LATEST NEWS
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ , తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య విభేదాలు తెలియనివి కావు. అయితే ఆ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఇరువురి మధ్యా విభేదాల ఒక ఆలయంలో జరుగుతున్న ఆధ్మాత్మిక కార్యక్రమం సందర్భంగా భగ్గుమనడం సంచలనం సృష్టించింది. అయితే పరిస్థితి అదుపు తప్పకుండా ఎంపీ కేశినేని హుందాగా వ్యవహరించగా, ఎమ్మెల్యే కొలికపూడి తీరు అరాచకంగా ఉందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఇంతకీ జరిగిందేంటంటే..  ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2)  దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు.   నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు  కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.  తలంబ్రాలను ఎమ్మెల్యే కొలికపూడికి ఇచ్చారు. అయితే, పట్టువస్త్రాలు తనకే ఇవ్వాలని, స్థానిక ఎమ్మెల్యేగా ఆ గౌరవం తనకే దక్కాలని కొలికపూడి పట్టుబట్టారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఫలితం లేకపోవడంతో కొలికపూడి హద్దుదాటి ప్రవర్తించారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వెడుతున్న ఎంపీ కేశినేని చిన్ని చేతుల్లోంచి లాగేసుకున్నారు. మామూలుగా అయితే కొలికపూడి తీరుతో అక్కడ పెద్ద ఘర్షణ జరిగి ఉండేది. కానీ కేశినేని చిన్ని తన వర్గీయులను శాంతంగా ఉండాలంటూ ఘర్షణ నివారించడమే కాకుండా కొలికపూడి స్వామి వారికి పట్లు వస్త్రాలను సమర్పించే కార్యక్రమాన్ని నవ్వుతూ తిలకించారు. సామాన్య భక్తులతో కలిసి స్వామివారి కల్యాణాన్ని వీక్షించారు.  దీంతో స్వామి వారి సమక్షంలో పరిస్థితి అదుపు తప్పకుండా కేశినేని చిన్ని  హుందాగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. అదే సమయంలో కొలికపూడి తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతుున్నాయి.  
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వారం అంతా చాలా బిజీబిజీగా గడపనున్నారు. రాష్ట్రాన్ని కుదిపేసిన కల్తీ పాల మరణాలు, బాణాసంచా పేలుడు ఘటన కారణంగా జరిగిన మరణాలు ఉన్నా.. జగన్ ఆయా సంఘటన బాధితులను పరామర్శించే పని పెట్టుకోలేదు. ఈ వారంలో ఆయన షెడ్యూల్ లో పెళ్లి వేడుకలకు హాజరు కావడం మాత్రమే ఉంది.  తొలుత ఆయన సోమవారం కల్తీ పాల మృతుల కుటుంబాలను పరామర్శిస్తారని వైసీపీ వర్గాలు చెప్పాయి. అయితే సోమవారం వచ్చింది. వెళ్లింది. కానీ జగన్ మాత్రం బెంగళూరు ప్యాలెస్ దాటి అడుగు బయటపెట్టలేదు.  మంగళవారం (ఫిబ్రవరి 3)ఆయన తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చారు. ఆ సందర్భంగా తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క్ తాడేపల్లి ప్యాలెస్ ను విజిట్ చేసి తన కుమారుడి పెళ్లికి జగన్ ను ఆహ్వానించి, ఆహ్వానపత్రిక ఇచ్చారు. వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి  వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు. దీంతో అంతకు ముందు రోజే అమరావతిలో చంద్రబాబును కలిసి తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించిన భట్టి, మరో సారి ఏపీకి వచ్చి జగన్ ను ఆహ్వానించాల్సిన పరిస్థితి వచ్చింది.  సరే జగన్ భట్టి అందించిన ఆహ్వాన పత్రికను అందుకోవడం వినా మంగళవారం (మార్చి 3) మరో కార్యక్రమం పెట్టుకోలేదు. ఇక బుధవారం (మార్చి 4) జగన్ అరకులో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహానికి హాజరయ్యారు. , ఆ తరువాత విశాఖ లో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నివాసానికి వెళ్లారు. ఇటీవల వాసుపల్లి గణేష్ కుమారుడి వివాహం జరిగిన సంగతి తెలిసిందే.  వాసుపల్లి నివాసానికి వెళ్లిన జగన్  నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ రెండు సందర్భాలలోనూ జగన్ భారీ జనసమీకరణ జరిగేలా అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు.  తాడేపల్లికి తిరిగి వచ్చారు. సాధారణంగా జగన్ తన రెండుమూడు రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటనల్లో పరామర్శ యాత్రలకూ, తన నివసంలో ఏర్పాటు చేసే మీడియా సమావేశాలకే ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఈ వారం మాత్రం ఆయన ఆనవాయితీని కాదని.. ఎమ్మెల్యే కుమారుడి పెళ్లి, మాజీ ఎమ్మెల్యే కుమారుడిని ఆశీర్వదించి రావడానికే పరిమితమయ్యారు.  మండలిలో లడ్డూ వివాదంపై రభస జరుగుతున్నా దాని గురించి పల్లెత్తు మాట మాట్లాడలేదు. రాజమహేంద్రవరంలో ఇటీవల కల్తీ పాలు కారణంగా మరణాలు సంభవించినా, శ్రీకాకుళం జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడులో పలువురు మరణించినా.. ఆయా ఘటనలో మృతుల కుటుంబాలను పరామర్శించాలని కూడా భావించలేదు.   
ఆంధ్రప్రదేశ్ మండలి చైర్మన్ పై వైసీపీ ఎమ్మెల్సీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమౌతున్నారా?  అంటే పరిశీలకుల నుంచి ఔననే సమాధానమే వస్తున్నది. స్వయంగా వైసీపీకి చెందిన మండలి చైర్మన్  మోషేనురాజుపై వైసీపీ ఎమ్మెల్సీలే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడమేంటని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం.. ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు.  అయితే  మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు. దీంతో వారు టెక్నికల్ గా ఇంకా వైసీపీ ఎమ్మెల్సీలుగానే ఉన్నారు. దీనిపై వారిలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే వారు మండలి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. రాజీనామా చేసిన ఎమ్మెల్సీలే కాకుండా.. రాజీనామా యోచనలో ఉన్న మరో ముగ్గురు వైసీపీ సభ్యులు కూడా ఈ అవిశ్వాస తీర్మానానిని మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. దీంతో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు అవసరమైన సంఖ్యాబలం ఉండటంతో  ఇక ఆ దిశగా అడుగులు వేయాలని వారు కృతనిశ్చయంతో ఉన్నట్లు చెబుతున్నారు.  మండలి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు వైసీపీకి రాజీనామా చేసిన  పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకట రమణలు సమాయత్తమౌతున్నారని అంటున్నారు.  ఇలా ఉండగా ఎమ్మెల్సీలుగా రాజీనామా చేసిన ఈ ఐదుగురూ పార్టీ ఫిరాయింపునకు పాల్పడ్డారనీ, వీరిపై అనర్హత వేటు వేయాలని వైసీపీ చేసిన ఫిర్యాదు మేరకు మండలి  ఛైర్మన్  విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో మండలి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని వైసీపీకి చెందిన రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు నిర్ణయించుకోవడం రాజకీయంగా అత్యంత  ప్రాధాన్యత సంతరించుకుంది. 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తన కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసేశారు. ఉగాది తరువాత ఏక్షణంలోనైనా కేబినెట్ ఎక్స్ పాన్షన్ ఉంటుందా అంటే తెలుగుదేశం వర్గాల నుంచి ఔనన్న సమాధానమే వస్తున్నది. కేవలం విస్తరణకే పరిమితం కాకుండా కేబినెట్ లో మార్పులూ, చేర్పులతో పూర్తి స్థాయి ప్రక్షాళన జరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని దేశం వర్గాలు అంటున్నాయి. మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున  మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.  తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే  కూటమి భాగస్వామ్య పక్షాలైన జనసేన, బీజేపీల నుంచి కూడా కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు ఆయా పార్టీలతో చర్చలు జరపాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.    ఇటీవలి కాలంలో ఆయన కొందరు మంత్రుల పనితీరును విమర్శించిన సందర్భాలను ఇందుకు ఉదాహరణగా తెలుగుదేశం వర్గాలు ఉటంకిస్తున్నాయి. మంత్రుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి పని తీరు సంతృప్తికరంగా లేని మంత్రులకు ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత మంత్రివర్గ ప్రక్షాళనపై చంద్రబాబు దృష్టి కేంద్రీకరించే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు.  
  రాజ్యసభ  ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది. కమలం పార్టీ కొత్త అధ్యక్షుడు నితిన్ నబీన్, శివేశ్ కుమార్, బిహార్ నుంచి ఎంపిక కానున్నారు. అస్సాం నుంచి తెరాశ్ గోవల్ల, జోగెన్ మోహన్, ఛత్తీస్‌గఢ్ నుంచి లక్ష్మీ వర్శ, హరియాణా నుంచి సంజయ్ భాటియా, ఒడిశా నుంచి మన్మోహన్ సమాల్, సుజీత్ కుమార్, పశ్చిమ బెంగాల్ నుంచి రాహుల్ సిన్హాను కాషాయ పార్టీ ఎంపిక చేసింది. ఈ నెల 16న ఎన్నికలు జరగనున్నాయి.10 రాష్ట్రాల్లోని మొత్తం 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో తెలంగాణ నుంచి 2 స్థానాలు ఖాళీ కానున్నాయి. బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ పదవీ కాలం ముగియనుంది. వీరి పదవి కాలం ఏప్రిల్ 9వ తేదీతో ముగియనుండటంతో  రాజ్యసభ ఎంపీల ఎన్నిక అనివార్యమైంది.  కాగా రాజ్యసభ ఎన్నికకు సంబంధంచి ఫిబ్రవరి 26న నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. మార్చి 5న నామినేషన్లకు చివరి తేదీ కావడంతో రెండు రోజుల్లో రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ నేతలు నిర్ణయించినట్లు తెలిసింది. కాగా రాజ్యసభ సభ్యుల ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్ చేసింది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్‌ ఆశించి  రాకపోయినప్పటికీ పార్టీ గెలుపుకు కృషి చేసిన నేతలకు ఈ సీట్లు కేటాయించాలనే అంశంపై పార్టీ నాయకుల మధ్య చర్చ జరిగింది. కాగా, రాజ్యసభ ఎంపీల రేసులో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వీ హన్మంతరావు, బెల్లయ్య నాయక్, దొమ్మాటి సాంబయ్య పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది.   
ALSO ON TELUGUONE N E W S
    నందమూరి బాలకృష్ణ అంటే ఒక ఫెరోషియస్ హీరో.. తన డైలాగులతో థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేయగల నటుడు. అదే సమయంలో చక్కని కామెడీ టైమింగ్ కూడా ఉన్న నటుడు. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమాల్లో అత్త, మరదళ్లను కవ్విస్తూ.. వారితో చేసే విన్యాసాలు ప్రేక్షకుల్ని బాగా ఎంటర్‌టైన్ చేస్తాయి. ఆ తరహా సినిమాలు బాలకష్ణ కెరీర్‌లో చాలా చేశారు. వాటిలో ముఖ్యంగా చెప్ప్పుకోదగిన సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’. బాలకష్ణ, శోభన, నిరోషా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు.    1990లో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా రిలీజ్ అయ్యే నాటికి బాలకష్ణ, కోదండరామిరెడ్డి యాక్షన్ సినిమాల‌తో దూసుకెళ్తున్నారు. అలాంటి సమయంలో వచ్చిన ‘నారీ నారీ నడుమ మురారి’ ప్రేక్షకులకు, నందమూరి అభిమానులకు చాలా భిన్నంగా అనిపించింది. ఈ సినిమా ఆద్యంతం ఎంతో వినోదాత్మకంగా ఉంటుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో మాదిరిగా డాన్సులు, ఫైట్స్ ఈ సినిమాలో ఉండవు. సినిమా అంతా ఎంతో సరదాగా, అక్కడక్కడ కొన్ని ఎమోషనల్ సీన్స్‌తో నడిచిపోతుంది. ఈ సినిమాలో సరదా సరదాగా సాగే కొన్ని సన్నివేశాలతో కూడిన వీడియోను మీకు అందిస్తున్నాం.  ఈ కథలో శేషారత్నం అధికారాన్ని చలాయిస్తూ భర్తను, తన కూతుళ్లను అదుపులో పెట్టుకుంటుంది. అదే సమయంలో ఊరి నుంచి వచ్చిన మేనల్లుడు వెంకన్న(బాలకృష్ణ)తో చిన్నచూపుగా మాట్లాడుతుంది. వెంకన్న మాత్రం ఎంతో ఉత్సాహంగా అత్తను, మరదళ్లను ఏడిపిస్తూ ఉంటాడు. ఆ సందర్భంలోనే తన కూతుళ్లను ఒక పల్లెటూరి నాటు మనిషికి ఇచ్చి పెళ్లి చేసే కర్మ తనకు పట్టలేదని, తన కూతుళ్ల చెప్పులు మోసే అర్హత కూడా అతనికి లేదని తీవ్రంగా అవమానిస్తుంది. దానికి బాలయ్య తనదైన స్ట‌యిల్‌లో ‘నీ అహంకారాన్ని తగ్గించి, నువ్వే నా కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకునేలా చేస్తాను’ అని ఛాలెంజ్ చేస్తాడు.  అత్తతో ఆ అల్లుడు ఎలా ఆడుకున్నాడు, మరదళ్లతో ఎలాంటి సరసాలు సాగించాడు అనే ఆసక్తికరమైన సన్నివేశాలతో సినిమా సాగుతుంది. ‘మొగుడి మాటలు కాదని కుక్కల మాటలు, పందుల మాటలు వింటుంటే ఇలాగే జరుగుతుంటాయి’ అని కైకాల సత్యనారాయణ చెప్పే డైలాగ్, మరదళ్లు పందెం వేసుకున్న సందర్భంలో ‘నేను గెలిస్తే పెళ్లయిన తర్వాత నువ్వు మా ఆయన్ని ఏమీ అనకూడదు’ అని ఒక మరదలు అంటే, ‘మరి మీ ఆయన నా మీద సరదా పడితే మాత్రం నేను కాదనను’ అని మరో మరదలు చెప్పే డైలాగ్ నవ్వులు పూయిస్తుంది. ప్రేక్షకులు, నందమూరి అభిమానులు కోరుకునే మాస్ ఎలిమెంట్స్‌తో పాటు కుటుంబ బాంధవ్యాలను తెలియజెప్పే సీన్స్ కూడా ఇందులో ఉంటాయి. నీతిని కాపాడే ఒక ధీరోదాత్తుడైన అల్లుడి పాత్రలో బాలకష్ణ జీవించారనే చెప్పాలి. ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ వీడియోను క్రింద ఇస్తున్నాం. చూసి ఆనందించండి. ఇలాంటి వినోదాత్మక వీడియోల కోసం Teluguone cinemaను Subscribe చేసుకోండి.   
  -విజయ్, సంగీత కేసు పరిస్థితి ఏంటి -మధ్యవర్తిత్వానికి తేరా లేపారా! -అదంతా రూమరేనా! ఇళయ దళపతి 'విజయ్'(Vijay)కి ఇటీవల భార్య సంగీత(sangeeta)విడాకుల నోటీసు పంపించిన సంగతి  తెలిసిందే. ఆ ఇద్దరి మధ్య ఎప్పట్నుంచి ఇంటర్నల్ గా గొడవలు జరుగుతున్నాయో తెలియదు కానీ, సడెన్ గా సంగీత విడాకులు పంపించడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ తో పాటు యావత్ ఇండియన్ సినీ పరిశ్రమ షాక్ కి గురయ్యింది. దీంతో ఎవరు ఎంత బిజీలో ఉన్నా విజయ్, సంగీత ఎపిసోడ్ కి సంబంధించిన మరిన్ని కొత్త విషయాల కోసం సోషల్ మీడియాని అస్సలు వదలటం లేదు. ఈ నేపథ్యంలో న్యూ అప్ డేట్ ఒకటి ఆ అందరు మరింతగా చర్చించుకునే అవకాశాన్ని కల్పించింది. కాకపోతే ఆ  అప్ డేట్ హోదా రూమర్. ఏంటో చూద్దాం. సంగీత ఇష్యు మరింతగా పబ్లిక్ లోకి వెళ్లకుండా విజయ్ సామరస్యంగా ముగించాలని చూస్తున్నాడని, అందుకు గాను కోర్టు దాకా వెళ్లకుండా సంగీత, కుమారుడు జేసన్ సంజయ్, కూతురు సాషాల భవిష్యత్తుతో పాటు ఆర్ధిక నిలకడ కోసం 250 కోట్ల రూపాయలని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని, ఇందు కోసం విజయ్ కొంత మంది పెద్దలని రంగంలోకి దింపాడనే వార్తలు తమిళ సినీ మార్కెట్ తో పాటు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ముందుగానే చెప్పుకున్నట్టు రూమర్ హోదాలోనే.  aslo read: Peddi: రామ్ చరణ్ రుద్రతాండవం.. రై రై పుట్టుకకి కారణం చెప్పిన అనంత్ శ్రీరామ్  ఏది ఏమైనా విజయ్ కి ఈ ఇయర్ ప్రారంభమే షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. పొంగల్ కి రిలీజ్ కావాల్సిన 'జన నాయగన్'(Jana Nayagan)సెన్సార్ ఎంట్రీ వల్ల ల్యాబ్ లోనే ఉంది. రిలీజ్ విషయం కూడా చెప్పలేని పరిస్థితి. మళ్ళీ నెల రోజులకే సంగీత నుంచి విడాకుల నోటీసు. ఈ నేపథ్యంలో  మే లేదా జూన్ లో జరిగే ఎన్నికల్లో విజయ్ తన కొత్త పొలిటికల్ పార్టీ తమిళగ వెట్రి కజగం ద్వారా ఎలాంటి ఫలితాలని చవి చూడబోతున్నాడనే ఆసక్తి ఏర్పడింది.  
-రికార్డు వ్యూస్ తో  రై రై  సాంగ్  -ఆసక్తి కర విశేషాలని పంచుకున్న అనంత్ శ్రీరామ్  -మీ కోసమే ఎక్స్ క్లూజివ్ గా  స్టిల్ 'పెద్ది'(Peddi)లోని 'సెకండ్ సాంగ్' రై రై రారా'(Rai Raa Raa)తన ఊచకోతని ఒక రేంజ్ లోనే చేస్తుంది. ఎంతలా అంటే ఇప్పటి వరకు రికార్డు ప్లేస్ లో ఉన్న అన్ని సాంగ్స్ ఈర్ష్య, అసూయతో రగిలిపోయేంతలా. హెల్త్ దెబ్బతింటుందేమో అని హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ చేయించుకుందామని అనుకున్నా మళ్ళీ రై రై రారా వినపడే పరిస్థితి ఉండటంతో మిన్నుకుండిపోయారు. ఈ విషయంలో పెద్ది ఫస్ట్ సింగల్ 'చికిరి' సాంగ్ కి మినహాయింపు లేదు. అసలు తెలుగు చిత్రసీమలో ఒక పాట విడుదలైన గంటల్లోనే మిలియన్ల వ్యూస్ సాధించి, కుర్రకారు గుండెల్లో మంట పుట్టిస్తోందంటే మామూలు విషయం కాదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'రుద్రతాండవం', ఏఆర్ రెహ్మాన్ 'శంఖారావం', దర్శకుడు బుచ్చిబాబు దార్శనికతకి అనంత శ్రీరామ్ కలం నుండి జాలువారిన అద్భుతమైన సాహిత్యం ప్రాణం పోసింది. 'రై రై రారా' సాంగ్  కేవలం వినడానికి మాత్రమే కాదు, ప్రతీ మధ్యతరగతి యువకుడిని ఉర్రూతలూగించే ఒక స్ఫూర్తి గీతం. రీసెంట్ గా మా తెలుగు వన్ తో  రై రై రారా ని రాసిన గీత రచయిత  అనంత శ్రీరామ్ (Anantha sriram)ముచ్చటించడం జరిగింది. సదరు ముచ్చట్లలో పాట వెనుక ఉన్న అసలు రహస్యాలు మరియు భావోద్వేగాలుని పంచుకున్నారు.    ఆయన మాట్లాడుతు మండే గుండె.. మారుతున్న రక్తం! ఈ పాటలోని ప్రతి అక్షరం ఒక యుద్ధంలా సాగుతుంది. "పాతికేళ్లకే నువ్వు పాతపడిపోకురా" అనే లైన్ ఈ రోజుల్లో యువతకి ఒకహెచ్చరిక లాంటిది. మనం రోజూ తినే పప్పు టమాటా తింటూ, పాత అప్పులే కడుతూ ఉంటే మన జీవితంలో కొత్తదనం ఏముంది? "నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేమి పొడిచావు. మనిషికి కేవలం కండరాలు ఉంటే సరిపోదు, లోపల గెలవాలనే 'మండే గుండె' ఉండాలని రాసాను. ఈ సాంగ్ రాయడానికి రెండు నెలల సమయం తీసుకున్నాను. బుచ్చిబాబు, నా మధ్య     'స్నేహపూర్వక యుద్ధం' జరిగిందని చెప్పవచ్చు. ఒకరిని మించి ఒకరు అద్భుతమైన భావాలను పంచుకుంటూ, ఏఆర్ రెహ్మాన్ అందించిన కొత్త ఓరవడి సంగీతానికి తగ్గట్టుగా  పదాలని తీర్చిదిద్దాం. విశేషమేమిటంటే, ఇంత పెద్ద గ్లోబల్ సినిమాలో వచ్చే మొదటి పాటలో ఒక్క ఆంగ్ల పదం లేకుండా పూర్తి తెలుగు పదాలతో రాసాను. ఒక గొప్ప సాహసం చేశాను.  ఇక ఈ సాంగ్ లో చరణ్ గారు చేసిన డ్యాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సాధారణంగా హుక్ స్టెప్పులు అందరూ చేసేలా సులువుగా ఉంటాయి. కానీ చరణ్ గారిలోని పూర్తి సామర్థ్యాన్ని వాడాలని జానీ మాస్టర్ కఠినమైన స్టెప్పులని  డిజైన్ చేశారు. అన్నీ మనం చేయడానికి కాదు, కొన్ని మనం చూడడానికి ఉంటాయి. ఈ విషయాన్నీ రై రై రుజువు చేసింది. వైలిన్ బిట్ వచ్చినప్పుడు చరణ్ గారు వేసిన స్టెప్పులు చూస్తుంటే కళ్ళు ఆర్పడం  మర్చిపోతాం. 'పెద్ది' లాంటి సినిమా పది సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఒక గొప్ప సినిమా. ఈ నాలుగు నిమిషాల పాట ఇచ్చిన ఉద్వేగానికి వంద రెట్లు ఉద్వేగం మూడు గంటల సినిమాలో ఉంటుంది. తెలుగు భాషా మాధుర్యాన్ని, స్ఫూర్తిని రగిలించే ఇటువంటి పాటలను ఆదరిస్తున్న ప్రేక్షకులకి కృతజ్ఞతలు. లిరిక్స్ , డ్యాన్స్  పోటీ పడుతున్నాయని, ఇంత మోటివేషనల్ సాంగ్ రావడం ఒక వరం లాంటిదని చరణ్ గారు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఇలా రై రై తో పాటి పెద్ది సంబంధించిన ఆసక్తి కర విషయాలని అనంత శ్రీరామ్ పంచుకున్నారు. తాను పెద్ది సిల్వర్ స్క్రీన్ పై కనపడటం లేదని కూడా చెప్పుకొచ్చారు.  also read: కన్నడ హీరోయిన్ల సంచలన పోస్ట్.. ఆ టిప్పు సుల్తాన్ మాకు ఎప్పుడో తెలుసు    మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు, అనంత శ్రీరామ్ గారి ఎనర్జిటిక్ ఇంటర్వ్యూ పూర్తి వీడియో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? వెంటనే మా యూ ట్యూబ్  ఛానల్ తెలుగు వన్  కి విజిట్ అవ్వండి. మరిన్ని సినీ విశేషాలు మీ కోసం వెయిటింగ్. సబ్ స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్.  ఛానల్ మటుకు మార్చకండి.  
  -పోస్ట్ లో ఏముంది  -ఎవర్ని టార్గెట్ చేసారు  -అసలు ఆ అవసరం ఎందుకు వచ్చింది గాడ్ క్రియేట్ చేసిన వాటిల్లో 'కళ' కూడా ఒకటి. సదరు కళకి మరో రూపం సినిమా. అలాంటి  సినిమా సుదీర్ఘ కాలం నుంచి యావత్తు విశ్వాన్ని అలరిస్తూ వస్తుంది. ఈ విషయంలో కులం, మతం,ప్రాంతం, దేశం అనే బేధాలు ఉండవు. కేవలం కళ మాత్రమే సినిమాలో నిక్షిప్తమై  ఉంటుంది. ఈ విషయం అందరికి తెలిసిందే. కానీ రుక్మిణి వసంత్, (Rukmini vasanth),ఆషికా రంగనాధ్,(ashika ranganath),సప్తమి గౌడ(Sapthami Gowda)వలన కళ గురించి మరోసారి చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. పూర్తి డీటైల్స్ చూద్దాం. రీసెంట్ గా ఈ ముగ్గురు ఇనిస్టా వేదికగా కీలకమైన పోస్ట్ చేసారు. సదరు పోస్ట్ లో మేము 'కళ' కోసం ఇక్కడ ఉన్నాం. హీరోయిన్ హోదాలో పబ్లిక్ ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు ఫోటోలు, వీడియోల్ని అనుచిత కోణాల్లో చిత్రీకరించి ప్రసారం చేస్తున్నారు. అనవసరమైన జూమ్ లతో మా పని కంటే శరీర బాగాలకే ఎక్కువ విలువనిస్తున్నారు. ఈ విషయంలో కొంత మంది ప్రవర్తన మమల్ని అగౌరవ పరిచేలా ఉంది. ఇక ఇలాంటి చర్యలని సహించం. ఈ విషయంలో నటీమణులందరం ఏక తాటిపై నిలబడతామని ముగ్గురు ఒకే  రీతిలో ఇనిస్టా వేదికగా పోస్ట్ చేసారు. అభిమానులు కూడా ఆ ముగ్గురు మాటలని సపోర్ట్ చేస్తున్నారు. also read:  Toxic: టాక్సిక్ రిలీజ్ వాయిదా.. కారణం తెలిస్తే షాక్ గ్యారంటీ   ఆ ముగ్గురి అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే రుక్మిణి వసంత్ ప్రెజంట్ మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా చేస్తుంది. మేకర్స్ ఏరి కోరి రుక్మిణి ని ఎంపిక చేసుకున్నారు. ఆషికా రంగనాధ్ ఏమో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర లో చేస్తుంది. సప్తమి గౌడ నుంచి కొత్త చిత్రం ప్రకటన రాకపోయినా గత వారం రిలీజైన 'రైజింగ్ ఆఫ్ అశోక' లో కనపడి మెప్పించింది. ఆ ముగ్గురు కన్నడ భామలనే విషయం తెలిసిందే.   
సీఎం-హోమ్ మినిస్టర్ నడుమ రాజకీయ పోరాటం విజయశాంతి ఎంట్రీతో మారిన రాష్ట్ర రాజకీయాలు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 'లేడీ సూపర్ స్టార్'గా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నటి విజయశాంతి(Vijayashanthi). ఆమె సినిమాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా, సమాజంలోని అన్యాయాలను, రాజకీయ కుట్రలను ఎండగట్టే ఆయుధాలుగా నిలిచాయి.  విజయశాంతి నటించిన పవర్ ఫుల్ సినిమాలలో 'ఆశయం'(Aasayam) ఒకటి. మోహన్ గాంధీ దర్శకత్వంలో శ్రీ సూర్య మూవీస్ నిర్మించిన ఈ పొలిటికల్ ఫిల్మ్, 1993 లో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమా ముఖ్యమంత్రి, హోం మంత్రి మధ్య రాజకీయ పోరాటం నేపథ్యంలో నడుస్తుంది. ఇందులో సరోజిని అనే పవర్ ఫుల్ పాత్రలో విజయశాంతి నటించారు. నిజాయితీగల అధికారి చక్రపాణి కూతురు ఆమె. ముఖ్యమంత్రి, హోం మంత్రి నడుమ జరిగే రాజకీయ చదరంగంలోకి సరోజిని ఎలా వచ్చింది? ఆమె రాష్ట్ర రాజకీయాలను ఎలా ప్రభావితం చేసింది? అనే ఆసక్తికర కథాకథనాలతో ఈ చిత్రం రూపొందింది. 'ఆశయం' సినిమాలో ఎన్నో అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి, హోం మంత్రి మధ్య సన్నివేశాలు కట్టిపడేస్తాయి. కొందరు నాయకులు రాజకీయాలను ఎంతలా బ్రష్టు పట్టించారో తెలిపేలా సన్నివేశాలు ఉంటాయి. రాజకీయ చదరంగం - ఒక దారుణ హత్య:  ఈ కథాంశం ఒక శక్తివంతమైన హోమ్ మినిస్టర్ చుట్టూ తిరుగుతుంది. అతను తన సారా సిండికేట్ ప్రయోజనాల కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగడతాడు. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన బాపయ్య అనే కాంట్రాక్టర్‌ను హతమార్చడానికి హోమ్ మినిస్టర్ పథకం పన్నుతాడు. నల్లమల అడవుల్లో తీవ్రవాదుల కదలికలు ఉన్నాయని అబద్ధం చెప్పి, బాపయ్య రక్షణ కోసం ఉన్న పోలీసు బలగాలను దారి మళ్లించి, అతడిని దారుణంగా హత్య చేయిస్తారు. ఈ హత్యను ఒక రాజకీయ హత్యగా కాకుండా, కేవలం దారి దోపిడీగా చిత్రీకరించడం వెనుక ఉన్న కుట్ర భయంకరమైనది. ప్రజాస్వామ్యాన్ని హత్యా రాజకీయాలతో ఎలా కూనీ చేస్తున్నారో ఈ సన్నివేశం కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. నిజాయితీ వర్సెస్ అవినీతి:  వ్యవస్థలో నిజాయితీగా పనిచేసే అధికారుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో మనం చూడవచ్చు. స్కూలు పిల్లల కోసం వచ్చిన యూనిసెఫ్ (UNICEF) సరుకును, అంటే పాల పొడి మరియు బట్టలను నల్లబజారులో అమ్ముకున్న వైనం వెలుగులోకి వస్తుంది. ఈ అవినీతికి వ్యతిరేకంగా నిలబడిన చక్రపాణి అనే వ్యక్తిని బెదిరించడమే కాకుండా, తప్పుడు కేసుల్లో ఇరికించే ప్రయత్నం జరుగుతుంది. కానీ, "జీవితం ఒక సవాలు, దానిని ధైర్యంగా ఎదుర్కోవాలి" అనే సిద్ధాంతంతో నిజాయితీగా ఉండేవారు ఎక్కడికీ పారిపోకూడదని ఈ సన్నివేశం మనకు హితబోధ చేస్తుంది. భయపడి పారిపోవడం వల్ల అవినీతి, అక్రమాలు ఇంకా పెరుగుతాయని, నిర్భయమే మనకు రక్షణ అని ఈ కథనం నొక్కి చెబుతుంది. కుటుంబ బంధాలు - విలువల ఘర్షణ:  ఈ పోరాటంలో అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, అవినీతికి పాల్పడేది బయటి వ్యక్తులు మాత్రమే కాదు, ఒక్కోసారి సొంత రక్తమే ద్రోహం చేస్తుంది. లంచం అనే గడ్డి తినే ఒక అవినీతి పోలీస్ ఆఫీసర్‌ను తన కొడుకు అని చెప్పుకోవడానికి కూడా ఒక తండ్రి నిరాకరిస్తాడు. "నీ మొహం చూస్తేనే పంచమహా పాతకాలు చుట్టుకుంటాయి" అని కొడుకుని అసహ్యించుకునే తండ్రి పాత్ర, సమాజంలో విలువల ప్రాముఖ్యతను చాటిచెబుతుంది. సమాజంలో అవినీతి ఎంతగా పాతుకుపోయినా, దాన్ని ఎదురించే ధైర్యం మనలో ఉండాలి. నిజాయితీగా బతికే వారికి ఏ ఊరైనా ఒకటేనని, అన్యాయాన్ని ఎదిరించినప్పుడే నిజమైన విజయం లభిస్తుందని ఈ సన్నివేశాలు మనకు గుర్తుచేస్తాయి. అద్భుతమైన డైలాగులు, ఉద్వేగభరితమైన నటనతో సాగే ఈ ఘట్టం ప్రతి ఒక్కరిలో ఆలోచనను రేకెత్తిస్తుంది. 'ఆశయం' సినిమాలోని అద్భుతమైన సన్నివేశాలను తెలుగువన్(TeluguOne) యూట్యూబ్ ఛానెల్‌ లో వీక్షించండి.  
సూపర్‌స్టార్ రజినీకాంత్ కెరీర్‌లో ‘పడయప్ప’ చిత్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగులో ఈ చిత్రాన్ని ‘నరసింహ’ పేరుతో రిలీజ్ చేశారు. రెండు భాషల్లోనూ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సినిమా ఇది. రజినీకాంత్, రమ్యకృష్ణ, సౌందర్య, రాధారవి, లక్క్ష్మీ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికిి కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని ఓ కీలక సన్నివేశం ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. డబ్బు కంటే ప్రేమ, అనుబంధాలు, ఆప్యాయతలు ప్రధానం అని చెప్పే ఈ సన్నివేశంలో ఏం ఉందో తెలుసుకుందాం.  తన కూతురి ప్రాణాలు కాపాడాలని, అందుకు నరసింహతో పెళ్లి ఒక్కటే మార్గమని నరసింహ తల్లిని వేడుకుంటాడు అన్నయ్య. గతంలో తాను చేసిన తప్పులను మన్నించమని, తన బిడ్డ ప్రాణాలు ఇప్పుడు నీ చేతిలోనే ఉన్నాయని చెల్లెల్ని ప్రాధేయపడతాడు. దానికి స్పందించిన నరసింహ తల్లి రేపే మీ ఇంటికి వచ్చి నిశ్చితార్థం చేసుకుంటానని మాట ఇస్తుంది. నరసింహ కూడా తల్లి ఇష్టమే తన ఇష్టమని చెబుతాడు. అందరూ అనుకున్నట్లుగా నిశ్చితార్థం జరుగుతుందని భావించి ఊరి జనం ముందు తాంబూలాలు మార్చుకోవడానికి సిద్ధమవుతారు. అయితే, అక్కడే నరసింహ తల్లి తన అసలు పంతాన్ని బయటపెడుతుంది. గతంలో తన కూతురిని ఏడిపించి, డబ్బు లేదనే కారణంతో తనను అవమానించిన విషయాన్ని అన్నయ్యకు గుర్తు చేస్తుంది. ‘ఈరోజు నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నా కాళ్ళ మీద పడ్డావు’ అంటూ నిలదీస్తుంది. తన అన్నయ్య ఇంటిలో పనిచేసే అమ్మాయితో నరసింహ పెళ్లి ఫిక్స్ చేస్తూ నిశ్చితార్థం చేస్తుంది. ఇది నీలాంబరికి, ఆమె తండ్రికి గట్టి షాక్ అవుతుంది. నిశ్చితార్థం చేసుకోవడానికి మీ ఇంటికి వస్తానని చెప్పానని, అదే చేశానని అంటుంది నరసింహ తల్లి. తన కొడుకు మనసు ఎంతో స్వచ్ఛమైనదని, వాడు కర్పూరం లాంటివాడు అని చెబుతుంది. కన్నవారు పిల్లల మనసును అర్థం చేసుకోవాలని, ఆస్తిపాస్తుల కోసం కాకుండా ఇష్టపడిన వారితోనే పెళ్లి జరగాలని చెబుతూ, నరసింహ మనసులో ఉన్న అమ్మాయినే కోడలిగా తెచ్చుకుంటానని ప్రకటిస్తుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని మనిషికి విలువ ఉండదని, పరువు పోయిన తర్వాత తలెత్తుకుని తిరగలేరని అక్కడ ఉన్న జనం చర్చించుకుంటారు. తన కొడుకు ప్రేమను గౌరవిస్తూనే, తనను అవమానించిన వారికి నరసింహ తల్లి బుద్ధి చెప్పిన తీరు ఈ సన్నివేశంలో అద్భుతంగా చిత్రీకరించబడింది. ఆసక్తికరమైన సన్నివేశాలు, డైలాగులు, చక్కని ఎమోషన్స్‌తో నిండిన ఈ వీడియోను క్రింద ఇస్తున్నాం. వీక్షించండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా Teluguone Cinema ను Subscribe చేసుకోండి. 
  -యష్ ఫ్యాన్స్ కి బాడ్ న్యూస్  -టాక్సిక్ వాయిదా  -ఈ బుధవారాన్ని జీవితంలో మర్చిపోరు  -వాయిదాకి గల కారణం ఏంటి!  ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా ఉన్న 'యష్'(Yash)అభిమానులు తమ దగ్గరలో ఉన్న గుళ్ళు, మసీదులు, చర్చిల బాట పట్టారు. తమ ఇష్టదైవాల ముఖాన్ని అదే పనిగా చూస్తూ  టాక్సిక్ రిలీజ్ డేట్ వాయిదాపడుతుందని చిన్న హింట్ కూడా రాలేదు కదా. అసలు మేకర్స్ లో ఆ అట్మాస్పియర్ కూడా కనపడలేదు. ఎందుకు ఇలా చేసావు స్వామి అని అడుగుతున్నారు. దీన్ని బట్టి టాక్సిక్(Toxic)రిలీజ్ వాయిదా డేట్ ఎంత షాకింగ్ న్యూస్ నో అర్ధం చేసుకోవచ్చు. మరి వాయిదాకి గల కారణాలని ఇష్టం లేకపోయినా అయిష్టంగానే చూద్దాం. ఇరాన్(Iran),ఇజ్రాయిల్(israel) దేశాల మధ్య గత కొన్ని రోజుల నుంచి యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. సదరు యుద్ధ మేఘాలు గల్ఫ్ కంట్రీస్ దుబాయ్, అబుదాబి, కువైట్, ఖత్తర్ వంటి దేశాలకి సైతం పాకాయి. దీంతో  ఆ దేశాలపై కూడా ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తుంది. ఈ కారణంగానే టాక్సిక్ వాయిదా పడింది. ఎందుకంటే సదరు గల్ఫ్ దేశాల సినీ మార్కెట్ చాలా పెద్దది. కొంత కాలం నుంచి భారీ బడ్జెట్ తో తెరకెక్కిన భారతీయ సినిమాలు సాధిస్తున్న కలెక్షన్స్ నే ఉదాహరణ. మేకర్స్ కూడా వరల్డ్ ప్రేక్షకులని దృష్టిలో  ఉంచుకొని భారీ ఖర్చుతో అన్ని హంగులని అమర్చుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ ని వాయిదా వెయ్యాలని కోరడంతో జూన్ 4 కి వాయిదా వేశారు. also read:  Janhvi Kapoor: బలిపశువుని చేస్తున్నారు.. అసలు జాన్వీ కపూర్ ప్రాబ్లెమ్ ఏంటి!  దీంతో ఇజ్రాయిల్, ఇరాన్ దేశాలు యష్ అభిమానుల ఆనందానికి తీవ్రమైన ఆటంకాన్ని కల్పించినట్లయింది. సోషల్ మీడియా వేదికగా వారంతా స్పందిస్తు మీ రెండు దేశాల్లో  ఎవరి ఆస్తులు ఎవరు లాక్కున్నారా! అంత పగ ఎందుకురా! యుద్ధం చేసుకోవాలని డిసైడ్ అయినప్పుడు ఇస్త్రీ చొక్కా నలగకుండా సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేసుకోవచ్చు కదా! ఇప్పుడు ఇదే కదా ట్రెండ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.     
-ఆ మాటలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది  -మాటల యొక్క ఆంతర్యం ఏంటి! -పెద్ది తో నెంబర్ వన్ హీరోయిన్ అవుతుందా  తనదైన సినీ రోజు ఒకటి రావడం అతిలోక సుందరి శ్రీదేవి(Sridevi)నట వారసురాలు 'జాన్వీ కపూర్'(Janhvi Kapoor)తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలడం ఖాయం. ఆ వాక్కు ఎలాంటి అక్షర దోషం లేని అక్షర సత్యమని మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)దేవర నిరూపించింది. సదరు చిత్రంలో 'తంగం' అనే  మాస్ క్యారక్టర్ లో లవ్, రొమాన్స్, ఎమోషన్ ని పర్ఫెక్ట్ గా ప్రదర్శించడమే ఉదాహరణ. ఇప్పుడు మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్(Ram Charan)'పెద్ది' లో 'అఛ్ఛాయమ్మ' గా ఊర మాస్ క్యారక్టర్ లో కనిపించబోతుంది. మేకర్స్ ఆమె లుక్ ని రివీల్ చేసిన దగ్గరనుంచి అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. నెంబర్ వన్ హీరోయిన్ అనే టాగ్ లైన్ పక్కా అని సోషల్ మీడియా వేదికగా హంగామ చేస్తూ ఉన్నారు.ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ పర్సనల్ న్యూస్ ఒకటి వాళ్ళ కంట పడింది. నువ్వు చెప్పేది హండ్రడ్ పర్శంట్  కరెక్ట్ జాన్వీ అని సపోర్ట్ చేస్తున్నారు. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం. జాన్వీ కపూర్ సోదరుడు పేరు అర్జున్ కపూర్(Arjun Kapoor). జాన్వీ తండ్రి బోనీకపూర్ మొదటి భార్య కుమారుడే అర్జున్ కపూర్. గత కొన్ని రోజుల నుంచి  సోషల్ మీడియాలో భారీగానే ట్రోల్  అవుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జాన్వీ  మాట్లాడుతు 'సోషల్ మీడియా సంస్కృతి ఏంటంటే వాళ్ళు వైరల్ అవ్వడానికి మనల్ని బలిపశువుల్ని చేస్తుంటారు. మనల్ని తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని బాధగా అనిపించినా అలాంటి వాటికి ఎక్కువ సమయం కేటాయించకూడదు. నిజానికి ఆ వార్తలకి మీకు సంబంధం కూడా ఉండదు. కానీ వాళ్ళకి వ్యూస్ నే ముఖ్యం. అందుకోసం ఎంత మంది బాధపడినా పర్వాలేదు. కానీ సోషల్ మీడియాలో ఈ రకమైన ప్రవర్తనని క్షమించకూడదు. నెగిటివిటి కి దూరంగా ఉండండని జాన్వీ  చెప్పుకొచ్చింది. అర్జున్ కపూర్ ట్రోల్ అవ్వడానికి కారణం వయసులో తనకంటే పన్నెండేళ్ళు పెద్దదైన బాలీవుడ్ భామ మలైకా అరోరా(Malaika Arora)తో రిలేషన్ లో ఉండేవాడు. కానీ ఆ రిలేషన్ రీసెంట్ గా  క్యాన్సిల్ అయ్యింది.  
Rocking Star Yash has been working on his next film, Toxic, in the direction of Geetu Mohandas, since the release of KGF Chapter 2, over four years. Now, the movie had been pitted against Dhurandhar 2 for release on 19th March and owing to Middle-Eastern Countries unrest, they have decided to postpone it to 4th June.  KVN Productions and Monster Mind Creations today announced a strategic rescheduling of the global theatrical release for the highly anticipated action-drama, Toxic: A Fairy Tale for Grown-ups.  As advised by one of their major distribution partner Phars Films, the decision to reschedule the release was made in response to escalating tensions and the resulting disruptions to cinema operations across the Gulf region, a key market for the film’s multi-language global rollout. The producers have been closely monitoring the rapidly evolving regional developments with the utmost caution.  This announcement comes at a time when the makers were gearing up for a grand trailer launch for 8th March in Bangalore, with media from across the country. The makers had already mapped out the film’s final promotional schedule ahead of its earlier release date of 19th March 2026. Even though the film’s first single, ‘Tabaahi,’ was ready for its scheduled debut on 2nd March, the makers chose to hold the music video and momentarily pause the promotional rollout which was locked and to be activated within a day or two. An official statement from KVN Productions and Monster Mind Creations Stated: Toxic: A Fairy Tale for Grown-ups is a film we conceptualized with the vision to create cinema for a global audience. Filmed in Kannada and English, it is built with the conviction to connect with viewers both at home and across the world. After years of dedicated labour, we were excited to share our film with you all on the 19th of March. However, the current uncertainty, especially in the Middle East, has created a situation that impacts our goal to reach and connect with the widest possible audience. Therefore, in the interest of our partners and our audience, we have made the difficult but carefully considered decision to reschedule our release. We thank you for your understanding and patience and look forward to your continued love and support. Toxic: A Fairy Tale for Grown-ups will now be released in cinemas across the globe in English and Indian languages on 4th June 2026. See you at the movies.   Toxic stars Yash, Nayanthara, Kiara Advani, Huma Qureshi, Rukmini Vasanth, and Tara Sutaria in pivotal roles. Written by Yash and directed by Geetu Mohandas, the film has been shot simultaneously in Kannada and English, with dubbed versions in Hindi, Tamil, Telugu, and Malayalam — reinforcing its global ambition. Produced by KVN Productions and Monster Mind Creations, Toxic: A Fairy Tale for Grown-Ups is slated for release on 4th June, 2026.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
The successful duo of Akkineni Nagarjuna and director Kalyan Krishna Kurasala is set to reunite for an upcoming project, marking their third collaboration. Following the massive success of Soggade Chinni Nayana and its sequel Bangarraju, the pair is looking to complete a hat-trick of hits. Annapurna Studios recently confirmed that this new venture is slated for a grand release on January 15, 2027, eyeing the lucrative Sankranthi festive window. The choice of date is significant, as it mirrors the release day of their first blockbuster together. While official details regarding the title and full cast remain under wraps, the announcement featured the iconic dialogue "Vaasivaadi Tassadiyya," sparking intense speculation that the film could be another installment in the Bangarraju franchise. Kalyan Krishna is currently finalizing the script, which is expected to be a family entertainer tailored to Nagarjuna’s screen presence. There are also reports suggesting that Naga Chaitanya or Akhil Akkineni might play key roles, potentially making it another multi-starrer from the Akkineni stable. As Nagarjuna balances this project alongside his milestone 100th film, fans are eager to see if this collaboration will once again dominate the box office.     Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
నేటి సమాజంలో పెళ్లి అనేది కేవలం రెండు కుటుంబాల కలయిక మాత్రమే కాదు, అది ఇద్దరు వ్యక్తుల జీవితకాల ప్రయాణం. అయితే, మారుతున్న కాలంతో పాటు యువత ఆలోచనలు, వారి భయాలు కూడా మారుతున్నాయి. చాలా సందర్భాలలో తల్లిదండ్రులు తమ పిల్లల కోసం సంబంధాలు చూసేటప్పుడు, వారి మనసులోని మాటను గమనించకుండా తొందరపడుతుంటారు. దీనివల్ల పెళ్లి కుదరకపోవడమే కాకుండా, పిల్లల మనసుపై అది తీవ్ర ప్రభావం చూపుతుంది. అరేంజ్డ్ మ్యారేజ్ విషయంలో మనం అనుసరించాల్సిన పద్ధతులు, చేయకూడని పొరపాట్ల గురించి  కాకతీయ మ్యారేజ్ డైరెక్టర్ నవీనా యలమంచి గారు చెప్పిన విషయాలను ఈ Video Link లింక్ క్లిక్ చేసి చూడండి మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? (Why Should We?) పెళ్లి సంబంధం చూసే ప్రక్రియలో పారదర్శకత లేకపోతే, అది కేవలం సమయాన్ని వృథా చేయడమే కాకుండా ఎదుటి కుటుంబం యొక్క శ్రమను, ఆశలను కూడా నీరుగారుస్తుంది. పిల్లలు సిద్ధంగా లేనప్పుడు వారిపై ఒత్తిడి తెస్తే, వారు ఎదుటి వారితో "నాకు ఇష్టం లేదు" అని చెప్పడం వల్ల రెండు కుటుంబాల మధ్య అనవసరమైన మనస్పర్థలు ఏర్పడతాయి. సరైన అవగాహన లేకుండా సంబంధాలు చూస్తే, భవిష్యత్తులో పిల్లలు మరే సంబంధాన్ని చూడటానికి కూడా ఇష్టపడరు. సంబంధాలు చూసేటప్పుడు తల్లిదండ్రులు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు: బలవంతం చేయడం: పిల్లలు పెళ్లికి మానసికంగా సిద్ధంగా లేనప్పుడు వారిని బలవంతంగా సంబంధాలు చూడమని ఫోర్స్ చేయకూడదు. ముందస్తు చర్చ లేకపోవడం: ఇంట్లో పిల్లలతో మాట్లాడి, వారి అభిప్రాయాలు తెలుసుకోకుండా బయట సంబంధాలు వెతకడం వల్ల ఫలితం ఉండదు. భయాలను విస్మరించడం: "నా ఫ్రెండ్స్ ఎవరూ పెళ్లి చేసుకుని హ్యాపీగా లేరు" లేదా "అపరిచిత వ్యక్తితో జీవితం ఎలా ఉంటుంది?" అనే పిల్లల భయాలను కొట్టిపారేయకండి. వారి భయాలు చాలా జెన్యూన్ అయి ఉండవచ్చు. పరిస్థితిని చక్కదిద్దడానికి మరియు పిల్లలను పెళ్లికి సిద్ధం చేయడానికి ఈ పద్ధతులు పాటించండి: కౌన్సెలింగ్ మరియు మాటామంతి: పిల్లలు మీతో ఓపెన్ అవ్వనప్పుడు, వారి మనసులో ఏముందో తెలుసుకోవడానికి ఓపికగా ప్రయత్నించండి లేదా నిపుణుల సహాయం తీసుకోండి. అవకాశం ఇవ్వండి: పిల్లలు ఎదుటి వారితో మాట్లాడటానికి ఇష్టపడకపోయినా, కనీసం ఒకరిద్దరిని కలిసేలా ప్రోత్సహించండి. సరైన వ్యక్తి (Right Person) తారసపడినప్పుడు వారిలోని భయాలు సహజంగానే తొలగిపోతాయి. ఇంటి గుట్టు ముఖ్యం: ముందుగా మీ ఇంట్లో చర్చలు జరిపి, పిల్లలను ఒప్పించిన తర్వాతే పబ్లిక్‌గా సంబంధాలు చూస్తున్నామని చెప్పడం గౌరవప్రదంగా ఉంటుంది. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్రశ్న: పిల్లలు సంబంధం చూడటానికి వచ్చినప్పుడు 'ఐ యామ్ నాట్ రెడీ' అని ఎందుకు అంటారు?  జవాబు: దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. వారు కెరీర్ మీద దృష్టి పెట్టాలని అనుకోవచ్చు లేదా అపరిచిత వ్యక్తులతో ప్రేమను ఎలా పంచుకోవాలో తెలియక భయపడవచ్చు. తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల కూడా వారు ఇలాంటి సమాధానాలు ఇస్తుంటారు. ప్రశ్న: పిల్లల భయాలు ఎప్పుడు తొలగిపోతాయి?  జవాబు: అరేంజ్డ్ మ్యారేజ్ అయినా, మరేదైనా సరే.. ఒక సరైన వ్యక్తిని కలిసినప్పుడు, వారితో మాటలు కలిసినప్పుడు మాత్రమే ఇలాంటి సందేహాలు, భయాలు క్లియర్ అవుతాయి. అంతవరకు మనం ఎన్ని చెప్పినా వారి భయం తగ్గదు. ప్రశ్న: ఒక సంబంధం తప్పిపోతే పిల్లలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?  జవాబు: ఒకసారి చేదు అనుభవం ఎదురైతే, తర్వాత వచ్చే మంచి సంబంధాలను కూడా పిల్లలు వద్దని తిరస్కరించే అవకాశం ఉంది. అందుకే ఇంట్లో పరిస్థితిని సెట్ చేసుకున్నాకే బయట సంబంధాలు చూడాలి. పెళ్లి అనేది జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు. పిల్లల భావోద్వేగాలను అర్థం చేసుకుని, వారి భయాలను గౌరవిస్తూ ముందుకు వెళ్ళినప్పుడే అరేంజ్డ్ మ్యారేజ్ విజయవంతం అవుతుంది. వారిని బలవంతం చేయడం కంటే, వారికి నమ్మకాన్ని కలిగించడం ముఖ్యం. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మరియు రిలేషన్‌షిప్ సలహాల కోసం మా యూట్యూబ్ ఛానల్‌ని సందర్శించండి! 👉మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి: [www.youtube.com/@Naveenacolumn ] (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
హోళీ అంటే భారతీయులకి మాత్రమే ప్రత్యేకమైన పండుగ. ఎక్కడో ఈశాన్యంలోని మణిపూర్లో ఉన్నా, ఖండాలు దాటుకుని ఏ అమెరికాలో ఉన్నా.... హోళీనాడు రంగు చేతపట్టని భారతీయుడు ఉండదు. ఇందులో ఒకో ప్రాంతానిదీ ఒకో ప్రత్యేకత. ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకోవడం ప్రపంచంలో బహుశా మన హోళీ సందర్భంలో మాత్రమే కనిపిస్తుంది. కానీ జీవితాన్ని రంగులమయం చేసుకునే ప్రయత్నం మాత్రం చాలా దేశాల్లో ఉంది... టమాటాల పండుగ స్పెయిన్‌లోని వలెన్‌సియాన్ నగరంలో ఏటా ఈ పండుగ చేసుకుంటారు. ఆగస్టు చివరి బుధవారం  జరుపుకొనే ఈ పండుగలో ఒకరి మీద ఒకరు టమోటాలు విసురుకుంటారు. 1945 నుంచి మొదలైన ఈ పండుగ రాన్రానూ ప్రచారాన్ని అందుకుంటోంది. నిజానికి ఈ సంప్రదాయం ఎలా మొదలైందో ఎవరికీ తెలియదు. కొందరు కుర్రకారు టమాటాలతో కొట్టుకున్న గొడవ ఇలా మారిందనీ, ఓ టమాటా లారీ బోల్తా పడటంతో ఈ సంప్రదాయం మొదలైందనీ, ఊళ్లో కౌన్సిల్‌ సభ్యుల మీద కోపం వచ్చిన పౌరులు టమాటాలను విసరడంతో ఈ ఆచారానికి పునాది ఏర్పడిందనీ రకరకాల వాదనలు ఉన్నాయి. కారణం ఏదైనా ఆ రోజు సంబరం మాత్రం అంబరాన్ని అంటుతుంది. ఆ సందర్భంగా ఎవ్వరికీ ఎలాంటి గాయం జరగకుండా చాలా నియమాలనూ పాటించాల్సి ఉంటుంది. ఒకటే రంగు నెదర్లాండ్‌ రాజుగారైనా విలియం అలగ్జాండర్ పుట్టినరోజు సందర్భంగా ఆ దేశంలో జరుపుకొనే సంబరాలే ‘Koningsdag’. ఈ రోజున నెదర్లాండ్స్ యావత్తూ ఆ దేశపు రంగైన నారింజరంగుతో నిండిపోతుంది. గోడల మీద నారింజ రంగు కనిపిస్తుంది. జనమంతా నారింజరంగు బట్టలు వేసుకుని తిరుగుతారు. ఆఖరికి జుట్టుకి కూడా నారింజ రంగు వేసుకుంటారు. ద్రాక్ష ఎరుపులో మందుప్రియులందరి నోరూరేలాంటి ఓ పండుగ ఉంది. అదే స్పెయిన్‌లో జరిగే ‘హారో వైన్‌ ఫెస్టివల్‌’. ఏటా జూన్‌ 29న ఆ దేశంలోని క్రైస్తవ సన్యాసి ‘శాన్‌ పెడ్రో’ జ్ఞాపకార్థం ఈ పండుగ జరుగుతుంది. హారో అనే ఊరిలో జరిగే ఈ పండుగలో ఊరి జనమంతా ఉదయం నుంచే ద్రాక్షసారాయి నిండిన పాత్రలతో బయల్దేరతారు. దారిలో తమకు ఎదురుపడినవారందరి మీదా ఈ సారాయిని ఒంపుతూ ముందకుసాగుతారు. సాయంత్రం అయ్యేసరికి ఊరంతా ద్రాక్షమయంగా మారిపోతుందన్నమాట. ఇక ద్రాక్షసారాని ఒంపుకోవడమే కాదు... దానిని తాగడంలో కూడా బోలెడు పోటీలు జరుగుతాయి. నారింజ యుద్ధం ఇటలీలోని ఇవ్రియా అనే పట్నంలో జరిగే పండుగ ఇది. దీని మూలాలు ఎప్పుడో 13వ శతాబ్దంలో ఉన్నాయని చెబతారు. అప్పట్లో రాజవంశానికి చెందిన వ్యక్తి, ఓ పల్లెటూరి పిల్లని బలాత్కారం చేయబోయాడట. దానికి తిప్పికొట్టిన ఆ అమ్మాయి, ఏకంగా ఆ వ్యక్తి తలని నరికేసిందని చెబుతారు. అంతేకాదు! విషయం తెలుసుకున్న పౌరులంతా కలిసి రాజవంశం మీద తిరగబడ్డారట. ఆనాటి ప్రతిఘటనకు గుర్తుగా ఇవ్రియావాసులు నారింజపండ్లని ఒకరిమీద ఒకరికి విసురుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా హోళీని తలపిస్తూ రంగులతో నిండే ఇలాంటి పండుగలు చాలానే ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి మాత్రం పైన పేర్కొన్నవే!   - నిర్జర.
మనకిష్టమైన వాళ్ళు మన ఎదురుగా ఉంటే నిజంగానే లైఫ్ కలర్ ఫుల్ గానే  కనిపిస్తుంది. కాని కొన్ని రోజులు అయ్యాకా దాటాకా రోటీన్ లైఫ్ తో బోర్ కొడుతుంది ఎవరికైనా. పొద్దున్నే లేవటం అవే ఉరుకులు పరుగులు, అదే టైం టేబుల్. జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు ఉండే బ్రైట్నెస్ రానురాను కరువవుతుంది. అందులోనూ ఇంట్లోనే ఉండే హోం మేకర్స్ ఇంకా ఇంకా బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎప్పుడూ చేసిన పనే చేస్తూ, మళ్ళీ తెల్లారిందా అనుకుంటూ వాళ్ళు పడే పాట్లు అన్ని ఇన్ని కావు. అలాంటి లైఫ్ లో కాస్త రంగులు నింపితే.....ఆనందాలు రెట్టింపయ్యి, అనురాగాలు విరబూస్తాయి, కదూ. మరి ఆ రంగుల్ని నింపటానికి ఏం చెయ్యాలంటే...... రొటీన్ లైఫ్ కి కాస్త భిన్నంగా ఉండాలంటే వీకెండ్స్ లో ఏదైనా లాంగ్ డ్రైవ్ గాని, లేదా చిన్న ట్రిప్ గాని ప్లాన్ చేసుకోవచ్చు. అలా వెళ్లివస్తే మన మూడ్ హాయిగా ఉంది నిజంగానే జీవితం రంగులమయంగా కనిపిస్తుంది. మనం రోజూ వాడే బట్టల్ని పక్కకి పెట్టి ఏదో ఒక న్యూ స్టైల్ ని మార్చాలి. రోజూ పంజాబీ డ్రెస్, సారీ వేసుకునే వాళ్ళు కాస్త డిఫెరెంట్ గా జీన్స్, కుర్తీ లాంటివి ట్రై చేస్తే మీలో వచ్చే మార్పు మీరే గమనించచ్చు. ఇంట్లో ఉండే ఫర్నిచర్ ఎప్పుడు ఒకేలా ఉంటే మజానే రాదు. అందుకే ఇంటికి కొత్త కళ రావాలంటే వాటి ప్లేస్ లు మారుస్తూ ఉండాలి.  మీ భాగస్వామి ఇంటికి వచ్చేసరికి ఒక స్వీట్ సర్ప్రైజ్ ప్లాన్ చేసుకోండి. ప్రతిరోజులా కాకుండా ఇంట్లోనే కేండేల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసుకుంటే రొటీన్ కి బిన్నంగా ఉంటుంది. మీకు సన్నిహితమైన వాళ్ళని ఇంటికి భోజనానికి పిలవండి. వాళ్ళు వచ్చారు వెళ్లారు అనేలా కాకుండా కాస్త వెరైటీగా కార్డ్స్ గేమ్ గాని, డంషరాడ్స్ లాంటి ఫన్నీ గేమ్స్ గాని ప్లాన్ చేసుకుంటే మనసు హాయిగా రంగులతో నిండిపోతుంది.  మాములుగా ఇంట్లో అందరు ఉన్నప్పుడు మీకు ఇష్టమైన సినిమా వస్తున్నా అది చూసే అవకాశం మీకు ఉండదు. పిల్లలు కార్టూన్ చూస్తామని, మిగిలిన వాళ్ళు సీరియల్స్ చూస్తామని రిమోట్ మీ చేతికి అందనీయరు. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు హాయిగా మీకిష్టమైన సినిమాని ప్లే చేసి చూడండి. మీకిష్టమైన కలర్ డ్రెస్, అది మీ పార్టనర్ కి నచ్చకపోతే మీరు వేసుకోటానికి సాహసించరు. అందుకే ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు లేదా మీ ఫ్రెండ్స్ తో బైటకి వెళ్ళినప్పుడు ఆ కలర్ డ్రెస్ వేసుకుని మీ కోరికని తీర్చుకోవచ్చు. ఇంట్లో మీకు బాగా ఇష్టమైన పెంపుడు జంతువుని పెంచుకుంటే మీకు బోర్ కొడుతోంది అనే మాటే గుర్తు రాదు. ఖాళీగా ఉన్న సమయంలో వాటితో ఆడుకుంటూ టైం ఇట్టే గడిచిపోతుంది. మీకిష్టమైన వాళ్ళ స్పెషల్ డేస్ గుర్తుపెట్టుకుని వాళ్ళకి గ్రీటింగ్ గాని, ఫ్లవర్ బొకే గాని పంపితే వాళ్ళు తిరిగి మీకు రెస్పాండ్ అయ్యే విధానం మీ లైఫ్ లో ఖచ్చితంగా కలర్స్ నింపుతుంది. మనకున్నదే చిన్న లైఫ్, అందులో మనకి దొరికే టైం కూడా చిన్నదే. ఆ టైంని కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటూ, ప్రతి సారి ఏదో ఒక కొత్త కోణంలో లైఫ్ ని చూసినట్లయితే మన లైఫ్ మనకి ఎప్పటికి బోర్ కొట్టదు. అది మన కళ్ళకి ఎప్పటికీ కలర్ ఫుల్ గానే కనిపిస్తుంది.  ...కళ్యాణి     
మన శరీరంలోని ఐదు జ్ఞానేంద్రియాలలో చెవి అత్యంత సున్నితమైనది మరియు ముఖ్యమైనది. మనం ప్రపంచంతో మమేకమవ్వడానికి, ఇతరుల మాటలు వినడానికి, సంగీతాన్ని ఆస్వాదించడానికి వినికిడి శక్తి ఎంతో అవసరం. కానీ నేటి కాలంలో మనం మన చెవుల ఆరోగ్యాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నాము. ఆ నిర్లక్ష్యం చివరకు మనల్ని శాశ్వత చెవుడు వైపు ఎలా నెడుతుందో, సీనియర్ ఈఎన్‌టీ సర్జన్ డాక్టర్ పి.వి.ఎల్.ఎన్. మూర్తి గారు పంచుకున్న కొన్ని కీలక విషయాలను ఈ Video Link క్లిక్ చేసి చూడండి మనం చెవుల ఆరోగ్యంపై ఎందుకు శ్రద్ధ పెట్టాలి? (Why Should We?) మన చెవి లోపల వినికిడికి సహాయపడే 'హెయిర్ సెల్స్' (Hair Cells) అనేవి ఉంటాయి. ఇవి చాలా సున్నితమైనవి. వీటి ప్రాముఖ్యత ఏమిటంటే: శాశ్వత నష్టం: ఒకసారి ఈ హెయిర్ సెల్స్ దెబ్బతింటే, అవి మళ్ళీ తిరిగి రావు. మన శరీరంలోని ఇతర కణాలలాగా ఇవి మళ్ళీ పుట్టవు (Regeneration ఉండదు). వృత్తిపరమైన జీవితం: వినికిడి లోపం ఉంటే మీటింగ్‌లలో ఇతరులు చెప్పేది అర్థం కాదు, దీనివల్ల నిర్ణయాలు తీసుకోవడంలో తప్పులు జరిగి మీ కెరీర్ దెబ్బతినవచ్చు. భారీ ఖర్చు: ఒకవేళ వినికిడి పూర్తిగా పోయి ఆపరేషన్ (Cochlear Implant) చేయించుకోవాల్సి వస్తే, ఒక్క చెవికి 7 నుండి 10 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఏం చేయకూడదు? (What Not To Do) నిరంతర శబ్దాలు: 24 గంటలూ బ్లూటూత్ హెడ్‌సెట్లు లేదా ఇయర్ ఫోన్లు పెట్టుకుని వినకండి. దీనివల్ల హెయిర్ సెల్స్ అలసిపోయి (Fatigue) శాశ్వతంగా దెబ్బతింటాయి. నిర్లక్ష్యం: చిన్నపాటి వినికిడి లోపం ఉన్నా "ఏం కాదులే" అని వదిలేయకండి. స్క్రీనింగ్ చేయించుకోకపోవడం వల్ల సమస్య తీవ్రమవుతుంది. సామాజిక భయం: కళ్ళద్దాలు పెట్టుకున్నట్లే, అవసరమైతే హియరింగ్ ఎయిడ్ (Hearing Aid) పెట్టుకోవడానికి వెనుకాడకండి. లోకం ఏమనుకుంటుందో అన్న భయంతో సమస్యను పెంచుకోవద్దు. దురలవాట్లు: ధూమపానం (Smoking) మరియు మద్యం అలవాటు వల్ల శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగి లోపలి కణాలు దెబ్బతింటాయి. చెవులను ఎలా కాపాడుకోవాలి? (How To Maintain Ear Health) ఆరోగ్యకరమైన జీవనశైలి: డయాబెటిస్ (షుగర్), బీపీ మరియు కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుకోవాలి. ఇవి పెరిగితే వినికిడి శక్తిపై ప్రభావం చూపుతాయి. వ్యాయామం: యోగా, ప్రాణాయామం మరియు క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం వల్ల శరీరంలో మంచి హార్మోన్లు విడుదలయ్యి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముందస్తు పరీక్షలు: చెవిలో బ్లాకేజ్ అనిపించినా, వినికిడి తగ్గినట్లు అనిపించినా వెంటనే 'ప్యూర్‌టోన్ ఆడియోమెట్రీ' లేదా 'ఎండోస్కోపీ' వంటి పరీక్షలు చేయించుకోవాలి. నీటి జాగ్రత్తలు: స్నానం చేసేటప్పుడు లేదా స్విమ్మింగ్ చేసేటప్పుడు చెవిలోకి నీరు వెళ్లకుండా చూసుకోవాలి. నీరు వెళ్తే చెవిలోని గుబిలి (Wax) ఉబ్బిపోయి నొప్పి మరియు బ్లాకేజ్‌కి దారితీస్తుంది. సాధారణ సందేహాలు - సమాధానాలు (Q&A) ప్రశ్న: వయసు పెరగడం వల్ల వచ్చే వినికిడి లోపాన్ని మందులతో తగ్గించవచ్చా?  జవాబు: దీనిని 'ప్రెస్ బ్రాయకోసిస్' అంటారు. దీనికి మందులు లేదా ఆపరేషన్లు ఉండవు. ప్రివెన్షన్ (ముందస్తు జాగ్రత్త) మాత్రమే మార్గం. సమస్య ఎక్కువైతే హియరింగ్ ఎయిడ్ వాడాలి. ప్రశ్న: పిల్లల్లో చెవి నొప్పి, బ్లాకేజ్ ఎందుకు వస్తుంది?  జవాబు: పిల్లల్లో జలుబు చేసినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ చెవిలోకి చేరి బ్లాకేజ్ ఏర్పడుతుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే 'గ్లూ ఇయర్' (Glue Ear) గా మారి వినికిడి లోపం రావచ్చు. వెంటనే డాక్టరును సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ప్రశ్న: చెవిలో గుబిలి (Wax) ఉండటం తప్పా?  జవాబు: గుబిలి అనేది ఒక రక్షణ కవచం లాంటిది. కానీ అది ఎక్కువై ఇయర్ కెనాల్‌ను బ్లాక్ చేసినప్పుడు మాత్రమే సమస్య అవుతుంది. అప్పుడు డాక్టర్ ద్వారా క్లీన్ చేయించుకోవాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. వినికిడి లోపం అనేది కేవలం శారీరక సమస్య మాత్రమే కాదు, అది మన ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్త పడండి. మరిన్ని ఆరోగ్య సమాచారం కోసం మరియు ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా 👉 (TeluguOne Health YouTube Channel) ని సందర్శించండి. సబ్‌స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి!
హోళి అంటే ఇష్టం లేనిది ఎవరికి?? చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు హోళి సందడిలో తమవంతు పాత్ర పోషిస్తారు. అయితే హోళి సంబరాలలో అక్కడక్కడా అపశ్రుతులు చోటుచేసుకుంటు ఉంటాయి. హోళిని హాయిగా ఎంజాయ్ చేస్తూ.. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు అవసరం. మీ చర్మ సంరక్షణ తప్పనిసరి:  చర్మాన్ని వీలైనంత జిడ్డుగా చేయడం చాలా ముఖ్యం, తద్వారా రంగులు చర్మం మీద  వ్యాప్తి చెందడానికి లేదా అంటుకునే అవకాశం ఉండదు. ఇందుకోసం కొబ్బరి నూనె రాసుకోవచ్చు. కొబ్బరి నూనె వల్ల మరొక లాభం ఏంటంటే చర్మం పొడిబారకుండా చేస్తుంది. అలాగే శరీరం మీద రంగులు క్లీన్ చేయడం సులువు అవుతుంది.   సేంద్రీయ రంగుల ఎంపిక:   పర్యావరణ అనుకూలంగానే కాకుండా మన చర్మానికి కూడా అనుకూలమైన రంగులతో హోలీని జరుపుకోవాలి. హానికరమైన రసాయనాలు కలిపిన రంగులను నివారించాలి. రసాయనాలు కలిపిన రంగులు ప్రకాశవంతంగా కనిపిస్తాయి అంతేకాఫు ఇవి నీటిలో చాలా తొందరగా కలిసిపోతాయి. ఈ రంగులు  చర్మం నుండి తొలగించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. చర్మాన్ని డ్యామేజ్ చేస్తాయి. ఇన్ఫెక్షన్లు, సైడ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. బంతి పువ్వు, గులాబీ, మందారం, చెట్ల ఆకులు, పసుపు ఇలా పువ్వుల రెక్కల నుండి రంగులు తయారుచేసుకోవచ్చు. .  హైడ్రేటెడ్ గా ఉండాలి:  హోలీ వేసవిలో వస్తుంది, హోళి సమయానికి వేసవి మొదలైపోయి ఉంటుంది. దీనివల్ల బయట ఎండలు భగ్గుమంటుంటాయి. ఈ ఎండల్లో రంగులు చల్లుకుని ఎంజాయ్ చేసినా.. మరొకవైపు ఎండ దెబ్బ మాములుగా ఉండదు.  కాబట్టి హైడ్రేటెడ్ గా ఉండటం చాలా అవసరం. నీరు, గ్లూకోజ్, జ్యూస్‌లు, శరీరాన్ని తిరిగి శక్తివంతం చేయడంలో సహాయపడతాయి.  పైగా ఇవి చర్మం పొడిబారకుండా తేమగా ఉండేలా చేస్తాయి.   కళ్ళను తేలిగ్గా తీసుకోవద్దు:  మీరు రోజూ  కాంటాక్ట్ లెన్స్‌లను ధరించేవారు అయితే, రంగులతో ఆడుకునే ముందు వాటిని తీసివేయడం మంచిది. కళ్ళజోడు మీద రంగులు లేదా నీళ్లు పడితే ఎదుటి ప్రాంతాన్ని మసగ్గా కనిపించేలా చేస్తాయి. ఇది ఇబ్బందే అనుకోవచ్చు. అలాగని కళ్ళజోడు లేకుండా హొలీ ఆడేటప్పుడు రంగులు నేరుగా కళ్ళలోకి పడకుండా అజాగ్రత్త పడాలి. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. కాబట్టి కళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి.  స్వీట్ల దగ్గరా జాగ్రత్త:  హోలీ సమయంలో మార్కెట్‌లో కల్తీ ఖోయా, మావా అమ్ముతారు. ఇంకా ఇలాంటి కల్తీ పదార్థాలతో స్వీట్లు తయారుచేస్తారు. ఇలాంటివే ఆఫర్స్ కింద, డిస్కౌంట్ల కింద అమ్మేస్తారు. కాబట్టి స్వీట్స్ కొనేముందు జాగ్రత్తగా ఉండాలి. .  శరీరాన్ని ఇలా కవర్ చేయాలి: హొలీ ఆడేటప్పుడు యావరేజ్ గా ఉన్న బట్టలు వేసుకోవాలి. దీనివల్ల వాటిమీద రంగులు వదలకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ కొత్త బట్టలు అయితే నాశనం అయిపోతాయి. ఫుల్ హాండ్స్ ఉన్న టాప్స్, ఫుల్ గా కాళ్లను కవర్ చేసే ప్యాంట్స్ వేసుకోవాలి. దీనీవల్ల రంగులు శరీరాన్ని పాడుచేసే అవకాశం తక్కువ. పాత డెనిమ్ జీన్స్, పొడవాటి పైజామాలను ఎంచుకోవచ్చు.  ఇలా ఆరోగ్యకరమైన హోళిని ఎంజాయ్ చేసి, ఆరోగ్యంగా ఉండండి.                                    ◆నిశ్శబ్ద.
హోళీ ఓ రంగుల పండుగ. కానీ అజాగ్రత్తగా ఉంటే, అవే రంగుల ఇతరుల జీవితాలలో చీకటిని నింపుతాయని హెచ్చరిస్తున్నారు. పిల్లవాడు తాగే పాల దగ్గర నుంచీ అంతా కలుషితం అయిపోతున్న ఈ రోజులలో, హోళీ సందర్భంగా ఎక్కడపడితే అక్కడ చవకగా దొరికే రంగుల గురించి చెప్పేదేముంది. మరి హోళీలో వాడే రంగులలో ఎలాంటి రసాయనాలు ఉంటాయో, వాటికి ఎలాంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలో ఆలోచించాల్సిందే రంగు – ఆకుపచ్చ ఉపయోగించే రసాయనం – కాపర్ సల్ఫేట్. విషప్రభావం – కొంట్లో పడితే చాలా ప్రమాదకరం. కళ్లు నీరుకారడం, ఎర్రబడటం, వాయడం జరగవచ్చు. ఒకోసారి తాత్కాలికంగా చూపు కూడా కనిపించకుండా పోవచ్చు. రంగు – ఎరుపు ఉపయోగించే రసాయనం – మెర్క్యురీ సల్ఫేట్. విషప్రభావం – చర్మం మీద ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒకోసారి చర్మ కేన్సర్కు కూడా దారితీయవచ్చు. గర్భిణీల శరీరంలోకి కనుక ఇది చేరితే వారి కడుపులో ఉన్న శిశువు ఎదుగుదల మీద తీవ్ర ప్రభావం చూపవచ్చు. ఒకోసారి ఆ శిశువుకి ప్రాణాంతకంగా కూడా మారుతుంది ఈ రసాయనం. రంగు – నీలం ఉపయోగించే రసాయనం – ప్రష్యన్ బ్లూ. విషప్రభావం – మాడు మీదా చర్మం మీదా దద్దుర్లు. రంగు – సిల్వర్ ఉపయోగించే రసాయనం – అల్యూమినియం బ్రొమైడ్. విషప్రభావం – చర్మం, ఊపిరితిత్తుల మీద తీవ్ర ప్రభావం. కేన్సర్ కారకం. రంగు – నలుపు ఉపయోగించే రసాయనం – రెడ్ ఆక్సైడ్. విషప్రభావం – మూత్ర పిండాల మీద ప్రభావం. గర్భస్రావం అయ్యే ప్రమాదం. చాంతాడంత జాబితా! గులాల్ పొడులలో లెడ్, క్రోమియం, కాడ్మియం, నికెల్, జింక్, సిలికా, మైకా... వంటి నానారకాల రసాయనాలూ కలుస్తాయని తేలింది. వీటిలో ఒకో రసాయనానిదీ ఒకో దుష్ఫ్రభావం! ఇక హోళీ రంగులు మెరిసిపోతూ ఉండేందుకు వాటిలో గాజుపొడి కలుపుతారన్న ఆరోపణమూ వినిపిస్తున్నాయి. పేస్టు లేదా ద్రవరూపంలో ఉండే రంగులది మరో సమస్య. వీటిలో ఇంజన్ ఆయల్ వంటి చవకబారు ద్రవాలను కలిపే ప్రమాదం ఉంది. ఈ రసాయనాలతో ఆరోగ్యం ఎలాగూ దెబ్బతింటుంది. హోళీ రోజున అవి నీటిలోనూ, నేలమీదా పడితే పర్యావరణం కూడా దెబ్బతింటుంది. కొత్త పోకడలూ ప్రమాదమే! ఇప్పుడు కొత్తగా హోళీ రంగులను చల్లుకునేందుకు చైనావారి పిచికారీలు దొరుకుతున్నాయి. వీటికి తోడు రంగులతో నింపిన బెలూన్లు కూడా లభిస్తున్నాయి. అసలే రసాయనాలు... ఆపై వాటిని వేగంగా చల్లేందుకు పరికరాలు. దీంతో ఏ రంగు ఎవరి కంట్లో పడుతుందో, అది ఎవరి జీవితాన్ని చీకటి చేస్తుందో తెలియని పరిస్థితి. ఒక్కసారిగా మీదపడే బెలూన్ల వల్ల ఒకోసారి వినికిడి కూడా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి రంగుకీ ఓ  ప్రత్యామ్నాయం హోళీలో ఇతరులు చల్లే కృత్రిమమైన రంగుల నుంచి జాగ్రత్తపడటం ఒక ఎత్తు. మనవరకు మనం అలాంటి రంగుల జోలికి పోకుండా సహజసిద్ధమైన రంగులు వాడటం మరో ఎత్తు. ప్రతి ఇంట్లోనూ దొరికే పసుపు, కుంకుమ, చందనం, బొగ్గు లాంటి రంగులు పదార్థాలు ఎలాగూ బోలెడు రంగలకు ప్రత్యామ్నాయంగా ఉంటాయి. ఇక ఆకుకూరలు, గోరింట పొడి, బీట్రూట్, కరక్కాయలు, మందారపూలు, నేరేడు పండ్లు లాంటివాటితో చాలా రంగులే సిద్ధమవుతాయి. కాస్త ఓపిక చేసుకుంటే తేలికగా అమరిపోయే సహజసిద్ధమైన రంగులను వదిలేసి ఏరికోరి రసాయనాలు కొనితెచ్చుకోవడం ఎందకన్నదే పెద్దల ప్రశ్న! - నిర్జర.