LATEST NEWS
  తెలుగువన్ ‘వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది. తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన ఈ చర్చలో ‘జమీన్ రైతు’ సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని సమకాలీన రాజకీయ అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకే చర్చ.. అదే నియోజకవర్గాల పునర్విభజన. రాబోయే రోజుల్లో లోక్ సభ సీట్ల సంఖ్య పెరగబోతోందా? అలా పెరిగితే ఏపీ, తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాలకు లాభమా లేక భారీ నష్టమా? ప్రముఖ విశ్లేషకులు డోలేంద్ర ప్రసాద్‌తో 'వాస్తవ వేదిక' ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడైన కీలక అంశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతానికి పట్టం కడుతూ, దక్షిణ భారతాన్ని విస్మరిస్తున్నారన్న వాదనలు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తున్నాయి  చారిత్రక నేపథ్యంలో విభజన చిక్కులు నియోజకవర్గాల విభజన అనేది కేవలం జనాభా ప్రాతిపదికన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని డోలేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. 1971 తర్వాత ఇందిరా గాంధీ హయాంలో సీట్లను స్తంభింపజేయడం వెనుక ఉన్న ఉద్దేశాలను ఆయన వివరించారు. జనాభా నియంత్రణను పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు శిక్ష విధిస్తూ, జనాభాను పెంచుకున్న ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు ఇవ్వడం ప్రజాస్వామ్య విరుద్ధమనే వాదన బలంగా వినిపిస్తోందని రవిశంకర్ ప్రశ్నించారు. ఒకవేళ ఉత్తరాదికి 600 సీట్లు వచ్చి, దక్షిణాదికి కేవలం 200 చిల్లర సీట్లు వస్తే, ఢిల్లీలో దక్షిణాది ఎంపీల వాయిస్ వినిపించదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఫార్ములాపై చర్చ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన 50% జనాభా, 50% జిడిపి (GDP) ప్రాతిపదికన సీట్ల కేటాయింపు ఫార్ములాపై కూడా చర్చ జరిగింది. కేవలం జనాభాను మాత్రమే కొలమానంగా తీసుకోకూడదని, ఆర్థిక అభివృద్ధిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని రేవంత్ చేసిన సూచనలు ఆచరణలో సాధ్యమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు దేశ ఆర్థిక వ్యవస్థకు భారీగా తోడ్పడుతున్నా, రాజకీయ ప్రాతినిధ్యంలో మాత్రం వెనుకబడిపోతున్నదని తెలుగువన్ ఎండీ తెలిపారు. రాజకీయ వ్యూహాలు - చంద్రబాబు వర్సెస్ జగన్ ఈ పునర్విభజన ప్రక్రియలో రాజకీయ పార్టీల పాత్రపై డోలేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2009లో జరిగిన విభజన సమయంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన చాతుర్యంతో వ్యవహరించారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల విషయానికొస్తే, ఈ డీలిమిటేషన్ ప్రక్రియ జగన్ మోహన్ రెడ్డికి కలిసి వచ్చే అవకాశం ఉందని, సాఫ్ట్‌వేర్ అల్గారిథమ్స్ ద్వారా లెక్కలు వేస్తే అది వైసీపీకే మేలు చేస్తుందని విశ్లేషించారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగితే ఈ ప్రమాదాన్ని అడ్డుకోవచ్చని, కానీ లోకేష్ టీమ్ కేవలం అంకెలకు పరిమితమైతే నష్టం తప్పదని అభిప్రాయపడ్డారు. ప్రజా స్పందన మరియు రియల్ టైమ్ రియాక్షన్స్ ఈ చర్చపై సామాన్యుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. "మేము జనాభాను నియంత్రిస్తే మా సీట్లు తగ్గించడం ఏంటి?" అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల హక్కుల కోసం అందరూ ఏకం కావాలని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ వివక్ష అనే పదం మళ్ళీ తెరపైకి రావడం బీజేపీకి దక్షిణ భారత్‌లో సవాలుగా మారేలా కనిపిస్తోంది. మోడీ-అమిత్ షా ద్వయం దక్షిణాదిపై వివక్ష చూపుతోందన్న విమర్శలపై కమలనాథులు ఎలా స్పందిస్తారో చూడాలి. ముగింపు మొత్తానికి నియోజకవర్గాల పునర్విభజన అనేది కేవలం ఎన్నికల ప్రక్రియ మాత్రమే కాదు, ఇది దేశ భవిష్యత్తును, సమాఖ్య స్ఫూర్తిని ప్రభావితం చేసే అంశం. దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధులు ఢిల్లీలో తమ ఉనికిని కాపాడుకుంటారా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.  ఇలాంటి ఆసక్తికర అంశాలపై కంఠంనేని రవిశంకర్, డోలేంద్ర ప్రసాద్‌ల మధ్య జరిగిన పూర్తి స్థాయి చర్చను తెలుగువన్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి  
  కబోది నాయకుల విమర్శల నుండి ఎదిగిన పరిణితి   నారా లోకేష్.  టీడీపీ ప్రధాన కార్యదర్శిగా  పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యతను గత ఎన్నికలకు ముందు స్వచ్ఛందంగా భుజానికి ఎత్తుకుని సాధించిన చూపిన  నిబద్దత గల కార్యదక్షకుడు లోకేష్. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయకత్వ పటిమ విషయంలో కానీ, సమస్యలను దీటుగా ఎదుర్కొని పరిష్కరించగలిగిన పరిణితి విషయంలో కానీ, పార్టీకి అన్నీ తానై దిశా నిర్దేశం చేయగలిగిన సమర్థత విషయంలో కానీ ఎవరికైనా ఏమైనా అనుమానాలుంటే ఆయన యువగళం పాదయాత్రతో అన్ని తొలగిపోయాయి.  సొంత పార్టీయే కాదు, ప్రత్యర్థి పార్టీలు సైతం  నారా లోకేష్ పరిణితి చెందిన నాయకుడనీ, ప్రజాభిమానం చూరగొన్న ప్రజా నాయకుడని అంగీకరించేశాయి. ఆ సమర్థత, ఆ గుర్తింపు ఫలితమే ఇప్పుడు ఆయనకు పార్టీలో ప్రమోషన్ దక్కింది.  అయితే నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి. పొలిటికల్ గా నారా లోకేష్ తొలి పలుకులు కూడా బయటకు రాకూడదన్న ప్రయత్నాలు చాలా గట్టిగా జరిగాయి.  పప్పు అన్నారు. బాడీ షేమింగ్ చేశారు.   హేళన చేశారు. టార్గెట్ చేసి మరీ క్యారెక్టర్ అసాసినేషన్ కు ప్రయత్నించారు. ఇదంతా ఎందుకు చేశారంటే..   పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. అలా నారా లోకేష్ తండ్రి చాటు బిడ్డగా ఉన్నప్పుడే పార్టీ ప్రగతి కోసం తన ఆలోచనలకు పదును పెట్టారు. అలా పదును పెట్టడం ద్వారా వచ్చినవే పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నగదు బదిలీ. దీంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తే తమ ఉనికి ప్రమాదంలో పడుతుందన్న భయంతో ప్రత్యర్థి పార్టీలు.. ఆయనపై సైకలాజికల్ ఎటాక్ ప్రారంభించారు. మానసికంగా ఆయన స్థైర్యాన్ని దెబ్బతీసి రాజకీయాలకు దూరం చేయాలని ప్రయత్నించారు.  ప్రణాళికాబద్ధంగా ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ప్రయత్నించారు. ఆయన చదువు, భాష, ఆహారం, ఆహార్యం ఇలా అన్నిటిపైనా దాడి చేశారు.   అయితే లోకేష్ వెనకడుగు వేయలేదు. ప్రత్యర్థుల విమర్శలను, మాటల దాడులను, హేళనలను ఎదుర్కొంటూ ముందడుగు వేశారు.  మంత్రిగా అభివృద్ధికి చిరునామాగా రాష్ట్రాన్ని మార్చేశారు. ప్రత్యక్ష ఎన్నికలలో తొలి ప్రయత్నంలో పరాజయం పాలైనా కృంగిపోలేదు. పడిలేచిన కెరటంలా ఎదిగారు.     ప్రతికూలతలను దీటుగా ఎదుర్కొని,  సంక్షోభాల్ని అవకాశంగా మల్చుకోవాలన్న తండ్రి చంద్రబాబు మాటల స్ఫూర్తితో  ముందుకు సాగారు. ప్రత్యర్థుల గుండెల్లో సింహస్వప్నంగా నిలిచారు.  2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ  పరాజయం, మంత్రిగా ఉండి కూడా స్వయంగా తాను పరాజయం పాలు కావడం నిజంగానే సంక్షోభం. మరీ ముఖ్యంగా ప్రత్యర్థులు టార్గెట్ చేసి మరీ ట్రోల్ చేస్తున్న లోకేష్ ఆ సంక్షోభాన్నే అవకాశంగా మార్చుకున్నారు.  తెలుగుదేశం పార్టీకి పెద్దగా అవకాశాలు లేని మంగళగిరి స్థానంలో  తొలి ప్రయత్నంలో పరాజయం పాలైనా  వెరవలేదు.  అదే నియోజకవర్గంలో నిలబడి ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నారు.  విపక్షంలో ఉండి   ఒక దీక్ష, ఒక తపస్సు, ఒక యజ్ణంగా తనను తాను మేకోవర్ చేసుకున్నారు. ప్రజా నేతగా ఎదిగారు.  అలాగే యువగళం పాదయాత్ర ద్వారా పార్టీకి భవిష్యత్ నాయకుడన్న నమ్మకాన్ని పార్టీలోనే కాదు ప్రజలలోనూ కలిగించారు.  తండ్రికి తగ్గ తనయుడన్న ప్రశంసలు అందుకున్నారు. అంతే కాదు తండ్రిని మించిన నాయకుడన్న నమ్మకాన్ని పార్టీ శ్రేణుల్లోనూ, ప్రజా బాహుల్యంలోనూ కలిగించారు. ఆ నమ్మకమే, ఆ విశ్వాసమే ఇప్పుడాయనను పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేసింది.   నారా లోకేష్ కు ఈ నాయకత్వం వారసత్వంగా వచ్చినది కాదు. ఆయన కష్టపడి సాధించుకున్నది. తనను తాను ప్రూవ్ చేసుకుని ప్రజలకు దగ్గరవ్వడం ద్వారా సంపాదించుకున్నది. ఇక లోకేశ్ యువగళం పాదయాత్ర తెలుగు రాజకీయాలలో మరో చరిత్ర అనే చెప్పాలి. లోకేష్ పాదయాత్ర ద్వారా  ప్రజలతో మమేకమై, వారి కష్టాలను తెలుసుకుని, కన్నీళ్లు తుడుస్తూ వారిలో భరోసా కల్పించారు. లోకేష్ పాదయాత్ర మొదలైనప్పటి నుంచి అడ్డుకునేందుకు, విచ్ఛిన్నం చేసేందుకు అప్పటి అధికార వైసీపీ పన్నని కుట్రలు, చేయని కుతంత్రాలు లేవు. వాటన్నిటినీ  ప్రజాదరణతో ఎదుర్కొని లోకేష్ ముందడుగు వేసిన తీరు నిజంగా నభూతో నభవిష్యతి. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, నారా చంద్రబాబునాయుడు, ఆ తరువాత జగన్ కూడా పాదయాత్రలు చేశారు. కానీ అప్పట్లో వారికి అధికార పార్టీ నుంచి అడ్డంకులు ఎదురు కాలేదు. కానీ లోకేష్ పాదయాత్ర విషయంలో అలాకాదు. జగన్ సర్కార్ ఆయన తొలి అడుగు వేయక ముందే  అడ్డంకులు సృష్టించింది. జీవో లు జారీ చేసి మరీ పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నించింది. భౌతిక దాడులకు సైతం తెగబడింది. మాట్లాడుతుంటే మైకు లాగేసింది. నిలుచున్న కూర్చీ తీసేసింది.  ప్రచార వాహనాలను సీజ్ చేసింది. అయినా లోకేష్ వెరవలేదు. మండుటెండ, జోరువాన, వణికించే చలిలోనూ నడక ఆపలేదు. నెలల తరబడి కుటుంబానికి దూరంగా రోడ్లపైనే ఉండటం, దుమ్ము ధూళిలో నడవడం, రోజూ వేల మంది పార్టీ నాయకుల్ని, కార్యర్తల్ని ప్రత్యక్షంగా కలవడం, వారు చెప్పిందంతా ఓపిగ్గా వినడం వంటివి లోకేశ్ ని  తమ నాయకుడిగా ప్రజలు ఓన్ చేసుకునేందుకు దోహదపడ్డాయి.  లోకేషా.. పాదయాతా అని ఎగతాళి చేసిన వారే శభాష్ అని   ప్రశంసలు కురిపించారు.   ఇప్పుడు తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేశ్   తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి బంధాన్ని మరింత పటిష్టం చేసి  రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెడతారని అంటున్నారు.  రాబోయే ఎన్నికల నాటికి లోకేశ్ మరింత బలమైన నాయకుడిగా ఎదిగే అవకాశం ఉందని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ హద్దులు దాటిపోయింది. విమర్శ,  వ్యక్తిగత దూషణల మధ్య రేఖ చాలా పల్చగా మారుతోంది. ముఖ్యంగా స్టాండప్ కామెడీ,  సోషల్ మీడియా వేదికలుగా పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ వంటి అగ్ర నాయకుల వ్యక్తిగత జీవితాలను విమర్శల పేరుతో కించపరచడం అనే ఒక  ప్రమాదకరమైన ధోరణికి ప్రబలుతోంది. అనుదీప్ కటికల, రఫీక్ వంటి వ్యక్తులు కామెడీ ముసుగులో చేస్తున్న వ్యాఖ్యలు కేవలం హాస్యం కోసం మాత్రమే కాకుండా, ఒక పథకం ప్రకారం జరుగుతున్న రాజకీయ కుట్రగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగు వన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో  ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు, అనుదీప్, రఫీక్ వంటి వారు స్టాండప్ కామెడీ ముసుగులో చేస్తున్న వికృత వ్యాఖ్యల వెనుక ప్రత్యర్థి రాజకీయ పార్టీల ప్రోత్సాహం ఉందన్నారు.  పవన్ కల్యాణ్, బాలకృష్ణ వంటి నాయకుల ప్రజాదరణను నేరుగా ఎదుర్కోలేక, వారి వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలన్న వ్యూహంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు.   అయితే.. ఈ వ్యూహం తరచుగా దెబ్బతింటోంది. బూమరాంగ్ అవుతోంది.  బాలయ్య,  పవన్ కళ్యాణ్ వంటి నాయకులను వ్యక్తిగతంగా టార్గెట్ చేసినప్పుడు, అది వారి అభిమానులలో ఆవేశాన్ని పెంచడమే కాకుండా, సాధారణ ప్రజల్లో కూడా వారి పట్ల సానుభూతి ఏర్పడడానికే దోహద పడుతోంది.  రాజకీయాల్లో విమర్శలు సిద్ధాంతపరంగా ఉండాలి తప్ప, కుటుంబ సభ్యులను లేదా వ్యక్తిగత విషయాలను లాగడం రాజకీయ సంస్కృతిని భ్రష్టు పట్టిస్తుందని అడుసుమిల్లి అన్నారు.   కమెడియన్ల అరెస్టులు,  పోలీసు చర్యలు ఒకవైపు జరుగుతున్నా, ఈ విద్వేష ప్రసంగాలు ఆగడం లేదు. ఇది సమాజంలో అసహనాన్ని పెంచి, అభిమాన సంఘాల మధ్య ఘర్షణలకు దారి తీస్తోంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావాలనే తపనతో చేసే ఇటువంటి వ్యాఖ్యలు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయి. న్యాయస్థానాలు,  పోలీసు యంత్రాంగం ఇటువంటి విషయాల్లో కఠినంగా వ్యవహరించకపోతే, భవిష్యత్తులో రాజకీయ విమర్శలు పూర్తిగా అభ్యంతరకరమైన వ్యక్తిగత దూషణలుగా మారిపోయే ప్రమాదం ఉందంన్నారు అడుసుమిల్లి.   రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఇటువంటి వివాదాలు ఓటర్ల నిర్ణయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా యువ ఓటర్లు,  మహిళా ఓటర్లు ఇటువంటి వ్యక్తిగత దాడులను అసహ్యించుకుంటారు. ఏ పార్టీ అయితే ఇటువంటి చర్యలను ప్రోత్సహిస్తుందో, ఆ పార్టీకి ప్రజల్లో ప్రతికూలత ఏర్పడుతుంది. భవిష్యత్తులో రాజకీయ పార్టీలు తమ సోషల్ మీడియా విభాగాలను, మద్దతుదారులను నియంత్రించకపోతే, రాజకీయ చర్చలు కేవలం విమర్శలకే పరిమితమై అభివృద్ధి అజెండా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. గౌరవప్రదమైన రాజకీయ వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అడుసుమిల్లి, వైసీపీయుల వ్యాఖ్యలకు ప్రజల నుంచి తీవ్రమైన నిరసన వ్యక్తం అవుతోందని చెప్పారు.     
దేశవ్యాప్తంగా పార్లమెంట్ మరియు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ( ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సాధారణంగా ఈ ప్రక్రియ పట్ల ప్రాంతీయ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తాయనే వాదన ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ మాత్రం   భిన్నంగా స్పందించింది. కేంద్రం ప్రతిపాదించిన ఈ నియోజకవర్గాల పెంపు నిర్ణయాన్ని ఆ పార్టీ స్వాగతించింది.  ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు.   పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.  వాస్తవానికి దక్షిణాదికి చెందిన పలువురు కీలక నేతలు, ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్ వంటి వారు ఈ పునర్విభజన అంశంపై గట్టిగానే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన స్థానాల పెంపు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన వారిలో ఉంది. ఈ నేపథ్యంలో వైకాపా కూడా ఇదే బాటలో నడుస్తుందని అంతా భావించారు. అయితే  సజ్జల చేసిన వ్యాఖ్యలు ఆ అభిప్రాయం తప్పని రుజువు చేశాయి.   కూటమి ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన పార్టీలు ఎలాగూ ఎన్డీయేలో భాగంగా ఉండటంతో అవి ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాయి. అయితే ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా వైసీపీ  కేంద్ర నిర్ణయానికి మద్దతు ప్రకటించడం గమనార్హం.  పరిశీలకులు వైసీపీ స్టాండ్ పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  అమరావతి చట్టబద్ధత నుంచి తీసుకుంటే.. ఆ పార్టీ విధానాలకు, సిద్ధాంతాలకూ వ్యతిరేకంగా ఉన్నా సరే కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయాన్నీ స్వాగతించడం లేదా అభ్యంతరం తెలపకపోవడం వైసీపీ విధానంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ పార్టీ అధినేత కేసుల భయంతోనే కేంద్రానికి వ్యతిరేకంగా గళమెత్తే ధైర్యం చేయడం లేదని అంటున్నారు. 
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుపై  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. పార్లమెంటులో తెలంగాణ ప్రాతినిధ్యాన్ని తగ్గించేలా లేదా రాష్ట్ర గొంతు నొక్కేలా కేంద్రం అడుగులు వేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆమె హెచ్చరించారు.  బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడిన కవిత  మహిళా రిజర్వేషన్ బిల్లు, డిలిమిటేషన్ అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.   మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.  నియోజకవర్గాలను బ్లాంకెట్‌గా 50 శాతం పెంచుతామని చెప్పడం పై కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.  చూడటానికి ఇది సరైన నిర్ణయంలా కనిపించినా తెలంగాణకు, దక్షిణాది రాష్ట్రాలకూ నష్టం జరుగుతుందన్నారు.  బీహార్ లాంటి రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణకు తక్కువ సీట్లు వస్తాయనీ, దీంతో రాష్ట్ర రాజకీయ ప్రాధాన్యం తగ్గే ప్రమాదం ఉందని కవిత అన్నారు. ప్రస్తుతం పార్లమెంట్‌లో తెలంగాణకు 3.13 శాతం ప్రాతినిధ్యం ఉందని గుర్తుచేస్తూ, డిలిమిటేషన్ తర్వాత కూడా అదే శాతం కొనసాగాలని ఆమె డిమాండ్ చేశారు. “అలా కాకపోతే మరో తెలంగాణ ఉద్యమం తప్పదు” అని హెచ్చరించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో కేంద్రం అనుసరిస్తున్న తీరును కవిత దుయ్యబట్టారు.  పునర్విభజన తర్వాత దేశవ్యాప్తంగా సీట్ల సంఖ్య పెరిగినప్పటికీ, ప్రస్తుత నిష్పత్తిని బేస్‌లైన్‌గా తీసుకోవాలని కేంద్రానికి సూచించారు. జనాభా నియంత్రణ పాటించి, అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాలను డీలిమిటేషన్ పేరుతో శిక్షించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టగా కవిత అభివర్ణించారు.   జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరిగితే, అభివృద్ధి చెందిన రాష్ట్రాలు నష్టపోయే ప్రమాదం ఉందని, ఇది ప్రాంతీయ అసమానతలకు దారితీస్తుందన్నారు. 
ALSO ON TELUGUONE N E W S
Nikhil Siddhartha starrer the upcoming period drama Swayambhu, which recently released its latest musical track, Ra Ra Dheevara. Directed by Bharat Krishnamachari and bankrolled by producers Bhuvan and Sreekar, the project also features Samyuktha and Nabha Natesh as the leading ladies. The song is a percussion-driven composition by Ravi Basrur, designed to match the intensity of the film's historical action setting. Ramajogayya Sastry has penned the lyrics, focusing on themes of courage and battlefield valor, while Santhosh Venky provides a strong vocal rendition that maintains the track's steady momentum. Visually, the video offers a clear look at the large production scale mounted by the makers. The set designs and cinematic framing emphasize a grand backdrop appropriate for the genre. The release also highlights Nikhil's visible physical transformation for the role.  His updated body language, intense styling, and overall warrior-like appearance reflect a strong commitment to the character's demands. Overall, the song effectively establishes the ambitious visual and musical tone of the film ahead of its theatrical release.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.    
సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaaram). ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది.  సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ‘మా ఇంటి బంగారం’ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్యా’ విడుదలైంది. పెళ్లి వేడుకల్లో మార్మోగిపోయేలా ఈ సాంగ్ ని మేకర్స్ రూపొందించారు.  (Thassadiya Song) మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్.. ‘తస్సాదియ్యా’ పాటను ఒక ఫర్ఫెక్ట్ పార్టీ నంబర్‌గా మలిచారు. పాటలోని బీట్స్, రిథమ్ ఎంతో ఎనర్జిటిక్‌గా ఉన్నాయి. కేవలం సినిమా పాటగానే కాకుండా.. ఫ్యామిలీ ఫంక్షన్స్, పెళ్లిళ్లలో డ్యాన్స్ చేయడానికి ఈ సాంగ్ మంచి ఆప్షన్ అయ్యేలా ఉంది. ఈ పాటకు రెహమాన్ సాహిత్యాన్ని అందించగా.. చిన్మయి శ్రీపాద, పుణ్య సెల్వ ఆలపించారు.  సమంతకు చిన్మయి వాయిస్ ఎంత బాగా సెట్ అవుతుందో మనందరికీ తెలిసిందే. ఈ పాటలో కూడా చిన్మయి తన గొంతుతో ఒక ప్రత్యేకమైన జోష్ నింపారు.  వీడియో సాంగ్‌లో సమంత ఎంతో హుషారుగా కనిపిస్తున్నారు. ఆమె కనిపించిన తీరు, ఎనర్జిటిక్ స్టెప్పులు, క్లాసీ కొరియోగ్రఫీ అన్నీ కూడా పాటను విజువల్ ట్రీట్‌గా మార్చేశాయి. విజువల్స్ చాలా కలర్‌ఫుల్‌గా, ప్రతి ఫ్రేమ్ నిండుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, సెట్స్ రిచ్‌గా కనిపిస్తున్నాయి. మొత్తానికి ‘తస్సాదియ్యా’ పాట ‘మా ఇంటి బంగారం’ సినిమా ప్రమోషన్లకు కొత్త ఊపునిచ్చింది. సమంత స్క్రీన్ ప్రెజెన్స్, సంతోష్ నారాయణన్ మ్యూజిక్, చిన్మయి గానం వెరసి ఈ పాట ఒక చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ‘ఓ బేబీ’ తరువాత నందినీ రెడ్డి, సమంత కలిసి చేస్తున్న చిత్రం కావడంతో సహజంగానే ఆడియెన్స్‌లో అంచనాలు ఏర్పడతాయి. ఇక రాజ్ నిడిమోరు స్టోరీ, స్క్రీన్ ప్లేని అందిస్తుండటంతో మరింతగా హైప్ ఏర్పడింది. ఈ సినిమాని సమ్మర్ కానుకగా మే 15న విడుదల చేస్తున్నారు.  
అఖిల్ అక్కినేని (Akhil Akkineni) లేటెస్ట్ మూవీ ‘లెనిన్‌’ (Lenin) శరవేగంగా రూపొందుతోంది. మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవ‌ల విడుద‌లైన ఫస్ట్ సాంగ్ ‘వారేవా వారేవా’కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ గా ‘ఎట్టా ఎట్టా..’ అనే సాంగ్ విడుద‌లైంది.  ‘ఎట్టా ఎట్టా’ సాంగ్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. జోష్‌తో నిండిన ఈ డాన్స్ మెలోడీ క్యాచీ బీట్స్, ఎనర్జీతో మెప్పిస్తోంది. అఖిల్, భాగ్యశ్రీ బోర్సే మధ్య కెమిస్ట్రీ ఈ పాటకు హైలైట్. అఖిల్ తన మాస్ స్టెప్స్‌తో అదరగొడుతుంటే, భాగ్యశ్రీ తన చార్మ్‌తో స్క్రీన్‌పై మెప్పిస్తోంది. వీరిద్దరి జోడీ స్క్రీన్ మీద చాలా ఫ్రెష్‌గా కనిపిస్తోంది. త‌న‌దైన సిగ్నేచ‌ర్ హుక్స్‌, బీట్స్‌తో  మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ మాస్ మెలోడీని అద్భుతంగా కంపోజ్ చేశారు. సింగ‌ర్ శ్రీకృష్ణ‌తో క‌లిసి త‌మ‌న్ ఈ పాట‌ను పాడ‌టం విశేషం. భాస్క‌ర‌భ‌ట్ల ట్యూన్‌కు త‌గ్గ‌ట్టు క్యాచీ లిరిక్స్ అందించారు. ప్ర‌తీ ప‌దం వినసొంపుగా లోక‌ల్ ట‌చ్‌తో రొమాంటిక్ స్టైల్లో ఉన్న‌ట్లు అనిపిస్తోంది.  వీడియో సాంగ్‌లో కనిపించే లోకేషన్లు, సినిమాటోగ్రఫీ టాప్ నాచ్‌గా ఉన్నాయి. కలర్ గ్రేడింగ్, సెట్స్ సినిమా మేకింగ్ వాల్యూస్‌ను ప్రతిబింబిస్తున్నాయి. అఖిల్ డాన్స్ మూమెంట్స్ కూడా చాలా గ్రేస్‌ఫుల్‌గా ఉన్నాయి. ఈ సాంగ్ విజువల్స్ చూస్తుంటే, సినిమాలో ఒక క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉండబోతుందని అర్థమవుతోంది. ‘లెనిన్’ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బలమైన భావోద్వేగాలు, ఆకట్టుకునే కథతో పూర్తి ఎంటటైన‌ర్‌గా రూపుదిద్దుకుంటోంది. అంద‌రూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న‌ ఈ చిత్రం జూన్ 26న థియేటర్లలో విడుదల కానుంది. ప్రేక్షకులకు మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా మేక‌ర్స్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు.  అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో మనం ఎంటర్‌ప్రైజెస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున‌, సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.   
"మనం చెట్లను కాపాడితే... చెట్లు మనల్ని కాపాడతాయి" అనే సిద్దాంతంతో చెట్లు నాటడానికే తన జీవితాన్ని అంకితం చేసి, "చెట్ల రామయ్య" అలియాస్ "వనజీవి రామయ్య"గా తన జన్మను ధన్యం చేసుకుని, భారత ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక "పద్మశ్రీ" పురస్కారం పొందిన దరిపల్లి రామయ్య జీవితానికి "వనజీవి రామయ్య" పేరుతో దృశ్యరూపం ఇచ్చారు నూతన నిర్మాత బూసం రవీంద్రనాధ్. "వృక్షో రక్షతి రక్షిత" అనే ట్యాగ్ లైన్ తో నంది అవార్డు గ్రహీత వేముగంటి దర్శకత్వంలో బి. ఆర్. మూవీస్ బ్యానర్ పై  రవీంద్రనాధ్ నిర్మించిన ఈ 40 నిమిషాల నిడివి కలిగిన లఘు చిత్రం... షార్ట్ ఫిలిమ్స్ కేటగిరీలో ఫస్ట్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ గా తెలంగాణ ప్రభుత్వం నుంచి గద్దర్ అవార్డు దక్కించుకుంది. 5 లక్షల నగదు బహుమతి కూడా అందుకుని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టిని ఆకర్షించింది. నిర్మాతగా తన తొలి ప్రయత్నమే ఫలప్రదం కావడంతో... త్వరలో రెండో చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు బూసం రవీంద్రనాధ్. కడప జిల్లాలోని ప్రొద్దుటూరుకు చెందిన రవీంద్రనాధ్ స్వతహాగా స్థిరాస్తి వ్యాపారి. సినిమాలంటే చిన్నప్పటి నుంచి మహా ఇష్టం. ఆ ఇష్టంతోనే "వనజీవి రామయ్య" చిత్రంలో ఒక చిన్న పాత్ర సైతం పోషించారు. ప్రస్తుతం తన రెండో చిత్రం కోసం కథాచర్చలు జరుపుతున్న రవీంద్ర త్వరలో ఈ చిత్రాన్ని సెట్స్ కి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. "వనజీవి రామయ్య"గా టైటిల్ రోల్ తో మెప్పించిన సీనియర్ నటుడు బ్రహ్మాజీతోపాటు ఈ చిత్రం రూపకల్పనలో దర్శకనిర్మాతలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. గద్దర్ అవార్డు అందుకున్న అనంతరం మెగాస్టార్ చిరంజీవి నుంచి సైతం ప్రశంసను పొందడం, అంతకుముందు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనకు నోచుకోవడం తనకు ఎంతో బలాన్నిచ్చాయని రవీంద్రనాధ్ తెలిపారు. చిరంజీవి గారిని కలిసినప్పుడు, "సర్ మీతో "ఠాగూర్" లాంటి సినిమా చేయాలన్నది నా జీవితాశయమని చెప్పినప్పుడు... "గట్టిగా అనుకో. తప్పక నెరవేరుతుంది" అని ఆయన చిరునవ్వుతో స్పందించడం తనకు వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చిందని రవీంద్ర పేర్కొన్నారు.  
The Madras High Court has officially dismissed an appeal filed by actress Tamannaah Bhatia, where she sought ₹1 crore in damages from Power Soaps Limited. The division bench, comprising Justices P. Velmurugan and K. Govindarajan Thilakavadi, upheld a previous 2017 ruling by a single judge that rejected the actor's compensation claim.   The legal dispute originated from an endorsement contract Tamannaah signed with the soap brand in October 2008. The agreement allowed the company to use her images for promotional purposes for exactly one year. However, the actress alleged that Power Soaps Limited continued to feature her photographs on product packaging and advertisements throughout 2010 and 2011 without her consent. She claimed this unauthorized commercial use negatively impacted her professional prospects while she was negotiating with competing brands. Despite these claims, the High Court concluded that the actor failed to provide credible and sufficient evidence to prove that the brand continued using her pictures after the contract expired in October 2009.  The court found the submitted materials, which included product wrappers and internet listings, to be unreliable for establishing continued usage. Consequently, the bench found no grounds to interfere with the earlier judgment, bringing an end to the long-standing legal battle.     Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.      
ప్రముఖ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannaah Bhatia)కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఒక వాణిజ్య ప్రకటనకు సంబంధించిన పరిహారం విషయంలో ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. అసలు వివాదం ఏమిటి? కొన్నేళ్ల క్రితం ‘పవర్ సోప్స్’ (Power Soaps) అనే సంస్థకు తమన్నా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. ఒప్పందం ప్రకారం నిర్ణీత కాలం పాటు ఆమె ఫోటోలను, వీడియోలను ఆ సంస్థ ప్రకటనల కోసం వాడుకుంది. అయితే, సదరు ఒప్పందం గడువు ముగిసిన తర్వాత కూడా ఆ సంస్థ తన ఫోటోలను ప్రకటనల్లో వాడుతూనే ఉందని, ఇది నిబంధనల ఉల్లంఘన అని తమన్నా ఆరోపించారు. దీనివల్ల తన ప్రతిష్ఠకు భంగం కలిగిందని, తనకు రూ.1 కోటి పరిహారం చెల్లించాలని కోరుతూ ఆమె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఏమని తీర్పు ఇచ్చింది? ఈ కేసును విచారించిన మద్రాస్ హైకోర్టు ధర్మాసనం తమన్నా వాదనలతో ఏకీభవించలేదు. ప్రధానంగా రెండు అంశాలను కోర్టు ప్రస్తావించింది: ఆధారాల లేమి: ఒప్పందం ముగిసిన తర్వాత కూడా ఫోటోలను వాడటం వల్ల తమన్నా వ్యక్తిగత లేదా వృత్తిపరమైన గౌరవానికి ఎలాంటి నష్టం వాటిల్లిందో నిరూపించే సరైన ఆధారాలను ఆమె సమర్పించలేకపోయారని కోర్టు అభిప్రాయపడింది. నష్టపరిహారం కోరడం: కేవలం ఒప్పందం ముగిసిన తర్వాత ఫోటోలు వాడారనే కారణంతో భారీ మొత్తంలో పరిహారం కోరడం సమంజసం కాదని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. సెలబ్రిటీ బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ - పాఠాలు సినీ సెలబ్రిటీలు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ చేసుకునేటప్పుడు ఒప్పందాల్లోని ‘యూసేజ్ రైట్స్’ (Usage Rights) గురించి మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ తీర్పు సూచిస్తోంది. ఒప్పంద ఉల్లంఘన జరిగినప్పుడు కేవలం ఆరోపణలు సరిపోవని, దానివల్ల జరిగిన నష్టాన్ని కోర్టులో నిరూపించాల్సి ఉంటుందని ఈ కేసు ద్వారా స్పష్టమైంది. ప్రస్తుతం తమన్నా పరిస్థితి ప్రస్తుతం తమన్నా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఒకవైపు సినిమాలు, మరోవైపు ఓటీటీ సిరీస్‌లతో దూసుకుపోతున్న ఆమెకు, ఈ కోర్టు తీర్పు కొంత నిరాశ కలిగించే విషయమే. అయితే, ఈ తీర్పుపై ఆమె పైకోర్టుకు వెళ్తారా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు.  
  శ్రీకాంత్(srikanth),రమ్యకృష్ణ(Ramyakrishna)అనేక చిత్రాల్లో చేసినప్పటికీ ఆ ఇద్దరి కాంబోలో వచ్చిన 'ఇంగ్లీష్ పెళ్ళాం ఈస్ట్ గోదావరి మొగుడు'(English Pellam East Godavari Mogudu)కి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. 1999 లో సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టగా నేటికీ చూసినా కొత్తగానే ఉంటుంది. ఈ రోజుల్లో పెళ్లి కానీ యువతీ యువకులు ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి డేటింగ్ లో ఉంటున్నారు కదా.. ఆ డేటింగ్ పాయింట్ తోనే ఈ చిత్రం తెరకెక్కింది.  సాంబశివరావు(శ్రీకాంత్) ఈస్ట్ గోదావరిలోని ఒక పల్లెటూరుకి చెందిన సరదా యువకుడు. పొట్ట కొస్తే అక్షరం ముక్క రాదు. కానీ కల్లాకపటం లేని స్వచ్ఛమైన మనిషి. శిరీష (రమ్యకృష్ణ) విదేశాల్లో చదువుకొని వచ్చిన అమ్మాయి. దీంతో అక్కడ ఎక్కువ శాతం మంది ఫాలో అయ్యే అలవాట్లని కలిగి ఉంటుంది. పైగా దూకుడు స్వభావం కలగలిపిన యువతితో పాటు తన మాటే గెలవాలనే మొండి పట్టుదల తన సొంతం.ఆ క్రమంలో మంచి చెడుకి తేడా కూడా తెలియదు. ఇంట్లో వాళ్ళని ఎదిరించి సాంబశివరావు తో డేటింగ్ చేస్తుంది. ప్రపంచం మొత్తం శిరీష చేసేది తప్పని అంటున్నా సాంబశివరావు మాత్రం డేటింగ్ కరెక్ట్ అంటాడు. డేటింగ్ లో తనని పసిపిల్లలాగా కూడా చూసుకుంటాడు. కానీ సాంబశివరావుకి శిరీష యాంటీగా మారుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ. కింద ఉన్న వీడియోలో డేటింగ్ కి సంబంధిచిన సీన్  ఉంది. శ్రీకాంత్ రమ్యకృష్ణ మధ్య వచ్చే ఆ సన్నివేశం తెలుగు వెండితెరపై ఒక అద్భుతమైన  మాస్టర్‌పీస్. అసలు ఈ సినిమా పేరు వినగానే వినోదాత్మకమైన అంశాలు గుర్తుకొస్తాయి. సదరు సన్నివేశం కూడా అదే కోవలోనే సాగినా ప్రేక్షకుల హృదయాలని  బరువుెక్కిస్తుంది.శ్రీకాంత్, రమ్యకృష్ణ పోటీ పడి నటించారు.ఆ కెమిస్ట్రీ సీన్ లోని  డ్రామాని  మరింత పండించింది. మూవీ మొత్తంపై చూసుకుంటే మధ్యతరగతి గోదావరి వ్యక్తిగా, ఆత్మగౌరవానికి మరియు ప్రేమాభిమానాలకు మధ్య నలిగిపోయే భర్త  క్యారక్టర్ లో శ్రీకాంత్ ఒదిగిపోయారు. ఆయన కళ్ళలో కనిపించే ఆవేదన, గొంతులో వణకు సగటు మనిషి పడే సంఘర్షణను ప్రతిబింబిస్తాయి. తనదైన శైలిలో గంభీరమైన నటనను ప్రదర్శించారు. రమ్య కృష్ణ అయితే ఒక ఆధునిక భావాలున్న యువతిగా, ఒక ఆడదానిగా తన తప్పుని తెలుసుకున్నప్పుడు కలిగే పశ్చాత్తాపాన్ని  ఎంతో హుందాగా పలికించారు. కేవలం మాటలతోనే కాకుండా, మౌనంతో కూడా భావాలను పండించడంలో  ఆమె ప్రతిభ స్పష్టంగా కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య  గొడవ మాత్రమే కాదు. సంప్రదాయానికి ,ఆధునికతకు మధ్య జరిగే ఒక భావోద్వేగ యుద్ధం. ఈస్ట్ గోదావరి సంస్కృతిలో ఉండే ఆత్మీయతను, అనుబంధాలను అర్థం చేసుకోవడంలో కలిగే పొరపాట్లు ఎలా ఉంటాయో కూడా మూవీలో చూడవచ్చు. Also read: Anna KOnidela: 15 ఏళ్ళ కన్యూజ్‌కి తెరదించిన అన్నా కొణిదెల.. ఏది ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో సంభాషణలు  నేరుగా హార్ట్ కి తగిలేలా ఉంటాయి. నేటి కాలంలో వస్తున్న యాక్షన్ మరియు థ్రిల్లర్ సినిమాల మధ్య, ఇలాంటి ప్యూర్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమాలు తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటాయి. మురళి మోహన్, బ్రహ్మాజీ, ప్రసాద్ బాబు తదితరులు ముఖ్యమైన క్యారెక్టర్స్ లో కనిపించారు. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, అన్నమయ్య, సింహాద్రి ఫేమ్ దొరస్వామి రాజు నిర్మాత కాగా సురేష్ వర్మ(Suresh Varma)దర్శకుడు. మణిశర్మ స్వరపరిచిన సాంగ్స్ కూడా మెప్పిస్తాయి   
Hyderabad’s cinematic landscape is poised for a significant upgrade with the introduction of the world’s first single-screen Dolby Cinema. Mythri has recently acquired a stake in the Ranga Theater located in Jeedimetla and is currently undertaking extensive renovations to equip the venue with advanced Dolby technology. This ambitious project comes with an estimated investment of Rs.13 to 14 crores, reflecting a substantial commitment to enhancing the local movie-going experience. The revamped theater will feature a 635-seat auditorium. While the screen size will be slightly more compact than multiplex counterparts like Allu Cinemas, it will remain exceptionally large for a single-screen setup. Beyond the technical upgrades, the renovation focuses heavily on patron comfort. The property will include premium seating, modern interiors, improved parking facilities, and dedicated food and beverage counters spread across two floors.  Set to open by the end of this year, the modernized Ranga Theater is strategically positioned to serve film enthusiasts across Jeedimetla, Kukatpally, Suraram, Kompally, and Balanagar. In a related development, Mythri is also revamping the Ganga theater in Dilsukhnagar, signaling a broader push to revitalize standalone cinemas across the city.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.    
నటుడు సందీప్ కిషన్ (Sundeep Kishan), దర్శకుడు కృష్ణ చైతన్య కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'పవర్ పేట' (Power Peta). 70MM ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతోంది. కృష్ణ చైతన్యకు ఇది డ్రీమ్ ప్రాజెక్టు అని చెప్పవచ్చు. అలాంటి సినిమా ఇద్దరు హీరోలను దాటుకొని, ఇప్పుడు ఫైనల్ గా సందీప్ కిషన్ చేతికి వెళ్ళింది. కథా నేపథ్యం ‘పవర్ పేట’ కేవలం ఒక సాధారణ యాక్షన్ సినిమా కాదు. ఇది ప్రేమ, ఆత్మగౌరవం, రాజకీయాల చుట్టూ తిరిగే ఒక ఇంటెన్స్ జోనర్-బ్లెండింగ్ ఫిల్మ్. ఒక సాధారణ వ్యక్తి, శక్తివంతమైన నాయకుడిగా ఎలా ఎదిగాడు అనే ప్రయాణాన్ని దర్శకుడు కృష్ణ చైతన్య ఇందులో ఆవిష్కరించబోతున్నారు. ఈ సినిమా మూడు భాగాలుగా రాబోతుండటం విశేషం. పీరియడ్ సెటప్‌లో సాగే ఈ కథలో సందీప్ కిషన్ విభిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. చెస్ బోర్డుపై గులాబీ పువ్వు, రక్తపు మరకలతో డిజైన్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ ఇంటెన్స్ గా ఉంది. నితిన్ నుంచి సందీప్ కిషన్ వరకు: నిజానికి ఈ ప్రాజెక్ట్ మొదట హీరో నితిన్‌తో ప్రారంభం కావాల్సింది. కొన్ని ఏళ్ల క్రితమే దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కాంబినేషన్ కుదరలేదు. ఆ తర్వాత విశ్వక్ సేన్ పేరు వినిపించినా అదీ పట్టాలెక్కలేదు. ఇప్పుడు అదే శక్తివంతమైన కథను సందీప్ కిషన్ తన భుజానికెత్తుకున్నారు. సందీప్ కిషన్‌కు ఉన్న మాస్ ఇమేజ్, ఆయన నటనకు ఈ ‘పవర్ పేట’ కథ సరిగ్గా సరిపోతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. నిర్మాణ విలువలు: ఈ చిత్రాన్ని 70MM ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సాంకేతికంగా ఈ సినిమాను అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా రస్టిక్ విజువల్స్, సహజ సిద్ధమైన లోకేషన్లలో చిత్రీకరణ జరపనున్నారు. సినిమాలో ప్రతి పాత్రకు ఒక ప్రాముఖ్యత ఉంటుందని, ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగుతుందని దర్శకుడు కృష్ణ చైతన్య ధీమా వ్యక్తం చేశారు.  
The Telugu film industry is increasingly turning to accessible ticket pricing to draw audiences back to theaters. This strategy is currently being tested by actor Thiruveer with his upcoming rural drama, Papam Prathap. With tickets capped around the 100-rupee mark, the trade is closely watching to see if affordability directly translates to box office success. Thiruveer openly stated that while his previous films garnered significant appreciation and viewership on OTT platforms, he is now specifically looking for a definitive theatrical hit. His new film arrives at a time when theater footfalls have become highly unpredictable. The core question remains: does a 100-rupee ticket genuinely secure a hit, or is it merely a supplementary push for strong content? Looking at recent Telugu box office trends, the results are insightful. Films like Little Hearts benefited massively from the 99-rupee ticket strategy, pulling in substantial crowds and generating impressive opening numbers. Conversely, lower prices alone could not salvage other projects that lacked strong word-of-mouth, proving that audiences will not flock to theaters purely for a discount. For Papam Prathap, the reduced pricing lowers the financial burden for families, presenting a clear advantage for its opening weekend. However, as past releases have demonstrated, this affordability only acts as an initial hook. The film’s ultimate theatrical longevity will depend entirely on its narrative strength. If the story genuinely connects with the audience, the 100-rupee ticket could very well give Thiruveer the theatrical breakthrough he needs.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి  జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది.  ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు.  కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని.  ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ ఏదో ఒక గొడవలో మునిగి తేలుతూ ఉంటుంది. అత్తగారు సంతోషంగా , లేకపోతే ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అందుకే అత్తాకోడళ్ల బంధం అంటే.. గొడవలు, పోట్లాటలు, వాదించుకోవడాలతో నిండి ఉంటుంది అనుకుంటారు.  అయితే అత్తాకోడళ్లు  ఒకరినొకరు అర్థం చేసుకుని, అవగాహన, గౌరవం , ఆప్యాయతతో ఉంటేనే అత్తాకోడోళ్ల  బంధం బాగుంటుంది.  ప్రతి అమ్మాయి అత్తగారు తనతో బాగుండాలని కోరుకుంటుంది.  అత్తగారు తన కోడలిని మెచ్చుకోవాలంటే.. కోడలిలో కొన్ని లక్షణాలు ఉండాలని రిలేషన్షిప్ నిపుణులు చెబుతున్నారు.  ఆ లక్షణాలు ఏంటో తెలుసుకుంటే.. మద్దతు.. అత్తమామలకు అండగా నిలబడి, వారికి పూర్తిగా మద్దతు ఇస్తే.. ఆ కోడలిని అత్తగారు ఎంతో ఇష్టపడతారు.  అలా కాకుండా అదే పనిగా గొడవలు చేసుకుని పుట్టింటికి వెళుతూ ఉంటే..  ఏ అత్తగారు కూడాతన కోడలిని ఇష్టపడరట. గొడవలు జరిగినా సరే.. వారి మధ్య మాత్రమే గొడవలు ఉండి, నలుగురిలో అత్తమామలను, భర్తను గౌరవించే కోడలిని అత్తగారు ఎప్పుడూ వదులుకోరు. గౌరవం, మర్యాద..  అత్తమామలకు ఇష్టమైన కోడలిగా ఉండాలనుకుంటే,  గౌరవప్రదంగా ఉండాలి. నలుగురు మెచ్చుకునేలా,  నలుగురిలో హుందాగా, కుటుంబాన్ని నలుగురిలో గొప్పగా చూపించేలా ఉండాలి. ఇది అత్తాకోడళ్ల బంధాన్ని బలంగా మారుస్తుంది. బాధ్యత.. ప్రతి అత్తగారు తన కోడలు ఇంటికి రాగానే అన్ని బాధ్యతలూ తీసుకోవాలని కోరుకుంటుంది.  ఇంటి పనుల పట్ల ఆసక్తి చూపించి,  బాధ్యతలన్నింటినీ చక్కగా నిర్వర్తిస్తే మంచి కోడలు అనిపించుకోగలరట. ప్రేమ, అనుబంధం.. అత్తగారి పట్ల ఒక తల్లిలా ప్రేమ, ఆప్యాయత చూపించాలి. అలా చేయడం వల్ల, ఆమె కోడలిని  మనస్ఫూర్తిగా ఆదరిస్తుంది,  తెలియకుండానే కోడలి పట్ల  ఆమెకు  చాలా ఇష్టం ఏర్పడుతుంది. మనసు విప్పి మాట్లాడటం..  ఏవైనా విషయాల గురించి బాధగా అనిపిస్తే, ఆ సంబంధాన్ని దీర్ఘకాలం పాటు నిలబెట్టుకోవడానికి ఆ క్షణంలోనే మనసు విప్పి మాట్లాడటం  ద్వారా అన్నింటినీ పరిష్కరించుకోవాలి. ఏ సమస్యనైనా మనసులో పెట్టుకోకుండా, సరైన సమయంలో దాన్ని పరిష్కరించుకోవాలి. ఇలా చేస్తే అత్తగారు కూడా కోడలిని బాధపెట్టకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. పైన చెప్పుకున్నవన్నీ పాటించే కోడళ్లు కూడా ఉంటారు. అయినా సరే.. అత్తగారు కోడలిని ఇష్టపడరు. కొందరు అత్తగార్లు.. తమ కోడలిని బాధపెట్టడం, ఏడిపించడం, చులకన చేసి మాట్లాడటం.. ఇవన్నీ తన హక్కుగా భావిస్తూ.. వాటికే అంటిపెట్టుకుని ఉంటారు. ఇలాంటి అత్తగార్ల దగ్గర ఎంత మంచి ప్రవర్తనతో మెలిగినా.. దున్నపోతు మీద వర్షం కురినట్టే అవుతుంది.  కాబట్టి అలాంటి వ్యక్తుల విషయంలో  అత్తగార్లదే తప్పు అవుతుంది కానీ.. కోడళ్లది అసలు తప్పు ఉండదు. మంచి కోడలు అనిపించుకోవడానికి అతిగా బాధలు అనుభవించడం మానితేనే కోడళ్లకు కూడా మంచిది.                                    *రూపశ్రీ.
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు.  అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. కానీ ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే.. చేసే కొన్ని తప్పులు వారికి ఎలాంటి విజయాన్ని ఇవ్వవు అని చెబుతాడు ఆచార్య చాణక్యుడు.  ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త.. వేల సంవత్సరాల కిందటే.. మనిషి వ్యక్తిత్వాన్ని, రాజనీతిని, ఆర్థిక సూత్రాలను ప్రపంచానికి అందించాడు.  అవి ఇవ్పటికీ ప్రజలు ఆచరించే విధంగా ఉన్నాయంటే.. ఆయన ఆలోచన,  ఆయన సిద్దాంతాలు ఎంత గొప్పవో అర్థం చేసుకోవచ్చు. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో.. సమాజంలో ఉండే కొందరు వ్యక్తులను అవమానించడం వల్ల  ఎంతో ఉజ్జ్వలమైన భవిష్యత్తును చీకటిలోకి నెట్టుకున్నట్టు అవుతుందని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఐదుగురు వ్యక్తులను అవమానించడం వల్ల జీవితంలో అసలు విజయాన్ని సాధించలేరని కూడా చెబుతాడు. ఇంతకీ ఎవరిని అవమానించకూడదు? ఎందుకు అవమానించకూడదు? తెలుసుకుంటే.. గురువు.. చాణక్య నీతి ప్రకారం గురువు అత్యున్నత స్థానాన్ని కలిగి ఉంటారు, ఎందుకంటే గురువు  అజ్ఞానమనే చీకటి నుండి జ్ఞానమనే వెలుగులోకి నడిపిస్తాడు. గురువు మనకు అక్షరాస్యతను అందించడమే కాకుండా, జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి ఎలాంటి విలువలు కలిగి ఉండాలో.. ఆ విలువలను నేర్పుతాడు. తమ గురువును లేదా మార్గదర్శకుడిని అగౌరవపరిచిన వారు తమ జ్ఞానాన్ని, విజయాన్ని కోల్పోతారని ఆచార్య చాణక్యుడు చెబుతాడు. తల్లిదండ్రులను.. ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల కంటే గొప్ప శ్రేయోభిలాషులు ఉండరు. తండ్రి కుటుంబానికి రక్షణ కవచం అయితే, తల్లి విలువలకు, ప్రేమకు ప్రతిరూపం. తల్లిదండ్రులకు మానసిక వేదన కలిగించే లేదా వారిని అగౌరవపరిచే పిల్లలు అదృష్టాన్ని, సంతోషాన్ని కోల్పోతారని చాణక్యుడు చెప్పాడు. చాణక్యుని ప్రకారం, పెద్దల కళ్లలో కన్నీళ్లు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ నివసించదట. పండితులు.. చాణక్య నీతి ప్రకారం సమాజంలో అపారమైన అనుభవం, బోలెడు జ్ఞానం ఉన్నవారే పండితులు.  అలాంటి పండితుల సాంగత్యం అమూల్యమైనది. పండితులను ఎగతాళి చేయడం లేదా కించపరచడానికి ప్రయత్నించడం మేధో దారిద్య్రాన్ని ప్రతిబింబిస్తుందని చాణక్యుడు పేర్కొన్నాడు. పండితులను అవమానించడం ద్వారా, సరైన సలహా, మార్గదర్శకత్వం పొందే అవకాశాలను కోల్పోయి, చివరికి పతనానికి గురవుతారట. కష్టపడి పనిచేసేవారు, సేవాభావం గలవారు.. ఆచార్య చాణక్యుడు ఎల్లప్పుడూ కష్టానికి గౌరవం ఇవ్వాలని బోధించారు. పారిశుధ్య కార్మికుడైనా, సెక్యూరిటీ గార్డు అయినా, కూలీ అయినా.. సమాజాన్ని నడిపించడానికి కష్టపడే ప్రతి ఒక్కరూ గౌరవానికి అర్హులు. ఒకరి ఆర్థిక స్థితి లేదా హోదాను బట్టి వారిని అవమానించడం మనిషిలో అహంకారాన్ని ప్రతిబింబిస్తుంది. అటువంటి ప్రతికూల శక్తే  ఉంటే.. అదే వారి దురదృష్టానికి అతిపెద్ద కారణం అవుతుంది. సాధు స్వభావం ఉన్నవారు.. ధర్మం, సత్యం, నైతికత మార్గాన్ని అనుసరించేవారిని అసంతృప్తికి గురిచేయడం, అవమానించడం చాలా తప్పు. సద్గుణ, సత్ప్రవర్తన గలవారు ఎవరికీ కీడు కోరుకోరు, కానీ వారిని అవమానించడం జీవితంలోని సానుకూల శక్తిని నాశనం చేస్తుంది. మానసిక సమతుల్యత కావాలన్నా, ఇంట్లో శాంతికి లోటు ఉండకూడదన్నా సాధు స్వభావం గల వారిని గౌరవించడం చాలా అవసరం.                            *రూపశ్రీ.
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు. ఎక్స్ట్రోవర్ట్  లు అయితే బయటకు బాగా జాలీగా ఉంటూ, అందరిలో కలిసిపోతూ.. ఎక్కడైనా సరే ఇట్టే సర్దుకుపోయే స్వభావం కలిగి ఉంటారు. కానీ ఇంట్రోవర్ట్ లు అలా కాదు.. వారు ఎవరి ముందూ ఏమీ ఎక్కువ మాట్లాడలేరు, కనీసం కావలసిన వస్తువులు,  అవసరమైన విషయాల దగ్గర కూడా వారు మాట్లాడలేకపోవడం వల్ల నష్టపోతూ ఉంటారు. ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఈ కారణంగా ఇంట్రోవర్ట్ లను చాలా కామెడీ చేస్తుంటారు. వారు సిగ్గుపడుతూ ఉంటారని, మొహమాటం ఎక్కువని కూడా ఆటపట్టిస్తూ ఉంటారు. అయితే.. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే.. నాణేనికి మరొక వైపు కూడా ఉంటుంది. అదే ఇంట్రోవర్ట్ లలో ఉండే బలం.  వారి వ్యక్తిత్వమే వారికి పెద్ద బలం అని చాలామంది కూడా అంటుంటారు. ఇంతకీ.. ఇంట్రోవర్ట్ లలో ఉండే బలాలు ఏంటో తెలుసుకుంటే.. ఒంటరితనం.. ఇంట్రోవర్ట్ లు ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడతారు. వారు ఒంటరిగా ఉన్నప్పుడు పునరుత్తేజం పొందుతారు. వారికి జనాల మధ్యలో ఉండటం అనే విషయం  త్వరగా విసుగు తెప్పిస్తుంది. అయితే ఇలా ఒంటరిగా ఎక్కువ గడపడం వల్ల వారికి వారి మీద నమ్మకం, వారి నిర్ణయాల పట్ల నమ్మకం, తమ వ్యక్తిత్వం పట్ల దృఢంగా ఉంటారు. లోతైన మాటలు.. ఇంట్రోవర్ట్ లు  చిల్లర మాటల కంటే అర్థవంతమైన సంభాషణలకు ప్రాధాన్యత ఇస్తారు. అదే పనిగా ఏదో ఒకటి మాట్లాడటం అనే దాని కంటే.. అవసరమైనప్పుడు అవసరమైన విషయాలు మాట్లాడటానికే వారు ఆసక్తి చూపిస్తారు. అతి ఆలోచనలు.. ఇంట్రోవర్ట్ లు ఒంటరిగా గడపడం ఎక్కువ కాబట్టి చాలా ఎక్కువ ఆలోచిస్తుంటారు. ప్రతి విషయం గురించి లోతుగా ఆలోచిస్తారు ,  నిర్ణయాలను జాగ్రత్తగా పరిశీలిస్తారు. తక్కువే.. కానీ బలమైన స్నేహాలు.. ఇంట్రోవర్ట్ లకు ఎక్కువ మంది స్నేహితులు ఉండరు. వారి లిస్ట్ లో చాలా కొద్దిమంది మాత్రమే స్నేహితులు ఉంటారు.  కానీ ఆ కొద్ది మంది చాలా మంచి స్నేహితులై ఉంటారు.  వారి స్నేహం కూడా చాలా బలంగా ఉంటుంది. వారు పెద్దగా మాట్లాడరని అంటుంటారు.. కానీ వారి మనసుకు ఎవరైనా దగ్గరైనా,  ఎదుటి వారి వ్యక్తిత్వం వారికి నచ్చినా.. వారు బాగా మాట్లాడతారు. వినడానికి ప్రాధాన్యత.. ఎక్స్ట్రోవర్ట్ లు ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూ ఉంటే.. ఇంట్రోవర్ట్ లు మాత్రం ఎక్కువగా వినడానికే ఇష్టపడతారు. ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే దాన్ని వినడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.  మౌనంగా ఉంటూ ఎదుటివారి మాటలను, వారి వ్యక్తిత్వాన్ని గమనించడానికి వీరు ఇష్టపడతారు.  వీరిలో పరిశీలనా శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది.                                 *రూపశ్రీ.
నేటి కాలంలో మారుతున్న జీవనశైలి, ఒత్తిడి మరియు ఆహారపు అలవాట్ల వల్ల వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటు (Heart Attack) బారిన పడుతున్నారు. అయితే, గుండెపోటు అకస్మాత్తుగా వచ్చే ప్రమాదమే అయినప్పటికీ, మన శరీరం కొన్ని రోజుల ముందే కొన్ని లక్షణాల ద్వారా మనల్ని హెచ్చరిస్తుంది. ఆ సంకేతాలను సరైన సమయంలో గుర్తిస్తే ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చు. తెలుగువన్ హెల్త్ (TeluguOne Health) ఈ ప్రత్యేక వీడియోలో, హార్ట్ అటాక్ వచ్చే ముందు కనిపించే ఆ ప్రమాదకరమైన సంకేతాల గురించి క్లియర్ గా వివరించడం జరిగింది. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే ముఖ్యమైన విషయాలు: ముందస్తు లక్షణాలు: గుండెపోటు రావడానికి కొన్ని రోజుల ముందు శరీరంలో కనిపించే మార్పులు ఏమిటి? నిర్లక్ష్యం చేయకూడని నొప్పులు: కేవలం ఛాతీ నొప్పి మాత్రమేనా? లేక ఇతర శరీర భాగాల్లో వచ్చే నొప్పులు కూడా గుండెపోటుకు సంకేతాలా? అప్రమత్తత: శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విపరీతమైన చెమటలు పట్టడం వంటి లక్షణాలను ఎలా గుర్తించాలి? ముందుజాగ్రత్త చర్యలు: ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే చేయాల్సిన పనులు ఏమిటి? మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఈ సమాచారం మీకోసమే కాదు, మీ కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడటానికి కూడా ఉపయోగపడుతుంది. తప్పకుండా ఈ వీడియోను పూర్తిగా చూడండి. హార్ట్ అటాక్ వచ్చే ముందు శరీరం ఇచ్చే ఆ ప్రమాదకరమైన సంకేతాలు ఏమిటో తెలుసుకోండి. ఈ లక్షణాలను గుర్తిస్తే ప్రాణాపాయం నుండి బయటపడవచ్చు. మరిన్ని ఆరోగ్య రహస్యాలను వీడియో రూపంలో చూడాలనుకుంటే ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌లో చూడండి. (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
  భారతీయుల ఆహారంలో పాలు, పాల ఉత్పత్తులకు చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది.  పాలు, పెరుగు, వెన్న, నెయ్యి లేకుండా రోజు అస్సలు గడవదు.  ఇక ఇప్పట్లో చాలా మంది పనీర్ కుడా బాగా వినియోగిస్తున్నారు. అయితే.. పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదే అయినా.. పాలు తాగడం వల్ల నయం చేయలేని పార్కిన్సన్స్ వ్యాధికూడా  వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు.  పాలకు,  పాల ఉత్పత్తులకు,  పార్కిన్సన్స్  వ్యాధి రావడానికి అసలు సంబంధం ఏంటి? వైద్యులు దీని గురించి ఏం చెబుతున్నారు? పూర్తీగా తెలుసుకుంటే.. పాలు,  పార్కిన్సన్స్ వ్యాధి.. పాల ఉత్పత్తులు.. ముఖ్యంగా పాలు తీసుకునే వారికి పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే ప్రమాదం కొద్దిగా ఎక్కువగా ఉండవచ్చని చాలా అధ్యయనాలు వెల్లడించాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  ఈ ప్రమాదం, ముఖ్యంగా పురుషులలో, 20 నుండి 40 శాతం వరకు ఎక్కువగా ఉన్నట్లు కనుగొనబడింది. అయితే.. ఇది వ్యాధికి ప్రత్యక్ష కారణం కాదు, కేవలం ఒక సహసంబంధం మాత్రమే. దీనిని ఇంకా పూర్తిగా అర్థం చేసుకోవాల్సి ఉందని వైద్యులు అంటున్నారు. పరిశోధనలు చెప్పింది ఇదే.. సుమారు 25 సంవత్సరాల పాటు ప్రజల ఆహారపు అలవాట్లను పరిశీలించిన తర్వాత, చాలా తక్కువ పాలను తీసుకునే వారితో పోలిస్తే, ప్రతిరోజూ మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు తక్కువ కొవ్వు ఉన్న పాలను తీసుకునే వారికి పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే ప్రమాదం 34 శాతం ఎక్కువగా ఉందని పరిశోధనలలో కనుగొనబడింది. అలాగే  పాలు తాగడం వల్ల పురుషులలో పార్కిన్సన్స్  ప్రమాదం 1.8 రెట్లు, మహిళలలో 1.3 రెట్లు పెరుగుతుందని మరొక అధ్యయనం కూడా చెబుతోంది. పాలతో ఎందుకు సమస్య అవుతోంది.. కొన్ని పరిశోధనల ప్రకారం, పాలలో ఉండే హెప్టాక్లోర్ ఎపాక్సైడ్ వంటి పురుగుమందుల అవశేషాలు మెదడుకు హానికరంగా ఉండవచ్చు. పాలలో ఉండే గెలాక్టోజ్ కూడా ఒక కారకమని, దీనిని అధిక పరిమాణంలో తీసుకున్నప్పుడు మెదడుపై ప్రభావం చూపుతుందని నమ్ముతారు. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పాల ఉత్పత్తులు మన పేగు మైక్రోబయోమ్‌ను ప్రభావితం చేసి, కొన్ని ప్రోటీన్ల ఉత్పత్తికి దారితీస్తాయని,  తరువాత మెదడుకు చేరి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయని చెబుతున్నారు. పాలు తాగడం మానేయాలా? వెంటనే పాలు లేదా పాల ఉత్పత్తులను మానేయాలని చెప్పడం దీని ఉద్దేశ్యం కాదు. మితంగా తీసుకోవడం చాలా అవసరమని పరిశోధనలు సూచిస్తున్నాయి.  ఎక్కువగా పాలు, ముఖ్యంగా తక్కువ కొవ్వు లేదా మీగడ తీసిన పాలు తీసుకుంటే, వాటిని కొద్దిగా తగ్గించడం మంచిది. పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలు.. భారతదేశంలో  పార్కిన్సన్ వ్యాధి కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. చేతులు వణకడం, కండరాలు బిగుసుకుపోవడం, కదలికలు మందగించడం,  శరీర భంగిమ దెబ్బతినడం వంటివి దీని లక్షణాలు. మలబద్ధకం, వాసన కోల్పోవడం, నిద్రలేమి,  మానసిక స్థితిలో మార్పులు వంటివి మొదటి దశలో కనిపించే లక్షణాలు. ఈ వ్యాధిని పూర్తిగా నివారించడం సాధ్యం కాదని వైద్యులు భావిస్తున్నారు, కానీ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా ప్రమాదాన్ని ఖచ్చితంగా తగ్గించవచ్చు.                               *రూపశ్రీ.
వెల్లుల్లితో కొలెస్ట్రాల్‌కు చెక్.. ఇలా వాడితే అద్భుత ఫలితాలు! మన వంటింట్లో ఉండే వెల్లుల్లి కేవలం రుచికే కాదు, అద్భుతమైన ఔషధ గుణాలకు కూడా మారుపేరు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు, అధిక బరువు మరియు మధుమేహంతో బాధపడేవారికి వెల్లుల్లి ఒక వరప్రసాదం లాంటిది. ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఈ వీడియోలో వెల్లుల్లిని ఎలా వాడాలి మరియు దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి Dr Chittibhotla Madhusudana Sarma గారు వివరించిన మరిన్ని విషయాలను ఈ VIDEO ద్వార తెలుసుకుందాం. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే ప్రధాన అంశాలు: కొలెస్ట్రాల్ నియంత్రణ: రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను వెల్లుల్లి ఎలా కరిగిస్తుంది? గుండె ఆరోగ్యం: రక్తపోటును (High BP) అదుపులో ఉంచి గుండెపోటు రాకుండా వెల్లుల్లి చేసే మేలు. బరువు తగ్గడం (Obesity): శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించడంలో వెల్లుల్లి పాత్ర. మధుమేహం (Diabetes): రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడానికి వెల్లుల్లిని ఎలా తీసుకోవాలి? సరైన పద్ధతి: వెల్లుల్లిని పచ్చిగా తీసుకోవాలా లేక వేయించి తీసుకోవాలా? ఏ సమయంలో తీసుకుంటే ఫలితం ఎక్కువగా ఉంటుంది? వెల్లుల్లిని ఔషధంగా వాడేటప్పుడు పాటించవలసిన నియమాలు మరియు మోతాదు గురించి డాక్టర్ గారి సూచనలను ఈ వీడియోలో క్లియర్ గా చూడవచ్చు. మీ ఆరోగ్యాన్ని సహజ సిద్ధంగా మెరుగుపరుచుకోవడానికి ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది. మరిన్ని ఆయుర్వేద ఆరోగ్య రహస్యాలను వీడియో రూపంలో చూడాలనుకుంటే ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌లో చూడండి. (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)