై వాహనం బలంగా తొడకు తగిలినా కేవలం రెండు నిమిషాలు ఆయింట్‌మెంట్ రాసుకుని 'నెక్స్ట్ టేక్' అని చెప్పిన ఘనత ఆయనది. సినిమా పట్ల అంతటి అమితమైన తపన, క్రమశిక్షణ కలిగిన బాలకృష్ణకు ఈ చిన్నపాటి గాయం ఒక దిష్టి చుక్క లాంటిదని, ఆయన మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు ఎనర్జీతో అతి త్వరలోనే షూటింగ్ సెట్‌లోకి అడుగుపెడతారని సినీ వర్గాలు, అభిమానులు విశ్వసిస్తున్నారు.     Nandamuri Balakrishna, Injury, NBK 111 Shooting, Anantapuram Jagan  
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా 'స్పిరిట్' (SPIRIT). ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రస్తుతం ఈ భారీ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఒక మైండ్ బ్లోయింగ్ అఫీషియల్ బిజినెస్ అప్‌డేట్ బయటకు వచ్చి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.  ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం యొక్క కర్ణాటక థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory), ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్ (Asian Suresh Entertainment) భాగస్వామ్యంతో సొంతం చేసుకున్నాయి. ప్రభాస్ మార్కెట్‌కు కర్ణాటక అత్యంత బలమైన స్థానాల్లో ఒకటిగా పేరుగాంచింది. బాహుబలి, సలార్ వంటి చిత్రాలతో కర్ణాటక బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ సాధించిన వసూళ్లు సరికొత్త చరిత్రను తిరగరాశాయి. అలాంటి బలమైన మార్కెట్‌లో ఈ క్రేజీ కాంబో చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేసేందుకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థలు బిగ్ ప్లాన్ చేస్తున్నాయి. కర్ణాటకలోని మూలమూలనా ఉన్న సినీ అభిమానులకు, ప్రేక్షకులందరికీ ఒక మరువలేని థియేట్రికల్ అనుభూతిని అందించడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను, బెంచ్‌మార్క్‌లను క్రియేట్ చేస్తామని ఇరు నిర్మాణ సంస్థలు ఎంతో ధీమాతో వెల్లడించాయి. ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీని టీ సిరీస్ ఫిలిమ్స్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ నటించబోతున్నారనే వార్తలతో ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ సినిమా 2027 మార్చి 5న థియేటర్లలో విడుదల కాబోతోంది.  https://x.com/peoplemediafcy/status/2079498470902333824   Prabhas, Sandeep Reddy Vanga, Spirit, Karnataka Distribution, People Media Factory  
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, ,మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మధ్య ఉన్న అనుబంధం సమయం వచ్చినప్పుడు బయటపడుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఆ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం తాలూకు యొక్క సువాసన అభిమానులకి, నెటిజెన్స్ ని తెలిసింది  దర్శకుడు గోపి చంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న nbk111 షూటింగ్  కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ కాకినాడ పోర్ట్ లో జరుగుతుంది.  అందులో భాగంగా బాలకృష్ణ, మంచు మనోజ్ పై  యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో అనుకోకుండా బాలకృష్ణ కాలు జారీ పడటంతో మోకాలికి స్వల్ప గాయం అయ్యింది  ఈ విషయం తెలియడంతో ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా 'Get well soon Bala Babai. Wishing you a speedy recovery and good health. Looking forward to seeing you roar back in full form..." అని ఎన్టీఆర్ ఎంతో ఆత్మీయంగా రాసుకొచ్చారు. అంటే "బాబాయ్, మీరు త్వరగా కోలుకోవాలి. మీకు గాయాల నుంచి విముక్తి కలిగి మంచి ఆరోగ్యం కలగాలని ఆకాంక్షిస్తున్నాను. మీరు మళ్లీ పూర్తి ఫామ్‌లో గర్జించడాన్ని చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను..." అని ఎన్టీఆర్ తన సందేశంలో అత్యంత భావోద్వేగంగా పేర్కొన్నారు. Also read: అభిమానుల పూజలు.. బాలకృష్ణ హెల్త్ అప్ డేట్ ఇదే   ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్‌లో "రోర్ బ్యాక్" అని ఉపయోగించిన పదం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సింహంలా బాబాయి మళ్లీ బాక్సాఫీస్ వద్ద గర్జించాలని ఎన్టీఆర్ కోరుకోవడం వారి మధ్య ఉన్న ఆత్మీయతని , గౌరవాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ పోస్ట్ బయటకు వచ్చిన కొద్ది నిమిషాల్లోనే వేల సంఖ్యలో లైక్స్, రీట్వీట్లతో సోషల్ మీడియాను ఊపేసింది. నందమూరి అభిమానులు ఈ సందేశాన్ని చూసి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. "బాబాయి అబ్బాయిల అనుబంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలి" అంటూ  అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.   balakrishna, ntr, gopichand malineni    
Jr NTR has extended his heartfelt wishes to Nandamuri Balakrishna after the senior actor-politician sustained an injury during the shooting of his upcoming film in Kakinada, which reportedly resulted in him undergoing surgery. The gesture from Tarak has caught the attention of fans, with many welcoming the public show of support within the Nandamuri family. Taking to X (formerly Twitter), Jr NTR wrote, "Get well soon Bala Babai. Wishing you a speedy recovery and good health. Looking forward to seeing you roar back in full form..." The message quickly went viral across social media, with fans appreciating the warm wishes from the War 2 actor. Balakrishna was recently injured while filming an action sequence for director Gopichand Malineni's upcoming film at the Kakinada Port. Reports stated that he slipped during the shoot and sustained a knee injury. While initial updates described it as a minor injury, Balakrishna has since undergone surgery and is now recovering under medical supervision. The exchange has once again highlighted the mutual respect shared by the two stars despite years of speculation surrounding the Nandamuri family. As Balakrishna recuperates, fans from across the Telugu film industry have been sending their prayers and wishes for his speedy recovery. With Balakrishna expected to resume work after completing his recovery, fans are eagerly waiting to see him return to the sets and continue work on his much-awaited collaboration with Gopichand Malineni. Manchu Manoj and Kajal Aggarwal are playing prominent roles in this film produced by Venkata Satish Kilaru.  Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'విశ్వంభర'. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ విజువల్ వండర్‌పై టాలీవుడ్ వ్యాప్తంగా అపారమైన అంచనాలు నెలకొన్నాయి. అయితే, గత కొన్ని నెలలుగా ఈ సినిమా విడుదల విషయంలో చోటుచేసుకున్న వరుస జాప్యాలు, వీఎఫ్ఎక్స్ (VFX) వర్క్ విపరీతంగా ఆలస్యం కావడం మెగా అభిమానుల్లో తీవ్ర గందరగోళానికి, అసహనానికి దారితీసింది. చిరంజీవి గతంలో నటించిన ఆల్ టైమ్ క్లాసిక్ 'జగదేకవీరుడు అతిలోకసుందరి' రేంజ్‌లో ఈ చిత్రం ఉంటుందని ప్రచారం జరగడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ, గత రెండేళ్లుగా ఈ సినిమా కేవలం వీఎఫ్ఎక్స్ టేబుల్‌పైనే నలుగుతూ ఉండటం, అలాగే గతంలో విడుదలైన టీజర్ లోని విజువల్ ఎఫెక్ట్స్‌పై విమర్శలు రావడం ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో స్వయంగా మెగాస్టార్ చిరంజీవి కూడా వీఎఫ్ఎక్స్ నాణ్యత, పనుల ఆలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఫిలిం నగర్ వర్గాల్లో కథనాలు వచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాదిలోనే సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని, క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా పనులను వేగవంతం చేయాలని దర్శకుడు వశిష్టకు చిరంజీవి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట. చిరు సూచనల తర్వాత చిత్ర యూనిట్ పనుల వేగాన్ని రెట్టింపు చేసింది. తాజా సమాచారం ప్రకారం, విశ్వంభర వీఎఫ్ఎక్స్ పనులు దాదాపుగా చివరి దశకు చేరుకున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే రాబోయే ఆగస్టు నాటికి విజువల్ ఎఫెక్ట్స్ అవుట్‌పుట్ పూర్తిగా సిద్ధమవుతుందని, ఆ వెంటనే పెండింగ్‌లో ఉన్న రీ-రికార్డింగ్ పనులను శరవేగంగా పూర్తి చేయనున్నారని తెలుస్తోంది. ఈ భారీ చిత్రాన్ని దసరా పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు యూవీ క్రియేషన్స్ మరియు దర్శకుడు వశిష్ట పట్టుదలతో పనిచేస్తున్నారు. ముఖ్యంగా రాబోయే ఆగస్టు నెలలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విశ్వంభర చిత్రం నుంచి ఒక సంచలనాత్మక బిగ్ అప్‌డేట్ రాబోతున్నట్లు చిత్రబృందం సంకేతాలు ఇచ్చింది. ఈ బిగ్ అప్‌డేట్ మరేదో కాదు, అధికారిక విడుదల తేదీ ప్రకటనయేనని మెగా అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారు. చిరంజీవి తదుపరి చిత్రం 'మెగా 158' బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతూ, 2027 సంక్రాంతి రేసులో ఉండటంతో, అంతకంటే ముందే విశ్వంభరను థియేటర్లలోకి తీసుకురావడం మెగా కాంపౌండ్‌కు అత్యంత కీలకంగా మారింది. సినిమాపై తాత్కాలికంగా బజ్ కొద్దిగా తగ్గినప్పటికీ, మెగాస్టార్ స్టామినా ముందు ఇవేవీ పెద్ద లెక్కకావని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విడుదల సమయానికి కట్ చేసే పవర్‌ఫుల్ ట్రైలర్, అలాగే రెండు వారాల పాటు నిర్వహించే ఆగ్రెసివ్ ప్రమోషన్లతో విశ్వంభర హైప్‌ను మళ్లీ పీక్స్‌కు తీసుకువెళ్లడం ఖాయం. గ్రాఫిక్స్ పనుల పట్ల చిరంజీవి పూర్తిగా సంతృప్తి చెందితే, ఈ దసరాకు బాక్సాఫీస్ వద్ద మెగా విశ్వరూపం చూడటం ఖాయంగా కనిపిస్తోంది.     Chiranjeevi, megastar, Vishwambhara
    గాడ్ ఆఫ్ మాసెస్, పద్మభూషణ్ బాలకృష్ణ(Balakrishna)దర్శకుడు గోపిచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న nbk111 షూటింగ్  కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ కాకినాడ పోర్ట్ లో జరుగుతుంది.  అందులో భాగంగా బాలకృష్ణ, మంచు మనోజ్ పై  యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో అనుకోకుండా బాలకృష్ణ కాలు జారీ పడటంతో మోకాలికి స్వల్ప గాయం అయ్యింది దీంతో షూటింగ్ ని నిలిపివేయగా బాలకృష్ణ కాకినాడ పోర్టులోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. బాలకృష్ణ గాయం విషయం నిమిషాల్లోనే వైరల్ గా మారడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కొంత మంది అభిమానులు దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రార్థన కార్యక్రమాలు జరిపిస్తున్నారు. బాలయ్య గాయాలపై గోపీచంద్ మలినేని స్పందిస్తూ కాకినాడలో జరుగుతున్న షూటింగ్ లో ఒక యాక్షన్ సీక్వెన్స్ లో  బాలకృష్ణ గారికి చిన్న మసిల్ టియర్ అయింది.  వైద్యుల సూచన మేరకు, ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవడానికి ఒక చిన్న మైనర్ సర్జరీ చేయాల్సి ఉంది. సినిమాపై ఆయనకున్న క్రమశిక్షణ, కష్టపడే తత్వం #NBK111 చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ ఎంతో స్ఫూర్తినిస్తుంది. Also read: కిరణ్ అబ్బవరం కోసం చిరంజీవి.. ఫ్యాన్స్ కి పూనకాలే  అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటారని ట్వీట్ లో తెలిపాడు. నందమూరి కళ్యాణ్ కూడా  రామ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ బాబాయ్ త్వరగా కోలుకోవాలని తెలిపాడు balakrishna, gopichand malineni, nbk111, kalyan ram  
నందమూరి బాలకృష్ణ 'NBK 111' మూవీ షూటింగ్ సెట్‌లో అనుకోకుండా గాయపడిన వార్త ప్రస్తుతం సినీ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాకినాడ తీరప్రాంతంలో ఈ సినిమాకి సంబంధించిన అత్యంత కీలకమైన, భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్న సమయంలో ఆయనకు మోకాలికి కండరాల గాయం, అంటే ‘మజిల్ టియర్’ (Muscle Tear) అయినట్లు చిత్ర బృందం తెలిపింది. డాక్టర్ల సలహా మేరకు ఆయన త్వరగా, సంపూర్ణంగా కోలుకోవడానికి ఒక చిన్న సర్జరీ చేయించుకోవాల్సి ఉందని వెల్లడించారు.  ఈ వార్త తెలియగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న నందమూరి అభిమానులు, సినీ ప్రముఖులు ఆందోళనకు గురికావడమే కాకుండా ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా తమ ఆకాంక్షలను వ్యక్తపరుస్తున్నారు. ఈ క్రమంలో నందమూరి కుటుంబం నుంచి హీరో కళ్యాణ్ రామ్ స్పందించిన తీరు ప్రతి ఒక్కరినీ అమితంగా ఆకట్టుకుంటోంది. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కళ్యాణ్ రామ్ ఒక భావోద్వేగపూరితమైన పోస్ట్ చేశారు. "గెట్ వెల్ సూన్ బాబాయ్ ❤️" అంటూ ఎంతో ఆప్యాయంగా హార్ట్ ఎమోజీతో తన పోస్ట్‌ను ప్రారంభించారు. "మీరు అత్యంత వేగంగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మీకు అత్యంత ఇష్టమైన, మీరు అమితంగా ప్రేమించే ఆ బాక్సాఫీస్ యాక్షన్‌లోకి అతి తక్కువ సమయంలోనే మళ్లీ తిరిగి అడుగుపెడతారని నేను గట్టిగా నమ్ముతున్నాను" అంటూ కళ్యాణ్ రామ్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. బాబాయ్, అబ్బాయ్ మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ పోస్ట్ మరోసారి నిరూపించింది. https://x.com/NANDAMURIKALYAN/status/2079492232223277163 Nandamuri Balakrishna, Nandamuri Kalyan Ram, Babai Abbai  
  హిట్ ట్రాక్ నే తన రూట్ గా మార్చుకున్న కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram)ఈ నెల 24 న  'చెన్నై లవ్ స్టోరీ' తో వస్తున్న విషయం తెలిసిందే.  మ్యాడ్ ఫేమ్ శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్ కావడంతో పాటు మెగా కాంపౌండ్ మనుషులుగా ముద్రపడ్డ సాయి రాజేష్, ఎస్ కె ఎన్ నిర్మాతలుగా వ్యవహరించడంతో పాటు ప్రచార చిత్రాలు కూడా బాగున్నాయి. దీంతో చెన్నైలవ్ స్టోరీ పై మంచి అంచనాలే ఉన్నాయి. చెన్నై లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)ముఖ్య అతిథిగా కానున్నారు. చిత్ర యూనిట్ ఈ విషయాన్నీ అధికారికంగా వెల్లడి చేసింది. సినిమా విడుదల తేదీ వేగంగా దగ్గరపడుతుండటంతో, ప్రమోషన్లను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాలనే ఆలోచనతో నిర్మాతలు ఈ గ్రాండ్ ఈవెంట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేశారు. మరి చిరంజీవి హాజరు కావడం చెన్నై లవ్ స్టోరీకి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు  చిన్న చిత్రాలకి, యంగ్ డైరెక్టర్లు మరియు కొత్త నటీనటులకి పెద్దపీట వేస్తూ, వారి చిత్ర ఆడియో వేడుకలకు లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు హాజరై గ్రాండ్ సక్సెస్ అందించడం చిరంజీవి గారికి ఒక ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో ఎంతో ఆసక్తికరమైన ప్రేమ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి మెగాస్టార్ హాజరుకావడం సినిమాకు ప్రమోషనల్ మైలేజ్‌ను అందించనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు 100 శాతం సక్సెస్ సాధించాలంటే ఇలాంటి పెద్ద స్టార్ల సపోర్ట్ ఎంతో కీలకమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. Also read: యష్ మాట తప్పాడు.. టాక్సిక్ రొమాన్స్ వెనుక అసలు నిజాలివే! మరోవైపు 'చెన్నై లవ్ స్టోరీ' చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి కూడా అత్యంత అద్భుతమైన రెస్పాన్స్ రావడం విశేషం. సెన్సార్ సభ్యులు మూవీలోని కంటెంట్, క్లీన్ లవ్ స్టోరీ, నటీనటుల పనితీరు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని ప్రత్యేకంగా అభినందించారని చిత్ర యూనిట్ తెలిపింది. 100 శాతం క్వాలిటీతో పాటు కుటుంబ సమేతంగా చూడదగిన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించామని నిర్మాతలు ఎంతో నమ్మకంగా వెల్లడించారు. సెన్సార్ బోర్డ్ అందించిన పక్కా పాజిటివ్ టాక్ ఒకవైపు, టాలీవుడ్ దిగ్గజం మెగాస్టార్ చిరంజీవి అందిస్తున్న ప్రత్యక్ష ఆశీస్సులు మరొకవైపు తోడవడంతో 'చెన్నై లవ్ స్టోరీ' తప్పకుండా పెద్ద విజయాన్ని సాధిస్తుందనే ధీమాతో చిత్రయూనిట్ ఉంది. రవి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. chiranjeevi,kiran abbavaram, sri gouri priya
నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మోస్ట్ వెయిటెడ్ ప్రాజెక్ట్ NBK 111 చిత్రీకరణ కాకినాడ తీరప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. అత్యంత భారీ స్థాయిలో డిజైన్ చేసిన ఒక కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్న సమయంలో అనుకోకుండా ఒక చిన్న ప్రమాదం చోటుచేసుకుంది. ఈ పోరాట సన్నివేశంలో పాల్గొంటున్న సమయంలో బాలకృష్ణకి గాయమైంది. ఈ వార్త కాకినాడ సెట్ నుంచి బయటకు రావడమే ఆలస్యం, నందమూరి అభిమానుల్లో తీవ్ర ఆందోళన రేగింది. నటసింహానికి ఏమైందో అని ఫ్యాన్స్ తీవ్రంగా కంగారు పడుతున్న తరుణంలో, NBK 111 చిత్ర యూనిట్ సభ్యులు ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసి ఈ విషయంపై పూర్తి స్పష్టతనిచ్చారు.  #NBK111 షూటింగ్ కాకినాడలో జరుగుతున్న సమయంలో ఓ యాక్షన్ సీక్వెన్స్ లో బాలకృష్ణకి చిన్న మజిల్ టియర్ (కండరాల చిట్లిపోవడం) అయింది. వైద్యుల సూచన మేరకు, ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవడానికి ఒక చిన్న మైనర్ సర్జరీ చేయించుకోబోతున్నారని స్పష్టం చేశారు. "సినిమాపై ఆయనకున్న క్రమశిక్షణ, కష్టపడే తత్వం #NBK111 చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ ఎంతో స్ఫూర్తినిస్తుంది. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్‌లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం." అని టీమ్ ప్రకటనలో పేర్కొంది.  శస్త్రచికిత్స అనంతరం చిన్నపాటి విశ్రాంతి తీసుకుని బాలకృష్ణ త్వరలోనే మళ్లీ షూటింగ్ సెట్‌లోకి అడుగుపెడతారని సమాచారం.     Nandamuri Balakrishna, Injury, Surgery, NBK111, Kakinada Shooting  
Nandamuri Balakrishna reportedly escaped a major mishap while shooting for his upcoming film with director Gopichand Malineni in Kakinada. The incident took place during the filming of an action sequence at the Kakinada Port, where the actor was participating in an intense stunt scene. According to reports, Balakrishna slipped and fell while filming the sequence, resulting in a minor injury to his knee. The action scene reportedly featured Balakrishna alongside actor Manchu Manoj, with the team filming a crucial fight episode for the movie. Following the fall, the actor was immediately attended to by the film's crew. Sources indicate that the injury is not serious, and Balakrishna has been advised to take some rest before resuming the shoot. He is currently resting at the Kakinada Port location. The film, directed by Gopichand Malineni, is one of the most anticipated Telugu projects in production. The makers are yet to issue an official statement regarding the incident or any possible changes to the shooting schedule. Fans will be relieved to know that the injury is said to be minor, and Balakrishna is expected to return to the sets after a brief period of rest.   Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
అంతర్జాతీయ చెస్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై 20న జరుపుకుంటారు . చెస్ అనేది మెదడును ఎక్కువగా ఉపయోగించే ఆట. అందువల్ల, చెస్ ఆడటం పిల్లల మేధస్సును పదును పెడుతుందని చాలా మంది చెబుతుంటారు. చాలా మంది తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ఆలోచనా, గ్రహణ సామర్థ్యాలను మెరుగుపరచడానికి పిల్లలతో చెస్ ఆడించాలని అనుకుంటారు. కానీ కేవలం చెస్ ఆడటం మాత్రమే మేధస్సును పదును పెడుతుందా? దీనిపై వైద్యులు ఏమంటున్నారో తెలుసుకుంటే.. ఆలోచించే అలవాటు.. చదరంగం ఆడేటప్పుడు పిల్లలు ప్రతి ఎత్తును జాగ్రత్తగా పరిశీలించాలి,.  ప్రత్యర్థి ఎలాంటి ఎత్తు వేస్తాడు అనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి,  ఇది పిల్లలు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే బదులు ముందుగా ఆలోచించేలా ప్రోత్సహిస్తుంది. క్రమంగా, వారు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే అలవాటును పెంపొందించుకోగలుగుతారు. ఏకాగ్రత.. చదరంగం ఆడుతున్నప్పుడు పిల్లల పూర్తి ఏకాగ్రత ఆటపైనే ఉంటుంది. వారి ఏకాగ్రత ఒక్క క్షణం తగ్గినా,  లేదా డిస్టర్బ్ అయినా  వారు ఆటను ఓడిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల, ఈ ఆట పిల్లల ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అందుకే చెస్ ఆడేటప్పుడు పిల్లలు ఏకాగ్రతగా ఉండటం వారి చదువులకు, ఇతర ముఖ్యమైన పనులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. జ్ఞాపకశక్తి.. చెస్ ఆడేటప్పుడు పిల్లలు అనేక ఎత్తులు, నియమాలు , చెస్ ఆడే ఇతర  పద్ధతులను గుర్తుంచుకోవలసి ఉంటుంది. దీనివల్ల వారి మెదడు నిరంతరం చురుకుగా ఉంటుంది. వైద్యుల ప్రకారం, ఇది వారి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది , కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తిని కూడా పెంచుతుంది. సహనం.. చెస్ అనేది తొందరపడి ఆడే ఆట కాదు. ప్రతి ఎత్తుగడకు జాగ్రత్తగా ఆలోచన అవసరం. కొన్నిసార్లు, గెలవడానికి చాలాసేపు వేచి ఉండాల్సి వస్తుంది. ఇది పిల్లలకు సహనాన్ని నేర్పి, వాస్తవిక దృక్పథంతో నిర్ణయాలు తీసుకునే అలవాటును పెంపొందించడంలో సహాయపడుతుంది. పాఠాలు.. చెస్ అనే కాదు.. ఏ ఆటలో అయినా సరే.. ఎల్లప్పుడూ గెలవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఓడిపోతాం. కానీ ఓటమి పిల్లలు తమ తప్పులను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని వైద్యులు చెబుతారు. ఇది తర్వాతిసారి మరింత మెరుగ్గా ఆడేందుకు వారిని ప్రోత్సహిస్తుంది. ఈ అలవాటు వారి చదువులో , ఇతర జీవిత పనులలో కూడా సహాయపడుతుంది. చెస్ మాత్రమే కాదు.. కేవలం చెస్  ఆడటం వల్ల మాత్రమే పిల్లల మెదడు పదునుదేరదని వైద్యులు చెబుతున్నారు. మంచి నిద్ర, సరైన పోషణ, రోజువారీ శారీరాన్ని చురుగ్గా ఉంచే ఇతర ఆటలు, చదువు కూడా చాలా అవసరం. ఇవన్నీ కలిసినప్పుడే పిల్లల మెదడు చక్కగా అభివృద్ధి చెందుతుంది. అందువల్ల, చదరంగంతో పాటు మంచి రోజువారీ అలవాట్లపై దృష్టి పెట్టడం ముఖ్యం.                                     *రూపశ్రీ.  
చిన్నతనం అంటేనే ఆటలు, అల్లరి పనులు, చిన్న చిన్న గొడవలు. పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడు స్నేహితులు, తమ తోటి పిల్లలతో ఆడుకుంటారు.. అలాగే కొన్ని సార్లు గొడవలు కూడా పడతారు.  పిల్లలు తప్పులు చ చేయడం సహజం. తోటి పిల్లలను బాధపెట్టడం కూడా సహజం. కానీ పిల్లలు మాత్రం  కొంత సేపు అయ్యాక లేదా ఒక రోజు తర్వాత అవన్నీ మర్చిపోయి తిరిగి కలిసి ఆడుకుంటారు, మళ్లీ గొడవలు కూడా పడతారు.  అందుకే పిల్లలను కల్మషం లేని వారు అని చెబుతూ ఉంటారు. అయితే గొడవలు పడినప్పుడో.. లేదా ఇతర పిల్లలు మీ పిల్లలను బాధపెట్టినప్పుడు, ఇతర పిల్లలు చేసిన తప్పులను మీ పిల్లలు మర్చిపోకుండా మనసులో ఉంచుకోవడం వంటివి చేసినప్పుడు అది మంచి విషయం కాదని పిల్లల పెంపకం నిపుణులు అంటున్నారు.   దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. కారణం.. పిల్లలు ప్రపంచాన్ని పెద్దల కంటే చాలా భిన్నంగా చూస్తారు. వారికి, ఒక బొమ్మను పగలగొట్టడం లేదా ఆటలో ఓడిపోవడం చాలా పెద్ద విషయం. అటువంటి పరిస్థితిలో, ఒక స్నేహితుడు వారి మాట వినకపోతే, వారు అభద్రతకు గురై, మోసపోయినట్లు భావిస్తారు. క్రమంగా, పిల్లలలో అహంభావం పెరుగుతుంది, దీనివల్ల క్షమాపణ చెప్పడం లేదా క్షమాపణ కోరడం ఒక కష్టమైన పనిగా అనిపిస్తుంది. ప్రవర్తనను మార్చడం వల్ల కలిగే ప్రభావం.. పిల్లవాడికి క్షమించే అలవాటు లేకపోతే, అతను క్రమంగా ఒంటరివాడు అవుతాడు. మనసులో పగను ఉంచుకోవడం అతని మానసిక ఒత్తిడిని పెంచుతుంది. దేనికీ సర్థుకుని పోలేని మనస్తత్వం,  ఇతరుల తప్పులను చూపించే కారణం వల్ల పిల్లవాడు ఎవరితో కూడా ఎక్కువకాలం స్నేహంగా ఉండలేడు.  పిల్లలు సున్నితమైన, అర్థం చేసుకునే వ్యక్తులుగా మారాలంటే,  క్షమించడం నేర్చుకోవాలి. తల్లిదండ్రులే సహాయం చేయాలి.. తల్లిదండ్రులు చిన్న విషయాలకే కోపగించుకుని, క్షమాపణ చెప్పకపోయినా లేదా క్షమించకపోయినా, పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. ఒకవేళ తను తప్పు చేసి ఉంటే ఏమి ఆశించి ఉండేవాడో ఆ పిల్లవాడిని అడగాలి. ఇతర పిల్లల పరిస్థితిని అర్థం చేసుకునేలా పిల్లలను  ప్రోత్సహించాలి. ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడు మీరు కూడా క్షమాపణ చెప్పి, ఎదుటి వ్యక్తిని క్షమించడం నేర్చుకోవాలి. క్షమాపణ చెప్పడం బలహీనతకు సంకేతం కాదని, గొప్పతనానికి సంకేతమని పిల్లలు  అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. స్నేహాన్ని బలపరిచే విషయాలు.. ఎవరూ పర్పెక్ట్ కారని పిల్లలకు వివరించాలి. ప్రతిఒక్కరూ తప్పులు చేస్తారు,  కాబట్టి అందరిలో  తప్పులు మాత్రమే  చూడటం తప్పని పిల్లలకు చెప్పాలి. స్నేహ సంబంధం అనేది నమ్మకం , క్షమాగుణం అనే పునాదులపై ఆధారపడి ఉంటుంది. 'క్షమించండి' అని చెప్పడంలో ఉన్న  ప్రాముఖ్యతను పిల్లలకు  వివరించాలి.  క్షమించడం ఎంతో గొప్ప గుణం అని  చెప్పాలి. చిన్నతనంలో క్షమించడం నేర్చుకున్న పిల్లలు భవిష్యత్తులో మరింత సంతోషంగా, విజయవంతంగా ఉంటారని మనస్తత్వవేత్తలు నమ్ముతారు. కాబట్టి పిల్లలకు క్షమాగుణం అలవాటు చేయాలి.                                       *రూపశ్రీ.  
  వయసు పైబడే కొద్దీ, చాలా మంది తల్లిదండ్రులకు రోజువారీ పనులలో సహాయం అవసరం అవుతుంది. ఉద్యోగాల రీత్యా పిల్లలు దూరంగా ఉండటం లేదా విదేశాల్లో ఉండటం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో పిల్లలు తల్లిదండ్రుల కోసం పిల్లలు కేర్ టేకర్ ను నియమించుకోవాలని అనుకుంటారు.  తల్లిదండ్రులు చాలా పెద్దవారైపోయి,  వారికి వారి పనులు కూడా చేసుకోలేని పరిస్థితిలో చాలా కుటుంబాలు కూడా కేర్ టేకర్ ను నియమించుకోవాలి అనుకుంటాయి.  అయితే కేవలం అనుభవం ఉందనో లేదా తక్కువ  పేమెంట్ తో కేర్ టేకర్ వస్తున్నారనో  తల్లిదండ్రుల కోసం కేర్ టేకర్ ను నియమించడం మంచిది కాదని అంటున్నారు లైఫ్ స్టైల్ నిపుణుల.   తల్లిదండ్రుల ఆరోగ్యం, భద్రత , మానసిక ఆరోగ్యం  కోసం  మంచి కేర్ టేకర్ ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. అందుకే కేర్ టేకర్ ను నియమించుకునే ముందు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి.  అవేంటో తెలుసుకుంటే.. ముఖ్యమైన విషయం.. మొదట తల్లిదండ్రులకు ఎలాంటి సంరక్షణ అవసరమో నిర్ధారించుకోవాలి. వారికి అల్జీమర్స్, డిమెన్షియా లేదా మరో తీవ్రమైన అనారోగ్యం ఉంటే, శిక్షణ పొందిన కేర్ టేకర్  అవసరం అవుతారు. వారికి కేవలం సమయానికి మందులు వేసుకోవడం, ఆహారం తినడం లేదా రోజువారీ పనులు చేసుకోవడంలో సహాయం అవసరమైతే, ఒక సాధారణ కేర్ టేకర్ కూడా  సరిపోతారు. కేర్ టేకర్ ను  ఎంచుకునే ముందు, స్నానం చేయడం, బట్టలు మార్చుకోవడం, ఆహారం తినడం, మరుగుదొడ్డికి వెళ్లడం, మందులు వేసుకోవడం లేదా రాత్రిపూట వారికి ఎంత సంరక్షణ అవసరమో వంటి రోజువారీ అవసరాల లిస్ట్ ను తయారు చేసుకోవాలి. ఇది సరైన కేర్ టేకర్ ను  ఎంచుకోవడాన్ని సులభతరం చేస్తుంది. ప్రశ్నలు అడిగేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు.. కేర్ టేకర్ ను ఇంటర్ప్యూ చేసే  సమయంలో అనుభవం గురించి అడిగితే సరిపోదు. వారు ఇంతకుముందు ఏ జబ్బు ఉన్న వ్యక్తులకు సర్వీస్ చేశారో,  మెడిసిన్ షెడ్యూల్ ను  నిర్వహించగలరో లేదో, అవసరమైతే భోజనం వండగలరో లేదో,  వైద్య అత్యవసర పరిస్థితిలో సరైన నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం ఉందో లేదో కూడా తెలుసుకోవాలి.  వీల్‌చైర్ లో ఉన్న తల్లిదండ్రుల కోసం  లేదా మంచం నుండి లేవడానికి సహాయం అవసరమయ్యే వారి గురించి పై  విషయాన్ని ముందుగానే చర్చించాలి.   తల్లిదండ్రులను కలవాలి.. కేర్ టేకర్ ను నియమించాలనే నిర్ణయం తీసుకునే ముందు, కేర్ టేకర్ ను తల్లిదండ్రులకు తప్పకుండా పరిచయం చేయాలి. దీనివల్ల తల్లిదండ్రులు, కేర్ టేకర్ ఇద్దరూ  ఒకరితో ఒకరు కంఫర్ట్ గా ఉన్నారో లేదో అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. కొన్నిసార్లు, అనుభవం కంటే ప్రవర్తన , మాట్లాడే విధానం వంటివి ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ప్రతి కేర్ టేకర్ ట్రైనింగ్ తీసుకున్నవారే అయి ఉండరు అనే విషయం  గుర్తుంచుకోవాలి. చాలా మందికి వృద్ధులను చూసుకునే విషయంలో అనుభవం లేదా వైద్య శిక్షణ ఉండదు. అందువల్ల వృద్దులకు  ఇన్సులిన్ ఇవ్వడం, రక్తంలో చక్కెర స్థాయిలను చెక్ చేయడంలో,, గాయానికి కట్టు కట్టడం లేదా ఇతర నర్సింగ్ పనులు అవసరం అయితే.. వాటిని చేసేందుకు వీలుగా నర్సింగ్ శిక్షణ తీసుకున్న వారిని ఎంచుకోవాలి. కుటుంబ భాద్యత.. చాలామంది కేర్ టేకర్ ను నియమిస్తే.. ఇక తల్లిదండ్రుల విషయంలో ఎలాంటి బాధ్యత,   భయం లాంటివి తమకు లేనట్టే అని అనుకుంటారు.  కానీ కేర్ టేకర్ ఉన్నంత మాత్రాన కుటుంబ బాధ్యతలు పూర్తిగా  వదిలేయాలని అర్థం కాదు.. కేర్ టేకర్ తల్లిదండ్రులను సరిగా చూసుకుంటున్నారా లేదా అని చెక్ చేస్తూ ఉండాలి.  కేర్ టేకర్ తమను బాగా చూసుకుంటున్నారా లేదా అని పెద్దలను అడిగి తెలుసుకుంటూ ఉండాలి, అలాగే కొందరు పెద్దవాళ్లు చాదస్తంగా కేర్ టేకర్ లు ఎంత బాగా చూసుకున్నా తృప్తి పడరు. ఇలాంటి పరిస్థితులలో కేర్ టేకర్ ను అర్ఖం చేసుకోవడం,  కేర్ టేకర్ కు మద్దతుగా ఉండటం చాలా ముఖ్యం.                                 *రూపశ్రీ.  
డెంగ్యూ బాధలకు చెక్..వ్యాక్సిన్ వచ్చేసింది..!  వర్షాకాలం వేడి నుండి ఉపశమనం కలిగించినప్పటికీ, వర్షం, నీరు నిలవడం, వరదలు వంటివి  వివిధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ సమయంలో దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం కూడా గణనీయంగా పెరుగుతుంది. ప్రతి సంవత్సరం వర్షాకాలం రాగానే చాలామంది  డెంగ్యూ గురించి  భయపడతారు.  జూలై - అక్టోబర్ నెలల మధ్య ఆసుపత్రులలో డెంగ్యూ రోగుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. డెంగ్యూ సమస్య చాలా తీవ్రంగా మారితే అంతర్గత రక్తస్రావ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది, ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు. ఈ ప్రమాదాల మధ్య, డెంగ్యూ విషయంలో భారతదేశంలో ఒక పెద్ద పురోగతి సాధించబడింది. జపాన్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ టకేడా ఫార్మాస్యూటికల్ అభివృద్ధి చేసిన డెంగ్యూ వ్యాక్సిన్, క్యూడెంగా, భారత ఔషధ నియంత్రణ సంస్థ నుండి ఆమోదం పొందింది. ముఖ్యంగా, భారతదేశంలో ఆమోదం పొందిన మొట్టమొదటి డెంగ్యూ వ్యాక్సిన్ ఇదే. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. భారతదేశంలో డెంగ్యూ వ్యాక్సిన్.. ఇప్పటివరకు  డెంగ్యూకు ఎలాంటి సరైన చికిత్స లేదు.. రోగి లక్షణాలను తగ్గించడానికి సహాయక చికిత్స అందించబడేది.  కానీ ఇప్పుడు వ్యాక్సిన్ ను కనుగొన్నారు.  నివేదికల ప్రకారం నాలుగు రకాల డెంగ్యూ వైరస్‌ల నుండి రక్షణ కల్పించేలా ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. ఇదే  దీనిలో ప్రత్యేకత. అంతేకాకుండా, ఈ వ్యాక్సిన్ ఇచ్చే ముందు డెంగ్యూ వచ్చిందో లేదో పరీక్షించాల్సిన అవసరం ఉండదట.   గత 20 ఏళ్లుగా భారతదేశంలో డెంగ్యూ కేసులు చాలా రెట్లు పెరిగిన కారణంగా ఈ వ్యాక్సిన్ కు  ఆమోదం లభించింది. ప్రతి సంవత్సరం వేలాది మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు , చాలా మంది రోగులను ఆసుపత్రిలో చేర్చవలసి వస్తోంది. సమర్థవంతమైన వ్యాక్సిన్ ఉంటే మంచిదని ఎంతో కాలంగా వైద్యుల నుండి ప్రజల వరకు అందరూ ఎంతో ఎదురుచూశారు.   భారతీయ కంపెనీ బయోలాజికల్-ఇ సహకారంతో టకేడా ఈ వ్యాక్సిన్‌ను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు కూడా ప్రారంభించింది. కుడెంగా టీకా.. కంపెనీ ప్రకారం క్యూడెంగా ఒక టెట్రావాలెంట్ లైవ్-అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్. సులభంగా చెప్పాలంటే, ఈ వ్యాక్సిన్‌ను నాలుగు రకాల డెంగ్యూ వైరస్‌ల నుండి రక్షణ కల్పించేలా రూపొందించారు. ఇందులో బలహీనంగా ఉన్న వైరస్ ఉంటుందట.. దీన్ని శరీరంలో ప్రవేశపెడితే..   శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ వ్యాధిని కలిగించకుండానే వైరస్‌ను గుర్తించి, పోరాడుతుందట.   భారతదేశంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ వ్యాక్సిన్ ను ఆమోదించడం  చాలా మేలైందని అంటున్నారు.  అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, గత రెండు దశాబ్దాలలో భారతదేశంలో డెంగ్యూ కేసులు దాదాపు 11 రెట్లు పెరిగాయి.   టకేడా 2024 సంవత్సరంలో భారతీయ వ్యాక్సిన్ తయారీ సంస్థ బయోలాజికల్-ఇతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, బయోలాజికల్-ఇ ప్రతి సంవత్సరం సుమారు 50 మిలియన్ డోసులను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తుంది.  ఈ దశాబ్దం చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏటా 100 మిలియన్ డోసులను ఉత్పత్తి చేయాలన్న  లక్ష్యాన్ని సాధించడానికి ఇది టకేడాకు సహాయపడుతుందట.                                          *రూపశ్రీ.  
పిల్లలకు కూడా ఆర్థరైటిస్ వస్తుందా.. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త! రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid Arthritis) అనేది పెద్దవారికే వచ్చే వ్యాధి అని చాలామంది అనుకుంటారు. కానీ ఈ సమస్య పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే కీళ్ల నొప్పులు, వాపులు, కదలికల్లో ఇబ్బందులు, ఎదుగుదలపై ప్రభావం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఈ వీడియోలో హోమియోపతి వైద్య నిపుణులు డా. ప్రవీణ్ కుమార్ పిల్లల్లో వచ్చే రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి సులభంగా వివరించారు. ఈ వ్యాధి ఎందుకు వస్తుంది? ప్రారంభ లక్షణాలు ఎలా గుర్తించాలి? ఏ వయస్సు పిల్లలకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది? తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చికిత్సలో ఆలస్యం చేస్తే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? వంటి ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. అలాగే పిల్లలలో కీళ్ల నొప్పి, ఉదయం లేవగానే కీళ్లు బిగుసుకుపోవడం, తరచూ వాపులు రావడం వంటి లక్షణాలను ఎలా గుర్తించాలో కూడా డాక్టర్ వివరించారు. సరైన సమయంలో వైద్యుడిని సంప్రదించడం వల్ల పిల్లల ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో కూడా ఈ వీడియోలో తెలుసుకోండి. పిల్లల ఆరోగ్యం గురించి ప్రతి తల్లిదండ్రులు తప్పకుండా చూడాల్సిన ఉపయోగకరమైన వీడియో ఇది. గమనిక: ఈ వీడియోలో చెప్పిన సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
స్మోకింగ్ మానాలంటే చాలా కష్టంగా ఉందా? ఇలా చేస్తే ఈజీగా మానేయవచ్చు..! ధూమపానం ఆరోగ్యానికి హానికరం.  ఈ విషయాన్ని పేపర్ లు,  టీవీ యాడ్స్ మాత్రమే కాకుండా ఏకంగా  సిగరెట్ ప్యాకెట్ ల పైన కూడా రాసి ఉంటుంది. ఇలా ఎవరు ఎంత చెప్పినా సరే.. చాలామంది స్మోక్ చేయడం మాత్రం మానరు. స్మోకింగ్ వల్ల ఎవరికి ఎంత సమస్య వచ్చినా దాని విషయంలో చాలా బలహీనంగా ఉంటారు. కానీ స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయి, ఆస్తమా, క్షయ,  క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు కూడా కారణం అవుతుంది. కేవలం ధూమపానం చేసేవారికే కాకుండా ఆ పొగను ఇతరులు పీల్చడం వల్ల ఇతరులకు కూడా సమస్య వస్తుంది. అయితే స్మోకింగ్ మానాలని మానలేకపోతున్న వారికి కొన్ని మంచి మార్గాలు ఉన్నాయి.  వాటిని పాటిస్తే స్మోకింగ్ మానేయడం చాలా ఈజీ.. ఆ మార్గాలు ఏెంటో తెలుసుకుంటే.. నిర్ణయం, కట్టుబడి ఉండటం.. ధూమపానం మానేయాలని నిర్ణయించుకుంటే మొదట ఎప్పటి నుండి మానేయాలి అనే విషయాన్ని నిర్ణయించుకోవాలి.  ఈ నిర్ణయం గురించి  కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా చెప్పాలి,  చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలి.  దీని వల్ల ఇతరులకు చెప్పాం కాబట్టి మానెయ్యాలి అనే ఆలోచన కూడా ఉంటుంది. పైగా ఫలానా రోజు నుండి మానేయాలి అని మనసును కూడా సన్నద్ధం చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులు,  స్నేహితులు కూడా ప్రో్త్సహించే అవకాశం ఉంటుంది. కొత్త అలవాట్లు.. ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం, యోగా లేదా వేగంగా నడవడం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా.. కొత్త అభిరుచిని అలవరచుకోవడం లేదా తమను తాము ఏదో ఒక పనిలో  నిమగ్నం చేసుకోవడం  కూడా ధూమపానం చేయాలనే కోరికను తగ్గించడంలో సహాయపడుతుంది. వైద్య సహాయం.. స్మోకింగ్ మానేయడానికి పదేపదే ప్రయత్నించినప్పటికీ  ధూమపానం మానుకోలేకపోతే, వైద్యుడిని లేదా స్మోకింగ్మ మానేయడానికి సహాయపడే నిపుణులను సంప్రదించాలి.  అవసరమైతే వారు నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (NRT), మందులు లేదా కౌన్సెలింగ్‌ను సిఫార్సు చేసే అవకాశం  ఉంటుంది.  వైద్యుడిని సంప్రదించకుండా ఎలాంటి మందులను వాడటం అయితే మంచిది కాదు. 4-డి సూత్రం.. "4-డి" సూత్రం అత్యంత ప్రభావవంతమైన పద్ధతిగా పరిగణించబడుతుంది. స్మౌకింగ్ చేయాలనే కోరికలు కలిగినప్పుడు, వెంటనే చేయకూడదు.. కొద్దిసేపు ఆగాలి, ఎందుకంటే అవి సాధారణంగా ఐదు నిమిషాల్లో తగ్గిపోతాయి, లోతైన శ్వాస తీసుకోవాలి, నీరు త్రాగాలి,  అదే ఆలోచనలో ఉండకుండావేరే పనులలో తమను తాము నిమగ్నం చేసుకోవడం లేదా స్నేహితులతో,  కుటుంబ సభ్యులతో మాట్లాడటం వంటి పనుల ద్వారా మైండ్ డైవర్ట్ చేసుకోవాలి.   స్మోకింగ్ మానడానకి  ప్రయత్నం చేసేటప్పుడు మొదట్లో చాలా కష్టంగా అనిపించవచ్చు.  కానీ పైన చెప్పుకున్నట్టు పాటిస్తూ ఉంటే తొందరలోనే స్మోకింగ్ మానేయవచ్చు.                                       *రూపశ్రీ.