LATEST NEWS
స్థానిక ఎన్నికల వేళ.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలక పరిణామం చోటు చేసుకుంది.  తెలుగుదేశం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ  జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో  మంగళగిరిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో  భేటీ కావడం పొలిటికల్ హీట్ ను ఒక్కసారిగా పెంచేసింది.  ఈ భేటీ కేవలం మర్యాదపూర్వక సమావేశమే అని ఇటు వంగవీటి రాధా, అటు పవన్ కల్యాణ్ చెబుతున్నప్పటికీ..రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వీరిరువురి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.  గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఒకింత జోరు తగ్గించిన వంగవీటి రాధా.. ఉన్నట్టుండి జనసేనానిని తో భేటీ అవ్వడం, అదీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి రగిలిన సమయంలో కలవడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు విజయవాడ  రాజకీయాల్లో పట్టు సాధించే దిశగా కూటమి పార్టీలు అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చ జరిగిందని  అంటున్నారు. అలాగే రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, క్షేత్రస్థాయిలో పార్టీల బలాబలాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురూ ముచ్చటించుకున్నట్లు చెబుతున్నారు.  మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల  వేళ పవన్ కల్యాణ్, వంగవీటి రంగా భేటీ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ స్థానక సమరంలో ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న చర్చ మొదలైంది.  [Pawan Kalyan, Vangaveeti Radha Krishna, AP Local Body Elections, Mangalagiri Camp office, Janasena Party, AP Politics, Telugu One]
ఉద్యోగులను ఉత్సాహపరిచేందుకు ఓ యాజమాన్యం అనుసరించిన సరికొత్త మార్గం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. గిఫ్ట్ బాక్స్‌ల ఎంపిక పేరుతో సిబ్బందిని ఆశ్చర్యపరిచిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.యూఏఈ కేంద్రంగా పనిచేస్తున్న ఓ ప్రముఖ సంస్థలో ఈ వినూత్న వేడుక జరిగింది. సంస్థ వ్యవస్థాపకుడు నిషాద్ హుస్సేన్, మేనేజింగ్ డైరెక్టర్ హసీనా నిషాద్ తమ సిబ్బంది కోసం ఒక ప్రత్యేకమైన బహుమతుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈవెంట్‌లో భాగంగా కార్యాలయ సమావేశ మందిరంలో టేబుల్ నిండా అందంగా ప్యాక్ చేసిన అనేక గిఫ్ట్ బాక్స్‌లను ఉంచారు. ఒక్కో ఉద్యోగి వచ్చి తమకు నచ్చిన పెట్టెను ఎంచుకోవాలని యాజమాన్యం సూచించింది. దీంతో సిబ్బంది ఎంతో ఉత్సాహంగా తమకు ఇష్టమైన బాక్స్‌లను ఎత్తుకున్నారు. వాటిని తెరిచి చూడగా కొందరికి ఖరీదైన ఐఫోన్లు లభించగా, మరికొందరి పెట్టెల్లో సాధారణ చాక్లెట్లు మాత్రమే కనిపించాయి. ఐఫోన్లు వచ్చిన వారి ఆనందానికి అవధులు లేకపోగా, చాక్లెట్లు దక్కిన సిబ్బంది మొహాల్లో కాస్త నిరాశ ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రక్రియ అంతటితో ముగిసిపోతుందని అందరూ భావించారు. అయితే, అక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. ఎండీ హసీనా నిషాద్ రంగంలోకి దిగి, చాక్లెట్లు మాత్రమే వచ్చిన సిబ్బంది వద్దకు స్వయంగా వెళ్లారు. వారికి కూడా సరికొత్త ఐఫోన్లను బహుమతిగా అందజేశారు. మొదట చిన్న బహుమతితో సరిపెట్టుకున్నామని అనుకున్న ఆ సిబ్బందికి ఈ ఊహించని బహుమతి అందడంతో వారి ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. చివరకు అందరి చేతుల్లోనూ ఐఫోన్లు మెరిశాయి. సిబ్బంది శ్రమ, అంకితభావం, ఐక్యత వల్లే కంపెనీ ఈ స్థాయికి చేరుకుందని యాజమాన్యం ఈ సందర్భంగా కొనియాడింది. ఇలాంటి విభిన్న కార్యక్రమాలు ఉద్యోగుల్లో నూతనోత్సాహాన్ని నింపుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులోనూ కార్పొరేట్ సంస్థలు ఇలాంటి సరికొత్త విధానాలను అవలంబించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తమవుతోంది.       [ UAE boss viral video, employees iphone surprise, mystery box gift game, world star holding haseena nishad, teluguone news international, Telugu One, Telugu News ]  
తెలంగాణ రాజకీయ రంగంలో ప్రస్తుతం ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక  హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఈ నియోజకవర్గంలో రాబోయే  ఉపఎన్నికలో కవిత బరిలోకి దిగనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి తెలంగాణ రక్షణ సేన పేర సొంత పార్టీ ఏర్పాటు చేసిన కల్వకుంట్ల కవిత.. ఏకకాలంలో ఇటు రేవంత్ సర్కార్ ను, అటు అధికారంలో ఉండగా బీఆర్ఎస్ వైఫల్యాలనూ ఎండగడుతున్నారు. దీంతో ఖైరతాబాద్ ఉపఎన్నిక బరిలో కల్వకుంట్ల కవిత దిగితే రాజకీయం రసకందాయంలో పడినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఫిరాయింపుల నిరోధక చట్టం కింద దానం నాగేందర్ సభ్యత్వం రద్దు కావడంతో ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది.  ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఈ నియోజకవర్గంలో పాగా వేయడానికి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.  వ్యూహాలను సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రక్షణ సేన అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత రంగంలోకి దిగనున్నారన్న వార్త పొలిటికల్ గా సంచలనంగా మారింది. హైదరాబాద్ మహానగర పరిధిలో  ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడం ద్వారా కల్వకుంట్ల కవిత  రాజకీయాల్లో తన ప్రభావం చాటేందుకు రెడీ అయ్యారంటున్నారు.  అంతే కాకుండా కేసీఆర్ కుమార్తె కవిత టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన తరఫున ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిస్తే, ఈ ఉపఎన్నిక రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ప్రాధాన్యత సంతరించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  గత కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న నాటకీయ పరిణామాలు, కుటుంబ రాజకీయాల నేపథ్యంలో కవిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.  కవిత రంగంలోకి దిగడం అంటూ జరిగితే ఖైరతాబాద్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆమె అభ్యర్థిగా రంగంలో ఉంటే.. అధికార కాంగ్రెస్ కు, ప్రతిపక్ష బీఆర్ఎస్ కూ కూడా గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా, ఆయా పార్టీల విజయావకాశాలపై ప్రభావం పడటం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   [Khairatabad Bypoll, Kavitha Kalvakuntla, Contest,  Danam Nagender disqualification, Telangana politics, Khairatabad assembly constituency, Telangana news, Telugu One]
సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోవర్స్, వ్యూయర్స్ సంపాదించాలనే పిచ్చి నేడు ఎంతోమంది యువతను తప్పుదారి పట్టిస్తోంది. ఏకంగా లైకులు, షేర్ల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా చట్టపరమైన తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా మెదక్ జిల్లాలో వెలుగు చూసిన ఒక సంచలన సంఘటన అందరినీ విస్మయానికి గురిచేసింది. కేవలం ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో తమ ఛానెల్స్‌కు ఫాలోవర్స్ పెంచుకోవాలనే దుర్బుద్ధితో ఇద్దరు యువకులు చేసిన సాహసం చివరికి వారిని కటకటాల వెనక్కి నెట్టింది. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన బండ మధు అనే యువకుడు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతనికి సోషల్ మీడియాలో రీల్స్ చేసే అలవాటు ఉంది.  ఇన్‌స్టాగ్రామ్‌లో ‘అలెగ్జాండర్-విపిన్’ పేరిట, యూట్యూబ్‌లో ‘పవర్ ఆఫ్ మనీ’ పేరిట అకౌంట్లు నిర్వహిస్తున్నాడు. అయితే ఎంత ప్రయత్నించినా తన అకౌంట్లలో ఫాలోవర్స్ పెరగకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఎలాగైనా తన పేజీని వైరల్ చేయాలని భావించిన మధు, తన యజమానితో కలిసి మేడారం వెళ్లిన సమయంలో అక్కడ సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన మావోయిస్టుల లేఖను చూశాడు. ఆ లేఖే అతని ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో 10 మంది మావోయిస్టులకు విధించిన మరణ శిక్షను రద్దు చేయాలనే డిమాండ్‌తో ఒక నకిలీ బెదిరింపు లేఖను సృష్టించాలని పథకం వేశాడు. ఈ వికృత ఆలోచనకు సాంకేతికతను జోడించి, చాట్‌జీపీటీ (ChatGPT) సహాయంతో ఒక మావోయిస్టు బెదిరింపు లేఖను ఇంగ్లీష్ లేదా తెలుగులో తయారు చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ లేఖను ఎర్రటి వస్త్రంపై రాసి, దానిని మరింత ప్రమాదకరంగా మార్చాడు. ఈ నేరంలో అదే గ్రామానికి చెందిన చింతకింది శ్రీధర్ అనే మరో యువకుడిని తనతో కలుపుకున్నాడు. పథకం ప్రకారం ఇద్దరూ కలిసి బైక్‌పై తూప్రాన్‌కు చేరుకున్నారు. అక్కడ స్థానిక మున్సిపల్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ ఆవరణలో ఈ మావోయిస్టు బెదిరింపు లేఖలను ఉంచారు.  అంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్‌లో ఉన్న గార్డ్ గట్టిగా కేకలు వేయడంతో ‘మై ఛత్తీస్‌గఢ్ సే ఆయా’ అంటూ అక్కడి నుంచి భయంతో బైక్‌పై పరారయ్యారు. తాము చేసిన ఈ విద్రోహ చర్యను మరింత ప్రచారం చేసుకోవాలనే దురాశతో, ఆ మావోయిస్టు బెదిరింపు లేఖను మధు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. అనుకున్నట్లుగానే ఆ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అంతేకాకుండా ఆ లేఖను తన స్నేహితులకు కూడా షేర్ చేసి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశాడు.ఈ సంఘటనను అత్యంత సీరియస్‌గా పరిగణించిన మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు, తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దర్యాప్తు చేయగా, ఈ లేఖ రాసింది బండ మధు, చింతకింది శ్రీధర్‌లుగా పోలీసులు నిరూపించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి.  వీరికి మావోయిస్టులతో ఎలాంటి సంబంధాలు లేవని, కేవలం ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో ఫాలోవర్స్, వ్యూయర్స్ పెంచుకోవాలనే ఒక్క ఉద్దేశంతోనే ఈ నకిలీ లేఖ నాటకం ఆడినట్లు తేలింది. నిందితుల నుంచి నేరానికి ఉపయోగించిన బైక్, మొబైల్ ఫోన్లు, రెయిన్‌కోట్, శాలువాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ మీడియా సమావేశంలో వెల్లడించారు. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలాంటి చట్టవిరుద్ధమైన, ప్రమాదకరమైన పనులకు పాల్పడితే జీవితాలు నాశనం అవుతాయని, యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తీవ్రంగా హెచ్చరించారు. ఈ కేసును అత్యంత తక్కువ సమయంలో చేధించి నిందితులను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.          [ Maoist letter Instagram, Medak News, Social Media Followers Risk, Telangana Crime News, Chatgpt Fake letter, Tupran Police arrest,  Telugu One, Telugu News ]  
 ఏపీసీసీ అధ్యక్షురాలు  షర్మిల కుమార్తె   అంజలి రెడ్డి  వివాహ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్ శివారులో  ఘనంా జరిగింది.   అమెరికాలో స్థిరపడిన డాక్టర్ సోమల రఘురామ్ రెడ్డితో అంజలి రెడ్డి వివాహం నిశ్చయమైన విషయం తెలిసిందే. ఈ వేడుకకు రాజకీయాలకు అతీతంగా పలువురు ప్రముఖులు హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు.  అయితే..  ఈ  కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత   జగన్ గైర్హాజరయ్యారు.  గురువారం (సెప్టెంబర్ 24)న  ఈ నిశ్చితార్థ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, పలువురు ప్రముఖ రాజకీయ నేతలు హాజరయ్యారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ నిశ్చితార్థం జరిగింది. అయితే.. సొంత మేనకోడలు నిశ్చితార్థానికి వైఎస్ జగన్ హాజరుకాకపోవడంపై రాజకీయవర్గాలలోనే కాదు.. సామాన్య జనంలో కూడా చర్చ జరుగుతోంది. గతంలో షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థానికి జగన్ దంపతులు హాజరైన సంగతిని పలువురు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. అప్పట్లో కూడా జగన్, షర్మిల మధ్య విభేదాలు ఉన్నాయి. అయినా జగన్ సతీసమేతంగా రాజారెడ్డి వివాహానికి హాజరై సందడి చేశారు. కానీ ఇప్పుడు హాజరు కాకపోవడంతో అప్పటి కంటే జగన్, షర్మిల మధ్య విబేధాలు తీవ్రమయ్యాయా, శుభకార్యానికి కూడా ముఖం చాటేసేంతగా ఇరువురి మధ్యా సంబంధాలు బెడిసాయా అన్న చర్చ జోరుగా సాగుతోంది. నిజంగానే విబేధాలు తీవ్రంగా ఉంటే.. షర్మిల ఇటీవల స్వయంగా జగన్ నివాసానికి వెళ్లి మరీ ఆయనను తన కుమార్తె వివాహ నిశ్చితార్ధం, వివాహానికి రావాలని కోరుతూ శుభలేఖ ఇచ్చి మరీ ఆహ్వానించారు.  షర్మిల స్వయంగా జగన్ ఇంటికి వెళ్లి ఆహ్వానపత్రిక అందచేసిన సందర్భంగా.. అన్నాచెల్లెళ్ల మధ్య రాజకీయ సయోధ్య కుదురుతోందంటూ మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.  అయితే, ఇది   కుటుంబపరమైన ఆహ్వానం మాత్రమేనని, దీనికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని షర్మిల అప్పుడే స్పష్టం చేశారు. రాజకీయాలతో సంబంధం లేకుండా షర్మిల స్వయంగా ఆహ్వానించారు. అలాగే జగన్ కూడా మేనకోడలి నిశ్చితార్ధ వేడుకకు హాజరౌతారని అంతా భావించారు. అయితే జగన్ హాజరు కాకపోవడంతో.. ఇరువురి మధ్యా అంతరం మరింత పెరిగిందనడానికి ఇదే సంకేతమని చెబుతున్నారు.  అదలా ఉంటే.. మేనకోడలి వవాహ వేడుక సమయంలో జగన్ విదేశీ పర్యటకు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకోవడం చూస్తుంటే.. జగన్, షర్మల మధ్య విభేదాలు రాజకీయాలు, ఆస్తుల పంపకం పరిధి దాటి ముందుకు వెళ్లాయని అంటున్నారు.  వైఎస్సార్ కుటుంబంలో గత కొంతకాలంగా ఆస్తులకు సంబంధించి వివాదాలు నడుస్తున్న సంగతి విదితమే తెలిసిందే. ఈ నేపథ్యంలో కుటుంబ వేడుకలకు జగన్ హాజరుకాకపోవడం ఆ వివాదాలు ఇక సయోధ్యకు అవకాశం లేనంతగా ముదిరిపోయాయా అన్న చర్చకు తెరతీశాయి. పరిస్థితులు చూస్తుంటే వైఎస్ కుటుంబం ఒకే వేదికపైకి వచ్చే అవకాశాలు ఇక లేవా అన్న అనుమానాలు కలుగుతున్నాయంటున్నారు.  [YS Sharmila,YS Jagan Mohan Reddy, Anjili Reddy,  Engagementm YSR Family,  Politics, Familt, Disputes, Telugu, One]
ALSO ON TELUGUONE N E W S
సితార ఎంటర్ టైన్ మెంట్ అధినేత నాగవంశీ రీసెంట్ గా సూర్య తో విశ్వనాధ్ అండ్ సన్స్ తో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ధనుష్ తో కూడా అంతకు మించిన విజయాన్ని అందుకోవడానికి సిద్దమవుతున్నాడు.  రీసెంట్ గా ధనుష్, నాగవంశీ కలయికలో తెరకెక్కబోతున్న కొత్త చిత్రం అధికారకంగా స్టార్ట్ అయ్యింది. తమిళంలో 'లబ్బర్ పందు' చిత్రంతో విమర్శకుల ప్రశంసలు పొంది ఘన విజయాన్ని అందుకున్న 'తమిళరసన్ పచ్చముత్తు' ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ వేడుక మధురై సమీపంలోని ప్రముఖ మారనాటు కరుప్పణస్వామి ఆలయ ప్రాంగణంలో అభిమానుల కోలాహలం మధ్య సాంప్రదాయబద్ధంగా జరిగింది. ఆలయంలో పూజా కార్యక్రమాల సందర్భంగా ధనుష్ స్వామివారికి 18 అడుగుల భారీ అరివాళ్ (కొడవలి) సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేయడం సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది.  'పారి వేట్టైక్కు పండకాల్ నట్టాచు' అనే పవర్‌ఫుల్ క్యాప్షన్‌తో గ్రామీణ నేపధ్యంలో సాగే పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుంది.   ఈ పూజా వేడుకలో ప్రసిద్ధ నటుడు ఎస్. జె. సూర్య, వైవిధ్యమైన నటుడు 'ఉరియడి' విజయ్ కుమార్, యువ కథానాయిక ప్రీతి ముకుందన్ మరియు హాస్యబ్రహ్మ వడివేలు పాల్గొని సందడి చేశారు. ముఖ్యంగా గత 15 ఏళ్లుగా ధనుష్, వడివేలు మధ్య ఉన్న విభేదాలు ఈ సినిమాతో తొలగిపోవడం కోలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. కొన్ని శక్తుల వల్లే తమ మధ్య చిన్న దూరం పెరిగిందని, 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఒకే తెరపై ధనుష్‌తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందంటూ వడివేలు వేడుకలో భావోద్వేగానికి గురయ్యారు.   సంచలన సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ స్వరాలు అందిస్తున్న ఈ భారీ చిత్రం 2027 వేసవి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.  ఇది కూడా చదవండి: ఈ రోజు బాలు గారిని తలుచుకోవడం మానవ జన్మకి అవసరం!   ఒకవైపు D56 ప్రారంభోత్సవం జరుగుతుండగానే, ధనుష్ తీసుకున్న మరొక నిర్ణయం చిత్ర పరిశ్రమలో ప్రశంసలు అందుకుంటోంది. రజనీకాంత్ 'జైలర్ 2' అక్టోబర్ 15న విడుదలవుతున్న నేపథ్యంలో, ఆయనపై ఉన్న గౌరవంతో తన 'ఓం: చాప్టర్-1' సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ధనుష్ ప్రకటించడం ఆయన పరిణతిని నిరూపించింది. 18 అడుగుల కత్తి సమర్పణ, 15 ఏళ్ల కలయిక మరియు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్ మేకింగ్‌తో 'D56' చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. శ్రీకర స్టూడియోస్ మరియు ప్రైమ్‌మార్క్ ప్రొడక్షన్స్  బ్యానర్స్ కూడా సహా నిర్మాతలుగా ఉన్నారు. గతంలో ధనుష్‌కు 'సార్' వంటి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఈసారి అంతకు మించి విజయాన్ని అందుకోవాలనే పట్టుదలతో మేకర్స్ ఉన్నారు.   [Dhanush New Movie Pooja Ceremony In Madurai,  Dhanush D56,  Madurai Film Launch, Tamizharasan Pachamuthu, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
Mahesh Babu has finally gone clean-shaven after maintaining his beard for the shoot of SS Rajamouli’s Varanasi. The actor was spotted at the airport in a completely new look while heading out with his wife Namrata Shirodkar for a holiday. During the paparazzi interaction, Mahesh even signed to the person filming that he had no beard. The new look has now added further confirmation to the reports that Mahesh has wrapped up his shooting for Varanasi. Reports surfaced earlier that the actor completed his portion on September 22, and his latest airport appearance has only strengthened those reports. Mahesh had been maintaining the rugged bearded look throughout the shoot, making the clean-shaven appearance significant. With Mahesh’s portions said to be wrapped, the actor has now taken a break and headed out on a holiday with Namrata. Meanwhile, the Varanasi shoot is expected to continue with the remaining portions, as SS Rajamouli gears up to take the ambitious project forward. Priyanka Chopra Jonas and Prithviraj Sukumaran are playing prominent roles in the film. Varanasi is releasing on 7th April 2027, worldwide.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
వీకెండ్ వచ్చిందంటే చాలు.. ఇంట్లోనే కూర్చొని మంచి సినిమా చూసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత థియేటర్లలో మిస్ అయిన సినిమాలను కూడా ఇంటి నుంచే చూసే అవకాశం లభిస్తోంది. ఇక ఈ వారం కూడా పలు కొత్త సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. కామెడీ, హారర్, రొమాన్స్, యాక్షన్.. ఇలా విభిన్న జానర్లలో ఉన్న ఈ సినిమాలు వీకెండ్‌లో ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం. రంభ ఊర్వశి మేనక అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటించిన సోషియో ఫాంటసీ కామెడీ మూవీ ‘రంభ ఊర్వశి మేనక’. దేవలోకం నుంచి భూలోకానికి వచ్చిన రంభ, ఊర్వశి, మేనకల కారణంగా ఓ సాధారణ వ్యక్తి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనే అంశంతో ఈ సినిమా తెరకెక్కింది. అల్లరి నరేష్ తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అగధ హారర్, సూపర్ నేచురల్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ‘అగధ’ ఆసక్తికరమైన ఆప్షన్. ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో నటించారు. ఓ అనుమానాస్పద మరణం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే క్రమంలో మహాదేవి అడవిలోని ఓ రహస్య గుహ వైపు సాగించే ప్రయాణం చుట్టూ కథ తిరుగుతుంది. ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. హాయ్! నయనతార, కవిన్ జంటగా నటించిన తమిళ రొమాంటిక్ డ్రామా ‘హాయ్!’. విష్ణు ఎడవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రేమ, భావోద్వేగాల నేపథ్యంలో సాగుతుంది. నయనతార, కవిన్ కాంబినేషన్‌కు తోడు కథలోని ఎమోషనల్ అంశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రస్తుతం ఈ మూవీ జీ5లో తెలుగుతో పాటు పలు భాషల్లో అందుబాటులో ఉంది. టాక్సిక్ కన్నడ స్టార్ యష్ హీరోగా నటించిన భారీ యాక్షన్ డ్రామా ‘టాక్సిక్’ కూడా ఈ వారమే ఓటీటీలోకి వచ్చింది. స్వాతంత్ర్యం తర్వాతి గోవా నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ ప్రపంచం, అధికారం, కుటుంబ సంబంధాలు, ప్రతీకారం వంటి అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. భారీ యాక్షన్ సన్నివేశాలు, యష్ స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇలా ఈ వారం ఓటీటీలో కామెడీ నుంచి హారర్, రొమాంటిక్ డ్రామా నుంచి భారీ యాక్షన్ వరకు విభిన్న జానర్ల సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో మీకు నచ్చిన జానర్‌ను బట్టి వీకెండ్‌లో ఇంట్లోనే మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆస్వాదించొచ్చు.       [OTT Movies This Weekend, New OTT Releases, OTT Movies September 2026, Rambha Urvasi Menaka, Agadha Movie, Hi Movie, Nayanthara Hi Movie, Toxic Movie, Yash Toxic OTT, Allari Naresh, ZEE5 Movies, Amazon Prime Video, Weekend OTT Movies, Latest OTT Releases]
The much-awaited sequel to Kalki 2898 AD is finally set to move into its next phase, with director Nag Ashwin confirming that the regular shoot will begin this October. Prabhas will join the sets as the team begins the extensive production schedule, with the makers targeting a mid-2027 wrap. The update comes soon after the team of Kalki 2898 AD received two National Film Awards for Wholesome Entertainment and Special Effects. Nag Ashwin and the team recently collected the honours from President Droupadi Murmu, adding further momentum to the sequel’s preparations. Kalki 2 is expected to take the dystopian world established in the first film forward on a much larger scale. The overwhelming response and massive box-office success of Kalki 2898 AD have raised expectations considerably, while the makers are keen to expand the universe without compromising on its visual scale. Amitabh Bachchan and Kamal Haasan, who played pivotal roles in the first part, are also expected to join the shoot subsequently. With the October schedule approaching, the Vyjayanthi Movies production is gearing up for a long and demanding shoot as Nag Ashwin looks to significantly raise the stakes in the sequel. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  కొందరిని తలుచుకోవడం అవసరమే కాదు. మన మానవ జన్మ చరితార్ధతకి ఒక నిదర్శనం కూడా. ఆయనే  గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం. తన అద్భుతమైన స్వరంతో  పాటని ప్రతి తెలుగు వారి ఆరో ప్రాణంగా మార్చిన కారణ జన్ముడు. తెలుగు జాతికి ఎనలేని కీర్తిని, గర్వాన్ని తెచ్చిన  సుస్వర ప్రవాహం. సుమారు ఐదు పదుల కాలం పాటు సాగిన ఆయన సంగీత ప్రయాణంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు ఏకంగా 16 భాషల్లో 50,000 కంటే ఎక్కువ పాటలు పాడి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. ఒకే రోజులో 21 పాటలు రికార్డు చేసి తన అసాధారణ ప్రతిభతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు కూడా. ఇది కూడా చదవండి: వైరల్ మీనింగ్ మార్చేసిన 'జ్యోతి పూర్వాజ్'.. ఆ పిక్స్ వైరల్      ప్రతీ భాషలోనూ అక్కడి మాండలికానికి, భావానికి అనుగుణంగా స్పష్టమైన ఉచ్చారణతో పాడటం ఆయనకే చెల్లింది. అందుకే సంగీత రంగంలో ఎన్నో విజయాలు అందుకున్నారు.  విజయాలు అపారమైనవి. ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఏకంగా 6 జాతీయ చలనచిత్ర అవార్డులను దక్కించుకోవడమే కాకుండా, పదుల సంఖ్యలో నంది పురస్కారాలను మరియు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల గౌరవాలను అందుకున్నారు. భారత ప్రభుత్వం ఆయన అసమాన ప్రతిభను గుర్తించి 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ మరియు ఆయన మరణానంతరం 2021లో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌తో సత్కరించింది. కానీ చావు ఎప్పుడు ఏడుస్తుండే విషయం ఏంటంటే బాలు గారికి చావు లేదని.. ఈ విషయం చావుకే బాగా తెలుసు. 2020 సెప్టెంబర్ 25 న బాలు గారు భువి నుంచి దివికి ఏగారు    [SP Balasubrahmanyam death anniversary, SP Balasubrahmanyam, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
హాలీవుడ్ స్టార్ హీరో జానీ డెప్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా ‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్’ సిరీస్‌లో జాక్ స్పారో పాత్రతో ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. అయితే గత కొంతకాలంగా వ్యక్తిగత వివాదాలు, ఇతర కారణాలతో ఆయన సినిమాల సంఖ్య తగ్గింది. ఇప్పుడు మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. జానీ డెప్ నటించిన ‘డే డ్రింకర్’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. మార్క్ వెబ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జానీ డెప్‌తో పాటు పెనెలోప్ క్రజ్, మాడెలిన్ క్లైన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రైవేట్ యాచ్‌లో బార్‌టెండర్‌గా పనిచేసే యువతి చుట్టూ ఈ కథ మొదలవుతుంది. ఆమెకు అదే యాచ్‌లో ఉండే ఓ మిస్టీరియస్ వ్యక్తి పరిచయం అవుతాడు. ఆ వ్యక్తి పాత్రలోనే జానీ డెప్ కనిపిస్తున్నారు. అతడితో పరిచయం ఏర్పడిన తర్వాత ఆమె జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది. ట్రైలర్‌ను బట్టి చూస్తే జానీ డెప్ పాత్ర చాలా రహస్యంగా ఉంటుంది. అతడి గతం ఏమిటి? యాచ్‌లోకి ఎందుకు వచ్చాడు? అతడికి, పెనెలోప్ క్రజ్ పోషించిన క్రిమినల్ పాత్రకు ఉన్న సంబంధం ఏంటి? అనే విషయాలపై ఆసక్తిని పెంచేలా ట్రైలర్‌ను రూపొందించారు. తన కథ ప్రతీకారానికి సంబంధించినదా.. లేక అంతకంటే ప్రమాదకరమైనదా అనే తరహాలో జానీ డెప్ చెప్పే మాటలు కూడా ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో జానీ డెప్ లుక్ కూడా ప్రత్యేకంగా కనిపిస్తోంది. గతంలో చూసిన పాత్రలకు భిన్నంగా కాస్త వయసు మళ్లిన లుక్‌లో ఆయన కనిపిస్తున్నారు. మరోవైపు పెనెలోప్ క్రజ్‌తో జానీ డెప్‌కు ఇది నాలుగో సినిమా కావడం విశేషం. గతంలో వీరిద్దరూ ‘బ్లో’, ‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్: ఆన్ స్ట్రేంజర్ టైడ్స్’, ‘మర్డర్ ఆన్ ది ఓరియంట్ ఎక్స్‌ప్రెస్’ చిత్రాల్లో కలిసి నటించారు. ‘డే డ్రింకర్’ను దర్శకుడు మార్క్ వెబ్ తెరకెక్కిస్తున్నారు. జాక్ డీన్ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. హారర్, మిస్టరీ, థ్రిల్లర్ అంశాలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. లయన్స్‌గేట్ సంస్థ నిర్మిస్తున్న ‘డే డ్రింకర్’ 2027 మార్చి 26న అమెరికాలో థియేటర్లలో విడుదల కానుంది. జానీ డెప్, పెనెలోప్ క్రజ్ కాంబినేషన్‌తో పాటు మిస్టరీ, క్రైమ్, థ్రిల్లర్ అంశాలతో ఈ సినిమా రూపొందుతుండటంతో హాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ దీనిపై ఆసక్తి నెలకొంది.     [Johnny Depp, Day Drinker, Day Drinker Trailer, Johnny Depp Day Drinker, Day Drinker Movie, Johnny Depp New Movie, Penelope Cruz, Madelyn Cline, Marc Webb, Day Drinker 2027, Hollywood Movies, Johnny Depp Latest Movie, Day Drinker Release Date]
నటీనటులు: రాగ్ మయూర్, అజయ్, మెరిన్ ఫిలిప్, ప్రిన్స్ సెసిల్, రాశి, బ్రహ్మాజీ సాంకేతిక వర్గం: రచన: విమల్ కృష్ణ సంగీతం: శ్రీచరణ్ పాకాల ఛాయాగ్రహణం: ఛోటా కె. నాయుడు, సునీల్ కుమార్ నామ ఎడిటింగ్: ఛోటా కె. ప్రసాద్ దర్శకత్వం: విమల్ కృష్ణ నిర్మాతలు: మేఘా చిలక, రాజీవ్ చిలక, హీరాచంద్ దండ్, విహాన్ దండ్, రాజేష్ కె. జగ్తియాని, స్నేహ రాజేష్ జగ్తియాని, శ్రీచరణ్ మార్నేని విమల్ కృష్ణ తన తొలి చిత్రం డీజే టిల్లు (DJ Tillu) తో విజయవంతమైన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ బ్లాక్‌బస్టర్ తర్వాత ఆయన ఆ ఫ్రాంచైజీకి వెళ్లకుండా, తన తదుపరి చిత్రమైన అనుమాన పక్షి (Anumana Pakshi) చేయడానికి తగినంత సమయం తీసుకున్నారు. రాగ్ మయూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో వివరంగా సమీక్షిద్దాం. కథ: సన్నీ (Rag Mayur) అనుమాన పక్షి అనే అకౌంట్ నడిపే ఒక కంటెంట్ క్రియేటర్. అతిగా ఆలోచించడం, అర్థం లేని భయాల తో బ్రతకడం  వల్ల అతను నిత్యం ట్రోల్ అవుతుంటాడు. అతనికి వర్మ (Prince Cecil) అనే ఒక స్నేహితుడు అలాగే  శత్రువు ఉంటాడు. సన్నీ అనుమానం కారణంగా వర్మ తన ప్రేయసి రమ్యతో బ్రేకప్ చెప్పుకోవాల్సి వస్తుంది. దాంతో రమ్యను తిరిగి తన జీవితంలోకి తీసుకురావాలని వర్మ.. పక్షిని పదే పదే అడుగుతుంటాడు. మరోవైపు, సన్నీ వల్ల స్పా వ్యాపారం దెబ్బతిన్న మరో స్నేహితుడు, తనను కాపాడటానికి కాశ్మీర్ (Kashmir) రావాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తాడు. సన్నీ వర్మతో కలిసి కాశ్మీర్ వెళ్తాడు. అక్కడ అతనికి కన్య (Merin Philip) పరిచయమవుతుంది. ఆమె అతనికి ఒక చాక్లెట్ ఇస్తుంది, అది తిన్నాక అతను ఆమెను ముద్దు పెట్టుకుంటాడు. దీన్ని అవకాశంగా తీసుకుని, ఆమె సన్నీని తన తండ్రి బ్రహ్మోస్ (Brahmaji) దగ్గరకు తీసుకువెళుతుంది. మరోవైపు వాయిస్ ఆఫ్ వైజాగ్ (Vasu - Voice of Vizag) అనే ఇన్‌స్టా పేజీని నడిపే వైజాగ్ పోలీస్ వాసు (Ajay), తన ఘోస్ట్ హంటర్ భార్య సూజి (Raasi)తో కలిసి కాశ్మీర్ వస్తాడు. ఉన్నట్టుండి, సన్నీకి తన మంచం మీద వర్మ శవమై కనిపిస్తాడు. వర్మను ఎవరు చంపారు? కన్య ఎవరు? ఈ మిస్టరీ ఎలా ముగిసింది? అనేది మిగతా కథ. విశ్లేషణ: సన్నివేశాల్లో కాస్తయినా వినోదాన్ని నింపడానికి రాగ్ మయూర్ బాగానే శ్రమించాడు. అతని నటన బాగానే ఉన్నప్పటికీ, స్క్రిప్ట్ మాత్రం చాలా పేలవంగా సాగింది. ప్రిన్స్‌కు డీజే టిల్లు తరహా పాత్రే దక్కగా, రాధిక పాత్రను అనుకరించేలా ఉన్న మెరిన్ ఫిలిప్ పాత్ర ఆ స్థాయి ఇంపాక్ట్‌ను క్రియేట్ చేయలేకపోయింది. స్క్రిప్ట్‌లో ప్రేక్షకులను నవ్వించే సత్తా ఎక్కడా కనిపించలేదు. వ్లాగర్ పోలీస్ ఆఫీసర్‌గా అజయ్ , ఘోస్ట్ హంటర్‌గా రాశి పాత్రలకు రాసుకున్న దానికంటే మరింత బలమైన కంటెంట్ అవసరం. సినిమాను నిలబెట్టడానికి వారు ఎంత ప్రయత్నించినా, తెరపై మాత్రం దిక్కుతోచని స్థితిలోనే కనిపించారు. అజయ్ నటనలో ఓవర్ యాక్షన్ ఎక్కువగా కనిపించింది. కథలోని ప్రతి పరిణామం, ప్రతి సన్నివేశం, ప్రతి వన్-లైనర్ శ్రద్ధ పెట్టి రాసినట్లు కాకుండా, ఏదో తేలికగా తీసుకుని రాసినట్లు అనిపిస్తుంది. డీజే టిల్లు తో చాలా పోలికలు ఉన్నప్పటికీ, అందులో టిల్లు క్యారెక్టర్ అద్భుతంగా వర్కౌట్ అయింది. కానీ ఇక్కడ,  ఇంతలా భయపడే వ్యక్తి  ఒక కంటెంట్ క్రియేటర్ అవ్వడం  ఏమాత్రం సహేతుకంగా అనిపించదు. పెరుగుతున్న సోషల్ మీడియా కంటెంట్ కల్చర్, ఇన్‌ఫ్లుయెన్సర్లు కావాలనే తపనపై సెటైరిక్ పంచ్‌లు వేస్తున్నామని మేకర్స్ భావించినప్పటికీ, ఆ జోకులు చాలా చప్పగా తేలిపోయాయి. సన్నివేశాలు ఎంత పేలవంగా, అస్తవ్యస్తంగా మారతాయంటే, డీజే టిల్లు తీసిన దర్శకుడే ఈ సినిమాను తీశాడా అనే సందేహం కలుగుతుంది. శ్రీచరణ్ పాకాల (Sri Charan Pakala) సంగీతం, నేపథ్య సంగీతం కూడా ఎలాంటి మెరుపులు మెరిపించలేకపోయాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా చాలా నిరాశపరుస్తాయి. ప్రతి విభాగంలోనూ విఫలమైన ఈ సినిమా, సాగదీసిన ఒక షార్ట్ ఫిల్మ్‌లా అనిపిస్తుంది. మొత్తంగా, విమల్ కృష్ణ నుంచి వచ్చిన అనుమాన పక్షి ఏమాత్రం గుర్తుంచుకోలేని చిత్రం. పాజిటివ్స్: రాగ్ మయూర్ చెప్పిన కొన్ని వన్-లైనర్స్ నెగెటివ్స్: పేలవమైన రచన నవ్వు రాని వన్-లైనర్స్ గందరగోళ కథనం గుర్తుంచుకోలేని సాంకేతిక విలువలు నాసిరకం ప్రొడక్షన్ డిజైన్ బాటమ్‌లైన్: అనుమానం పెను భూతం కనుక ఈ పక్షి ఎగరడం పూర్తి గా మర్చిపోయింది!    రేటింగ్: 1.5/5   విజ్ఞప్తి : ఈ సమీక్షలో వ్యక్తీకరించిన అభిప్రాయాలు పూర్తిగా సమీక్షకుడి వ్యక్తిగతమైనవి. వీటికి సంస్థ ఎటువంటి బాధ్యత వహించదు. వీటిపై స్పందించే ముందు పాఠకులు తమ విచక్షణను ఉపయోగించగలరు.
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో ‘బాషా’ సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. 1995లో వచ్చిన ఈ సినిమా రజనీకాంత్‌ను మాస్ హీరోగా మరో స్థాయికి తీసుకెళ్లింది. మాణిక్యం అనే సాధారణ ఆటో డ్రైవర్ పాత్రలో కనిపించిన రజనీకాంత్.. తన గతాన్ని బయటపెట్టే సన్నివేశాల్లో చూపించిన స్టైల్, యాక్షన్, డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ రజనీ అభిమానులు ‘బాషా’ను ప్రత్యేకంగా గుర్తుచేసుకుంటారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం తాజాగా మరోసారి చర్చలోకి వచ్చింది. ‘బాషా’ కథకు అసలు ఆలోచన ఒక బాలీవుడ్ సినిమా షూటింగ్ సమయంలో పుట్టిందట. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, గోవిందా కలిసి నటించిన ‘హమ్’ సినిమా షూటింగ్ సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆ సినిమా షూటింగ్ ఊటీలో జరుగుతున్న సమయంలో ముగ్గురు నటులు ఓ సీన్ గురించి చర్చించుకున్నారట. ఆ సీన్‌లో గోవిందా పోలీస్ ఆఫీసర్ కావాలని ప్రయత్నిస్తాడు. అయితే ఇంటర్వ్యూలో అతడిని తిరస్కరిస్తారు. ఆ సమయంలో అమితాబ్ బచ్చన్ పాత్ర రంగంలోకి దిగి తనదైన శైలిలో అధికారులను ఒప్పించేలా మాట్లాడుతుంది. చివరకు గోవిందాకు పోలీస్ ఉద్యోగం వచ్చేలా చేస్తుంది. ఈ ఐడియాను ముగ్గురూ ‘హమ్’ దర్శకుడు ముకుల్ ఎస్. ఆనంద్‌తో పంచుకున్నారట. దర్శకుడికి కూడా సీన్ నచ్చినప్పటికీ.. అది అప్పటి ‘హమ్’ కథకు సరిపోదని భావించి సినిమాలో పెట్టలేదట. అయితే ఆ సీన్ ఆలోచన రజనీకాంత్‌కు మాత్రం బాగా నచ్చింది. కొంతకాలం తర్వాత దర్శకుడు సురేశ్ కృష్ణతో కలిసి ‘అన్నామలై’ సినిమా చేస్తున్న సమయంలో రజనీకాంత్ ఈ విషయాన్ని ఆయనతో చెప్పారట. ఈ ఐడియా తనకు కూడా నచ్చడంతో సురేశ్ కృష్ణ దానిని మరింతగా డెవలప్ చేయాలని భావించారు. ఆ తర్వాత ‘వీరా’ సినిమా పూర్తయిన అనంతరం ఇద్దరూ మరో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే ‘బాషా’ అనే టైటిల్‌ను రజనీకాంత్ సూచించగా.. ఆ ఆలోచన చుట్టూ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. అలా ‘హమ్’లో ఉపయోగించకుండా పక్కన పెట్టిన ఓ సీన్ ఐడియా.. రజనీకాంత్, సురేశ్ కృష్ణ చేతుల్లో ‘బాషా’గా రూపుదిద్దుకుంది. అయితే అసలు ‘హమ్’లోని సీన్‌ను యథాతథంగా ‘బాషా’లో చూపించలేదు. ఆ ప్రాథమిక ఆలోచనకు కొత్త కథను జోడించి మాణిక్యం పాత్రను, అతడి గతాన్ని, కుటుంబ నేపథ్యాన్ని రూపొందించారు. 1995 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బాషా’ భారీ విజయాన్ని అందుకుంది. హింసకు దూరంగా సాధారణ జీవితాన్ని గడిపే ఆటో డ్రైవర్‌గా కనిపించే మాణిక్యం.. పరిస్థితుల కారణంగా తన అసలు గతాన్ని బయటపెట్టాల్సి రావడం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా రజనీకాంత్ కెరీర్‌లోనే ఓ కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయింది.       [Rajinikanth Baasha, Baasha Movie, Rajinikanth Baasha Story, Baasha Hum Connection, Rajinikanth Hum Movie, Amitabh Bachchan Hum, Govinda Hum, Rajinikanth Movies, Baasha Trivia, Baasha Movie Story, Suresh Krissna, Rajinikanth Interesting Facts, Tamil Cinema, Rajinikanth Latest News]
Cast: Rag Mayur, Ajay, Merin Philip, Prince Cecil, Raasi, Brahmaji Crew:  Written by Vimal Krishna Music by Sricharan Pakala Cinematography by Chota K. Naidu, Sunil Kumar Nama Editing by Chota K. Prasad Directed by Vimal Krishna Produced by Megha Chilaka, Rajiv Chilaka, Hirachand Dand, Vihaan Dand, Rajesh K. Jagtiani, Sneha Rajesh Jagtiani, Sricharan Marneni Vimal Krishna made a name for himself as a successful director with his debut film, DJ TIllu. After the blockbuster, he did not return to the franchise but took his time to make his next, Anumana Pakshi. With Rag Mayur in the leading role, the movie released today. Let's discuss about it in detail.    Plot:  Sunny (Rag Mayur) is a content-creator who runs an account, Anumana Pakshi and he gets trolled regularly for his overthinking and irrational fears. He has a close friend and an enemy, Varma (Prince Cecil). His doubt causes break-up of Varma with his love, Ramya. He keeps asking Pakshi to bring her back into his life. Meanwhile, a friend whose Spa business is spoilt by Sunny, asks him to come to Kashmir and save him, threatening he will commit suicide.  Sunny goes to Kashmir with Varma and there he meets Kanya (Merin Philip). She gives him a chocolate that makes him kiss her. Using this as an opportunity, she takes him to her father Bramhos (Brahmaji). Vizag Cop Vasu (Ajay), who runs a insta page Voice of Vizag, comes to Kashmir with his ghost hunter wife, Suji (Raasi). Suddenly, Sunny finds Varma dead in his bed. Who killed him? Who is Kanya? What is end of this mystery? Watch the movie to know more.  Analysis:  Rag Mayur tried hard to infuse some fun into the lazily written one-liners and situations. While his performance is good enough but the script is too bland. Prince had similar role like DJ Tillu and Merin Philip's role that emulates Radhika, did not create similar impact.  Nothing in the script really showcased any potential to tickle the funny bones. Ajay as Vasu, a vlogger Police Officer, and Raasi, as a ghosthunter, needed much more material than handed to them. They just looked clueless trying to put in as much as they can to make it all work. Ajay came across as hamming. Every development, every situation and every one-liner all seem to have been written taking things for granted rather than really putting in an effort. DJ Tillu had a lot of similarities but Tillu character worked big time. Here, a man being so fearful being a content-creator made no sense.  While the makers seem to have thought has they are making sacrastic punches on growing social media content culture and aspiration to become influencers, the jokes just have been bland. The situations just grow so unfunny and random that one wonders if same director made DJ Tillu.  Overall, Anumana Pakshi is a forgettable film from Vimal Krishna and even Sri Charan Pakala music, BGM had no spark. Cinematography and editing are forgettably terrible too. The movie just fails in every aspect and feels like a dragged on short film.  Positives:  Rag Mayur's few one-liners  Negatives:  Lethargic Writing Unfunny one-liners Clumsy narrative Forgettable Technical values Terrible production design   Bottomline: An Unfunny and Forgettable Film   Rating: 1.5/5   Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘కాకా’. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. సాంప్రదాయ పూజా కార్యక్రమాలతో ‘కాకా’ డబ్బింగ్ పనులకు శ్రీకారం చుట్టారు. దేవుని దగ్గర స్క్రిప్ట్ ఉంచి, పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఫొటోలను చిత్రబృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సినిమాలో కీలక పాత్రలో యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ నటిస్తున్నారు. ఆమె అమ్ములు పాప అనే పాత్రలో కనిపించనున్నారు. యాక్షన్‌తో పాటు ఎమోషన్స్ కు ప్రాధాన్యత ఉండేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోంది. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ‘కాకా’ను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13, 2027న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో రిలీజ్ డేట్‌ను టార్గెట్‌గా పెట్టుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేసే పనిలో టీమ్ ఉన్నట్లు తెలుస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి–బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ‘కాకా’పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈసారి ‘కాకా’లో చిరంజీవిని బాబీ ఏ రేంజ్‌లో చూపించబోతున్నారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది కూడా చదవండి:  ‘రంగం’ వెనుక కథ.. ముగ్గురు స్టార్స్ వదులుకున్న బ్లాక్ బస్టర్.! https://x.com/KaakaMovie/status/2103365063264674063       [KAAKA Dubbing Starts, Kaaka Movie Dubbing, Megastar Chiranjeevi, Bobby Kolli, Kaaka Movie, Chiranjeevi Kaaka, Telugu Film News, Telugu News]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుషులనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న ప్రధానమైన సౌందర్య మరియు ఆరోగ్య సమస్య జుట్టు రాలడం. ప్రతిరోజూ నిద్రలేచింది మొదలు దువ్వెన పట్టుకుంటే గుప్పెడు జుట్టు చేతికి రావడం, లేదా స్నానం చేస్తున్నప్పుడు కుళాయి దగ్గర కుప్పలుగా జుట్టు రాలిపోవడం చాలామందిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సాధారణంగా ఒక మనిషికి రోజుకు 50 నుండి 100 వెండ్రుకలు రాలడం అనేది సహజమైన ప్రక్రియే అయినప్పటికీ, అంతకంటే ఎక్కువ మోతాదులో విపరీతంగా రాలిపోతుంటే మాత్రం దానిని తీవ్రమైన హెచ్చరికగా భావించాలి. మారుతున్న జీవనశైలి, విపరీతమైన మానసిక ఒత్తిడి, పోషకాహార లోపం, హార్మోన్ల అసమతుల్యత మరియు రసాయనాలతో కూడిన షాంపూల వాడకం వల్ల వెంట్రుకల కుదుళ్లు బలహీనపడి ఊడిపోతుంటాయి. ఈ జుట్టు రాలే సమస్యకు ఖరీదైన హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ మరియు కెమికల్ ట్రీట్‌మెంట్లు తాత్కాలిక పరిష్కారాన్ని మాత్రమే ఇస్తాయి, కానీ ఆయుర్వేదం చెప్పిన సహజసిద్ధమైన పద్ధతులు జుట్టును కుదుళ్ల నుండి దృఢంగా మార్చి రాలడాన్ని అరికడతాయి. జుట్టు రాలడాన్ని అరికట్టడంలో మరియు కొత్త వెంట్రుకల ఎదుగుదలను ప్రోత్సహించడంలో ఆయుర్వేదంలో  భృంగరాజ్  లేదా గుంటగలగర ఆకు ప్రథమ స్థానంలో నిలుస్తుంది. భృంగరాజ్ ఆకుల రసాన్ని లేదా తైలాన్ని తలకు క్రమం తప్పకుండా పట్టించడం వల్ల తలమాడుకి (Scalp) రక్తప్రసరణ పెరుగుతుంది. దీనివల్ల కేశాల కుదుళ్లకు అవసరమైన పోషకాలు లభించి జుట్టు ఊడటం తక్షణమే తగ్గుతుంది. అలాగే మన ఇళ్లల్లో సులభంగా దొరికే మందార పూలు మరియు మందార ఆకులు జుట్టు సంరక్షణకు గొప్ప ఔషధంగా పనిచేస్తాయి. మందార రేకులు మరియు ఆకులను మెత్తగా నూరి పేస్ట్‌లా చేసి తలకు మాస్క్‌లా వేసుకుంటే, అందులోని అమైనో యాసిడ్లు, విటమిన్ సీ కుదుళ్లను బలోపేతం చేసి వెంట్రుకలు ఒత్తుగా, నల్లగా పెరిగేలా చేస్తాయి. ఆయుర్వేదంలో అమృతంగా భావించే ఆమ్లా లేదా ఉసిరికాయ జుట్టు ఆరోగ్యాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉసిరిలో విటమిన్ సీ మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఎండిన ఉసిరి ముక్కలను కొబ్బరినూనెలో మరిగించి తయారుచేసిన నూనెతో వారానికి రెండుసార్లు తలకు మసాజ్ చేయడం వల్ల తలమాడుపై ఉన్న పొడిబారిన తత్వం మరియు చుండ్రు శాశ్వతంగా నివారించబడతాయి. అలాగే కుంకుడుకాయలు, సీకాకాయ్ మిశ్రమంతో తలస్నానం చేయడం వల్ల వెంట్రుకల సహజమైన తత్వానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా కెమికల్స్ లేని స్వచ్ఛమైన క్లీన్సింగ్ లభిస్తుంది. కేవలం బాహ్య సంరక్షణ మాత్రమే కాకుండా, ఆహారంలో సైతం తగిన మార్పులు చేసుకోవాలని ఆయుర్వేద నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రతిరోజూ ఆహారంలో ప్రోటీన్లు, ఐరన్ మరియు జింక్ ఎక్కువగా ఉండే కరివేపాకు, బాదం, నువ్వులు, మొలకెత్తిన విత్తనాలు మరియు ఆకుకూరలు తీసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లు అంతర్గతంగా బలపడతాయి. మానసిక ఒత్తిడి కూడా జుట్టు రాలడానికి 40 శాతానికి పైగా కారణమవుతుంది కాబట్టి, రోజూ యోగా, ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి జుట్టు పెరుగుదల మెరుగవుతుంది. ఈ ఆయుర్వేద నియమాలను మీ రోజువారీ జీవితంలో భాగం చేసుకుంటే అతి తక్కువ సమయంలోనే విపరీతమైన జుట్టు రాలడానికి చెక్ పెట్టి ఒత్తైన, నల్లని, దృఢమైన కేశాలను మీ సొంతం చేసుకోవచ్చు.     [ Hair Fall, Hair Growth, Bhringraj, Hibiscus, Amla, Ayurvedic Hair Care, Scalp Health, Dandruff, Hair Nutrition, Stress Management ]  
తీరిక లేని ఆధునిక జీవనశైలిలో మనలో చాలామంది సమయాభావం వల్ల లేదా అలవాటు ప్రకారం భోజనం చేసిన వెంటనే స్నానానికి వెళ్తుంటారు. ముఖ్యంగా ఉదయం ఆఫీసులకు, కళాశాలలకు త్వరత్వరగా వెళ్లే క్రమంలో లేదా రాత్రి వేళల్లో ఆలస్యంగా ఇంటికి వచ్చి భోజనం ముగించిన వెంటనే శరీరం చల్లబడటానికి స్నానం చేయడం చాలా ఇళ్లల్లో సాధారణ దృశ్యంగా మారింది. అయితే, ఈ చిన్న అలవాటు మన జీర్ణవ్యవస్థపై మరియు మొత్తం ఆరోగ్యంపై ఎంతటి ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం వల్ల శరీరంలో అంతర్గతంగా జరిగే జీవక్రియల సమతుల్యత తీవ్రంగా దెబ్బతింటుందని ఆయుర్వేద శాస్త్రంతో పాటు ఆధునిక వైద్య నిపుణులు కూడా గట్టిగా హెచ్చరిస్తున్నారు. మనం ఆహారాన్ని స్వీకరించిన వెంటనే మన శరీరం దానిని జీర్ణం చేయడానికి ఒక ప్రత్యేకమైన ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఆయుర్వేదంలో దీనిని  జఠరాగ్ని  లేదా జీర్ణశక్తి అని పిలుస్తారు. మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవ్వడానికి కడుపులోని పాచక రసాలు మరియు ఎంజైమ్‌లు సమర్థవంతంగా పనిచేయాలి. దీని కోసం మన గుండె పొట్ట, ప్రేగుల భాగాలకు రక్తప్రసరణను గణనీయంగా పెంచుతుంది. సాధారణంగా భోజనం చేసిన తర్వాత శరీరంలోని రక్తంలో దాదాపు 70 శాతం వరకు జీర్ణవ్యవస్థ వైపు మళ్లించబడుతుంది. దీనివల్ల కడుపు భాగంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది, ఈ ఉష్ణోగ్రతే ఆహారాన్ని వేగంగా కరిగించడానికి సహాయపడుతుంది. అయితే, భోజనం ముగించిన వెంటనే మనం స్నానం చేసినప్పుడు శరీరంలో ఒక రకమైన థర్మల్ షాక్ లేదా ఉష్ణోగ్రత వైరుధ్యం ఏర్పడుతుంది. మన శరీరంపై నీరు పడగానే, చర్మం యొక్క ఉష్ణోగ్రత హఠాత్తుగా తగ్గిపోతుంది. ఈ పరిస్థితిలో శరీరం తన బాహ్య చర్మ ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడం కోసం లేదా చలిని తట్టుకోవడం కోసం కడుపు భాగంలో ఉన్న రక్తాన్ని చేతులు, కాళ్లు మరియు చర్మం ఉపరితలానికి వేగంగా తరలిస్తుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థకు అందాల్సిన రక్తప్రసరణ హఠాత్తుగా తగ్గిపోతుంది. దీనివల్ల కడుపులో ఉన్న జఠరాగ్ని చల్లబడి, ఆహారం జీర్ణమయ్యే వేగం 50 శాతం కంటే ఎక్కువ మందగిస్తుంది. ఇలా జీర్ణక్రియ నెమ్మదించడం వల్ల కడుపులో ఆహారం సరిగ్గా అరగక ఉండిపోతుంది. దీనివల్ల తీవ్రమైన కడుపు ఉబ్బరం, గ్యాస్, యాసిడ్ రిఫ్లక్స్ (కడుపులో మంట), మరియు అజీర్తి వంటి సమస్యలు తక్షణమే తలెత్తుతాయి. అంతేకాకుండా, జీర్ణం కాని ఆహారం ప్రేగులలో ఎక్కువ సమయం నిల్వ ఉండటం వల్ల అది పులిసిపోయి శరీరంలో విషపదార్థాలు (ట్రాక్సిన్లు) విడుదలవడానికి కారణమవుతుంది. క్రమంగా ఇది దీర్ఘకాలికంగా మలబద్ధకం, కడుపులో అల్సర్లు మరియు జీర్ణకోశ వ్యాధులకు దారితీస్తుంది. వేడి నీటితో స్నానం చేసినా లేదా చల్లటి నీటితో స్నానం చేసినా ఈ ప్రమాదం వర్తిస్తుంది. చల్లటి నీటి స్నానం రక్తనాళాలను సంకోచింపజేస్తే, వేడి నీటి స్నానం రక్తనాళాలను విస్తరింపజేసి రక్తాన్ని చర్మానికి ఎక్కువ మళ్లిస్తుంది. వైద్య నిపుణుల సలహా ప్రకారం, భోజనం చేసిన తర్వాత కనీసం 30 నుండి 45 నిమిషాల వరకు స్నానం చేయకుండా ఆగడం చాలా ముఖ్యం. ఈ సమయం జీర్ణక్రియ ప్రాథమిక దశ పూర్తికావడానికి మరియు రక్తం కడుపు భాగంలో సక్రమంగా పనిచేయడానికి సరిపోతుంది. ఒకవేళ మీరు తప్పనిసరిగా స్నానం చేయాలనుకుంటే, స్నానం చేసిన తర్వాతే భోజనం చేయడం అత్యంత శ్రేయస్కరం. స్నానం చేసినప్పుడు శరీరం ఉత్తేజితమై, జీర్ణక్రియకు సిద్ధంగా ఉంటుంది. కాబట్టి మీ జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండాలంటే మరియు గుండెపై అనవసర ఒత్తిడి పడకుండా ఉండాలంటే భోజనం తర్వాత వెంటనే స్నానం చేసే అలవాటును ఇప్పుడే మానుకోండి.     [ Bath After Eating, Digestion, Digestive Health, Ayurveda, Jatharagni, Blood Circulation, Acid Reflux, Indigestion, Bloating, Healthy Habits ]
నేటి ఆధునిక ప్రపంచంలో ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా నాన్  వెజ్ ప్రియులు ప్రతిరోజూ తమ ఆహారంలో మాంసాహారాన్ని భాగం చేసుకుంటున్నారు. అయితే,  మాంసాహారం తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా.  అనే ప్రశ్న చాలా కాలంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై అంతర్జాతీయ నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరియు క్యాన్సర్ పరిశోధనా సంస్థలు జరిపిన సమగ్ర అధ్యయనాలలో అనేక దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. రోజూ తీసుకునే మాంసాహార రకం, దానిని వండే పద్ధతి మరియు తీసుకునే మోతాదు ఆధారంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు మారుతాయని ఈ పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC) నివేదికల ప్రకారం, ప్రాసెస్ చేసిన మాంసం (Processed Meat) అంటే హామ్‌స్, సాసేజ్‌లు, బెకన్, హాట్ డాగ్స్ వంటి వాటిని  గ్రూప్ 1 కార్సినోజెన్  (Group 1 Carcinogen) గా వర్గీకరించారు. అంటే ధూమపానం లేదా పొగాకు వాడకం లాగే ప్రాసెస్డ్ మీట్ కూడా మానవులలో క్యాన్సర్‌కు స్పష్టమైన కారణమవుతుందని ఆధారాలు ఉన్నాయి. ప్రతిరోజూ కేవలం 50 గ్రాముల ప్రాసెస్ చేసిన మాంసాహారాన్ని తినడం వల్ల కొలొరెక్టల్ క్యాన్సర్ (ప్రేగు క్యాన్సర్) వచ్చే ప్రమాదం ఏకంగా 18 శాతం పెరుగుతుందని శాస్త్రీయంగా నిరూపించబడింది. ఈ ప్రాసెస్డ్ మాంసంలో రుచి, రంగు మరియు నిల్వ కాలం పెంచడానికి వాడే సోడియం నైట్రేట్, నైట్రైట్స్ వంటి రసాయనాలు జీర్ణక్రియలో అత్యంత ప్రమాదకరమైన నైట్రోసో సమ్మేళనాలుగా మారి ప్రేగుల కణజాలాన్ని దెబ్బతీస్తాయి. మరోవైపు, రెడ్ మీట్ అంటే మేక, గొర్రె, పంది, ఎద్దు వంటి జంతువుల మాంసాన్ని IARC  గ్రూప్ 2A కార్సినోజెన్  (Group 2A Carcinogen) వర్గంలో చేర్చింది. అంటే ఇది మానవులలో క్యాన్సర్ కలిగించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రతిరోజూ 100 గ్రాముల రెడ్ మీట్ తీసుకోవడం వల్ల ప్రేగు క్యాన్సర్ ప్రమాదం 17 శాతం వరకు పెరుగుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. రెడ్ మీట్‌లో సహజంగా ఉండే  హీమ్ ఐరన్  (Heme Iron) కణాలలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను పెంచి, డిఎన్‌ఏను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది క్రమంగా ప్రేగులు, ప్రోస్టేట్ మరియు ప్యాంక్రియాటిక్ (క్లోమం) క్యాన్సర్లకు దారితీస్తుంది. మాంసం రకమే కాకుండా, దానిని మనం వండే పద్ధతి కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని నిర్ధారిస్తుంది. మాంసాహారాన్ని డైరెక్ట్ మంటపై బొగ్గులపై కాల్చడం (Barbecue/Grilling), అధిక ఉష్ణోగ్రత వద్ద సుదీర్ఘకాలం వేయించడం (Deep Frying) లేదా మాడిపోయేలా వండడం వల్ల అందులో హెటెరోసైక్లిక్ అమైన్లు (HCAs), పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు (PAHs) అనే అత్యంత విషపూరితమైన రసాయనాలు ఉత్పన్నమవుతాయి. ఈ రసాయనాలు మానవ శరీరంలోని డిఎన్‌ఏ నిర్మాణంలో ఉత్పరివర్తనలు (Mutations) తీసొచ్చి క్యాన్సర్ కణాల ఉత్పత్తికి బీజం వేస్తాయి. అయితే మాంసాహారం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని, సరైన జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాన్ని చాలావరకు తగ్గించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. వారానికి 350 నుండి 500 గ్రాముల కంటే ఎక్కువ రెడ్ మీట్ తినకూడదని, ప్రాసెస్డ్ మీట్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. రెడ్ మీట్‌కు ప్రత్యామ్నాయంగా చికెన్, చేపలు, కోడిగుడ్లు వంటి వైట్ మీట్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదం ఉండకపోగా, శరీరానికి మేలు జరుగుతుంది. అలాగే మాంసంతో పాటు ప్రతిరోజూ పీచు పదార్థం (Fiber) ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు మరియు విటమిన్ సీ ఉండే పండ్లు తీసుకోవడం వల్ల ప్రేగుల్లో క్యాన్సర్ కారక రసాయనాల ప్రభావం తగ్గుతుంది. ఆరోగ్యకరమైన వంట పద్ధతులు పాటించడం, మసాలాలు తగ్గించడం ద్వారా ఆరోగ్యంగా ఉంటూ మాంసాహారాన్ని ఆస్వాదించవచ్చు.     [ Processed Meat, Red Meat, Cancer Risk, Colorectal Cancer, IARC, WHO, Group 1 Carcinogen, Heme Iron, HCAs, PAHs ]  
రోజువారీ జీవితంలో గంటల తరబడి ఒకే చోట కూర్చొని పనిచేయడం లేదా కంప్యూటర్, మొబైల్ ఫోన్లు ఎక్కువగా వాడటం వల్ల మెడ పట్టుకుపోవడం, మెడ నొప్పి రావడం సాధారణంగా మారిపోయింది. ఈ నొప్పి తీవ్రమైతే కొందరిలో సర్వైకల్ పెయిన్ రూపంలో ఇబ్బంది పెడుతుంది. ఇలాంటి సమయంలో మెడ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది సొంత వైద్యాలు లేదా చిట్కాలు పాటిస్తుంటారు. అందులో   చాలామంది పాటించే ఉపాయం దిండు లేకుండా నిద్రపోవడం. దిండును పక్కన పెడితే మెడ నొప్పి పూర్తిగా తగ్గిపోతుందనే నమ్మకం చాలామందిలో ఉంది. అయితే ఇది నిజమేనా లేదా కేవలం ఒక అపోహ మాత్రమేనా అనే విషయాలను వివరంగా తెలుసుకుంటే.. దిండు లేకుండా నిద్రపోవడం వల్ల మెడ నొప్పి తగ్గిపోతుందా? మెడ నొప్పి తగ్గాలంటే వెంటనే దిండు వాడటం ఆపేయాలని చాలామంది భావిస్తారు. కానీ వైద్య నిపుణుల ప్రకారం ఇందులో ఎలాంటి నిజం లేదు. మన వెన్నుపాము నిర్మాణం పూర్తిగా సూటిగా, నేరుగా ఉండదు. మెడ భాగంలో వెన్నుపాము స్వల్పంగా వంపు తిరిగి ఉంటుంది. నిద్రపోతున్న సమయంలో ఈ వంపుకు సరైన సపోర్ట్ లభించడం చాలా అవసరం. దిండు లేకుండా పడుకున్నప్పుడు ఏం జరుగుతుంది? వెల్లకిలా పడుకున్నప్పుడు  దిండు వాడకపోతే తల వెనుకకు వాలిపోతుంది. దీనివల్ల మెడ భాగంలోనూ, పరుపుకు మధ్య ఖాళీ ఏర్పడుతుంది. ఈ ఖాళీ వల్ల మెడ కండరాలు, లిగమెంట్లపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. మెడ  సహజమైన వంపు చదునుగా మారే ప్రమాదం ఉంది. ఫలితంగా ఉదయం లేచేసరికి మెడ నొప్పి తగ్గకపోగా మరింత ఎక్కువవుతుంది.  ఒక పక్కకు తిరిగి పడుకునే అలవాటు ఉన్నవారికి భుజానికి, మెడకు మధ్య చాలా ఖాళీ ఉంటుంది. దిండు లేకపోతే తల పరుపు వైపు క్రిందికి వంగిపోతుంది. దీనివల్ల మెడ నరాలపై విపరీతమైన ఒత్తిడి పడి నరాలు లాగడం, తీవ్రమైన నొప్పి రావడం జరుగుతుంది. ఇది దీర్ఘకాలిక సర్వైకల్ సమస్యలకు దారితీస్తుంది. సరైన దిండును ఎలా ఎంచుకోవాలి? మెడ నొప్పి తగ్గడానికి దిండును పూర్తిగా మానేయడం పరిష్కారం కాదు, సరైన దిండును ఎంచుకోవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. దిండు మందం చాలా ముఖ్యం. అది మరీ ఎత్తుగా లేదా మరీ పలచగా ఉండకూడదు. నిద్రపోయేటప్పుడు  నొసలు, గడ్డం ఒకే స్థాయిలో సమాంతరంగా ఉండేలా దిండు సహకరించాలి. దిండు బాగా ఎత్తుగా ఉంటే గడ్డం ఛాతీ వైపు ఒంగిపోతుంది. అలాగే దిండు బాగా పలచగా ఉంటే తల వెనుకకు వాలిపోతుంది. ఇవి రెండూ మెడకు హానికరమే. పక్కకు తిరిగి పడుకునే అలవాటు ఉన్నవారు తమ భుజం చివర నుండి మెడ వరకు ఉండే దూరానికి సరిపోయేంత మందం ఉన్న దిండును ఎంచుకోవడం మంచిది. నిద్రపోయే భంగిమతో పాటు సరైన సపోర్ట్ ఇచ్చే దిండును వాడటం ద్వారా మాత్రమే మెడ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. తీవ్రమైన మెడ నొప్పి లేదా నరాల ఒత్తిడి ఉన్నప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోకుండా వైద్యులను సంప్రదించి తగిన సలహా తీసుకోవడం మంచిది.                                                                                                                                                   *రూపశ్రీ.
ఈ మధ్యకాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న తీవ్రమైన ఆరోగ్య సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. అయితే కుటుంబంలో ఎవరికీ క్యాన్సర్ చరిత్ర లేకపోయినా, ఎలాంటి చెడు అలవాట్లు లేకపోయినా సరే కొందరికి ఈ వ్యాధి బారిన పడటం మనం చూస్తూనే ఉంటాం. దీనికి కారణం మనం రోజువారీ జీవితంలో, ముఖ్యంగా మన వంటింట్లో తెలియకుండా చేసే కొన్ని పొరపాట్లు , వంటల్లో వాడే కొన్ని పదార్ధాలే కారణమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన కిచెన్ లో ఉండే కొన్ని రకాల ఆహార పదార్థాలు, వాటిని వండే పద్ధతుల వల్ల క్యాన్సర్ కలిగించే కారకాలు (కార్సినోజెన్లు) తయారవుతాయట. వీటి గురించి  తెలుసుకోవడం చాలా అవసరం. ​మన వంటింట్లో క్యాన్సర్ ముప్పును పెంచే ప్రధాన అంశాలు , వాటి వివరాలు తెలుసుకుంటే.. ​అతిగా మాడ్చిన పదార్థాలు (ఆక్రిలమైడ్).. ఆహార పదార్థాలను అధిక ఉష్ణోగ్రత వద్ద అంటే దాదాపు 120 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి చేసినప్పుడు, లేదా మాడిపోయే వరకు వేయించినప్పుడు వాటిలో ఆక్రిలమైడ్ అనే రసాయన కాంపౌండ్ తయారవుతుంది. ఎక్కువగా వేయించిన బంగాళాదుంపలు, మాడిపోయిన దోసలు, పరోటాలు, డార్క్ బ్రౌన్ కలర్ లోకి మారిన బ్రెడ్ టోస్ట్, కొన్ని రకాల బిస్కెట్లలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపులోకి వెళ్ళిన తర్వాత డిఎన్ఏ పై ప్రభావం చూపి జన్యు మార్పులకు కారణమవుతుంది. కాబట్టి వంటలను నల్లగా మాడకుండా దోరగా, గోల్డెన్ కలర్ వచ్చే వరకు మాత్రమే వేయించుకోవడం మంచిది. క్యూబా వేయించిన మాంసాహారం (హెట్రోసైక్లిక్ అమైన్స్).. చికెన్, మటన్, చేపలు వంటి ప్రోటీన్ ఎక్కువ ఉన్న మాంసాహారాన్ని అధిక వేడి మీద ఎక్కువగా వేయించినప్పుడు లేదా గ్రిల్ చేసినప్పుడు ఈ కాంపౌండ్లు ఏర్పడతాయి. చికెన్ లేదా మటన్ ను నల్లగా మాడ్చి తినడం వల్ల ఆరోగ్యానికి తీవ్ర హాని కలుగుతుంది. ​నిప్పులపై నేరుగా కాల్చిన వంటకాలు (పాలోసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్)..  బొగ్గులు లేదా నేరుగా గ్యాస్ మంటపై పెట్టి మాంసాన్ని లేదా ఇతర పదార్థాలను కాల్చినప్పుడు వాటిపై నల్లటి బొగ్గు లాంటి పొర ఏర్పడుతుంది. ఈ రసాయనాలు డిఎన్ఏ నిర్మాణాన్ని దెబ్బతీసి క్యాన్సర్ రిస్క్ ని పెంచుతాయి. ​మళ్లీ మళ్లీ వాడిన నూనె (రిపీటెడ్ కుకింగ్ ఆయిల్):  ఒకసారి వాడిన నూనెను పదే పదే వేడి చేసి వాడటం మన ఇళ్లలో చాలా సాధారణం. కానీ నూనెను పదే పదే మరిగించడం వల్ల అందులో అనేక హానికరమైన ఆక్సిడైజ్డ్ కొవ్వులు, పాలిమర్స్, ఆల్డిహైడ్స్ ఉత్పన్నమవుతాయి. ఇవి శరీరంలోని జీన్స్ స్థాయిలోకి వెళ్లి క్యాన్సర్ కారకాలుగా మారతాయి. నిల్వ ఉంచిన ధాన్యాల్లో బూజు (అఫ్లాటాక్సిన్స్).. వేరుశెనగ పప్పులు, జొన్నలు, సజ్జలు, రైస్, గోధుమలు లేదా పప్పు ధాన్యాలను సరిగ్గా నిల్వ చేయనప్పుడు తేమ చేరి వాటిపై ఆస్పర్జిల్లస్ అనే ఫంగస్ (బూజు) ఏర్పడుతుంది. ఈ ఫంగస్ విడుదల చేసే అఫ్లాటాక్సిన్ అనే విష పదార్థం నేరుగా కాలేయం (లివర్) పై దాడి చేసి, లివర్ క్యాన్సర్ వచ్చేలా చేస్తుంది. కాబట్టి నిల్వ ఉంచే ధాన్యాలను తడి లేకుండా పొడిగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ​ప్రిజర్వ్ చేసిన ఆహారాలు , సాసె లు (నైట్రోజమైన్స్):  ప్యాక్ చేసిన ఆహారాలు, డబ్బాల్లో నిల్వ ఉండే మాంసం, నగ్గెట్స్, వివిధ రకాల సాసెస్ లలో నిల్వ ఉండటానికి కొన్ని రకాల రసాయనాలు, వీటిలో నైట్రేట్స్ ప్రధానమైనవి. ఇవి కడుపులోకి వెళ్లాక నైట్రోజమైన్స్ గా మారి డిఎన్ఏను దెబ్బతీస్తాయి. ​అధికంగా రెడ్ మీట్ తీసుకోవడం: మటన్, బీఫ్, పోర్క్ వంటి రెడ్ మీట్ ను పరిమితికి మించి తరచూ తీసుకోవడం వల్ల కూడా పెద్దపేగు క్యాన్సర్ అయిన కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. ​తాగునీటిలో  ఆర్సెనిక్.. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో (బోర్ నీటిలో) ఆర్సెనిక్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. అలాంటి నీటితో పండించిన బియ్యం లేదా ఆ నీటితో వంట వండటం వల్ల దీర్ఘకాలంలో క్రోమోసోమల్ లోపాలు వచ్చి అనారోగ్యం పాలవుతారు. దీనికి పరిపరిష్కారంగా నీటిని పరిక్షించుకోవడం లేదా రైస్ వండేటప్పుడు ఎక్కువ నీరు పోసి ఉడికించిన తర్వాత గంజి వార్చడం వల్ల ఈ రసాయనాల ప్రభావాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. ​రెడీమేడ్ ప్యాక్డ్ ఫుడ్స్ (ఫ్యూరాన్ కాంపౌండ్స్).. ప్యాక్ చేసిన సీల్డ్ ఫుడ్స్, అధిక వేడి వద్ద స్టెరిలైజ్ చేసిన ఇన్స్టంట్ బేబీ ఫుడ్స్, కప్ నూడుల్స్ వంటి పదార్థాల్లో ఫ్యూరాన్ కాంపౌండ్లు ఉంటాయి. చిన్నపిల్లలకు బయట దొరికే ప్యాక్డ్ సీరియల్స్ కంటే ఇంట్లో ఫ్రెష్ గా తయారుచేసిన ఆహారాన్ని ఇవ్వడమే ఆరోగ్యానికి మంచిది. ​వంటల్లో మద్యం ఉపయోగించడం (అసిటాల్డిహైడ్).. కొందరు బిర్యానీలు, కేకులు లేదా కొన్ని రకాల వంటకాల తయారీలో రుచి కోసం ఆల్కహాల్ వాడుతుంటారు. ఆల్కహాల్ శరీరంలోకి వెళ్లాక అసిటాల్డిహైడ్ గా మారి క్యాన్సర్ కు దారితీసే అవకాశం ఉంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ​ఆహారాన్ని అధిక వేడి మీద నల్లగా మాడిపోయేలా వండకూడదు. వంటగదిలో మంచి గాలి, వెలుతురు ఉండేలా  చూసుకోవడం చాలా ముఖ్యం. గదుల్లో బల్బ్  లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. నూనెను పదే పదే వాడకుండా, నిల్వ పదార్థాలకు దూరంగా ఉంటూ, ఫ్రెష్ గా ఇంట్లో వండుకున్న ఆహారానికి ప్రాధాన్యత ఇస్తే క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.                         *రూపశ్రీ.
పిల్లలు బరువు పెరగడం లేదా ఎత్తు పెరగడంలో ఇబ్బంది పడుతున్నారా? చదువులో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత విషయంలో సమస్యలు ఉన్నాయా? పిల్లల ఎదుగుదలకు అవసరమైన పోషకాలను అందించడంలో కొన్ని గింజలు ఉపయోగపడతాయి. డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ సూచించిన విధంగా బాదం, పిస్తా, జీడిపప్పు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు తీసుకుని ఇంట్లోనే పోషకమైన గింజల పొడిని తయారు చేసుకోవచ్చు. ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకుని విడిగా వేయించి, మెత్తగా పొడి చేసుకుని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ పొడిలో అర టీస్పూన్‌ను 100 మి.లీ. గోరువెచ్చని పాలలో కలిపి పిల్లలకు ఇవ్వవచ్చని డాక్టర్ సూచిస్తున్నారు. ఈ గింజల్లో ఉండే పోషకాలు పిల్లల ఎదుగుదల, ఎముకల ఆరోగ్యం, మెదడు పనితీరు మరియు శారీరక బలానికి తోడ్పడవచ్చు. ఈ 5 గింజల పొడిని ఎలా తయారు చేసుకోవాలి? పిల్లలకు ఎంత మోతాదులో ఇవ్వాలి? పూర్తి వివరాల కోసం ఈ వీడియోను చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)