LATEST NEWS
వివేకానంద రెడ్డి హత్య జరిగి ఏడేళ్లవుతోంది... సిబిఐ విచారణ ముగిసిందనుకుంటున్న సమయంలో, హఠాత్తుగా ఈడీ ఎందుకు ఎంటర్ అయింది?  అవినాష్ రెడ్డి ఇల్లు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇళ్లపై జరిగిన దాడుల్లో కేవలం 24 లక్షల క్యాష్, కొన్ని డాక్యుమెంట్లు మాత్రమే దొరికాయా? లేక ఈ దాడుల వెనుక ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేసే పెద్ద విషయం ఏమైనా జరగబోతోందా? అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది. దీనిపై సీనియర్ జర్నలిస్టు, ఎనలిస్ట్ వీవీరావు తెలుగువన్ ఛానల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో,  న్యాయ వర్గాల్లో గత కొన్నేళ్లుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో హఠాత్తుగా ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హఠాత్తుగా రంగానికి దిగి తనిఖీలు చేపట్టడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. 2019 మార్చి నెలలో జరిగిన వైఎస్ వివేకా  హత్య ఉదంతంలో ఇప్పటివరకు  సిబిఐ విచారణ జరుపుతుండగా, ఉన్నట్టుండి ఈడీ అధికారులు రంగప్రవేశం చేయడం వెనుక ఉన్న కారణాలపై విశ్లేషకులు మరియు సామాన్య ప్రజలు ఆసక్తికరమైన చర్చలకు తెరలేపారు. ఈడీ అధికారులు నిర్వహించిన సోదాల్లో భాగంగా పలు కీలకమైన ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు. నిందితులు, సాక్షులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక వ్యక్తుల ఇళ్లలో జరిపిన శోధనలలో  24 లక్షల రూపాయల నగదుతో పాటు అనేక కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం బయటకు వచ్చింది. అయితే హత్య జరిగిన  ఏడేళ్ల తరువాత నిందితుల ఇళ్లలో కీలక డాక్యుమెంట్లు ఉంటాయా? సంఘటన జరిగిన గంటల వ్యవధిలో సాక్ష్యాలను తారుమారు చేస్తున్న నేటి పరిస్థితుల్లో హత్య జరిగిన ఏడేళ్ల తరువాత కీలక పత్రాల స్వాధీనం అంటూ వస్తున్న వార్తలు నమ్మశక్యంగా లేవని వీవీరావు విశ్లేషించారు.  ఈ తనిఖీల వెనుక కేవలం హత్య కేసు విచారణ మాత్రమే  లేదన్నారు. అయినా ఈడీ వంటి దర్యాప్తు సంస్థల తనిఖీలు రానున్న రోజులలో జరగనున్న రాజకీయ పరిణామాలకు తార్కాణమని గత అనుభవాలను బట్టి  అవగతం చేసుకోవచ్చునన్నారు. ఇప్పుడు ఈడీ దాడుల వెనుక రాజకీయ కోణం ఉందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇటీవలే జగన్ హయాంలో ఏపీలో చక్రం తిప్పిన ఐఏఎస్ అధికారి ఒడిషాలో కాంగ్రెస్ గూటికి చేరడం... రానున్న రోజుల్లో జగన్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. ఎందుకంటే.. ఏడేళ్ల తరువాత ఇప్పుడు ఈడీ ఈ కేసులో అవినాష్ రెడ్డి తదితరుల నివాసాలలో ఆధారాల కోసం తనిఖీలు నిర్వహించడం విచిత్రంగా ఉందన్నారు. రానున్న రోజులలో జరగబోయే పరిణామాలేమిటన్నది వేచి చూడాలన్నారు.   Jagan to join Congress, YS Viveka Case ED Raids, YS Vivekananda Reddy Murder Case, ED Investigation, Avinash Reddy ED Raids, TeluguOne
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటనకు ముహూర్తం ప్రకటించేశారు. శ్రావణ శుక్రవారం రోజే తాను విజయవాడ వేదికగా కొత్తపార్టీ ప్రకటన చేస్తానని వెల్లడించారు.  తాను త్వరలోనే కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు గతంలోనే వెల్లడించిన విజయసాయి. ఇప్పుడు ఆ పార్టీ ప్రకటన ఎప్పుడు, ఎక్కడ అన్న విషయంలో క్లారిటీ ఇచ్చారు.    శ్రావణమాసం మూడో శుక్రవారం నాడు  విజయవాడ వేదికగా  పార్టీ పేరు, జెండా, అజెండా, విధివిధానాలను వెల్లడిస్తానని చెప్పారు.  ప్రజాసమస్యలపై నిలదీసేందుకు,  ప్రజల గొంతుకగా మారేందుకు చట్టసభల్లో ప్రత్యేకంగా ప్రతిపక్ష హోదా ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంటూ, పరోక్షంగా వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ బాయ్ కాట్ ను తప్పుపడుతూ విమర్శలు గుప్పించారు.   గత కొంతకాలంగా విజయసాయిరెడ్డి రాజకీయ అడుగులపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్నది.  వైసీపీ ఆవిర్భావం నుంచీ ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన విజయసాయి.. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి రాజకీయ సన్యాసం ప్రకటించిన ఇంత కాలానికి సొంత రాజకీయ వేదక ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం విశేషం.    Vijayasai Reddy Political Party Announcement, Vijayawada, Sravana Sukrvaram, Vijayawada,   AP Politics, TeluguOne
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ పర్యటన ఏమైంది? కొన్ని వారాల కిందట జగన్ హస్తిన పర్యటనకు వెడుతున్నారనీ, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారనీ వైసీపీ ఆర్భాటంగా ప్రకటించింది. వైసీపీ సోషల్ మీడియాలో జగన్ పర్యటన గురించిన పోస్టులు పుంఖానుపుంఖాలుగా వెల్లువెత్తాయి. దీంతో జగన్ హస్తిన పర్యటనపై సర్వత్రా ఆసక్తి  వ్యక్తమైంది.   రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణలు, ప్రధానంగా అధికార మార్పిడి తర్వాత చోటుచేసుకుంటున్న వరుస పరిణామాల నేపథ్యంలో ఆయన హస్తిన టూర్ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. హస్తిన పర్యటనలో జగన్ మోడీ,  షాలతో చర్చించే అంశాలేంటి?  జగన్, ఆయన పార్టీ నేతలు, సన్నిహిుతలు ఎదుర్కొంటున్న సీబీఐ, ఈడీ విచారణలు వేగవంతమై, దర్యాప్తులు కొలిక్కి వస్తున్న వేళ ఆయన మోడీ, అమిత్ షాలతో భేటీ కానున్నారన్న వార్తలు ఉత్కంఠకు తెరలేపాయి.  జగన్  ఢిల్లీ పర్యటన కేంద్రం పెద్దల ఆశీస్సులతో.. కేసుల నుంచి రక్షణ పొందేందుకేనన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తమైంది. అయితే జగన్ హస్తిన పర్యటన వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చి వారాలు గడిచిపోయినా ఆయన బెంగళూరు, తాడేపల్లి ప్యాలెస్ మధ్య తిరగడం తప్ప హస్తిన  ఫ్లైట్ ఎక్కలేదు. దీంతో  జగన్ పర్యటన సంగతేమైందన్న చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. ఆయనకు మోడీ, అమిత్ షాలు అప్పాయింట్ మెంటే ఇవ్వలేదని రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.  గతంలో అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో  కేంద్ర ప్రభుత్వంతో  వైసీపీ సఖ్యతగా వ్యవహరించింది. జగన్ ఎప్పుడు కోరితే అప్పుడు మోడీ, షాల అప్పాయింట్ దొరికేసేది. అయితే 2024 ఎన్నికల తరువాత నుంచి  పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు వచ్చింది.   కేంద్రం కోరినా కోరకున్నా...జగన్, వైసీపీ కేంద్ర ప్రభుత్వ విధానాలన్నిటికీ బేషరతు మద్దతు ఇస్తున్నా.. కేంద్రం పెద్దలు ఆయనను పట్టించుకున్న దాఖలాలు కనిపించడంలేదు. ఇక రాష్ట్రంలో  కొలువుదీరిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జగన్ హయాంలో తీసుకున్న నిర్ణయాలు, జరిగిన అక్రమాలపై వరుస విచారణలు జరుపుతుంటే..  కేంద్ర దర్యాప్తు సంస్థలు జగన్ అక్రమాస్తులు, మద్యం కుంభకోణం కేసుల విచారణల్లో వేగం పెంచుతున్న పరిస్థితిప్రస్ఫుటంగా కనిపిస్తోంది.  ఈ నేపథ్యంలోనే జగన్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. కేంద్రం పెద్దలను కలిసి రక్షణ కోరేందుకు జగన్ మోడీ, షాల అప్పాయింట్ మెంట్ కోరారని రాజకీయవర్గాలలో విస్తృత ప్రచారం జరిగింది. కట్ చేస్తే జగన్ ఇప్పుడు హస్తిన పర్యటన ఊసెత్తడం లేదు. వైసీపీ సోషల్ మీడియాలో  కూడా ఆయన హస్తిన పర్యటనకు సంబంధించిన వివరాలేవీ కనిపించడం లేదు. దీంతో మోడీ, షా జగన్ కు అప్పాయింట్ మెంట్  ఇవ్వలేదని స్పష్టమౌతోందని అంటున్నారు.  కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే సర్కార్ లో తెలుగుదేశం కీలక భాగస్వామి కావడంతో..  జగన్ కు అప్పాయింట్ మెంట్ ఇవ్వడం  రాజకీయంగా ప్రతికూల సంకేతాలు ఇస్తుందన్న భావనతో మోడీ, షాలు జగన్ కు అప్పాయింట్ మెంట్ నిరాకరించినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి.     రాబోయే రోజుల్లో ఢిల్లీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఏ దిశగా సాగుతుంది, కేంద్ర ప్రధాన నాయకులతో ఆయన సమావేశం అయ్యే అవకాశం దక్కుతుందా లేదా అనేది ఏపీ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారింది. కేంద్ర దర్యాప్తు సంస్థల కేసుల విచారణ గతిని, రాష్ట్ర రాజకీయాల భవిష్యత్తును ఈ పర్యటన ఏ విధంగా ప్రభావితం చేస్తుందో వేచి చూడాల్సి ఉంది. What happend to Jagan delhi tour, Modi, Shah, Appointment, Cases, Nda, Telugudesham, Ap, TeluguOne
వైసీపీ  సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అడుగులు ఎటు అన్న విషయంపై ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో చర్చ జోరుగా నడుస్తోంది.  శాసనమండలిలో  వైసీపీ పక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ జనసేన వైపు చూపు సారించారన్న చర్చ జోరందుగుంది.  ఆయన రాజకీయ అడుగులు జనసేన వైపు పడుతున్నాయని వైసీపీలోనే వినిపిస్తున్నది.  ఆయన ఇప్పటికే జనసేన అగ్రనేతతో ఈ విషయంగా చర్చలు జరిపారని గట్టిగా వినిపిస్తోంది.  ఈ విషయంలో  బొత్స సత్యనారాయణ స్వయంగా స్పందిస్తూ ఈ ప్రచారాన్ని ఖండించారు. తాను పార్టీ మారుతాన్న ప్రచారం పూర్తిగా ఆధారరహితమని స్పష్టం చేశారు. ఇదంతా మైండ్ గేమ్ లో భాగమని కొట్టి పారేశారు.  బొత్స స్వయంగా ఖండిచినా ఆయన జనసేనకు షిఫ్ట్ అవుతారన్న ప్రచారం ఇసుమంతైనా తగ్గలేదు. రాజకీయ పరిశీలకులు సైతం బొత్సలో జనసేన, వైసీపీల మధ్య ఊగిసలాట కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. స్థానిక ఎన్నికలలో పార్టీ పోటీపై వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్న జనసేనాని.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం  చేసే దిశగా అడుగులు వేస్తున్న తరుణంగా బొత్స జనసేన వైపు మొగ్గు చూపే అవకాశాలను కొట్టి పారేయలేమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  తాజాగా బొత్స ఇటీవలి మౌనాన్ని వీడి మండలిలోనూ, బయటా కూడా తెలుగుదేశం పై, మంత్రి లోకేష్ పై విమర్శలకు పదును పెట్టడం, అదే సమయంలో జనసేన పట్ల ఒకింత మెతక వైఖరిని అవలంబించడం ఇందుకు తార్కానాలుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద బొత్స రాజకీయ అడుగుల విషయంలో అటు వైసీపీలోనూ, ఇటు జనసేనలోనూ కూడా ఆసక్తికర చర్చ అయితే జరుగుతోంది.   Botsa Satyanarayana, Janasena Party, YSRCP, AP Politics, Vizianagaram Politics
  టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ..! తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పలువురు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు సమన్వయంతో వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న ‘అదృశ్య వ్యక్తులు’ ఎవరో నిష్పాక్షికంగా గుర్తించి, వారిపై పార్టీ క్రమశిక్షణా నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవిని కోరారు. క్రమశిక్షణా కమిటీ తనకు జారీ చేసిన నోటీసుకు ఇప్పటికే వివరణ ఇచ్చానని సురేఖ తెలిపారు.  అయినప్పటికీ పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఒకే తరహాలో తనపై, తన కుటుంబంపై విమర్శలు చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. క్రమశిక్షణా కమిటీ విచారణ కొనసాగుతున్న సమయంలోనే తనపై బహిరంగ విమర్శలు చేయడం, రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇవ్వడం, చర్యలు తీసుకోవాలని మీడియా ముందు డిమాండ్ చేయడం ద్వారా కమిటీ స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందా అనే అంశాన్ని కూడా పరిశీలించాలని ఆమె కోరారు.  పార్టీ నాయకత్వం, క్రమశిక్షణా నియమావళిపై తనకు పూర్తి గౌరవం ఉందని పేర్కొన్న సురేఖ.. సీనియర్ బీసీ మహిళా నాయకురాలిగా తనపై సామూహికంగా విమర్శలు వస్తున్నా పార్టీ నాయకత్వం మౌనం వహించడం ఆందోళన కలిగిస్తోందని లేఖలో పేర్కొన్నారు. పార్టీ ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, బలహీన వర్గాల ఆత్మగౌరవానికి కట్టుబడి వున్న పార్టీ అని, ఆ విలువలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై పార్టీ క్రమశిక్షణా నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సురేఖ కోరారు. Konda Surekha, CM Revanth Reddy, Telangana Congress, Konda Susmitha, TPCC, Congress MLAs Ultimatum, TPCC Disciplinary Committee, MP Mallu Ravi  
ALSO ON TELUGUONE N E W S
బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షోలలో 'బిగ్ బాస్' అగ్రస్థానంలో కొనసాగుతోంది. కేవలం ఆటలు, టాస్క్‌లే కాకుండా కంటెస్టెంట్ల వ్యక్తిగత జీవితాలు, డ్రామా, ఎమోషన్స్ చుట్టూ తిరిగే ఈ షోకు భారీగా ప్రేక్షకాదరణ లభిస్తుంది. అయితే గత కొంతకాలంగా ఈ షో సెలెక్షన్ ప్రక్రియలో ఒక ఆసక్తికరమైన కొత్త ట్రెండ్ టాలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చనీయాంశమవుతోంది. ప్రధానంగా లవ్ బ్రేకప్స్, విడాకులు లేదా పర్సనల్ లైఫ్‌లో తీవ్ర కష్టాలు ఎదుర్కొన్న సెలబ్రిటీలకే, ముఖ్యంగా నటీమణులకు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. వ్యక్తిగత వివాదాల్లో ఉన్నవారిని షోలోకి తీసుకోవడానికి నిర్వాహకులు ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. దీని వెనుక ఉన్న అసలు కారణం ప్రేక్షకుల క్యూరియాసిటీయే అని చెప్పాలి. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం, వారి ప్రేమ వ్యవహారాలు, విడాకుల వెనుక ఉన్న అసలు నిజాలు తెలుసుకోవడానికి సామాన్య ఆడియెన్స్ తీవ్రంగా ఆసక్తి చూపుతుంటారు. జీవితంలో చేదు అనుభవాలను ఎదుర్కొన్న భామలు హౌస్‌లో తమ ఎమోషన్స్ షేర్ చేసుకోవడం వల్ల షోకి మైలేజ్ పెరగడంతో పాటు రేటింగ్స్ ఒక్కసారిగా దూసుకెళ్తాయి. తెలుగు బిగ్ బాస్ విషయానికి వస్తే, దివి వైద్య వంటి అందాల భామలు హౌస్‌లోకి రాకముందే తమ పర్సనల్ లైఫ్ లైన్, బ్రేకప్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి తన అందం, వ్యక్తిత్వంతో విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకుంది. హౌస్‌లో తన ఎమోషనల్ జర్నీని షేర్ చేసుకుంటూ స్ట్రాంగ్ పోటీదారుగా నిలిచి ఆడియెన్స్ మనసులను గెలుచుకుంది. ఇక బాలీవుడ్ బిగ్ బాస్ వేదికపై ఇలాంటి కంబ్యాక్స్ మరింత ఎక్కువగా కనిపిస్తుంటాయి. శ్వేతా తివారీ, రశ్మి దేశాయ్, శమితా శెట్టి వంటి నటీమణులు తమ వ్యక్తిగత బంధాలు దెబ్బతిన్న తర్వాత లేదా విడాకుల వంటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడి బిగ్ బాస్ ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. అక్కడ తమ రియల్ పర్సనాలిటీతో నేషనల్ లెవెల్లో విపరీతమైన క్రేజ్ సాధించారు. శ్వేతా తివారీ ఏకంగా టైటిల్ విజేతగా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ రకమైన ఎమోషనల్ కంటెక్స్ట్ వర్కవుట్ అవుతుండటంతో, బిగ్ బాస్ రాబోయే సీజన్లలో కూడా పర్సనల్ లైఫ్ వల్ల వార్తల్లో నిలిచిన నటీమణులనే ఎంచుకోనున్నారని నెట్టింట టాక్ నడుస్తోంది. కెరీర్‌లో కాస్త గ్యాప్ వచ్చి, రీ-ఎంట్రీ ఇవ్వాలనుకునే సెలబ్రిటీలకు కూడా ఈ రియాలిటీ వేదిక ఒక సరైన వేదికగా మారుతోంది. ముందుముందు రాబోయే సీజన్లలో మరికొంతమంది ప్రముఖ భామలు తమ లైఫ్ స్టోరీస్‌తో ఆడియెన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కొత్త ట్రెండ్ భవిష్యత్తులో బుల్లితెర రేటింగ్స్‌ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.
మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన బ్లాక్‌బస్టర్ మూవీ 'ఇరుముడి'. ఈ సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్న రవితేజ, సినిమాలో 'నాగులు' పాత్ర చేసిన 'కొమురం' నటనపై ప్రశంసల వర్షం కురిపించారు.  రవితేజ ఎల్లప్పుడూ టాలెంట్ ఉన్న ఆర్టిస్టులను ప్రోత్సహించడంలో ముందే ఉంటారు. సినిమా వేదికల మీద తోటి నటీనటుల గురించి ఆయన ఓపెన్ గా మాట్లాడే తీరు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుంది. ఇటీవల జరిగిన 'ఇరుముడి' వేడుకలో రవితేజ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దర్శకుడు శివ నిర్వాణ విజన్ ను, ఆయన విజన్‌లోని కన్విక్షన్ ను రవితేజ ఎంతో ప్రశంసించారు. శివ నిర్వాణ తనకు ఉన్న నమ్మకంతోనే కొమురం వంటి నటుడితో అంతటి విభిన్నమైన, అద్భుతమైన క్యారెక్టర్ చేయించగలిగారని రవితేజ కొనియాడారు. ఒక దర్శకుడికి తన నటీనటుల ఎంపికపై ఉన్న స్పష్టతే ఆ సినిమా విజయాన్ని నిర్ణయిస్తుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ వేడుకలో రవితేజ కేవలం కొమురం పాత్రపైనే కాకుండా, సినిమాలో నటించిన ఇతర నటీనటులందరి పనితీరుపై కూడా ప్రత్యేకంగా స్పందించారు. భార్గవ్, కిషోర్, కొమురం వంటి నటులను దర్శకుడు చాలా చక్కగా ఎంచుకున్నారని, ప్రతి ఒక్కరూ తమ పాత్రల్లో చాలా బాగా చేశారని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. సీనియర్ హీరో నోటి నుంచి వచ్చిన ఈ ప్రశంసలు ఆయా ఆర్టిస్టులకు ఎంతో బూస్ట్ ఇచ్చాయనే చెప్పాలి.       Irumudi, Ravi Teja, Shiva Nirvana, Komaram  
మరికొన్ని గంటల్లో యష్ తన వన్ మాన్ షో 'టాక్సిక్' తో వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లో ల్యాండ్ కాబోతున్నాడు. కేజిఎఫ్ సిరీస్ వచ్చిన నాలుగేళ్ళ తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఫ్యాన్స్ , ప్రేక్షకులు టాక్సిక్ ని వీక్షించడం  కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.  రీసెంట్ గా సోషల్ మీడియాలో యష్ ఫ్యూచర్ లో రాజకీయరంగ ప్రవేశం చేస్తాడనే రూమర్ హల్ చల్ చేస్తుంది. ఈ రూమర్ వినిపించడానికి కూడా కారణం ఉంది. ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో యశ్ తమిళ స్టార్ హీరో ముఖ్యమంత్రి ‘దళపతి’ విజయ్ గురించి మాట్లాడుతు 'విజయ్ ప్రయాణం నిజంగా నాకు  ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయనలోని క్రమశిక్షణ, ప్రజల పట్ల ఉన్న కట్టుబాటు, విపరీతమైన ప్యాషన్ చూసి ఎంతో నేర్చుకున్నాను. నటుడిగా ప్రేక్షకులు ఇచ్చిన ప్రేమాభిమానాలని తిరిగి సమాజానికి సేవ రూపంలో అందించే బాధ్యతాయుతమైన ఘట్టానికి విజయ్ చేరుకున్నారు. ప్రజలు ఆయనను ఈ స్థాయిలో నిలబెట్టారంటే దానికి ఆయన పడిన కష్టమే కారణం. కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన ఆయన పయనం మునుముందుకు విజయవంతంగా సాగాలని యశ్ ఆకాంక్షించారు. దీంతో విజయ్ దారిలోనే యష్ రాజకీయాల్లోకి వస్తాడనే రూమర్ చిరు మందహాసంతో షికారు చేస్తుంది. ఏది ఏమైనా యష్ రాజకీయాల్లో రావడం తన సినీ హక్కు.   Also Read: శ్రియ ఇనిస్టాగ్రమ్ పిక్ వైరల్.. ఆ స్టార్ హీరోతో హ్యాపీ డే Yash, Vijay, Toxic, Geetu Mohandas
Irumudi has received special appreciation from one of Indian cinema’s finest performers, Dhanush. The multiple National award winning actor made a special video call to director Shiva Nirvana and spoke personally with Baby Nakshatra. The actor watched the Ravi Teja starrer and was particularly impressed by the young actress’s performance, making the interaction an extremely special moment for her. Dhanush showered Nakshatra with praise during the call, telling her that she was “so natural, so beautiful, so wonderful.” The little actress looked visibly excited as he continued appreciating her work and expressed his wish to meet her soon. The most heartwarming moment came when Dhanush told Nakshatra that whenever they meet, he wants to learn acting from her. Coming from an actor celebrated for his natural and instinctive performances, the compliment left Nakshatra visibly thrilled. Dhanush concluded the conversation on an affectionate note, telling her, “Great job kanna. God bless you.” The video of this special interaction has now gone viral, with audiences loving the genuine appreciation shown by the star. The appreciation also adds to the growing recognition for Nakshatra, whose performance as Ravi Teja’s daughter has emerged as one of the major highlights of Irumudi.  Directed by Shiva Nirvana and produced by Mythri Movie Makers, the film is enjoying a strong theatrical run, with its emotional father-daughter track connecting particularly well with audiences and divine Ayyappa Deeksha angle bringing even older audiences to theatres.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఇండియన్ సినిమా హిస్టరీలోనే సరికొత్త అధ్యాయం తిరగరాసిన సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం గురించి తెలుసుకోవాలని కోట్లాది మంది అభిమానులు ఆరాటపడుతుంటారు. అలాంటి ఫ్యాన్స్‌కు తలైవా కూతురు, దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ ఒక తీపి కబురు అందించారు. తండ్రి జీవిత అనుభవాలతో ఒక ప్రత్యేకమైన పుస్తకం సిద్ధమవుతోందని వెల్లడించారు. సౌందర్య రజనీకాంత్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని అధికారికంగా పంచుకున్నారు. తన తండ్రి ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ జీవితంలోని మజిలీలు, ఆయన సాధించిన విజయాలు, ఎదుర్కొన్న సవాళ్లను సమగ్రంగా ఈ ఆత్మకథలో పొందుపరుస్తున్నట్లు తెలిపారు. ఈ పుస్తక రచన ప్రాసెస్ ప్రస్తుతం ఎంతో ప్రత్యేకంగా, శ్రద్ధగా సాగుతోందని పేర్కొన్నారు. ‘ఒక యోగి ఆత్మకథ’ (Autobiography of a Yogi) పుస్తకం ఎలాంటి స్ఫూర్తిని నింపుతుందో, తన తండ్రి ఆత్మకథ కూడా రాబోయే తరాలకు అంతటి స్ఫూర్తినిస్తుందని సౌందర్య ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, భవిష్యత్తులో ఒకవేళ తన తండ్రి బయోపిక్‌ను వెండితెరపై డైరెక్ట్ చేసే అవకాశం వస్తే, అది తనకు దక్కే అత్యంత అరుదైన గౌరవంగా భావిస్తానని మనసులోని మాటను బయటపెట్టారు. ఒక సాధారణ బస్ కండక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించిన శివాజీరావు గైక్వాడ్.. తలైవా రజనీకాంత్‌గా మారి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఎందరికో ఆదర్శం. క్రమశిక్షణ, సృజనాత్మకతకు స్పష్టత ఉండడమే ఆయన విజయ రహస్యాలని, ఈ విషయాన్నే తన తండ్రి తనకు నేర్పించారని సౌందర్య గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తమ అభిమాన నటుడి జీవిత విశేషాలను, ఎవరికీ తెలియని రహస్యాలను త్వరలోనే పుస్తక రూపంలో చదవబోతున్నామనే వార్త తెలుసుకుని రజనీ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. మరోవైపు, సౌందర్య రజనీకాంత్ ప్రొడక్షన్ వ్యాపారంలోనూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆమె నిర్మాణంలో బాలాజీ మోహన్ దర్శకత్వంలో 'లవ్' అనే రోమాంటిక్ తమిళ వెబ్ సిరీస్ రూపుదిద్దుకుంటోంది. అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటిస్తున్న ఈ సిరీస్ త్వరలోనే ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రజనీకాంత్ పుస్తకం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలుసుకునేందుకు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.   Rajinikanth Autobiography, Soundarya Rajinikanth, Rajinikanth Life Story, Rajinikanth Biopic Updates, Superstar Rajinikanth News
  శ్రియ.. తెలుగుతో పాటు తమిళ సినిమా రంగంలో టాప్ హీరోయిన్ గా సత్తా చాటి యాక్టింగ్ ఇప్పట్లో ఎక్స్ పైరీ డేట్ లేదంటూ యువహీరో తేజ సజ్జకి తల్లిగా మిరాయ్ లో కనిపించి మెప్పించింది. ప్రస్తుతం  హిందీ చిత్రం 'ఆవారాపన్ 2' తో థియేటర్స్ లో సందడి చేస్తున్న శ్రియ రీసెంట్ గా ఇనిస్టాగ్రమ్ వేదికగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి దిగిన ఒక పిక్‌ని షేర్ చేస్తూ, "హ్యాపీ డే" అనే ఆసక్తికర క్యాప్షన్‌ని జత చేసింది. దీంతో రజనీకాంత్ హీరోగా అశ్విత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధర్మన్’ లో రజినీకి శ్రియ జోడిగా చేస్తుందనే రూమర్ చాలా గర్వంతో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ధర్మాన్ షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుపుకుంటోంది. ఈ హైదరాబాద్ షెడ్యూల్ సమయంలోనే శ్రియ సెట్స్‌కు వచ్చి రజనీని కలవడంతో, ఆమె ఈ చిత్రంలో ముఖ్యమైన క్యారక్టర్ పోషిస్తుందని అంటున్నారు అయితే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, 19 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఐకానిక్  కాంబినేషన్ మళ్లీ తెరపై మెరవబోతోందన్న ఆలోచనే తమిళ, తెలుగు చలనచిత్ర అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేసింది.  Also read: వివాదంలో ఇరుముడి.. ఆ సన్నివేశాలు తొలగించాలని డిమాండ్  రజనీ, శ్రియ అనగానే ప్రతి సినీ అభిమానికి ముందుగా గుర్తుకొచ్చేది శంకర్ దర్శకత్వంలో 2007లో వచ్చిన ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్ ‘శివాజీ’. ఆ సినిమాలో రజనీకాంత్‌కు జంటగా శ్రియ చేసిన నటన, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. సాంగ్స్ నేటికీ మారుమోగిపోతుంటాయి. ధర్మాన్ ని ఉలయ నాయగన్  కమల్ హాసన్‌ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.  Shriya Saran, Rajinikanth, Dharman, Kamal Haasan
Shriya Saran has sparked fresh speculation about Rajinikanth’s upcoming film Dharman after sharing a picture with the Superstar on her Instagram page. The actress posted the photo with the caption, “When you meet the legend, Photo toh banta hai”, clearly expressing her excitement at meeting one of Indian cinema’s biggest icons. However, the photograph has gained extra attention because Rajinikanth is seen in his Dharman look, leading to speculation that Shriya could be associated with the film. The possibility of a reunion has naturally caught fans’ attention because Shriya and Rajinikanth previously shared the screen in Shankar’s Sivaji: The Boss. Released in 2007, the blockbuster featured the two as the lead pair and remains one of Rajinikanth’s memorable collaborations. Interestingly, Shriya recently spoke about working with Rajinikanth and recalled being completely starstruck before their first meeting, even fearing that she would freeze during their first rehearsal. Meanwhile, Dharman, directed by Ashwath Marimuthu, is currently progressing with its third schedule in Hyderabad. Rajinikanth plays a doctor in the action entertainer, with Simran and Raashii Khanna also part of the cast, while Ram Pothineni has reportedly joined the project as the antagonist. For now, there is no official confirmation that Shriya Saran is part of Dharman. Her caption itself does not suggest anything about the film, but Rajinikanth’s Dharman appearance in the photograph has inevitably given the reunion rumours fresh fuel.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.   https://www.instagram.com/p/Dcc-n5GiyyU/
Ravi Teja has delivered an universally accepted content-driven blockbuster with his Irumudi. Directed by Shiva Nirvana and produced with high passion by Mythri Movie Makers, the movie shattering all records at the box office. The rush for tickets has been phenomenal and even on Monday, the movie collected on par with day 1.  Tuesday Bookings are unprecedented and the movie is going to be one of the most profitable films ever in History of Telugu Cinema. Already, the movie has collected Rs.100 crores+ gross in 4 days and it is the fastest ever 100 crore grosser for Ravi Teja. The movie sold more than 3.8 Million+ tickets across BMS and District apps.  In North America, the movie has grossed above $1.1 Million+ and it is the highest for a Ravi Teja starrer. Trade analysts are shocked looking at the intense bookings and maddening rush for the film in all centres across Telugu States. People who rarely watch movies are coming to theatres to enjoy the experience.  The movie attracted footfalls equal to Baahubali on first Monday and this is unprecedented in recent times. Ravi Teja is showcasing his absolute star power at the box office with a content driven film where every department gave their best. The performances of the ensemble cast, divine angle all are propelling the movie to unprecedented heights. Trade analysts are predicting never-seen-before profit margins for all parties involved. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  -100 కోట్లతో దూసుకుపోతున్న ఇరుముడికి షాక్  -తమని అగౌరవపరిచేలా ఉన్న సీన్స్ తొలిగించాలని టీచర్స్ డిమాండ్  -అభిమానుల్లో టెన్షన్ మాస్ మహారాజా రవితేజ ఇరుముడి ఐదు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరింది. దీంతో  అభిమానులతో పాటు చిత్ర యూనిట్ లో జోష్ నెలకొని ఉండగా ఇప్పుడు ఇరుముడిని ఊహించని విధంగా ఒక పెద్ద వివాదం చుట్టుముట్టింది. ఈ చిత్రంలో ఉపాధ్యాయుల ప్రతిష్టను, ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థను దిగజార్చేలా అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్య (APTF) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి ఉన్న గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్న ఆ సన్నివేశాలను వెంటనే  తొలగించాలని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల, ప్రధాన కార్యదర్శి బసవలింగారావు  డిమాండ్ చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సీలేరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల పేరుని  స్పష్టంగా ఉపయోగించడం, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ధరించే అధికారిక యూనిఫామ్‌నే సినిమాలో చూపిస్తూ ఉపాధ్యాయురాలి క్యారక్టర్ ని  నెగెటివ్ కోణంలో చిత్రీకరించడంపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నాయి. Also Read: అయ్యప్ప గెటప్‌లో డేవిడ్ వార్నర్.. ఇరుముడి ఫీవర్  సినిమా అనేది సమాజాన్ని ప్రజల ఆలోచనలని, అమితంగా ప్రభావితం చేసే అత్యంత శక్తివంతమైన మాధ్యమనేది నిజం. ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల వంటి సున్నితమైన అంశాలను తెరపై చూపించేటప్పుడు దర్శకనిర్మాతలు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని APTF నేతలు సైతం స్పష్టం చేశారు. మరి చిత్ర యూనిట్ ఈ విషయంపై ఈ విధంగా స్పందిస్తుందో చూడాలి. Irumudi, Teachers, Raviteja, Shiva Nirvana  
Nani’s highly anticipated pan-India action drama The Paradise is keeping its musical momentum high. After the first single Aaya Sher turned into a massive chartbuster with over 200 million views across platforms, the makers are now gearing up for the release of the much-awaited second single. Composer Anirudh Ravichander has completed the recording of the song, with director Srikanth Odela revealing the update on social media. “Just finished recording our second single... Gear up with your speakers... out soon,” he posted, raising expectations among fans. The behind-the-scenes picture shared by Odela has added further curiosity. It features Anirudh playfully seeking the blessings of lyricist Kasarla Shyam at the recording studio, hinting that the upcoming track could carry a strong local and energetic flavour. The excitement around The Paradise has already grown significantly following Nani’s recently released glimpse, which showcased the film’s intense world and generated strong anticipation. With the second single now ready, the makers are expected to announce its release date soon. Produced by Sudhakar Cherukuri, The Paradise is currently progressing through post-production and is slated for a worldwide release in multiple languages on September 24. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
నేటి వేగవంతమైన జీవనశైలిలో మహిళలు తమ ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ధ చూపలేకపోతున్నారు. దీనివల్ల చాలామంది మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో రక్తహీనత లేదా ఎనీమియా అత్యంత ప్రమాదకరమైనదిగా మారింది. శరీరంలో ఇనుప ధాతువు లేదా ఐరన్ లోపం వల్ల నిరంతరం అలసట, నీరసం, తలనొప్పి, కళ్లు తిరగడం, అలాగే చర్మం పాలిపోవడం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ విధమైన సమస్యల నుంచి బయటపడటానికి రోజూ మెడికల్ షాపుల్లో లభించే కేమికల్ మందులు లేదా ఐరన్ టాబ్లెట్లపై ఆధారపడటం కంటే, మన వంటింట్లో లభించే సహజసిద్ధమైన ఆహార పదార్థాలతో బలాన్ని పుంజుకోవడం ఎంతో శ్రేయస్కరం. ఈ క్రమంలోనే మహిళల ఆరోగ్యానికి దివ్యౌషధంగా పనిచేసే ఒక అద్భుతమైన ఐరన్ రిచ్ సూపర్ ఫుడ్ లడ్డూ వంటకం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ హెల్దీ మరియు రుచికరమైన ఐరన్ లడ్డూలను ఇంట్లోనే చాలా తక్కువ సమయంలో సులభంగా తయారు చేసుకోవచ్చు. దీని తయారీకి కావాల్సిన ప్రధాన దినుసులు మన ఇంట్లో సులభంగా లభించే నల్ల నువ్వులు, బెల్లం, వేయించిన పల్లీలు, బాదం, జీడిపప్పు, వాల్ నట్స్ మరియు కొద్దిగా నెయ్యి. నల్ల నువ్వులు మరియు బెల్లంలో సమృద్ధిగా ఐరన్, కాల్షియం నిక్షేపమై ఉంటాయి. ఇవి శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను వేగంగా పెంచడానికి అద్భుతంగా తోడ్పడతాయి. ముందుగా బాదం, జీడిపప్పు, పల్లీలను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత నువ్వులను కూడా లైట్‌గా వేయించి చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని బెల్లం తురుముతో కలిపి మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చివరిగా కొద్దిగా స్వచ్ఛమైన నెయ్యి కలిపి చిన్న చిన్న లడ్డూలుగా చుట్టుకుంటే ఎంతో రుచికరమైన ఐరన్ లడ్డూలు సిద్ధమవుతాయి. రోజువారీ ఆహారంలో కేవలం ఒక ఐరన్ లడ్డూను చేర్చుకోవడం ద్వారా శరీరానికి కావలసిన ఐరన్, ప్రొటీన్, మరియు ఇతర అవసరమైన ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో తీవ్రమైన అలసట, నీరసంతో బాధపడే మహిళలకు, గర్భిణులకు, అలాగే రక్తం తక్కువగా ఉన్న యుక్తవయసు బాలికలకు ఈ లడ్డూలు తక్షణ శక్తిని అందిస్తాయి. బెల్లంలో ఉండే సహజసిద్ధమైన తీపి శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎండు ఫలాలు (డ్రై ఫ్రూట్స్) లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా ఈ లడ్డూలను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి చర్మం మరియు జుట్టు కూడా ఎంతో ఆరోగ్యవంతంగా తయారవుతాయి.       How to increase hemoglobin naturally laddoo, sesame jaggery iron boosting superfood.
ప్రపంచవ్యాప్తంగా మధుమేహం లేదా డయాబెటిస్ వ్యాధి కోట్లాది మంది ప్రజల జీవితాలను నరకప్రాయంగా మారుస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 53 కోట్ల మంది మధుమేహంతో తీవ్ర అవస్థలు పడుతుండగా, రాబోయే 2050 నాటికి ఈ సంఖ్య ఏకంగా 85 కోట్ల మార్కును దాటిపోతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా బిళ్లలు వేసుకోవడం, వేళకు ఇన్సులిన్ ఇంజెక్షన్లు పొడుచుకోవడం డయాబెటిస్ రోగులకు నిత్యకృత్యమైపోయింది. ఈ నిరంతర నరకయాతన నుంచి మధుమేహ బాధితులకు విముక్తి కలిగించేందుకు చైనాకు చెందిన శాస్త్రవేత్తలు ఒక విప్లవాత్మక ఆవిష్కరణ చేశారు. కేవలం ఒక కప్పు పెరుగు రూపంలో ఉండే  స్మార్ట్  ప్రోబయోటిక్‌ను తీసుకోవడం ద్వారా డయాబెటిస్‌ను పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చని వారు నిరూపించారు. ఈ పరిశోధన విజయవంతమైతే రాబోయే రోజుల్లో ఇన్సులిన్ సూదుల అవసరమే ఉండకపోవచ్చు. చైనాలోని ఈస్ట్ చైనా నార్మల్ యూనివర్సిటీ పరిశోధకులు  గిఫ్ట్  (GIFT) అనే పేరుతో జన్యుపరంగా మార్పు చేసిన ఒక  స్మార్ట్  ప్రోబయోటిక్‌ను అభివృద్ధి చేశారు. ఈ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా మన శరీరంలో ఒక రహస్య గూఢచారిలాగా అత్యంత తెలివిగా పనిచేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణంగా ఉన్నంతవరకు ఈ బ్యాక్టీరియా శరీరంలో నిస్తేజంగా సైలెంట్‌గా ఉంటుంది. కానీ, ఎప్పుడైతే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ప్రమాదకరంగా పెరుగుతాయో, వెంటనే ఈ స్మార్ట్ బ్యాక్టీరియా అప్రమత్తమై మేల్కొంటుంది. అలా మేల్కొన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను వేగంగా తగ్గించే GLP 1 (గ్లూకోగాన్లై క్ పెప్టైడ్ 1) అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్, ఊబకాయం చికిత్సలో సంచలనం సృష్టిస్తున్న  ఓజెంపిక్  మందు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుందో, ఈ ప్రోబయోటిక్ కూడా అదే తరహాలో పనిచేయడం విశేషం. ఈ విప్లవాత్మక పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాలు అంతర్జాతీయంగా పేరుగాంచిన  నేచర్  (Nature) సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. శాస్త్రవేత్తలు ఇప్పటికే కోతులు, ఎలుకలపై నిర్వహించిన ముందస్తు ప్రయోగాల్లో ఈ స్మార్ట్ ప్రోబయోటిక్ అద్భుతమైన మరియు ఆశాజనక ఫలితాలను ఇచ్చింది. ఈ ఆవిష్కరణ వెనుక లీడ్ సైంటిస్ట్  యే హైఫెంగ్  దశాబ్దాల కష్టం దాగి ఉంది.       Gift smart probiotic diabetes treatment breakthrough,insulin free diabetes probiotic supplement launch.
బ్యాంకులో మన డబ్బు భద్రంగా ఉంటుందని భావిస్తాం, కానీ అదే బ్యాంక్ సాంకేతిక లోపాలు, నిర్లక్ష్యంతో అత్యవసర నిధులను నెలల తరబడి నిలిపివేస్తే ఆ బాధ వర్ణనాతీతం. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఒక చిన్న పల్లెటూరు చర్చి కమిటీకి సరిగ్గా ఇటువంటి విచిత్రమైన, కష్టతరమైన అనుభవమే ఎదురైంది. బ్రిటన్‌లోని ప్రముఖ లాయిడ్స్ బ్యాంక్ (Lloyds Bank) చేసిన చిన్న పొరపాటు, చూపించిన అలసత్వం వల్ల ఒక గ్రామీణ చర్చి నిధులు పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. గత సంవత్సరం నవంబర్‌లో లాయిడ్స్ బ్యాంక్ తమ పారిష్ చర్చి ఖాతాను మూసివేస్తున్నామని, దాని స్థానంలో కొత్త బిజినెస్ ఖాతాను తెరవాలని చర్చి ట్రెజరర్‌కు సమాచారం అందించింది. ఈ నూతన ఖాతా ప్రక్రియను కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే, బ్యాంక్ ఆన్‌లైన్ సిస్టమ్‌లోని సాంకేతిక లోపం వల్ల ట్రెజరర్‌తో పాటు లోకల్ బ్యాంక్ బ్రాంచ్ సిబ్బంది కూడా కొత్త ఖాతాను తెరవలేకపోయారు. దీంతో బ్రాంచ్ అధికారుల సలహా మేరకు, మార్చి నెల ప్రారంభంలో ట్రెజరర్ మరొక బ్యాంకులో నూతన ఖాతాను తెరిచారు. అప్పటి నుండి పాత ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌ను కొత్త ఖాతాలోకి బదిలీ చేయాలని లాయిడ్స్ బ్యాంకును నిరంతరం అభ్యర్థిస్తూనే వచ్చారు. కానీ బ్యాంక్ యజమాన్యం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. ప్రతిసారీ బ్రాంచ్‌ను సందర్శించాలని, కొద్ది వారాల్లో డబ్బు జమ అవుతుందని అధికారులు దాటవేత ధోరణి ప్రదర్శించారు. అంతటితో ఆగకుండా, ట్రెజరర్ సమర్పించిన గుర్తింపు పరిశీలన (Identity Verification) పత్రాలను బ్యాంక్ పోగొట్టుకుందని, అందుకే ఈ ఫైల్‌ను ప్రాధాన్యత జాబితాలో అత్యంత కిందకి నెట్టివేశామని చెప్పడం గమనార్హం. కాగా, కేవలం 60 ఇళ్ళు ఉన్న ఒక చిన్న గ్రామంలో, కేవలం 10 మంది సభ్యులు మాత్రమే ఉన్న చర్చి సంఘానికి నిలిచిపోయిన ఆ £5,500 (సుమారు 5.5 లక్షల రూపాయలకు పైగా) చాలా పెద్ద మొత్తం. చర్చికి అత్యవసరంగా కావలసిన మరమ్మతులు పూర్తి చేయడానికి, అలాగే కరెంట్ బిల్లులు చెల్లించడానికి వేరే దారి లేక చర్చి సభ్యుల నుండి అప్పుగా డబ్బులు సేకరించాల్సి వచ్చింది. ఈ దారుణమైన నిర్లక్ష్యంపై మీడియా మరియు కస్టమర్ ఛాంపియన్స్ దృష్టికి విషయం వెళ్ళడంతో లాయిడ్స్ బ్యాంక్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పబ్లిక్ మీడియాలో ఈ విషయం వెలుగులోకి వస్తుందని గ్రహించిన వెంటనే బ్యాంక్ వేగంగా స్పందించింది. తమ కమ్యూనికేషన్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయని అంగీకరిస్తూ ఒక క్షమాపణ లేఖను పంపింది. అలాగే సద్భావానకి (Goodwill) చిహ్నంగా £400 పరిహారం మరియు నిలిచిపోయిన కాలానికి వడ్డీ కింద £96 చెల్లిస్తామని ఆఫర్ చేసింది.       Lloyds Bank blocks 5500 pounds account balance, parish church funds frozen lloyds bank delay.
థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో ఒత్తిడి, ఆందోళన, అలసట, ఏకాగ్రత తగ్గడం వంటి ఇబ్బందులు కనిపించవచ్చు. ఇలాంటి సమయంలో ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు యోగా, ప్రాణాయామం కూడా కొంతమందికి ఉపయోగకరంగా ఉండొచ్చు. అలాంటి ప్రాణాయామాల్లో ఉజ్జయి ప్రాణాయామం (Ujjayi Pranayama) ఒకటి. దీనిని చేస్తూ శ్వాస తీసుకునేటప్పుడు గొంతు భాగంలో స్వల్పంగా శబ్దం వస్తుంది. అందుకే దీనిని కొందరు “Ocean Breath” అని కూడా అంటారు. ఈ వీడియోలో సీనియర్ యోగా థెరపిస్ట్, ఆయుర్వేద డైటీషియన్ స్రవంతి రఘు ఉజ్జయి ప్రాణాయామాన్ని ఎలా చేయాలి? శ్వాసను ఎలా  నియంత్రించాలి? రోజువారీ జీవితంలో దీనిని ఎలా ప్రాక్టీస్ చేయాలి? వంటి విషయాలను సులభంగా వివరిస్తున్నారు. థైరాయిడ్ సమస్యలతో పాటు ఒత్తిడి, మానసిక ఆందోళన లేదా ఏకాగ్రత లోపం వంటి సమస్యలు ఉన్నవారు ఈ ప్రాణాయామం గురించి తెలుసుకోవచ్చు. అయితే ప్రాణాయామం థైరాయిడ్‌కు వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. థైరాయిడ్‌కు మందులు వాడుతున్నవారు వైద్యుల సూచనలను తప్పకుండా పాటించాలి. గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించిన తర్వాత యోగా లేదా ప్రాణాయామాన్ని ప్రారంభించడం మంచిది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
సూపర్‌మార్కెట్‌లో, షాప్స్ లో, చిన్న అంగళ్లలో కొనుగోలు చేసే బిస్కెట్లు, ప్యాకెట్ ఫుడ్స్, పాల ఉత్పత్తులు, జ్యూస్‌లు, సాస్‌లు, రెడీ-టు-ఈట్ ఆహార పదార్థాలపై “Best Before”, “Use By”, “Expiry Date” వంటి పదాలు కనిపిస్తుంటాయి. చాలామందికి వీటి మధ్య తేడా స్పష్టంగా తెలియదు. “తేదీ అయిపోయింది కదా… ఇక ఆహారం మొత్తం పారేయాలా?” అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అంతే కాదు.. తేదీ దాటి ఇంకా ఒక్కరోజే, ఒక్క వారమే.. కాబట్టి ఏమి కాదు అనుకుని  వాడేవాళ్ళు  కూడా ఉంటారు. అయితే Best Before తేదీ , Use By/Expiry తేదీ ఒకే అర్థాన్ని ఇవ్వవు. ఆహారం ఎంతకాలం నాణ్యతగా ఉంటుంది? ఎప్పుడు దాన్ని తినడం సురక్షితం కాదు? అనే విషయాల్లో ఈ తేదీలకు చాలా తేడా ఉంది. దీని గురించి ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. తేదీ ఎందుకు వేస్తారు? ఆహార పదార్థాలను తయారు చేసిన తర్వాత వాటి రుచి, వాసన, రంగు, ఆకృతి, పోషకాల నాణ్యత, భద్రత కాలం గడిచేకొద్దీ మారవచ్చు. అందుకే తయారీదారులు ప్యాకెట్‌పై ఒక నిర్దిష్ట తేదీని సూచిస్తారు. అయితే ఆ తేదీ ప్రతి సందర్భంలో “ఆ రోజు తర్వాత ఆహారం విషంగా మారుతుంది” అని అర్థం కాదు.  ఇక్కడే Best Before, Use By మధ్య తేడా వస్తుంది. “Best Before” అంటే ఏమిటి? Best Before అంటే ఆ ప్యాక్ లో ఉన్న ఆహార పదార్థం  మంచి నాణ్యతను కలిగి ఉండే కాలం. అంటే, ప్యాకెట్‌పై..  ఒక నిర్దిష్ట తేదీ వరకు ఆహారం తన రుచి, వాసన, క్రిస్పీనెస్, రంగు వంటి నాణ్యతలను బాగా కలిగి ఉంటుందనీ అర్ధం. తేదీ దాటిన వెంటనే ఆహారం పాడైపోతుందా? సరిగ్గా నిల్వ చేసిన కొన్ని ఆహార పదార్థాలు Best Before తేదీ దాటిన తర్వాత కూడా కొంతకాలం తినడానికి అనుకూలంగా ఉండవచ్చు. అయితే వాటి నాణ్యత తగ్గి ఉండవచ్చని చెబుతున్నారు. ఉదాహరణకు.. బిస్కెట్లు మెత్తబడవచ్చు, సీరియల్స్ క్రిస్పీనెస్ కోల్పోవచ్చు, కొన్ని ప్యాకెట్ ఫుడ్స్ రుచి తగ్గవచ్చు, టీ, కాఫీ వంటి పదార్థాల సువాసన తగ్గవచ్చు. అందుకే  Best Before అనేది ప్రధానంగా నాణ్యతకు సంబంధించిన అంశం అని చెబుతారు. “Use By” అంటే ఏమిటి? Use By అనేది ఆహారం  భద్రతకు సంబంధించిన గడువు. ఈ తేదీ ముఖ్యంగా త్వరగా పాడయ్యే ఆహార పదార్థాలకు వర్తిస్తుంది. ఉదాహరణకు: కొన్ని తాజా పాల ఉత్పత్తులు,  తాజా మాంసం, చేపలు, కొన్ని రెడీ-టు-ఈట్ ఆహారాలు, త్వరగా పాడయ్యే ఇతర ఆహారాలు ప్యాకెట్‌పై నిర్ణీత తేదీ ఉంటే.. ఆ తేదీ దాటిన తర్వాత అది బయటికి చూడటానికి లేదా వాసనకు బాగానే ఉన్నప్పటికి తినడం సురక్షితం అని అని అనుకోకూడదు.  అందుకే Use By తేదీ దాటిన ఆహారాన్ని తినకుండా ఉండటం మంచిది. Best Before తేదీ దాటితే ఏం చేయాలి? ఆహారం ఏ రకమైనది, ఎలా నిల్వ చేశారు, ప్యాకెట్ తెరిచారా లేదా అనే విషయాలపై ఇది ఆధారపడి ఉంటుంది. కొన్ని ఆహారాలు ఈ తేదీ దాటిన తర్వాత కూడా తినడానికి అనువుగానే ఉంటాయి. కానీ వాటిలో నాణ్యత మాత్రం తగ్గిపోయి ఉంటుంది. అలాంటి ఆహారం తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. వాసన చూసి ఆహారం సురక్షితమా కాదా తెలుసుకోగలమా? కొన్ని హానికరమైన బ్యాక్టీరియా లేదా ఇతర సూక్ష్మజీవులు ఆహారంలో పెరిగినా, ఆహారంలో  దుర్వాసన, రంగు మార్పు కనిపించకపోవచ్చు కూడా. అందువల్ల ఆహారం వాసన రాలేదనే కారణంతో తినడం సరైనది కాదు. ముఖ్యంగా Use By తేదీ దాటిన ఆహారాన్ని కేవలం వాసన లేదా రుచి చూసి ఏమి కాదని  నిర్ధారించుకోవడం సరైన పద్ధతి కాదు. ప్యాకెట్ తెరిచిన తర్వాత గడువు మారుతుందా? కొన్ని ఆహార పదార్థాలకు ఇది చాలా ముఖ్యమైన విషయం. కొన్ని ఆహారాల మీద best before అని ఉన్నా.. ప్యాకెట్ లు లేదా బాటిల్ మూతలు తెరిచిన తర్వాత వాటిని ఎక్కువ రోజులు వాడటం మంచిది కాదు. వాటిని తొందరగా వాడేయాలి.                                                                                                                                                   *రూపశ్రీ.
ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? ఇది ఎందుకు వస్తుంది? లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలా గుర్తించాలి? అనే విషయాలను ఈ వీడియోలో డాక్టర్ ఆర్. బాలాజీ సులభంగా వివరిస్తున్నారు. కాలేయ కణాల్లో అధికంగా కొవ్వు పేరుకుపోవడాన్ని ఫ్యాటీ లివర్ (Fatty Liver Disease) అంటారు. చాలా మందిలో దీనివల్ల ప్రారంభ దశలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. అయితే కొంతమందిలో అలసట, బరువు తగ్గడం లేదా పొత్తికడుపులో అసౌకర్యం వంటి సమస్యలు కనిపించవచ్చు. అధిక బరువు, ఊబకాయం, జీవనశైలి వంటి కారణాలు ఫ్యాటీ లివర్‌కు దారితీయవచ్చు. ఆహారపు అలవాట్లలో మార్పులు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బరువును నియంత్రించుకోవడం ద్వారా ప్రమాద కారకాలను తగ్గించుకోవచ్చు. ఫ్యాటీ లివర్‌ను నిర్లక్ష్యం చేయకుండా సరైన సమయంలో వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం. కొంతమందిలో ఈ సమస్య కాలేయంలో తీవ్రమైన మార్పులకు దారితీసే అవకాశం ఉంటుంది. ఫ్యాటీ లివర్‌కు కారణాలు ఏమిటి? దాని లక్షణాలు ఏంటి? ఎలా నిర్ధారిస్తారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి పూర్తి వివరాలను డాక్టర్ ఆర్. బాలాజీ ఈ వీడియోలో వివరించారు. వీడియోను పూర్తిగా చూడండి.. ఫ్యాటీ లివర్ గురించి ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి. గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు లేదా లక్షణాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)