Home

»

Latest News

కొమురం యాక్టింగ్‌కి మాస్ మహారాజా ఫిదా.!

Aug 25, 2026 1:11PM

మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన బ్లాక్‌బస్టర్ మూవీ 'ఇరుముడి'. ఈ సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్న రవితేజ, సినిమాలో 'నాగులు' పాత్ర చేసిన 'కొమురం' నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. 

రవితేజ ఎల్లప్పుడూ టాలెంట్ ఉన్న ఆర్టిస్టులను ప్రోత్సహించడంలో ముందే ఉంటారు. సినిమా వేదికల మీద తోటి నటీనటుల గురించి ఆయన ఓపెన్ గా మాట్లాడే తీరు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుంది. ఇటీవల జరిగిన 'ఇరుముడి' వేడుకలో రవితేజ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

దర్శకుడు శివ నిర్వాణ విజన్ ను, ఆయన విజన్‌లోని కన్విక్షన్ ను రవితేజ ఎంతో ప్రశంసించారు. శివ నిర్వాణ తనకు ఉన్న నమ్మకంతోనే కొమురం వంటి నటుడితో అంతటి విభిన్నమైన, అద్భుతమైన క్యారెక్టర్ చేయించగలిగారని రవితేజ కొనియాడారు. ఒక దర్శకుడికి తన నటీనటుల ఎంపికపై ఉన్న స్పష్టతే ఆ సినిమా విజయాన్ని నిర్ణయిస్తుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

ఈ వేడుకలో రవితేజ కేవలం కొమురం పాత్రపైనే కాకుండా, సినిమాలో నటించిన ఇతర నటీనటులందరి పనితీరుపై కూడా ప్రత్యేకంగా స్పందించారు. భార్గవ్, కిషోర్, కొమురం వంటి నటులను దర్శకుడు చాలా చక్కగా ఎంచుకున్నారని, ప్రతి ఒక్కరూ తమ పాత్రల్లో చాలా బాగా చేశారని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. సీనియర్ హీరో నోటి నుంచి వచ్చిన ఈ ప్రశంసలు ఆయా ఆర్టిస్టులకు ఎంతో బూస్ట్ ఇచ్చాయనే చెప్పాలి.

 

 

 

Irumudi, Ravi Teja, Shiva Nirvana, Komaram

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com